Sunday, 10 July 2016

ఒక జీవితం

ఒక జీవితం

కొన్ని ఉరుములు
కొన్ని పిడుగులు
జీవితంలో ఉలిక్కి పడుతుంటారు!

సంతోష సాగరంలో ఈదుతున్నపుడు
తన్మయ క్షణాల్లో మునుగుతున్నపుడు
కోల్పోయిన బంధాలేవో
లోలోపల అలా తడుముతుంటారు!
మూలాల వెంట వదిలిపోయినవి
కళ్లెం పట్టుకు లాగుతుంటారు!

దూరమైన జీవితాల్లో
భౌతిక సమ్మేళనాలుండవ్‌
గాయపడ్డ మమతల దేహాలు తప్ప!

నాకిప్పటికిప్పుడు
నా వాళ్ళతో నా మట్టితో
కాసేపు మనసారా కురిసే
మాటలా జారిపోవాలనుంది

జీవితమంటే
నలుగురి ఆప్యాయతల కలయిక
మనసు ఊరటను
వ్యక్తపరిచే ఒక వేదిక
హ దయం రెక్కల రెపరెపల్లో
సందర్భాల్ని వెతుక్కుంటూ
కాలాన్ని మోసుకుపోతున్నాను

మనసారా నవ్వడానికి
ఆర్థిక కొలతలు అవసరం లేదు
అంతుచిక్కని లెక్కల్లోకి దిగితే
సమీపించే కొద్దీ సాధించేకొద్దీ
చేరాల్సినది వేరే ఉంటుంది

గమ్యాల చేరికలో ఒక జీవితం
సుగంధాల జల్లులు కురుస్తున్నట్లు
వేపచేదులు తినిపిస్తున్నట్లు
ఒక అనుభూతి అంతర్భాగమవుతోంది
ఆగని కాలం గుర్రపు స్వారీ చేస్తుంది
మనమే కన్నీళ్లను తీపిగా చేదుగా
అభివర్ణిస్తుంటాం
జీవితం అనేక అనుభూతుల, అనుభవాల విద్యాలయం!

- గవిడి శ్రీనివాస్‌
087227 84768

Monday, 20 June 2016

ఒక తీయని లోకం లోకి ..!


http://epaper.prabhanews.com/846881/Andhra-Pradesh-Main/20-06-2016#page/4/3

20-6-2016  Andhraprabha monday











చినుకు సంబరం


ఉక్కపోత జీవితంలో
ఉన్నట్టుండి మబ్బులు
ఉరమటం మొదలెట్టాయి.

ఎండకు తడిసిన తనువులు
చినుకు సంబరంతో
మట్టి మధ్య మొలకెత్తుతున్నాయి.

నా గాలిలో మట్టి పరిమళం
నా శ్వాసలో ఆశను రేపింది.

చినుకు తడితో మట్టి పులకించినట్లు
మట్టిని తాకిన ఒళ్ళు జలదరించిపోతోంది.

పిడికెడు మట్టిని పట్టిన
దోసిళ్లలోకి రాలిన నా కన్నీళ్లు
ఆనందాశ్రువుల్ని పోగు చేస్తున్నాను.

గుప్పెడు గుండెలో
వెలుగు వరదల్ని నింపే
నీటిలో పులకరించిపోతున్నాను.

నాగలితో దున్నుకోడానికి
ఒక ఆకాశం వచ్చి వాలినందుకు
ఒక చినుకుగా మాట్లాడినందుకు
పూల వర్షంలా జారినందుకు
తనువు బహుముఖంగా పులకరిస్తోంది.
గాలిసయ్యాటలాడుతోంది
మనసు ఊగుతోంది
పల్లె పరవశంలో
మనసు మునుగుతోంది.

నా మట్టంటే
బహుమానమంత అభిమానం
కాలం మీద చెప్పుకున్న కబుర్లన్నీ
నా మట్టితో నిండిన అనుభవాలే.

చినుకు కురిస్తే చాలు
చిగురించే చెట్టునవుతాను
పరవశించే నెమలినౌతాను
ఆకాశానికి వేలాడే
ఇంద్ర ధనుస్సునవుతాను.
మనిషినవుతాను
మట్టిని నమ్ముకున్న
రైతు బిడ్డనవుతాను
మట్టిని మోసే మనిషిని
మనిషిని నడిపే మట్టినీ అవుతాను

గవిడి శ్రీనివాస్‌
- 08886174458
19-6-2016
http://www.prajasakti.com/SnehaBook/1806599
http://www.prajasakti.com/WEBSUBCONT/1806599

Monday, 13 June 2016

చినుకు సంబరం



http://epaper.prabhanews.com/839234/Andhra-Pradesh-Main/13-06-2016#page/4/3

Sahiti Gavaakshyam

Sunday, 15 May 2016

రంగుల లోకం

Home » 

రంగుల లోకం

Posted On 4 days 1 hour 32 mins ago
రంగుల లోకం
ఇంద్ర ధనుసులో పొదిగి ఉన్నవి
ఎన్ని వర్ణాలు
ఎన్ని రంగుల జలపాతాలు
ఒక వర్ణ శోభిత దృశ్యం లా
ఒక రంగుల గొడుగులా
చూపుల్ని తన వైపు
లాక్కు పోవడం లేదూ!
ఒక అందాల ఆభరణంలా
మిరుమిట్లు గొలపడం లేదూ!
ఎన్ని జాతులు ఎన్ని మతాలు
ఎన్ని కులాలు ఎన్ని వర్ణాలు
ఒకే రక్తంలో పూయడం లేదూ!
మరి కన్నీటిని చెక్కుతున్న శిల్పులెవరూ?
ఆత్మ హత్యలకు కారకులెవరు?
నాలో ఉద్వేగాన్ని
నీలోకి ఉద్భోదిస్తూ
నీలో ప్రేమను
పరిచయం చేయమంటున్నాను.

