24 oct 2018 navya weekly andhra jyothi
https://epaper.andhrajyothy.com/m5/1862719/Navya-Weekly/20.10.2018?fbclid=IwAR3n_AJf8vD6fPoUfodkkhQotVoSp345DapBT_VvyJ3pkXFpbVE0uR8KMvU#issue/51/1
చెరో వైపు -గవిడి శ్రీనివాస్ 9966550601, 7019278 368
బహుశా నువ్వూ నా లాగే
మధన పడుతున్నావనుకుంటా
ఒక వైపు జ్ఞాపకాల్లో తడుస్తూ
నిద్ర లేని రాత్రుల్ని మోస్తున్నావనుకుంటా
వేకువ అంచుల్లో జారిపడ్డ కలలన్నీ
సగం లోనే ఎగిరిపోతే
విరిగి పడ్డ ముక్కలు గా మనం మిగిలాం .
చూపులు ఒకటే
మనసులు ఒకటే
దాని పరిధు లే వేరు .
నేల పై చినుకు మొలిస్తే
ఆ చినుకు లో నువ్వు పరిమళిస్తే
తుమ్మెద ఝంకారం లా మనసు ధ్వనిస్తే
రాలిన నీ జ్ఞాపకాల్లో మునుగుతూ నేను .
వాన వెలిసాక
అంతా నిర్మానుష్యంగా ఏమి జరగనట్టు
నిర్మలంగా సాగిపోతున్నట్లు భ్రమిస్తాం .
లోలోపల ఘర్షణలు కలవని ధృవాలు
ఒక వేకువలాంటి కల కోసం
చెరో వైపు దుఃఖిస్తూ
ఒక తలపు నీవెంట
ఒక తలపు నా వెంట
ఒక చేరువ కోసం పరితపిస్తూ
తలమునకలవుతున్నాం .
No comments:
Post a Comment