Wednesday 29 November 2017

ప్రపంచ తెలుగు మహాసభల కార్యాలయం

చిరునామా
ప్రపంచ తెలుగు మహాసభల కార్యాలయం
రవీంద్ర భారతి,  లక్డికాపూల్, సైఫాబాద్,
హైదరాబాద్ - 500004, తెలంగాణ.
ఈ-మెయిల్: wtchyd2017@telangana.gov.in
తెలంగాణ సాహిత్య అకాడమీ: (+91) 40 29703142 / 52 
సాంస్కృతిక సలహాదారు కార్యాలయం: (+91) 40 2345 4384
సాంస్కృతికశాఖ డైరెక్టరేట్: (+91) 40 2321 2832
ప్రభుత్వ కార్యదర్శి, YAT&C: (+91) 40 2345 2055
సాంస్కృతికశాఖా మంత్రి కార్యాలయం: (+91) 40 2345 4063

Saturday 14 October 2017

poems

Singer Sunitha | Gavidi Srinivas | Gideon katta

cinema

https://youtu.be/YjZ76Ry-gDo

cinema

manishi chettu tatvam

Telugu velugu October monthly 2017

ఏంది మామ ! - గవిడి శ్రీనివాస్ 07338053650, 9966550601

ఏంది మామ ! - గవిడి శ్రీనివాస్ 07338053650, 9966550601
ఏంది మామ
ఏడున్నవేంది
పొద్దుగుంకేదాకా 
పెళ్ళాం పిల్లల యేదలేదా ఏంది !
కళ్ళారేసుకుని
సూపులు వాసిపోతున్నాయి.
సుక్కలు దూరే యేలదాకా
ఏంది మామ ఆ పని
ఒక ముద్దూ నేదు
ఒక ముచ్చటా నేదు
పొద్దత్తమానం పనియాదేనా
సినుకు సిటుక్కుమంతే
సెంత సేరిపోనా
కూస్తంత యెచ్చగా
రాతిరిని జుర్రుకోమా ఏందీ మామ !
ఏమోనో మామ
ఈ మజ్జ
బొత్తిగా పేమ తగ్గిపోనాది
సూసే కళ్ళ కి
ఏడుపే వాటమైనాది
అడవి కాసిన ఎన్నెలైనాది బతుకు
పోల్నే మామ
పోయింది ఎలాగూ తేనేము
నువ్వొ త్తావనీ
కాటుక కళ్ళు మెరుత్తున్నాయి
బుగ్గచుక్క ఎతుకుతాంది
సన్నజాజి గుప్పుమంది
సేతి గాజులు అల్లరవుతున్నాయి.
కాలి బొటన వేలు ముగ్గు లేత్తాంది
ఏందీ మామ నువ్వు
నువ్వు ఏం సేత్తావో తెల్దు
కాసేపటికి నా పక్క ఎలుగుతుండాలా
సందె పొద్దు దివిటీ మల్లె !

September 2017 విశాలాక్షి మాస పత్రిక లో ప్రచురించారు

nadaka

తెలుగు విద్యార్థి మాస పత్రిక ఆగష్టు 2017

Saturday 16 September 2017

ఇల్లు కొన్ని దృశ్యాలు

palapitta monthly Aug2017

ఇల్లు కొన్ని దృశ్యాలు - గవిడి శ్రీనివాస్  07338053650, 9966550601

నా చేతి వేళ్ళు  పట్టుకున్న
ఉదయం లా నవ్వుతూ 
కాస్తంత ముందుకి 
ఇల్లు పిల్లాడి  అల్లరితో  ఊగుతుంది .

తెరచిన కిటికీ అరల్లోంచి 
చేతులు చాచుకు ఎగిరే గాలికి
 గోడకి వేళ్ళాడే  క్యాలెండర్లు 
ఎగిరి ఎగిరి నవ్వుకుంటున్నాయి.

మూసిన హృదయాల్ని తెరిచే తలుపులు 
కొద్ది కొద్ది గా వీధి దృశ్యాల్ని 
కూరగాయల బండి  గానో  నడిచి పోయే  బాధ్యతల గానో 
ఒంపుతున్నాయి.

