కొన్ని క్షణాలు
ఆకర్షణతోనో అనుబంధం తోనో
పెనవేసుకుని చెమట చుక్కలుగా
మునిగి తేలిన అమృత ఫలాన్ని నేను.
ప్రాణం పోసుకున్న ఆడపిండాన్ని నేను.
ఊపిరి ఊదుకుంటున్నందుకే
దేవునికి కడుపు లోనే కృతజ్ఞతగా
రెక్కలూపుతున్నాను .
రేపటి కలల మీద
ఇప్పుడే పేగుల వలయాల్లో గంతులేస్తున్నాను
కడుపు నిమురుతున్నపుడల్లా
చెక్కిలి గింతలతో మురిసిపోయాను .
సూర్యోదయం ఎలా వుంటుందో
చంద్రోదయం ఎలా బుజ్జగిస్తుందో
ఎన్ని ఉయ్యాలలు పడిగాపులు కాస్తున్నాయో
ఊహకు అందని ఆనందాల మధ్య
నిండిపోయాను.
రెమ్మ రెమ్మ తో గాలి వూదుతున్నందుకే
నా చిట్టి గుండె
మట్టి మీద పడి
మల్లె పరిమళాల్ని
హత్తుకో బోతున్నందుకే
ఆనందంగా వుంది .
ఆటల ప్రపంచంలో తోటి పిల్లల్ని
ఆప్యాయత బంధాల్లో నా వాళ్ళని
తనివితీరా చూసుకోవాలనీ వుంది .
నాకల ఫలించక ముందే
నా చెవుల్లో కి ధ్వనించిన నిజం
ఇప్పుడు కనడానికి
కడుపులోంది ఆడబిడ్డా మగబిడ్డా !
నిర్ధారణకు నిర్ధక్ష్యణ్యం గా వచ్చినపుడే
వసంతమే లేని
శిశిరం లా రాలిపోతున్నందుకే
దృశ్యం కాలేని ఆడ శిశువు గా
మానవత్వాన్ని పాఠం గా నేర్పమని
మౌన ఘోషా తరంగాల్ని వేదజల్లుతున్నాను
కన్నీటి వాగై జననాంగం నుండీ
జారిపోబోతున్నాను .
మట్టి గుండె జారిపోతోంది
గవిడి శ్రీనివాస్
08886174458
మమకారం పంచిన తల్లిలా
నా మట్టి లాలించి పాలించేది
నేను తెల్లారే రేగిన ఆనందంతో
పొలా గట్లవెంట తుళ్ళిపడేవాడిని
కళ్ళళ్ళో పరిమళా పందిళ్ళు విరిసేవి
అంతే
వొయ్యారంగా ఊగే ఆకుపచ్చని పొలాన్ని
రెక్కు చాచుకు హత్తుకునే వాణ్ణి
దొర్లుతున్న సంవత్సరంలో
పైరుపచ్చని కలు దృశ్యాలై నిలిచేవి
రాజధాని రెక్కల్లో
రాక్షస కత్తు దూస్తున్నాయి
చీకటి స్వప్నాు
ఊహించని దాయి
బతుకుని ఛిద్రం చేస్తున్నాయి
ఆకుపచ్చని గుండె మీద
సిమ్మెంట్ దరువు మోగుతున్నాయి
ఈ కళ్ళముందే
మబ్బుపడుతున్న పొలాన్ని చూస్తే
ఆకాశాన్ని పిండి
కన్నీటి ధారు చిందిస్తున్నట్లు
నాలో ఒక నిర్వేదం అుముకుంది
ఇక్కడ మట్టి బంధాల్ని లెక్కించే
మనుషుల్ని చూడలేం
ఊహ సౌధాల్ని
ఆలింగనం చేసుకుని
వ్యాపార సామ్రాజ్య వాదాన్ని
బాకా ఊదుతున్న
రాబంధుల్ని భరిస్తున్నాం
నిశ్శబ్దం ముక్కలైన చోట
విప్లవాు మొకెత్తుతాయి
ఆశ దృశ్యాల్ని చూపిస్తూ
రిక్త హస్తాు ఎదురైన వేళ
రగుతున్న రక్తం
చెరిగిపోని పుటగా
లిఖించబడుతుంది
30--08-2015
ప్రస్థానం సెప్టెంబర్ 2015
మరలా తిరిగి రాలేకపోతున్నాను ..! - గవిడి శ్రీనివాస్ 07019278368, 08722784768ఒక నిశ్శబ్ద సమయంనీలోకి ప్రవేశించాను.మరలా తిరిగి రాలేక పోతున్నాను.ఆ క్షణం నీవూ నేనూచూపులతో మాట్లాడుకున్నాం .ఆప్యాయతల్ని అలంకరించు కున్నాంబిగిసిన వస్త్రాల్లోవిరిసిన సమ్మోహన రూపంగాజుల సవ్వడి లోమోగిన గుండెలుచేతుల కరచాలనం లోనలిగిన మనసులునీ కురుల నదులలోతేలిన ముఖ సోయగాలుముద్దుల పరిమళాలుకురిసే వాన లోమౌనంగా వాలిన క్షణాలుఅలంకరించిన హృదయాలునాలో నడుస్తున్నఈ వెన్నెల సమీరాలుఇక నాలోఒక చిరు నవ్వు శిల్పం లాపూల వనం లామిగిలి పోయాయ్.మరలా రాలేని బందా ల్లో నీవుమరచిపోలేనినీ జ్ఞాపక శిలా శాసనం లామిగిలిన నేను.

No comments:
Post a Comment