Saturday 31 March 2018

సంధి కాలం - గవిడి శ్రీనివాస్ 07019278368, 9966550601

                                                          Vistruta  Monthly March 2018


సంధి  కాలం   - గవిడి శ్రీనివాస్ 07019278368, 9966550601

ఇన్నేళ్లు ఇన్ని రోజులు
గడిసి  పోయాక
కాసేపు  నాలోకి  అవలోకించుకుంటాను .


కొన్ని జ్ఞాపకాలు
అలా తడుముతుంటాయి .

నా ఊరు నా వాకిలి
నా చుట్టూ నడిసిన  పరిసరాలు
కళ్ళ ముందు పక్షుల్లా  వాలతాయి.

నేను
మొక్కను చూస్తూ మొలిచాను
పూవును చూస్తూ పరిమళించాను
మట్టిని  తాకుతూ
దేహమే అనుకున్నాను .

ఊరూ మారింది
జీవన సరళీ కొత్తగుంది
గుడిసెలు  ముడుచుకున్నాయి

మార్పు సహజమే
మారనిదల్లా
కాసింత ప్రేమ కోరుకునే  మనసు మాత్రమే

ఆప్యాయంగా  పలకరించే
నా పొరుగు వాళ్ళు
వారి మాటలు తడిపి పోతుంటాయి .

ఇన్ని జ్ఞాపకాల తర్వాత
ఇవి గుర్తొచ్చిన  సంధి కాలం
నాలో నేను
ఒక  తీపి అనుభూతిగా
మిగిలిపోతాను .

Sunday 18 March 2018

తోడు

తోడు

రచన: గవిడి శ్రీనివాస్
ప్రయాణాలు కొన్ని సార్లు
ఒంటరిగానే తలుపులు తెరుచుకుంటాయి .
కాలం కొన్ని చీకటి రాత్రుల్ని మోస్తుంది .
విసిగిన చోట నక్షత్రాల్ని బంతిలా కుట్టి
కాసింత వెలుగుని రాజుకుంటే బాగుణ్ణు
దారిపొడుగునా రుతువులు
పరిచయాలుగా పూస్తే బాగుణ్ణు
ఊపిరి ఊగిసలాట
ముంగిట నిలిచే ఆరాటమైతే బాగుణ్ణు
కురిసే నక్షత్రాలు అలసిన సంద్రాలు
జీవితానికి ముడిపడుతుంటాయి .
పసిడి వెన్నెల ముద్దలు ముద్దలుగా
మబ్బుల నుంచీ జారినపుడు
కాళ్ళ ముందు ముచ్చట తోరణాల్ని
తొడిగినపుడు
నిలువునా దేహం
కొత్త అనుభూతుల్ని
తోడుగా నిలుపుకుంటుంది .
అలసిన దేహానికి
తోడు భరోసాగా నిలుస్తుంది .



http://maalika.org/magazine/2018/03/05/%E0%B0%A4%E0%B1%8B%E0%B0%A1%E0%B1%81/
సాహిత్య మాసపత్రిక

Sunday 11 March 2018

oka siriya

12March2018

http://epaper.suryaa.com/1575675/Andhra-Pradesh/Monday-12-March,2018#page/4/2

Thursday 1 March 2018

sweekarinchavuu

Karma Bhoomi
http://epaper.andhrabhoomi.net/andhrabhoomi.aspx?id=TS#page1730355
http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=10149863