Sunday, 24 December 2023
యోగ, ప్రాణాయామం మరియు ధ్యానం
Tuesday, 17 October 2023
Sunday, 15 October 2023
Gavidi Srinivas Songs 2023 October
Wednesday, 27 September 2023
Gavidi Srinivas Songs 2023 September
Sunday, 3 September 2023
దిగులు గుండె మీద కవిత సంపుటి -150
కొన్ని క్షణాలు
ఆకర్షణతోనో అనుబంధం తోనో
పెనవేసుకుని చెమట చుక్కలుగా
మునిగి తేలిన అమృత ఫలాన్ని నేను.
ప్రాణం పోసుకున్న ఆడపిండాన్ని నేను.
ఊపిరి ఊదుకుంటున్నందుకే
దేవునికి కడుపు లోనే కృతజ్ఞతగా
రెక్కలూపుతున్నాను .
రేపటి కలల మీద
ఇప్పుడే పేగుల వలయాల్లో గంతులేస్తున్నాను
కడుపు నిమురుతున్నపుడల్లా
చెక్కిలి గింతలతో మురిసిపోయాను .
సూర్యోదయం ఎలా వుంటుందో
చంద్రోదయం ఎలా బుజ్జగిస్తుందో
ఎన్ని ఉయ్యాలలు పడిగాపులు కాస్తున్నాయో
ఊహకు అందని ఆనందాల మధ్య
నిండిపోయాను.
రెమ్మ రెమ్మ తో గాలి వూదుతున్నందుకే
నా చిట్టి గుండె
మట్టి మీద పడి
మల్లె పరిమళాల్ని
హత్తుకో బోతున్నందుకే
ఆనందంగా వుంది .
ఆటల ప్రపంచంలో తోటి పిల్లల్ని
ఆప్యాయత బంధాల్లో నా వాళ్ళని
తనివితీరా చూసుకోవాలనీ వుంది .
నాకల ఫలించక ముందే
నా చెవుల్లో కి ధ్వనించిన నిజం
ఇప్పుడు కనడానికి
కడుపులోంది ఆడబిడ్డా మగబిడ్డా !
నిర్ధారణకు నిర్ధక్ష్యణ్యం గా వచ్చినపుడే
వసంతమే లేని
శిశిరం లా రాలిపోతున్నందుకే
దృశ్యం కాలేని ఆడ శిశువు గా
మానవత్వాన్ని పాఠం గా నేర్పమని
మౌన ఘోషా తరంగాల్ని వేదజల్లుతున్నాను
కన్నీటి వాగై జననాంగం నుండీ
జారిపోబోతున్నాను .
మట్టి గుండె జారిపోతోంది
గవిడి శ్రీనివాస్
08886174458
మమకారం పంచిన తల్లిలా
నా మట్టి లాలించి పాలించేది
నేను తెల్లారే రేగిన ఆనందంతో
పొలా గట్లవెంట తుళ్ళిపడేవాడిని
కళ్ళళ్ళో పరిమళా పందిళ్ళు విరిసేవి
అంతే
వొయ్యారంగా ఊగే ఆకుపచ్చని పొలాన్ని
రెక్కు చాచుకు హత్తుకునే వాణ్ణి
దొర్లుతున్న సంవత్సరంలో
పైరుపచ్చని కలు దృశ్యాలై నిలిచేవి
రాజధాని రెక్కల్లో
రాక్షస కత్తు దూస్తున్నాయి
చీకటి స్వప్నాు
ఊహించని దాయి
బతుకుని ఛిద్రం చేస్తున్నాయి
ఆకుపచ్చని గుండె మీద
సిమ్మెంట్ దరువు మోగుతున్నాయి
ఈ కళ్ళముందే
మబ్బుపడుతున్న పొలాన్ని చూస్తే
ఆకాశాన్ని పిండి
కన్నీటి ధారు చిందిస్తున్నట్లు
నాలో ఒక నిర్వేదం అుముకుంది
ఇక్కడ మట్టి బంధాల్ని లెక్కించే
మనుషుల్ని చూడలేం
ఊహ సౌధాల్ని
ఆలింగనం చేసుకుని
వ్యాపార సామ్రాజ్య వాదాన్ని
బాకా ఊదుతున్న
రాబంధుల్ని భరిస్తున్నాం
