నేను పాఠం నేర్పాను ..! -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601
నేను మాట నేర్పాను
మౌనం బద్దలయింది .
నేను భరోసా ఇచ్చాను .
ఆశ విత్తుగా మొలకెత్తింది
నేను పాఠం నేర్పాను
చైతన్యం ఉరకలేసింది
నేను ఉదయించే సూర్యుని చూపాను
పోరాటానికి పునాది పడింది
నేను ప్రశ్నను చూపాను
సమాధానమే ఎదురై నిలిచింది
నేను అగ్నిని చూపాను
క్షమించరానిదేదో బూడిదయింది.
నేను కళ్ళు తెరవమన్నాను
ఆత్మ స్థైర్యం నిలుచుని పోరాడింది
నేను మౌనంగా నవ్వుకున్నాను
స్థబ్దంగా పడిన క్షణాల నైరాశ్యాన్ని చూసీ ..!
No comments:
Post a Comment