http://epaper.prajasakti.com/1047577/East-Godavari/Sneha#page/15/1
రూపాయి పోరాటం - గవిడి శ్రీనివాస్ 07019278368, 08722784768
రోజల్లా
నడిచే ప్రయాణాన్ని
ముక్కలు గా విరిచి
కన్నీళ్లనే తొడగటం .
అర్థరాత్రి నిర్ణయాల
ముసుగుల్లో ముంచెత్తటాలు
ఒక విధ్వంసపు ఆనవాలు.
నల్ల కుబేరులెపుడూ
రూపాయిని వివిధ రూపాలుగా
తొడుక్కుంటారు .
ఇప్పుడు
విరిగిన సగం జీవితం
సామాన్యుడి పైనో
మధ్యతరగతి గానో
విలవిలలాడుతూ
ప్రాణాలు ఆఖరి శ్వాసగా
విడవబడు తున్నాయి .
పనులు గాల్లో కలిసి
బారులు కట్టిన జనం
బ్యాంకుల చుట్టూ యుద్ధం
ప్రాణం గుప్పిట తల్లడిల్లుతూ
ప్రణాళిక లేని పెద్ద వ్యవహారానికి
బలౌతూ ప్రణమిల్లుతూ
ఒక పరిష్కరానికి
ఎదురు చూపులు
పోరాడుతున్నాయి .