అలా చూడు ప్రపంచం
అలా చూడు ప్రపంచం
గడియారం ముల్లు
గుండెల్లో గంటలా మోగుతుంటే
క్షణాల్ని నెత్తిన ఎత్తుకుని
నిర్ణయించబడ్డ సమయానికి
అడుగులు సమాయత్తమవుతుంటాయి
ఇక్కడ గమ్యాలు చేరడమంటే
హారన్ ఊదుతున్న ఆటోల వెంటో
ఘోషించే కెరటాల్లాంటి బస్సుల వెంటో
హడావుడిగా ముస్తాబైన మెట్రో రైళ్ల వెంటో
మనల్ని మనం ఆరేసుకోవడమే.
ఇక్కడ జీవితమంటే
ఆకాశాన్ని వంచి మెరుపుల్ని మోయడమే
వొడిసిపట్టిన సమయాల్ని నిలదీస్తే
దానిలో మనం మనలా జీవించిన
క్షణాల్ని లెక్కించ గలిగామా!
చుట్టూ చూస్తుంటే
పల్లె చాపలా చుట్టుకు పోతున్నట్లు
పట్టణం ఉక్కపోతలో ఉడికిపోతున్నట్లు
చెమర్చిన కళ్ళు చెబుతున్నాయి
వొక సందర్భం
వొక పూర్తి కాని స్వప్నం
మనల్ని కొత్తదారుల వెంట తరుముతుంటాయి
ఇక్కడ ప్రేమను వొంపే మనసుంది
మనసుని నీ ముందు నిలబెట్టే ఆశా వుంది
నీతో గడపడానికే సమయం గొడవ పడుతుంది
కాలం కన్నీరు కారుస్తుంది
మనిషి పరుగుని చూసి
ఒకింత దిగులుగా కాస్తంత జాలిగా
వృద్ధి చెందడమంటే
మనసుకి కారాగార శిక్ష వేయడం కాదు.
కొన్ని విలువలు కొన్ని మమతలు
కలబోసుకోవడమే.
- గవిడి శ్రీనివాస్
9985010538
గడియారం ముల్లు
గుండెల్లో గంటలా మోగుతుంటే
క్షణాల్ని నెత్తిన ఎత్తుకుని
నిర్ణయించబడ్డ సమయానికి
అడుగులు సమాయత్తమవుతుంటాయి
ఇక్కడ గమ్యాలు చేరడమంటే
హారన్ ఊదుతున్న ఆటోల వెంటో
ఘోషించే కెరటాల్లాంటి బస్సుల వెంటో
హడావుడిగా ముస్తాబైన మెట్రో రైళ్ల వెంటో
మనల్ని మనం ఆరేసుకోవడమే.
ఇక్కడ జీవితమంటే
ఆకాశాన్ని వంచి మెరుపుల్ని మోయడమే
వొడిసిపట్టిన సమయాల్ని నిలదీస్తే
దానిలో మనం మనలా జీవించిన
క్షణాల్ని లెక్కించ గలిగామా!
చుట్టూ చూస్తుంటే
పల్లె చాపలా చుట్టుకు పోతున్నట్లు
పట్టణం ఉక్కపోతలో ఉడికిపోతున్నట్లు
చెమర్చిన కళ్ళు చెబుతున్నాయి
వొక సందర్భం
వొక పూర్తి కాని స్వప్నం
మనల్ని కొత్తదారుల వెంట తరుముతుంటాయి
ఇక్కడ ప్రేమను వొంపే మనసుంది
మనసుని నీ ముందు నిలబెట్టే ఆశా వుంది
నీతో గడపడానికే సమయం గొడవ పడుతుంది
కాలం కన్నీరు కారుస్తుంది
మనిషి పరుగుని చూసి
ఒకింత దిగులుగా కాస్తంత జాలిగా
వృద్ధి చెందడమంటే
మనసుకి కారాగార శిక్ష వేయడం కాదు.
కొన్ని విలువలు కొన్ని మమతలు
కలబోసుకోవడమే.
- గవిడి శ్రీనివాస్
9985010538
http://www.prajasakti.com/Article/Sneha/1822895
No comments:
Post a Comment