వెన్నెల స్నానం
చల్లని వెన్నెల కిరణాల్ని
కత్తులతో కోస్తూ
కలల రాకుమారుడినవుతాను
అపుడవి
వాన పువ్వులై రాలుతుంటాయి
అంతే
నేను తడిసి ముద్దవుతుంటాను
కాస్తంత మురిపెం
నాలో చలి మంట కాగుతుంది
వెన్నెల్ని చూస్తే రెక్కలు మొలుచుకుని
నాలో ఉత్తేజం
పావురంలా ఎగురుతుంది
అంతే
నేను పారిజాతాన్ని
బహూకరిస్తున్నట్లు
నాలో కలుస్తున్న
గాలి పరవళ్లలో మునిగి పోతాను !!
- గవిడి శ్రీనివాస్
08722784768
కత్తులతో కోస్తూ
కలల రాకుమారుడినవుతాను
అపుడవి
వాన పువ్వులై రాలుతుంటాయి
అంతే
నేను తడిసి ముద్దవుతుంటాను
కాస్తంత మురిపెం
నాలో చలి మంట కాగుతుంది
వెన్నెల్ని చూస్తే రెక్కలు మొలుచుకుని
నాలో ఉత్తేజం
పావురంలా ఎగురుతుంది
అంతే
నేను పారిజాతాన్ని
బహూకరిస్తున్నట్లు
నాలో కలుస్తున్న
గాలి పరవళ్లలో మునిగి పోతాను !!
- గవిడి శ్రీనివాస్
08722784768
http://epaper.prajasakti.com/c/12631068
http://www.prajasakti.com/Article/Savvadi/1832306
No comments:
Post a Comment