సందర్శించిన ప్రదేశాలు 
మాట పంచుకున్న అనుభవాలు 
నాల్గు గోడల మధ్య 
జ్ఞాపకాల ఆకుల్లా రాలుతున్నాయి.

ఒక మునిలా ధ్యానిస్తుంటే 
ఆత్మ దర్శనం లో 
జ్ఞాన సంద్రాలు ముంచుతున్నాయి .

ఆరబోసిన ఆకాశం కింద 
పిల్లాడు బొంగరం లా  తిరుగుతుంటే 
చుక్కల ఆకాశం చొక్కాలో  మెరుస్తోంది .

ఆరుబయట చినుకులు 
బుగ్గల్ని గిల్లుతూ ముత్యాల్ని అద్దుతూ 
తూనీగల్ని పైపై ఊపుతూ 
మనోరథాన్ని  మహిమాన్వితం  చేస్తున్నాయి .

మౌన ప్రపంచాన్ని ముక్కలు చేసి 
మాటల  లోగిళ్ళు 
ముసిముసి నవ్వులై కుదుపుతున్నాయి .

ఉదయానికి సంధ్య కి మధ్య 
చెరగని మధురానుభూతి లా .

Tuesday 15 August 2017

gavidi srinivas lyrics

https://www.youtube.com/watch?v=9THqeQNwPCg

https://www.youtube.com/watch?v=9nQ9SXEbGXI

https://www.youtube.com/watch?v=4zK2oQTsYyg

https://www.youtube.com/watch?v=7q47TnLeqhg

https://www.youtube.com/watch?v=ltOV5YT3CJc

నేను సైతం : గవిడి శ్రీనివాస్ - జగద్ధాత్రి

నేను సైతం : గవిడి శ్రీనివాస్
గవిడి శ్రీనివాస్, నేడు చాలామంది సాహితి ప్రియులకి తెలుగు పాఠకులకి బాగా పరిచయమున్న పేరు. “గవిడి శ్రీనివాస్ ఊహాశాలి. చీకట్లో వెలుగుతున్న ఆత్మనెలా ఆవిష్కరించాలి, తన మానసిక నేత్రంతో దర్శించి దాన్ని, భౌతికంగా ప్రకృతిని , పరిసరాల్నీ, చూసిన దాన్ని మన ముందుంచటానికి తను ఈ కవితా సంపుటిలో కృషి చేశాడు” అని కితాబిచ్చారు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కర గ్రహీత , ప్రసిద్ధ కవి కె. శివారెడ్డి శ్రీనివాస్ ‘వలస పాట’ కవితా సంపుటికి. సామాజిక స్పృహ ఉన్న కవిగా నాగ భైరవ కోటేశ్వర రావు గారు, అద్దేపల్లి రామమోహనరావు గారు, డాక్టర్ రామసూరి వంటి పెద్దలనుండి ప్రశంసలు పొందిన యువ కిశోరమ్ గవిడి శ్రీనివాస్. ‘మిత్రుడు గవిడి శ్రీనివాస్ ఈ ఉత్తమాంధ్రలో వికసించిన మరో కుసుమం’ అన్నారు సాహితీ స్రవంతి వారు. సాహితీ స్రవంతి తో కలిసి నడుస్తూ , ఆ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగే కవి గవిడి శ్రీనివాస్. సమాజం లోని అసమానతలకు, అన్యాయాలకు తక్షణం స్పందించే యువ కవుల్లో శ్రీనివాస్ ఒకరు.
శ్రీనివాస్ జీవిత విశేషాలు
గవిడి శ్రీనివాస్1977, 1977, జూన్13న గాతాడలో పుట్టారు. తిమిటేరు బూర్జవలస
