దళిత స్వరం
ఏముంటాయి కారణాలేముంటాయికొన్ని అసహనాలు కొన్ని అహంకారాలు
కొన్ని కన్నీళ్లు కొన్ని చిరిగిన క్షణాలు
అలా విలవిలలాడుతుంటాయి!
రంగులోంచి కులం మొలకెత్తినట్లు
ఒకే చెట్టుకే
కొన్ని కాసే రెక్కలే
నరకబడుతున్నాయి
దళితుడైతేనేం
స్వరం మనిషిదేగా
మరి కొన్ని కళ్ళు వీక్షిస్తుంటే
కొన్ని మానభంగాలు
కొన్ని మారణ హౌమాలు
కొన్ని తెగ్గోయటాలు
అనాగరికంగా తొంగిచూస్తూనే ఉన్నాయి
ఒక రంగుని ఇంకో రంగు
శిక్షిస్తున్నట్లు ఒక్కో
చరిత్ర పుట బరువవుతోంది
శీలం ఎవరిదైనా ఒకటేగా
శోకం ఎవరిదైనా బాధేగా
క్షోభ పడ్డ క్షణాలు
దళిత స్వరాలై
దేశ నలుదిక్కులా మార్మోగుతున్నాయి!
- గవిడి శ్రీనివాస్, 08722784768
http://www.prajasakti.com/Article/Savvadi/1851685
09-10-2016