రైతు పర్వం
ఎండని మోస్తున్న రైతు
చెమట చుక్కల్ని పండిస్తూ
చాలు చాలునా విచ్చుకున్న రైతు
విత్తు నుండి మొలక మెరిసేదాకా
మొలక నుండి ఫలం ఊగే దాక
వీచే గాలులు
నడిచే ప్రవాహాలు
లెక్కపెట్టిందే లేదు
దేహం ముక్కలుగా
చిట్లుతున్నట్లు
దళారీ రాబందులూ
ఎదురౌతున్నట్లు
వ్యాపారులు అదును కోసం
కొంగ నిద్ర నటిస్తున్నట్లు
ఏదీ నిదుర పట్టనివ్వడం లేదు
ఆకాశం చేతిలో ఉరుముతున్నట్లు
పిడుగులు బతుకుని అదుముతున్నట్లు
పంట ఖర్చులు ఎగురుతున్నట్లు
మౌనంగా రైతు కుదేలవుతుంటే
సేద్యం చేసే పంటలన్నీ
పూర్తి కాని కలలా
మిగిలిన నేలపై రైతు
సగం బతుకు వలసపోతూ
మోడుగా మిగిలిన రైతు
మట్టిలో కంది చెట్టులా
పాతుకుపోయినా
మిరప కారాలు
తగులుతూనే వున్నాయి
జొన్నసేలు ఊపుతూనే వున్నాయి
పత్తి ఆశలు తేలుతూనే వున్నాయి
ధాన్యం రాశులుగా ఎగరకుండా
ఒక నిలకడ కోసం
నాల్గు దిక్కుల్ని నల్లని ఆకాశాన్ని
భూమిని
గుప్పెట్లో బంధిస్తున్నా
రైతు పర్వం
అడుగు అడుగునా
కుదుపుతూనే వుంది
- గవిడి శ్రీనివాస్
07019278368
చెమట చుక్కల్ని పండిస్తూ
చాలు చాలునా విచ్చుకున్న రైతు
విత్తు నుండి మొలక మెరిసేదాకా
మొలక నుండి ఫలం ఊగే దాక
వీచే గాలులు
నడిచే ప్రవాహాలు
లెక్కపెట్టిందే లేదు
దేహం ముక్కలుగా
చిట్లుతున్నట్లు
దళారీ రాబందులూ
ఎదురౌతున్నట్లు
వ్యాపారులు అదును కోసం
కొంగ నిద్ర నటిస్తున్నట్లు
ఏదీ నిదుర పట్టనివ్వడం లేదు
ఆకాశం చేతిలో ఉరుముతున్నట్లు
పిడుగులు బతుకుని అదుముతున్నట్లు
పంట ఖర్చులు ఎగురుతున్నట్లు
మౌనంగా రైతు కుదేలవుతుంటే
సేద్యం చేసే పంటలన్నీ
పూర్తి కాని కలలా
మిగిలిన నేలపై రైతు
సగం బతుకు వలసపోతూ
మోడుగా మిగిలిన రైతు
మట్టిలో కంది చెట్టులా
పాతుకుపోయినా
మిరప కారాలు
తగులుతూనే వున్నాయి
జొన్నసేలు ఊపుతూనే వున్నాయి
పత్తి ఆశలు తేలుతూనే వున్నాయి
ధాన్యం రాశులుగా ఎగరకుండా
ఒక నిలకడ కోసం
నాల్గు దిక్కుల్ని నల్లని ఆకాశాన్ని
భూమిని
గుప్పెట్లో బంధిస్తున్నా
రైతు పర్వం
అడుగు అడుగునా
కుదుపుతూనే వుంది
- గవిడి శ్రీనివాస్
07019278368
08-01-2017 prajasakti sunday