నిశ్శబ్దం ముక్కలైన చోట
విప్లవాు మొకెత్తుతాయి
ఆశ దృశ్యాల్ని చూపిస్తూ
రిక్త హస్తాు ఎదురైన వేళ
రగుతున్న రక్తం
చెరిగిపోని పుటగా
లిఖించబడుతుంది
30--08-2015
ప్రస్థానం సెప్టెంబర్ 2015
మరలా తిరిగి రాలేకపోతున్నాను ..! - గవిడి శ్రీనివాస్ 07019278368, 08722784768ఒక నిశ్శబ్ద సమయంనీలోకి ప్రవేశించాను.మరలా తిరిగి రాలేక పోతున్నాను.ఆ క్షణం నీవూ నేనూచూపులతో మాట్లాడుకున్నాం .ఆప్యాయతల్ని అలంకరించు కున్నాంబిగిసిన వస్త్రాల్లోవిరిసిన సమ్మోహన రూపంగాజుల సవ్వడి లోమోగిన గుండెలుచేతుల కరచాలనం లోనలిగిన మనసులునీ కురుల నదులలోతేలిన ముఖ సోయగాలుముద్దుల పరిమళాలుకురిసే వాన లోమౌనంగా వాలిన క్షణాలుఅలంకరించిన హృదయాలునాలో నడుస్తున్నఈ వెన్నెల సమీరాలుఇక నాలోఒక చిరు నవ్వు శిల్పం లాపూల వనం లామిగిలి పోయాయ్.మరలా రాలేని బందా ల్లో నీవుమరచిపోలేనినీ జ్ఞాపక శిలా శాసనం లామిగిలిన నేను.
మరలా తిరిగి రాలేకపోతున్నాను ..! - గవిడి శ్రీనివాస్ 07019278368, 08722784768ఒక నిశ్శబ్ద సమయంనీలోకి ప్రవేశించాను.మరలా తిరిగి రాలేక పోతున్నాను.ఆ క్షణం నీవూ నేనూచూపులతో మాట్లాడుకున్నాం .ఆప్యాయతల్ని అలంకరించు కున్నాంబిగిసిన వస్త్రాల్లోవిరిసిన సమ్మోహన రూపంగాజుల సవ్వడి లోమోగిన గుండెలుచేతుల కరచాలనం లోనలిగిన మనసులునీ కురుల నదులలోతేలిన ముఖ సోయగాలుముద్దుల పరిమళాలుకురిసే వాన లోమౌనంగా వాలిన క్షణాలుఅలంకరించిన హృదయాలునాలో నడుస్తున్నఈ వెన్నెల సమీరాలుఇక నాలోఒక చిరు నవ్వు శిల్పం లాపూల వనం లామిగిలి పోయాయ్.మరలా రాలేని బందా ల్లో నీవుమరచిపోలేనినీ జ్ఞాపక శిలా శాసనం లామిగిలిన నేను.
అంతలా గుప్పుమంటావనుకోలేదు .
మౌనాన్ని తోరణాలుగా అలంకరించి
మల్లెలు మాట్లాడుతున్నట్లు ఒక నీవు .
గాజు అద్దం మీద మంచు సంతకం లా ఒక నీవు .
దృశ్యా అదృశ్య తెరలుగా ఒక నీవు .
ఆ కాసేపు నీ వొడి లో
శ్వాసించిన క్షణాల్ని
బంధించిన జ్ఞాపకాల్ని
నీవు లేనపుడు
ఒంటరిగా చేసుకుంటాను .
తగలబడుతున్న అంతరంగాల్ని
ఒక జలపాతపు జల్లులా
తడిపి పోతావు .
గాయాలు పూసుకున్న హృదయానికి
కాస్తంత చందనం చల్లిపోతావు .
నీవెప్పుడూ అంతే
చిగురుటాకు లా వీస్తావు
వెన్నెల చినుకుల్ని కురిసిపోతావు .
నేనెప్పుడూ
రెప్పల వాకిట్లో
నీ కోసం ఎదురు చూస్తుంటాను .
నీ వొచ్చి వెళ్లిన ప్రతిసారీ
కూలబడుతుంటాను .
నీవు గుర్తొచ్చిన ప్రతిసారి
చిగురిస్తుంటాను .
కాలం రంగుల్ని కత్తిరించలేక
దిగులుగా నీకై ఒక నేను !
