Sunday 25 December 2016

రూపాయి పోరాటం


http://epaper.prajasakti.com/1047577/East-Godavari/Sneha#page/15/1


రూపాయి పోరాటం - గవిడి శ్రీనివాస్  07019278368, 08722784768

రోజల్లా 
నడిచే ప్రయాణాన్ని 
ముక్కలు గా విరిచి 
కన్నీళ్లనే  తొడగటం .

అర్థరాత్రి  నిర్ణయాల 
ముసుగుల్లో ముంచెత్తటాలు
ఒక విధ్వంసపు ఆనవాలు.

నల్ల కుబేరులెపుడూ 
రూపాయిని  వివిధ  రూపాలుగా 
తొడుక్కుంటారు .

ఇప్పుడు 
విరిగిన  సగం జీవితం 
సామాన్యుడి పైనో 
మధ్యతరగతి గానో 
విలవిలలాడుతూ 
ప్రాణాలు ఆఖరి శ్వాసగా 
విడవబడు తున్నాయి .

పనులు గాల్లో కలిసి 
బారులు కట్టిన జనం 
 బ్యాంకుల చుట్టూ యుద్ధం 
ప్రాణం గుప్పిట తల్లడిల్లుతూ 
ప్రణాళిక లేని పెద్ద వ్యవహారానికి 
బలౌతూ ప్రణమిల్లుతూ 
ఒక పరిష్కరానికి 
ఎదురు చూపులు 
పోరాడుతున్నాయి .