లో ప్రాథమిక విద్యను అభ్యసించి, తర్వాత ఉన్నత పాఠశాల చదువు 10 కిలోమీటర్లు దూరం ఉన్న దత్తి హైస్కూల్‌లో కొనసాగింది. ఈయన తాత గవిడి కన్నప్పల నాయుడు . తండ్రి సూర్యనారాయణ వీరోఓగా పనిచేసేవారు. 1999 నుండి 2010 వరకు సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయుని గా చేశారు.2010 నుండి నోర్డ్ సిన్యూ , సిఎంబియోసిస్ టెక్నాలజీస్ , సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేశారు .ఈయన ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖ పట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు.సెయింట్ మేరీస్ సెంటినరీ కాలేజీ నుండి బి .ఎడ్ . పూర్తీ చేశారు . ఈయన తాతయ్య వలిరెడ్డి అప్పలనాయుడు దగ్గర పెరిగారు . తాతయ్య ఉపాద్యాయుడు , సర్పంచ్ గా చేశారు .
రచనలు
1.కన్నీళ్లు సాక్ష్యం (కవితల సంపుటి 2005 ) యువస్పందన ప్రచురణ
2.వలస పాట (కవితల సంపుటి 2015) సాహితీ స్రవంతి ప్రచురణ
పాటలు 1 . తొలితొలి ఆశల్లో (ఆల్బమ్)
కవిగా గీత రచయితగా అక్షర సైనికుడై సామాజిక చైతన్యానికై కవాతు చేస్తున్న శ్రీనివాస్ ఎందరో యువ కవులకు స్ఫూర్తి. చిరునవ్వుతో పలకరిస్తున్నా అతని మేధోనేత్రం మాత్రం నిత్యం సమాజ శ్రేయస్సును కోరుతూనే ఉంటుంది. అందుకు తాను కూర్చగల, కవిత్వాన్ని రచించుకుంటూనే ఉంటుంది. నిర్మలంగా నవ్వుతూ పలకరించడం, సాహిత్యాన్ని గురించి ఎక్కువగా తెలుసుకోవడం నిరంతర విద్యార్ధిగా వినమ్రంగా మసలడం శ్రీనివాస్ వ్యక్తిత్వానికి మెరుగు పెట్టే అంశాలు.
శ్రీనివాస్ కవిత్వం, తత్వం గురించి తెలుసుకుందాం . ఈ చిన్ని కవిత ఈ కవి భావుకతకీ, పుట్టిన ఊరు మీద, తన వారి మీద మమకారానికి ప్రతీక గా నిలుస్తుంది.
ఊగే ఈ గాలిలో
ఊగే... ఈ గాలిలో
ఈ నేలలో
గుండెను తడిపేవిశ్వజనీన భాష ఏదో ఉంది
జారుతున్న పొద్దులో
చలిదుప్పట్లో దాక్కుంది
వెచ్చదనం ముసుగేసుకున్న
చుట్ట వొణికిన తాతను చుట్టుకుంది
రింగు వలయాల్లో రంగులు
మారుతూ
తలపాగాలో ముసుగుతన్నింది (ఆంధ్రజ్యోతి శ్రీకాకుళం 20/8/2005)
శ్రీనివాస్ లోని భావుకతకు, ప్రాపంచిక స్పృహకు తార్కాణంగా నిలిచే ఈ కవిత చూద్దాం
ఒక గుప్పెడు రాత్రులు
రాత్రులన్నీ
సజావుగా నిద్రపోవు
గుప్పెడు జ్ఞాపకాలు తట్టి
మది కడలి
కల్లోలితమవుతుంది .
ఈ ప్రపంచీకరణ ప్రపంచం
వైకుంఠ పాళీ అవుతుంది .
కదిలే అడుగులలో
వొణికిన సవ్వడులెన్ని.
ముంచుతున్న పనివేళల
మంచు తెరల వెనుక
నలిగిన జీవికలెన్ని .
మబ్బుల్ని ఢీకొట్టి
మంటల్ని ఊపినట్లు
ఊపిరి ఉక్కపోత తో
బిగుసుకుంటుంది .
ఆశంతా
ఒక గుప్పెడు రాత్రులు
ఎగసీ
నిద్రపుచ్చేవి