చినుకు రువ్వితే
మడి సెక్కలా
తడిసి ముద్దయిపోతుంటాను .
ఒంటినిండా బురద పూసుకుని
వరి నారు మడిలో
కట్టలుగా తేలుతుంటాను .
పీల్చే గాలిలో
మట్టివాసన రేపటి స్వప్నాలకి
ఊపిరిలూదుతుంది.
బురదలో అడుగు మునిగి తేలిన ప్రతిసారీ
దుఃఖాన్ని ముక్కలు చేసుకుని సుఖం తేలినట్లు
సుఖాన్ని అణచిపెట్టి దుఃఖం రాలుతున్నట్లు
అలా జీవిత చక్రం తిరుగుతుంది .
పైపైన చినుకులు కురుస్తుంటాయి
నన్ను అంటకాగిన బురదని
జార్చుకుని తేలికై పోతాను.
ఒక్కో అడుగులో
ఒక్కో వరికట్ట గూడులా కూచుంటుంది .
ఊగే పైరు సెలయేరులా సాగుతుంటే
ఉన్నఫళంగా ప్రాణం కొత్త ఊపిరి ఊదుకుంటుంది.
నేనూ గట్టు పైన బండరాయి పై
అలా చూస్తూ మెరిసిపోతాను .
పైరు పిలుస్తున్నట్లు
ఊరు మురిసిపోతున్నట్లు
ఆ ఆనందం లో నా లోని
ప్రపంచం చుట్టూ పరిభ్రమిస్తాను .
నా వరి పొలం నాలో నిండిపోతుంది .
నా దేహం లో దహించబడుతున్న ఆంక్షల జ్వాలల్ని
నీకు ఒంపి చూపలేను .
ఖండితమౌతున్న ఉద్విగ్న దుఃఖ సమయాల్ని
వెలుగెత్తి చాటలేను .
స్వప్నాల మాటున సంకెళ్లు బిగుస్తున్నాయ్.
నాలో నన్ను చూద్దామని బయలుదేరా
ముక్కలవుతున్న నమ్మకాన్ని
సర్దుకుపోతున్న దేహాన్ని
కాస్తంత హెచ్చరించా !
ఇప్పుడు పునర్మించు కోవాల్సిన
కాలం లో సాగిల పడుతున్నందుకే !
అలసట దేహానికే
యుద్ధభేరి మోగించే భావాలకి కాదు .
విచ్చుకుంటున్న పూల మధ్య
ముల్లులా గుచ్చుకునే ఒక దిగులు .
వాయువేగాలు
తగలబడుతున్న జనారణ్యాలు
సమయంలేని పొడి క్షణాలు
బాధను రంగరిస్తూనే వున్నాయి .
మనసు బతకాల్సిన చోట
ఒత్తిడి ఉక్కపోత రాజుకుంటోంది .
దిగులు దిండులో ఒత్తిగిల్లటం తప్పా
వెన్నెల సరోవరాల్ని పరచే
ఇల్లు వాకిలి పిల్ల కాలువలు
ఇప్పుడు ఏవీ గుర్తుకు రావటం లేదు .
ఇక్కడ
మౌనాన్ని రాపాడుతున్న బతుకుల్లో
కుండ పోతగా రాలుతున్న ఎండలు
పొగలు కక్కుతున్న ఆవేశపు ధరలు
సామాన్యుడి బతుకుల్లోకి శూలాల్ని విసురుతున్నాయి .
ఇక్కడ
జీవితం మునగదూ తేలదు
మూలాల్ని ముడిపెట్టుకుని
ఆశ ని కాలం కనుబొమల పై నెట్టుకుంటాం .
రోజులు బోర్లా పడుతుంటాయి
అలవికాని సందర్భాలు మునుగుతుంటాయి .
అందలం ఎక్కేవాడికి
గుడిసెల గోల కానరాదు .
మబ్బులు మడిసే వాడికి
హద్దులు చెరిపే వాడికి
అర్దాకలి గోసలు అర్థం కావు .
శున్యానికి రెక్కలు చాపి
తపోదీక్షతో ధరల్ని దిగమని
శరణు వేడడమే శరణ్య మౌతోంది .
ఇక్కడ
పై చూపులు
నేల మీద వాలాలి
కాగిన బతుకుల్లో
కూసింత భరోసా నిలపాలి! .
