Sunday 24 February 2019

జ్ఞాపకాలనే


25-02-2019 Suryaa paper monday

http://epaper.suryaa.com/2042394/Telangana/Monday-25-Feb-2019?fbclid=IwAR2a8av3p3mLLGmQsjQkSv8w24Rxrw30IacdgjkkW9UouipG87B6Skowp2I#page/4/2

Thursday 7 February 2019

నా చుట్టూ నా లోపల



28-01-2019



నా చుట్టూ నా లోపల  -గవిడి శ్రీనివాస్ 9966550601,7019278368 

రాత్రులు చూపుల్ని మోసుకుని 
దీప కాంతులతో  పరుగెడుతుంటాయి .
ఏ తీరాలా వైపో  క్షణాల్ని కోసుకుంటూ ...
ఏ ఆరాటాలు వైపో పొద్దు తెలియని ప్రపంచం వైపు 
అలా సమయాలు హడావిడి గా సాగిపోతుంటాయి .

పట్టణమొక  సాగరమే 
ఈదటమే అలవాటుగా 
రుతువులు  మారుతుంటాయి .

బస్సుల్లో కిక్కిరుసుకుపోతూ  జన ప్రవాహం 
మెట్రో వైపు  పరుగెడుతూ మరో ప్రవాహం 
ఊగే ప్రపంచాన్ని 
రంగులు అద్దే కార్మికుడు ఎత్తునుంచీ 
ఆదుర్ధా గా చూస్తాడు . 

ధూళిని  దులిపే 
కార్మికుని కళ్ళలో  ఆర్ద్రత 
తడి తడి గా  తడుముతుంది .

ఉరుముల పిడుగుల అరుపులు 
ద్వారాల వెంట తెరచి ఉంటాయి .

ఇక్కడ బానిసత్వమే తప్ప 
పని వేళలకీ చివరాఖరు అంటూ ఉండదు .

అవసరాల తోటలో 
బతుకులు ముడిపడి తెగుతుంటాయి .

కారణాల విశ్లేషణ  అనవసరం 
ఇక వెనక్కి ఆలోచించని పరుగే 
నిజమైన నిర్దారణ  గా సాగే అవసరం .

నా చుట్టూ పరుగుల వలయాలుంటాయి .
నా లోపల చందమామలు చెట్లు 
పూల మొక్కలు అలానే ఉంటాయి .

ఆస్వాదించడానికి  క్షణాలకే  తీరికలేదు 
ఏదో సమయం ఎప్పటి సౌందర్యాన్నే
కొత్తగా ఆహ్వానిస్తూ  ఆనందిస్తుంది .
నా చుట్టూ గజి బిజీ నా లోపల అంతే !