రెక్కలు కట్టుకు ఉగుతుంటాయనీ
కలగంటూ...నేను !
నేటి ప్రపంచీకరణ సమయంలో సామాన్యుని పక్షాన నిలిచి పలికే అక్షర యోధుడు శ్రీనివాస్. కల్లోలిత మౌతోన్న అoతరంగం తో తన తోటి వారికి వారితో బాటు తాను అనుభవిస్తోన్న పరాయీకరణ నుండి మేల్కొల్పడం, వారిలో సామాజిక స్పృహ కలిగించడం శ్రీనివాస్ కవిత్వ తత్వం. వసుధైవక కుటుంబకం అని భావించే మన ప్రాచీన స్పృహ శ్రీనివాస్ కవిత్వంలో కనపడుతుంది. ఆ విశ్వకుటుంబాన్ని సాధించే లక్ష్యంగా తన అక్షరాల దారి మనకి సుస్పష్టంగా అగుపిస్తుంది.
“పూర్తి కాని కలలా
మిగిలిన నేలపై రైతు .
సగం బతుకు వలసపోతూ
మోడుగా మిగిలిన రైతు .
మట్టిలో కంది చెట్టులా
పాతుకుపోయినా
మిరప కారాలు
తగులుతూనే వున్నాయి .
జొన్నసేలు ఊపుతూనే వున్నాయి .
పత్తి ఆశలు తేలుతూనే వున్నాయి .
ధాన్యం రాశులు గా ఎగరకుండా
ఒక నిలకడ కోసం
నాల్గు దిక్కుల్ని నల్లని ఆకాశాన్ని
భూమిని
గుప్పెట్లో బంధిస్తున్నా
రైతు పర్వం
అడుగు అడుగునా
కుదుపుతూనే వుంది . (రైతు పర్వం)
పంట పండిస్తోన్న రైతు కడుపునిండా రెండు పూటలా తిండికి నోచుకోవడం లేదు. రైతు బిడ్డగా వారి జీవనాన్ని చూస్తున్న కవి ఆర్ద్రమైన అక్షరాల్లో రైతు పర్వాన్ని రచిస్తాడు.
అన్నదాత రైతుకే అన్నం లేని స్థితిలో , దళారుల మోసాలలో మోసపోతూ , నిత్య దరిద్రాన్నే అనుభవిస్తున్న రైతు జీవనం లో మార్పు రావాలని ఆశిస్తాడీ స్వాప్నిక కవి. పత్తి రైతుల ఆత్మహత్యలు , నుండి నేటి మిర్చి రైతుల వరకూ సాగుతోన్న ధు:ఖమయ రైతు జీవితాన్ని చిత్రిస్తూనే , అందులోని మార్పునాశిస్తాడు, కవిగా శాసిస్తాడు ఈ కవి. ఆశాజీవి అటు రైతు, ఇటు కవి. ఇద్దరూ కోరుకునేది సమాజంలో ని అసమానతలు రూపు మాయడం. ఉత్తమమైన కవిత్వాన్ని అందించే శ్రీనివాస్ మంచి గీత రచయిత కూడా. ‘తొలి తొలి ఆశల్లో’ అనే ఆల్బమ్ కూడా వెలువరించారు. ఆశాజీవి , అక్షరాల విశ్వాసి అయిన ఈ కవిని కదిలించని సామాజిక సమస్య లేదు. నిరంతరం సమాజానికి కాపలాదారుగా నిలిచే ఈ కవి ఆశావాహ దృక్పధం ఈ వాక్యాల్లో చూద్దాం.
“చీకటిని కలగంటే అలికిన ఆకాశం తప్పా/ చిక్కని వెలుగు జాలరి వలలో ఉదయించదు కాలానికి తెడ్లు కట్టి/నావ దూకినపుడే బతుకులో ఉషోదయానికి తెర తీసినట్టవుతుంది!” అని సుధృఢ విశ్వాసం తో పలికే ఈ కవి మరిన్ని కవితా సంపుటాలను , గీతాలను తెలుగు పాఠకులకోసం రచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శిరాకదంబంద్వారా అభినoదిస్తోంది సాహితీ జగతి . .... జగద్ధాత్రి

