Sunday, 13 December 2015

నాలో నా ఊరు

http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=4309734
13-12-2015(andhrabhoomi.)

నాలో నా ఊరు

ఎన్ని కాలాలు
అలలు అలలుగా నడచి వచ్చినా
నాలో వట వృక్షంలా నిలిచిన నా ఊరు
విజ్ఞానాన్ని బుర్రలోకి వొంపుకుంటూ
ఎన్ని దూరాలు
జీవిత సందర్భాలుగా మారినా
కాస్తంత సమయం దొరికితే చాలు
నా పైరు నా పల్లె
రెప్పల మీద పిట్టల్లా వాలుతూనే ఉంటాయి
నా పల్లెలో
వలస పక్షుల్ని చూస్తున్నాను
తడారిన గుండెల్లో
పగిలిన బీడు భూముల్లో
మొలకెత్తని ఆశలు
వలస పోతున్నాయి
అయినా చెదిరిన స్వప్నాల్ని
మళ్లీ నిర్మిస్తున్నాను
పల్లె గుర్తొస్తే చాలు
దేహం ముక్కలు ముక్కలుగా
రాలిపోతుంది
పల్లె రుణం తీర్చుకోడానికి
మనసు ప్రణమిల్లుతోంది
పల్లెకు పోతాను
రైతుని విజ్ఞాన నిధిగా నిలిపేవరకూ
పల్లెకు పోతాను
మేట వేసిన జీవితంలో
ఒక ఆశగా మొలకెత్తుతాను.

No comments:

Post a Comment