ప్రయాణాలు కొన్ని సార్లు
ఒంటరిగానే తలుపులు తెరుచుకుంటాయి .
కాలం కొన్ని చీకటి రాత్రుల్ని మోస్తుంది .
విసిగిన చోట నక్షత్రాల్ని బంతిలా కుట్టి
కాసింత వెలుగుని రాజుకుంటే బాగుణ్ణు
దారిపొడుగునా రుతువులు
పరిచయాలుగా పూస్తే బాగుణ్ణు
ఊపిరి ఊగిసలాట
ముంగిట నిలిచే ఆరాటమైతే బాగుణ్ణు
కురిసే నక్షత్రాలు అలసిన సంద్రాలు
జీవితానికి ముడిపడుతుంటాయి .
పసిడి వెన్నెల ముద్దలు ముద్దలుగా
మబ్బుల నుంచీ జారినపుడు
కాళ్ళ ముందు ముచ్చట తోరణాల్ని
తొడిగినపుడు
నిలువునా దేహం
కొత్త అనుభూతుల్ని
తోడుగా నిలుపుకుంటుంది .
అలసిన దేహానికి
తోడు భరోసాగా నిలుస్తుంది .
ఇన్నేళ్లు ఇన్ని రోజులు
గడిసి పోయాక
కాసేపు నాలోకి అవలోకించుకుంటాను .
కొన్ని జ్ఞాపకాలు
అలా తడుముతుంటాయి .
నా ఊరు నా వాకిలి
నా చుట్టూ నడిసిన పరిసరాలు
కళ్ళ ముందు పక్షుల్లా వాలతాయి.
నేను
మొక్కను చూస్తూ మొలిచాను
పూవును చూస్తూ పరిమళించాను
మట్టిని తాకుతూ
దేహమే అనుకున్నాను .
ఊరూ మారింది
జీవన సరళీ కొత్తగుంది
గుడిసెలు ముడుచుకున్నాయి
మార్పు సహజమే
మారనిదల్లా
కాసింత ప్రేమ కోరుకునే మనసు మాత్రమే
ఆప్యాయంగా పలకరించే
నా పొరుగు వాళ్ళు
వారి మాటలు తడిపి పోతుంటాయి .
ఇన్ని జ్ఞాపకాల తర్వాత
ఇవి గుర్తొచ్చిన సంధి కాలం
నాలో నేను
ఒక తీపి అనుభూతిగా
మిగిలిపోతాను .
స్వీకరించవూ - గవిడి శ్రీనివాస్
నాలో కదిలే అలలా
నాలో మెదిలే కోలాటం లా
నాలో విరిసే తొలి కిరణమయ్యావు
నాలో పూసిన తొలి మందారమయ్యావు
తూనీగలాగ నీతలపులే వాలుతూ
పూతోట లాగ నీముందునే వాలుతూ
నిను కలిసిన ఆ సమయం
నేను మురిసిన ఆ సమయం
నేను ఆనంద ప్రపంచం లోతుల్లో మునిగి పోతాను
నేను నీ ఆలోచన ప్రపంచంలో లోతుల్లో మునిగిపోతాను
నిను పూజిస్తూ ధ్యానించనీ
మరి
నను నీ ప్రియుని గా స్వీకరించవూ..!
కాలం: 11-2-2018
------------------------------
రేపటి తరం
ఎర్రని అలలు అలలుగా రాలిపోతోంది .
కొన్ని దుఃఖపు కెరటాల మధ్య
సూర్యులు అస్తమిస్తున్నారు .
ఆక్రమిత ప్రాంతవాదులు
స్థానిక రోధనవుతుంటే
రాజ్య పాలకులు యుద్ధ మేఘాలవుతుంటే
జీవితం ముక్కలవుతోంది .
దేశమేదయినా గాయం బాధ అదే
సమయమంతా చీకట్లను
చీల్చడం లో మునిగిపోతోంది .
తగలబడుతున్న సిరియా సాక్షి గా
వొరిగి పోతున్న నలిగి పోతున్న
కాలం సాక్షి గా
చిన్నారుల్ని అడిగిచూడు
తెగని సమస్యలు
చావుని ఎత్తుకునే తలపులు
నెత్తురోడుతున్న
ఒక సిరియా కొన్ని దుఃఖాలు
అణువణువునా తల్లడిల్లుతున్నాయి.
సన్నద్ధం కావాల్సిన సమయం
మౌనం నిషిద్ధం .