నేను సైతం : గవిడి శ్రీనివాస్-జగద్ధాత్రి

నేను సైతం : గవిడి శ్రీనివాస్

గవిడి శ్రీనివాస్, నేడు చాలామంది సాహితి ప్రియులకి తెలుగు పాఠకులకి బాగా పరిచయమున్న పేరు. గవిడి శ్రీనివాస్ ఊహాశాలి.  చీకట్లో వెలుగుతున్న ఆత్మనెలా ఆవిష్కరించాలి, తన మానసిక నేత్రంతో దర్శించి దాన్ని, భౌతికంగా ప్రకృతిని , పరిసరాల్నీ, చూసిన దాన్ని మన ముందుంచటానికి తను ఈ కవితా సంపుటిలో కృషి చేశాడు అని కితాబిచ్చారు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కర గ్రహీత , ప్రసిద్ధ కవి కె. శివారెడ్డి శ్రీనివాస్ ‘వలస పాట’ కవితా సంపుటికి. సామాజిక స్పృహ ఉన్న కవిగా నాగ భైరవ కోటేశ్వర రావు గారు, అద్దేపల్లి రామమోహనరావు గారు, డాక్టర్ రామసూరి వంటి పెద్దలనుండి ప్రశంసలు పొందిన యువ కిశోరమ్ గవిడి శ్రీనివాస్. ‘మిత్రుడు గవిడి శ్రీనివాస్ ఈ ఉత్తమాంధ్రలో వికసించిన మరో కుసుమం’ అన్నారు సాహితీ స్రవంతి వారు. సాహితీ స్రవంతి తో కలిసి నడుస్తూ , ఆ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగే కవి గవిడి శ్రీనివాస్. సమాజం లోని అసమానతలకు, అన్యాయాలకు తక్షణం స్పందించే యువ కవుల్లో శ్రీనివాస్ ఒకరు.

శ్రీనివాస్ జీవిత విశేషాలు
 గవిడి శ్రీనివాస్1977, 1977, జూన్13న  గాతాడలో పుట్టారు. తిమిటేరు బూర్జవలస
లో ప్రాథమిక విద్యను అభ్యసించి, తర్వాత ఉన్నత పాఠశాల చదువు 10 కిలోమీటర్లు దూరం ఉన్న దత్తి హైస్కూల్‌లో కొనసాగింది. ఈయన తాత గవిడి కన్నప్పల నాయుడు . తండ్రి సూర్యనారాయణ  వీరోఓగా పనిచేసేవారు. 1999 నుండి 2010  వరకు  సెయింట్ ఆన్స్  స్కూల్  లో  గణిత ఉపాధ్యాయుని గా చేశారు.2010  నుండి నోర్డ్ సిన్యూ , సిఎంబియోసిస్ టెక్నాలజీస్ , సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేశారు .ఈయన ఆంధ్ర  విశ్వవిద్యాలయం విశాఖ పట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు.సెయింట్ మేరీస్ సెంటినరీ కాలేజీ నుండి  బి .ఎడ్ . పూర్తీ చేశారు . ఈయన తాతయ్య వలిరెడ్డి అప్పలనాయుడు దగ్గర పెరిగారు . తాతయ్య ఉపాద్యాయుడు , సర్పంచ్  గా చేశారు .

రచనలు 

1.కన్నీళ్లు సాక్ష్యం (కవితల సంపుటి 2005 ) యువస్పందన ప్రచురణ

2.వలస పాట (కవితల సంపుటి 2015) సాహితీ స్రవంతి ప్రచురణ

పాటలు    1 . తొలితొలి ఆశల్లో (ఆల్బమ్)

కవిగా గీత రచయితగా అక్షర సైనికుడై సామాజిక చైతన్యానికై కవాతు చేస్తున్న శ్రీనివాస్ ఎందరో యువ కవులకు స్ఫూర్తి. చిరునవ్వుతో పలకరిస్తున్నా అతని మేధోనేత్రం మాత్రం నిత్యం సమాజ శ్రేయస్సును కోరుతూనే ఉంటుంది. అందుకు తాను కూర్చగల, కవిత్వాన్ని రచించుకుంటూనే ఉంటుంది. నిర్మలంగా నవ్వుతూ పలకరించడం, సాహిత్యాన్ని గురించి ఎక్కువగా తెలుసుకోవడం నిరంతర విద్యార్ధిగా వినమ్రంగా మసలడం శ్రీనివాస్ వ్యక్తిత్వానికి మెరుగు పెట్టే అంశాలు.