పరాకాష్టకు చేర్చే
విపరీత ధోరణుల్ని
ముక్కలు ముక్కలు చేస్తున్నాను
వీలైతే కాసింత ఓదార్పు నివ్వు
జీవితాన్ని కబళించే
శోక గీతికలకి
ఆరంభకుడివి
ఆరాధ్యుడువి కానే కారాదు.

జీవితాధ్యాయంలో
కాసింత ప్రేమను రుచి చూడు
ఒక్కసారిగా విద్వేషాలన్నీ
చెరో దిక్కులో పరుగులెడతాయి.
- గవిడి శ్రీనివాస్‌
9966550601
http://www.prajasakti.com/Content/1795293



- గవిడి శ్రీనివాస్‌

http://epaper.prajasakti.com/c/10320420


Monday, 9 May 2016

గవిడి శ్రీనివాస్

http://www.wikiwand.com/te/%E0%B0%86%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95_%E0%B0%AF%E0%B1%81%E0%B0%97%E0%B0%82_%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%80%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2_%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE


http://www.wikiwand.com/te/%E0%B0%86%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95_%E0%B0%AF%E0%B1%81%E0%B0%97%E0%B0%82_%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%80%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2_%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE#/.E0.B0.95.E0.B0.B5.E0.B1.81.E0.B0.B2.E0.B1.81

Sunday, 17 April 2016

ఓ నా దేశమా..!




http://epaper.prajasakti.com/780595/East-Godavari/Sneha#page/19/1

17-4-2016  Sneha prajasakti

Sunday, 10 April 2016

naa matii


http://ipr.ap.nic.in/AndhraPradeshPatrika/issues/2016/April/Telugu/page56.html

April 2016

Sunday, 3 April 2016

తొలకరి జ్ఞాపకం!

తొలకరి జ్ఞాపకం!

Posted On 16 hours 26 mins ago
తొలకరి జ్ఞాపకం!
మబ్బుల రెక్కలు ఊగుతుంటే
తొలి తొలకరి జల్లు మనసును తడిపేది
పంట పొలాల గుండెల మీద
నా ఎడ్ల బండి కొత్త దారుల్ని తొలిచేది
గరిసెడు గత్తం బండిలో పరుగులు తీసేది
ఎద్దుల గంటల్లో ఆశలు మోతలు మోగేవి

వెన్నెల వొంపిన చందమామ సాక్షిగా
ప్రతి మడిలో రాత్రిళ్ళు ఎరువుల కుప్పలు విరిసేవి
పనిలోని ఆనందాన్ని
ఆ ఆనందంలోని ప్రక తిని
నా కూనిరాగాలు పరవశింపజేసేవి
తడి తగిలితే చాలు
నాగలి కర్రు నాగేటి చాళ్ళలో
మట్టి గుండెల్ని చీల్చుకుంటూ ఉరకలు తీసేది
ఎన్ని మైళ్ళు నాగలితో నడిచాను
ఎన్ని సార్లు విత్తనంతో మొలకెత్తాను

తెల్లవారు జాము చంద్రుడు పూస్తున్నప్పటి నుంచీ
సూరీడు వేడెక్కేవరకూ
నాగలితో ప్రయాణం
జీవన వేదమయ్యేది
బతుకు పాటయ్యేది
పాట పల్లవించిన బతుకులో
నాగలి కర్రు కళ్ళల్లో హరిత వనాల్ని నింపేది

ఇప్పుడు నా నాగలి జాడేది
ఇనుప దున్నల కింద
కనుమరుగై పోతున్న నా ఎడ్లబండి
ఆనవాళ్లైనా మిగుల్చుకోవాలని తల్లడిల్లుతున్నాను
- గవిడి శ్రీనివాస్‌
08722784768, 9966550601
http://www.prajasakti.com/Content/1779612

Sunday, 13 March 2016

ఆకురాలే కాలం

ఆకురాలే కాలం

యవ్వనం మొగ్గ తొడిగి లేతప్రాయం
వెన్నెల గొడుగు కింద కలల్ని వేలాడదీసుకుంది
సహవాసాలు అభిమానాలు తెలియని బంధమై
అల్లుకుపోయి జీవితంగా ముడివేసుకుంటున్నాయి
కన్నె వయసు ఊహలన్నీ ఊసులన్నీ పదిలంగా
హృదయం లోకి ప్రవేశించాక తొంగిచూసిన
క్షణాల్లో ఏడడుగుల బంధంలోకి ప్రవేశించాం
రోజులు పెనవేసుకున్నాయి కాలం కబుర్లు చెప్పుకుంది
అనుభూతులు ఆడపిల్ల రూపం లో సాక్షాత్కరించాయి
ఏమైందో ఏమో ఆకు రాలే కాలం తడితడిగా
తడుముతోంది నన్ను తరుముతోంది
తోడై నిలవాల్సినవాడే కన్నీళ్ళ బుట్టను
నెత్తిన ఎత్తి జాడే లేని చోటుకి జారిపోయాడు
రెక్కలూపుతున్నపాపతో నా పూల కొట్టు లో
ఓదార్చే ప్రతి పువ్వులో అతని కోసం
రెప్పవాల్చని ఆశలతో ముసురుతున్నకాలాన్ని
కాస్తంత బరువుగానే ముందుకుతోస్తున్నాను