నడిసే కాలాలు
ఊసులాడే ఆశలూ
రోజును దొర్లించడం పరిపాటే .
అబద్ధాన్ని ఎల్లప్పుడు నిజంలా నడపలేం
నమ్మేప్రజలను ఎంతోకాలం భ్రమింపచేయలేం .
కన్నీళ్లను తుడవాల్సినపుడు
వొట్టి మాటలు జీవితాలను నిలబెట్టలేవు .
అందలం మీద
కింది మాటలు గుర్తుకు రావు .
కాలం ఆసన్నమైనపుడు
ఎన్ని అబద్దాలైన గుండెల్ని గెలవలేవు .
అంతర్గత అగ్ని కీలల్ని
అబద్దాలు జయించలేవు .
మాకిప్పుడు ప్రత్యేక హోదా కావాలి
వికసించే కొత్త నవ్వులు కావాలి .
కాలం: 4-3-2018
------------------------------
సన్నద్ధం కావాల్సిన సమయం
మౌనం నిషిద్ధం .
నడిసే కాలాలు
ఊసులాడే ఆశలూ
రోజును దొర్లించడం పరిపాటే .
అబద్ధాన్ని ఎల్లప్పుడు నిజంలా నడపలేం
నమ్మేప్రజలను ఎంతోకాలం భ్రమింపచేయలేం .
కన్నీళ్లను తుడవాల్సినపుడు
వొట్టి మాటలు జీవితాలను నిలబెట్టలేవు .
అందలం మీద
కింది మాటలు గుర్తుకు రావు .
కాలం ఆసన్నమైనపుడు
ఎన్ని అబద్దాలైన గుండెల్ని గెలవలేవు .
అంతర్గత అగ్ని కీలల్ని
అబద్దాలు జయించలేవు .
మాకిప్పుడు ప్రత్యేక హోదా కావాలి
వికసించే కొత్త నవ్వులు కావాలి .
కాలం: 15-4-2018
------------------------------
ఒంటరితనం ఒక వేదన. -గవిడి శ్రీనివాస్
వొళ్ళు విరుచుకుంటున్న
నాల్గు గోడల మధ్య
వేలాడుతున్న శూన్యాన్ని
ఒంటరిగా తెరిచిన కళ్ళతో చూశాను.
అలికిడిలేని ప్రపంచంలో
శూన్యపు పొరలు
దిగులు మేఘాలు గా కురవడం
సందేశమూ సమాధానం లేక
ఒంటరి జ్ఞాపకాల్లో తడవడం
చిరాకు దిండు మీద దొర్లడం
ఎంత దుర్లభం!
ఇప్పుడు ఎవరితో మాటాడాలి
కాసింత వీచే గాలితో మాటాడాలి
తల ఊపే మొక్క తో మాటాడాలి
కాలాన్ని తిప్పే గాలి మర తో మాటాడాలి
మనిషి కి మనిషి తోడులేకుంటే
ఇంకెవరి తో మాటాడాలి.
కొన్ని సందర్భాలు వెంటాడే ఒంటరితనాలు
కోల్పోతున్న బతుకు రుతువుల్ని
జీవితపు బంధాల విలువల్ని
ఒంటరి కి పాఠాలు వల్లివేస్తాయి
బిక్కు బిక్కుమంటున్న నాల్గు దిక్కుల్లో
వొలికిపోతున్న దుఃఖాన్ని
ఒక్కో జ్ఞాపకంగా కళ్ళలో తడుముకుంటూ
కాలం నిశ్శబ్ద ప్రవాహంలోకి రాలిపోతుంది!
కాలం: 20-5-2018
------------------------------
కాలం: 24-6-2018
------------------------------
ఈ నల్లని మేఘాలు -కీకారణ్యాలు -గవిడి శ్రీనివాస్
ఆకూ ఆకూ కరచాలనం చేస్తున్నవేళ
ఒక సూర్యోదయం వెలిగింది
మబ్బూ మబ్బూ ఢీ కొంటున్నవేళ
ఒక మెరుపు అలా మెరిసి చినుకు అలా కురిసింది.