శ్రీనివాస్ కవిత్వం, తత్వం గురించి తెలుసుకుందాం . ఈ చిన్ని కవిత ఈ కవి భావుకతకీ, పుట్టిన ఊరు మీద, తన వారి మీద మమకారానికి ప్రతీక గా నిలుస్తుంది.

ఊగే ఈ గాలిలో

ఊగే... ఈ గాలిలో

ఈ నేలలో

గుండెను తడిపేవిశ్వజనీన భాష ఏదో ఉంది

జారుతున్న పొద్దులో

చలిదుప్పట్లో దాక్కుంది

వెచ్చదనం ముసుగేసుకున్న

చుట్ట వొణికిన తాతను చుట్టుకుంది

రింగు వలయాల్లో రంగులు

మారుతూ

తలపాగాలో ముసుగుతన్నింది (ఆంధ్రజ్యోతి శ్రీకాకుళం 20/8/2005)

శ్రీనివాస్ లోని భావుకతకు, ప్రాపంచిక స్పృహకు తార్కాణంగా నిలిచే ఈ కవిత చూద్దాం

 ఒక గుప్పెడు రాత్రులు 

రాత్రులన్నీ 

సజావుగా  నిద్రపోవు 

గుప్పెడు జ్ఞాపకాలు  తట్టి 

మది కడలి 

కల్లోలితమవుతుంది .

ఈ ప్రపంచీకరణ ప్రపంచం 

వైకుంఠ పాళీ అవుతుంది .

కదిలే అడుగులలో 

వొణికిన  సవ్వడులెన్ని.

ముంచుతున్న పనివేళల

మంచు తెరల వెనుక 

నలిగిన జీవికలెన్ని .

మబ్బుల్ని  ఢీకొట్టి 

మంటల్ని  ఊపినట్లు 

ఊపిరి ఉక్కపోత తో 

బిగుసుకుంటుంది .

ఆశంతా

ఒక  గుప్పెడు రాత్రులు 

ఎగసీ 

నిద్రపుచ్చేవి 

రెక్కలు కట్టుకు ఉగుతుంటాయనీ

కలగంటూ...నేను !

నేటి ప్రపంచీకరణ సమయంలో సామాన్యుని పక్షాన నిలిచి పలికే అక్షర యోధుడు శ్రీనివాస్. కల్లోలిత మౌతోన్న అoతరంగం తో తన తోటి వారికి వారితో బాటు తాను అనుభవిస్తోన్న పరాయీకరణ నుండి మేల్కొల్పడం, వారిలో సామాజిక స్పృహ కలిగించడం శ్రీనివాస్ కవిత్వ తత్వం. వసుధైవక కుటుంబకం అని భావించే మన ప్రాచీన స్పృహ శ్రీనివాస్ కవిత్వంలో కనపడుతుంది. ఆ విశ్వకుటుంబాన్ని సాధించే లక్ష్యంగా తన అక్షరాల దారి మనకి సుస్పష్టంగా అగుపిస్తుంది.

పూర్తి కాని కలలా 

మిగిలిన నేలపై రైతు .

సగం బతుకు  వలసపోతూ 

మోడుగా మిగిలిన  రైతు .

మట్టిలో  కంది చెట్టులా 

పాతుకుపోయినా

మిరప కారాలు 

తగులుతూనే వున్నాయి .

జొన్నసేలు ఊపుతూనే వున్నాయి .

పత్తి ఆశలు తేలుతూనే వున్నాయి .

ధాన్యం రాశులు గా  ఎగరకుండా 

ఒక నిలకడ కోసం

నాల్గు దిక్కుల్ని నల్లని ఆకాశాన్ని 

భూమిని 

గుప్పెట్లో  బంధిస్తున్నా

రైతు పర్వం 

అడుగు అడుగునా 

కుదుపుతూనే వుంది . (రైతు పర్వం)

పంట పండిస్తోన్న రైతు కడుపునిండా రెండు పూటలా తిండికి నోచుకోవడం లేదు. రైతు బిడ్డగా వారి జీవనాన్ని చూస్తున్న కవి ఆర్ద్రమైన అక్షరాల్లో రైతు పర్వాన్ని రచిస్తాడు.

