http://epaper.prajasakti.com/1101895/East-Godavari/Sneha#dual/14/1
12-2-2017 prajasakti
నీవింకిన ఈ దేహంలో
ఇంతగా
నాలోకి జ్ఞాపకాల జలపాతంలా
దుమికి
నాలో నీ విద్యుత్ రేఖల్ని
మండిస్తావనుకోలేదు
ఎండిన తటాకంలోకి
నీటి చెలమలా వచ్చావ్
కొన్ని కబుర్లు కొన్ని చూపులు
విసిరి ముంచేసావ్
నీ రెక్కల మాటున
చప్పుడు నేననీ తెలిసాక
సంబర పడిపోయాను
కాలాన్ని భుజాలపై మోసుకుపోతూ
ఋతువు ఋతువుకీ
నా మీద వాలతావ్.
ఏవో కోల్పోయిన అనుభూతులు
తిరిగి వచ్చినట్లు మథనపడుతుంటాను
నీవు తామర మీద
నీటిబిందువులా దొర్లి పోతుంటావ్
నాలోకి ఉషస్సులు వచ్చిపోతుంటారు
నీవు ఊరటగా మిగిలి పోతుంటావ్
అంతే
కాస్తంత బాధగా
నీవింకిన ఈదేహంలో
కిటికీ చూపులు
ఆశగా వెదుకుతుంటారు
నీవింకిన ఈ దేహంలో
- గవిడి శ్రీనివాస్
07019278368
నాలోకి జ్ఞాపకాల జలపాతంలా
దుమికి
నాలో నీ విద్యుత్ రేఖల్ని
మండిస్తావనుకోలేదు
ఎండిన తటాకంలోకి
నీటి చెలమలా వచ్చావ్
కొన్ని కబుర్లు కొన్ని చూపులు
విసిరి ముంచేసావ్
నీ రెక్కల మాటున
చప్పుడు నేననీ తెలిసాక
సంబర పడిపోయాను
కాలాన్ని భుజాలపై మోసుకుపోతూ
ఋతువు ఋతువుకీ
నా మీద వాలతావ్.
ఏవో కోల్పోయిన అనుభూతులు
తిరిగి వచ్చినట్లు మథనపడుతుంటాను
నీవు తామర మీద
నీటిబిందువులా దొర్లి పోతుంటావ్
నాలోకి ఉషస్సులు వచ్చిపోతుంటారు
నీవు ఊరటగా మిగిలి పోతుంటావ్
అంతే
కాస్తంత బాధగా
నీవింకిన ఈదేహంలో
కిటికీ చూపులు
ఆశగా వెదుకుతుంటారు
నీవింకిన ఈ దేహంలో
- గవిడి శ్రీనివాస్
07019278368