చిక్కుముడులు నక్షత్రాలుగా చిక్కుకున్నాయి
వేళ్ళు నాటుకున్నచోట
గాలి గుహలు కట్టుకున్న చోట
వృక్షాలు వొంగి సలాం వేసే చోట
ఆకలి ఉరుముతుంటే
అరణ్యం వణుకుతోంది
ఒకప్పటి రాతి ఆయుధం
ఇప్పుడు ఆకలి తుపాకై వూగుతోంది
ఆకాసాన్ని తలకిందులుగా వేలాడదీసే
ఇన్ని చెట్ల మధ్య ఇన్ని క్రూరమృగాల మధ్య
తలదాచుకున్న సూర్యుల్ని నమస్కరించాలి
సమస్య సాధన కోసం
మార్పు సూర్యల్లై ఉదయిస్తూ
సంకురాతిరినే ఉరితీస్తూ
మట్టి పరిమళాల్ని పీలుస్తూ
పాద ముద్రలు రేపటి స్వేచ్ఛకై విడుస్తూ
ఈ నల్లని మేఘాలు కీకారణ్యాలు
ఉరుముతున్నాయి ఉడుకుతున్నాయి
ఇప్పుడు సమ సమాజం
ఒక నిర్మాణాత్మక అవసరం.
.
కాలం:22-7-2018
------------------------------
మా ఊరి చెరువు -గవిడి శ్రీనివాస్
అలా
ఆకాశం రెక్కలు కట్టుకుని ఎర్ర ఎర్ర గా వాలుతూ
సాయంత్రం సూర్యుడ్ని ముంచుతున్న వేళ
పొలం గట్ల మీద చూపులవెంట
నడిసెల్లి చూస్తే పెద్ద హృదయాన్ని ఆరేసుకున్న
మా ఊరి చెరువు.
మనసు పడాలేకానీ మౌనమూ సంగీతమే
ప్రతి సాయంత్రమూ దివ్య సమ్మోహన సహవాసమే
ఆ కొండగాలి ఆకుల అలల్లా ఊగుతుంటే
గుప్పెడంత ఊహలు పక్షులై ఎగురుతూంటాయి.
ఏ కొంగల గుంపో ఏ పిచ్చుకల సమూహమో
ఎగురుతున్న ముగ్గులా మనోహరంగా
నా కళ్ల కొలనుల్లో తేలియాడుతుంది.
నా పక్కనే తిరుగు ముఖంలో
ఆవులు ఎద్దులు మేకలు
నా పక్కనే సంతోషాన్ని ఎత్తుకునే పసుకాపరులు
మిశ్రమ సమూహాలికి కొదువేలేదు
అలా కాసేపు ఆకాసం వంక
ఎగిరే మబ్బుల గుర్రాల్ని
సంధ్య లో గుంకే సూర్య బింబాన్ని
నాలో పూర్తిగా నింపేసుకున్నాను.
ఎప్పుడైనా ఆస్వాదించగలిగే క్షణం లోని
అనుభూతిని బంధించటం ఒక వరం.
వరం లా చిక్కుకున్న అనుభూతుల్లో
మునిగితేలటం ఒక బతకటం.
నన్ను తడిపిన ఊపిరి జ్ఞాపకంలా
మా ఊరి చెరువు.
వానా కాలం నిండుగా బెక బెకలతో వాగుతుంది
ఎండాకాలం ఆటల పరుపుగా పడి ఉంటుంది.
నేను చెరువు గట్టంట నడిస్తే చాలు
సంతోషాన్ని నిర్వచించలేని
అనుభూతుల దొంతరల్లో గాలిని పీలుస్తూ
ఆకాసాన్ని ధరిస్తూ వాయు మేఘాల్ని
వస్త్రాల్లో బంధించటం కంటే ఆనందం ఏముంటుంది.!
కాలం: 5-8-2018
------------------------------
మా ఊరి చెరువు -గవిడి శ్రీనివాస్
అలా
ఆకాశం రెక్కలు కట్టుకుని ఎర్ర ఎర్ర గా వాలుతూ
సాయంత్రం సూర్యుడ్ని ముంచుతున్న వేళ
పొలం గట్ల మీద చూపులవెంట
నడిసెల్లి చూస్తే పెద్ద హృదయాన్ని ఆరేసుకున్న
మా ఊరి చెరువు.
మనసు పడాలేకానీ మౌనమూ సంగీతమే
ప్రతి సాయంత్రమూ దివ్య సమ్మోహన సహవాసమే
ఆ కొండగాలి ఆకుల అలల్లా ఊగుతుంటే
గుప్పెడంత ఊహలు పక్షులై ఎగురుతూంటాయి.