అన్నదాత రైతుకే అన్నం లేని స్థితిలో , దళారుల మోసాలలో మోసపోతూ , నిత్య దరిద్రాన్నే అనుభవిస్తున్న రైతు జీవనం లో మార్పు రావాలని ఆశిస్తాడీ స్వాప్నిక కవి. పత్తి రైతుల ఆత్మహత్యలు , నుండి నేటి మిర్చి రైతుల వరకూ సాగుతోన్న ధు:ఖమయ రైతు జీవితాన్ని చిత్రిస్తూనే , అందులోని మార్పునాశిస్తాడు, కవిగా శాసిస్తాడు ఈ కవి. ఆశాజీవి అటు రైతు, ఇటు కవి. ఇద్దరూ కోరుకునేది సమాజంలో ని అసమానతలు రూపు మాయడం. ఉత్తమమైన కవిత్వాన్ని అందించే శ్రీనివాస్ మంచి గీత రచయిత కూడా.  ‘తొలి తొలి ఆశల్లో’ అనే ఆల్బమ్ కూడా వెలువరించారు. ఆశాజీవి , అక్షరాల విశ్వాసి అయిన ఈ కవిని కదిలించని సామాజిక సమస్య లేదు. నిరంతరం సమాజానికి కాపలాదారుగా నిలిచే ఈ కవి ఆశావాహ దృక్పధం ఈ వాక్యాల్లో చూద్దాం.

చీకటిని కలగంటే అలికిన ఆకాశం తప్పా/ చిక్కని వెలుగు జాలరి వలలో ఉదయించదు కాలానికి తెడ్లు కట్టి/నావ దూకినపుడే బతుకులో ఉషోదయానికి తెర తీసినట్టవుతుంది! అని సుధృఢ విశ్వాసం తో పలికే ఈ కవి మరిన్ని కవితా సంపుటాలను , గీతాలను తెలుగు పాఠకులకోసం రచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శిరాకదంబంద్వారా  అభినoదిస్తోంది సాహితీ జగతి . .... జగద్ధాత్రి

Wednesday 19 July 2017

Friday 16 June 2017

గవిడి శ్రీనివాస్

http://www.gpedia.com/te/gpedia/%E0%B0%97%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B0%BF_%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D

Sunday 21 May 2017

Sunday 14 May 2017

నివేదన

http://epaper.suryaa.com/c/19053065

15-05-2017 surya paper

మిర్చీ మంటల్లో రైతు

15-05-2017 Andhra Bhoomi sahithi 

http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=8107253#

ఇక అమ్మ ను చూడాలనుంది

                                          Andhra prabha 14-05-2017 Sunday Mother's day

Saturday 13 May 2017

గవిడి శ్రీనివాస్

http://www.maria-online.com/information/article.php?lg=te&q=%E0%B0%97%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B0%BF_%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D

Sunday 23 April 2017

గవిడి శ్రీనివాస్

https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82:%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%95%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2%E0%B1%81

గవిడి శ్రీనివాస్

http://www.wikiwand.com/te/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81%E0%B0%96%E0%B1%81%E0%B0%B2_%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE#/.E0.B0.97

మిర్చీ మంటల్లో రైతు

http://54.243.62.7/images_designer/article_docs/2017/4/16/sunday.pdf

Visalaandhra 16-04-2017

Sunday 16 April 2017

మంటల్లో రైతు

                                                                      16-4-2017
                                                        prajasakti savvadi daily

Sunday 9 April 2017

Neevinkina

http://54.243.62.7/images_designer/article_docs/2017/4/2/Sundaybook02042017.pdf

Visalaandhra sunday 02-04-2017

Sunday 19 March 2017

sonta vuru

surya paper 13-3-2017

nidurodamante

prajasakti 19-3-2017

sonta vuru

                                           nava telangana  sunday 19-3-2017

ఒక గుప్పెడు రాత్రులు

AndhraBhoomi sunday 19-3-2017

అక్షరాలోచనాలు!