ఏ కొంగల గుంపో ఏ పిచ్చుకల సమూహమో
ఎగురుతున్న ముగ్గులా మనోహరంగా
నా కళ్ల కొలనుల్లో తేలియాడుతుంది.
నా పక్కనే తిరుగు ముఖంలో
ఆవులు ఎద్దులు మేకలు
నా పక్కనే సంతోషాన్ని ఎత్తుకునే పసుకాపరులు
మిశ్రమ సమూహాలికి కొదువేలేదు
అలా కాసేపు ఆకాసం వంక
ఎగిరే మబ్బుల గుర్రాల్ని
సంధ్య లో గుంకే సూర్య బింబాన్ని
నాలో పూర్తిగా నింపేసుకున్నాను.
ఎప్పుడైనా ఆస్వాదించగలిగే క్షణం లోని
అనుభూతిని బంధించటం ఒక వరం.
వరం లా చిక్కుకున్న అనుభూతుల్లో
మునిగితేలటం ఒక బతకటం.
నన్ను తడిపిన ఊపిరి జ్ఞాపకంలా
మా ఊరి చెరువు.
వానా కాలం నిండుగా బెక బెకలతో వాగుతుంది
ఎండాకాలం ఆటల పరుపుగా పడి ఉంటుంది.
నేను చెరువు గట్టంట నడిస్తే చాలు
సంతోషాన్ని నిర్వచించలేని
అనుభూతుల దొంతరల్లో గాలిని పీలుస్తూ
ఆకాసాన్ని ధరిస్తూ వాయు మేఘాల్ని
వస్త్రాల్లో బంధించటం కంటే ఆనందం ఏముంటుంది.!
కాలం:16-9-2018
------------------------------
మా ఊరి చెరువు -గవిడి శ్రీనివాస్
అలా
ఆకాశం రెక్కలు కట్టుకుని ఎర్ర ఎర్ర గా వాలుతూ
సాయంత్రం సూర్యుడ్ని ముంచుతున్న వేళ
పొలం గట్ల మీద చూపులవెంట
నడిసెల్లి చూస్తే పెద్ద హృదయాన్ని ఆరేసుకున్న
మా ఊరి చెరువు.
మనసు పడాలేకానీ మౌనమూ సంగీతమే
ప్రతి సాయంత్రమూ దివ్య సమ్మోహన సహవాసమే
ఆ కొండగాలి ఆకుల అలల్లా ఊగుతుంటే
గుప్పెడంత ఊహలు పక్షులై ఎగురుతూంటాయి.
ఏ కొంగల గుంపో ఏ పిచ్చుకల సమూహమో
ఎగురుతున్న ముగ్గులా మనోహరంగా
నా కళ్ల కొలనుల్లో తేలియాడుతుంది.
నా పక్కనే తిరుగు ముఖంలో
ఆవులు ఎద్దులు మేకలు
నా పక్కనే సంతోషాన్ని ఎత్తుకునే పసుకాపరులు
మిశ్రమ సమూహాలికి కొదువేలేదు
అలా కాసేపు ఆకాసం వంక
ఎగిరే మబ్బుల గుర్రాల్ని
సంధ్య లో గుంకే సూర్య బింబాన్ని
నాలో పూర్తిగా నింపేసుకున్నాను.
ఎప్పుడైనా ఆస్వాదించగలిగే క్షణం లోని
అనుభూతిని బంధించటం ఒక వరం.
వరం లా చిక్కుకున్న అనుభూతుల్లో
మునిగితేలటం ఒక బతకటం.
నన్ను తడిపిన ఊపిరి జ్ఞాపకంలా
మా ఊరి చెరువు.
వానా కాలం నిండుగా బెక బెకలతో వాగుతుంది
ఎండాకాలం ఆటల పరుపుగా పడి ఉంటుంది.
నేను చెరువు గట్టంట నడిస్తే చాలు
సంతోషాన్ని నిర్వచించలేని
అనుభూతుల దొంతరల్లో గాలిని పీలుస్తూ
ఆకాసాన్ని ధరిస్తూ వాయు మేఘాల్ని
వస్త్రాల్లో బంధించటం కంటే ఆనందం ఏముంటుంది.!
కాలం: 28-10-2018
------------------------------