ఒక గుప్పెడు రాత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాత్రులన్నీ
సజావుగా నిద్రపోవు
గుప్పెడు జ్ఞాపకాలు తట్టి
మది కడలి
కల్లోలితమవుతుంది
ఈ ప్రపంచీకరణ ప్రపంచం
వైకుంఠపాళీ అవుతుంది
కదిలే అడుగులలో
వొణికిన సవ్వడులెన్ని
ముంచుతున్న పనివేళల
మంచు తెరల వెనుక
నలిగిన జీవికలెన్ని
మబ్బుల్ని ఢీకొట్టి
మంటల్ని ఊపినట్లు
ఊపిరి ఉక్కపోతతో
బిగుసుకుంటుంది
ఆశంతా
ఒక గుప్పెడు రాత్రులు
ఎగసీ
నిద్రపుచ్చేవి
రెక్కలు కట్టుకు ఊగుతుంటాయనీ
కలగంటూ... నేను!
-గవిడి శ్రీనివాస్, 07019278368
http://andhrabhoomi.net/content/akshara-443

Saturday 18 March 2017

గవిడి శ్రీనివాస్ జీవితం

గవిడి శ్రీనివాస్

గవిడి శ్రీనివాస్
జననం
గవిడి శ్రీనివాస్
1977, జూన్13
గాతాడ, మెరకముడిదాం మండలం
విజయనగరం (జిల్లా)
ప్రసిద్ధి
తెలుగు కవి, గీత రచయిత.
పిల్లలు
టాబుశ్రీ,
దీపశిఖ ,
నవనీత్
           
భార్య
తండ్రి
అనురాధ
సూర్యనారాయణ

      తల్లి
అరుణ కుమారి
   సంతకం

గవిడి శ్రీనివాస్ తెలుగు కవి, గీత రచయిత. మార్క్సిస్టు. శ్రీనివాస్  గాతాడనివాసి. 
రామసూరి ,అద్దేపల్లి, కె. శివారెడ్డి,భావశ్రీ  వంటి  కవుల ప్రభావంతో  సాహిత్య రంగానికి వచ్చాడు. తెలుగులో భావుకత ,శిల్ప నైపుణ్యం కల్గిన కవిత్వం  చేపట్టిన కవుల్లో గవిడి ఒకరు.

జీవిత విశేషాలు

గవిడి శ్రీనివాస్1977, 1977, జూన్13న  గాతాడలో పుట్టారు. తిమిటేరు బూర్జవలస
లో ప్రాథమిక విద్యను అభ్యసించి, తర్వాత ఉన్నత పాఠశాల చదువు 10 కిలోమీటర్లు దూరం ఉన్న దత్తి హైస్కూల్‌లో కొనసాగింది. ఈయన తాత గవిడి కన్నప్పల నాయుడు . తండ్రి సూర్యనారాయణ  వీరోఓగా పనిచేసేవారు. 1999 నుండి 2010  వరకు  సెయింట్ ఆన్స్  స్కూల్  లో  గణిత ఉపాధ్యాయుని గా చేశారు.2010  నుండి నోర్డ్ సిన్యూ , సిఎంబియోసిస్ టెక్నాలజీస్ , సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేశారు .ఈయన ఆంధ్ర  విశ్వవిద్యాలయం విశాఖ పట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు.సెయింట్ మేరీస్ సెంటినరీ కాలేజీ నుండి  బి .ఎడ్ . పూర్తీ చేశారు . ఈయన తాతయ్య వలిరెడ్డి అప్పలనాయుడు దగ్గర పెరిగారు . తాతయ్య ఉపాద్యాయుడు , సర్పంచ్  గా చేశారు .

రచనలు

1.కన్నీళ్లు సాక్ష్యం (కవితల సంపుటి 2005 ) యువస్పందన ప్రచురణ

2.వలస పాట (కవితల సంపుటి 2015) సాహితీ స్రవంతి ప్రచురణ

పాటలు 

1 . తొలితొలి ఆశల్లో (ఆల్బమ్)

పురస్కారాలు

2016లో సాహితీ సమాఖ్య  నుండి సాహితీవిమర్శకు గాను కవితాసృజన  పురస్కారాన్ని అందుకున్నారు .

Sunday 12 February 2017

నీవింకిన ఈ దేహం లో

http://epaper.prajasakti.com/1101895/East-Godavari/Sneha#dual/14/1

12-2-2017  prajasakti