Sunday 19 March 2017

sonta vuru


surya paper 13-3-2017

nidurodamante


prajasakti 19-3-2017

sonta vuru

                                         
                                           nava telangana  sunday 19-3-2017

ఒక గుప్పెడు రాత్రులు


AndhraBhoomi sunday 19-3-2017



అక్షరాలోచనాలు!

ఒక గుప్పెడు రాత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాత్రులన్నీ
సజావుగా నిద్రపోవు
గుప్పెడు జ్ఞాపకాలు తట్టి
మది కడలి
కల్లోలితమవుతుంది
ఈ ప్రపంచీకరణ ప్రపంచం
వైకుంఠపాళీ అవుతుంది
కదిలే అడుగులలో
వొణికిన సవ్వడులెన్ని
ముంచుతున్న పనివేళల
మంచు తెరల వెనుక
నలిగిన జీవికలెన్ని
మబ్బుల్ని ఢీకొట్టి
మంటల్ని ఊపినట్లు
ఊపిరి ఉక్కపోతతో
బిగుసుకుంటుంది
ఆశంతా
ఒక గుప్పెడు రాత్రులు
ఎగసీ
నిద్రపుచ్చేవి
రెక్కలు కట్టుకు ఊగుతుంటాయనీ
కలగంటూ... నేను!
-గవిడి శ్రీనివాస్, 07019278368
http://andhrabhoomi.net/content/akshara-443

Saturday 18 March 2017

గవిడి శ్రీనివాస్ జీవితం

గవిడి శ్రీనివాస్


గవిడి శ్రీనివాస్
జననం
గవిడి శ్రీనివాస్
1977, జూన్13
గాతాడ, మెరకముడిదాం మండలం
విజయనగరం (జిల్లా)
ప్రసిద్ధి
తెలుగు కవి, గీత రచయిత.
పిల్లలు
టాబుశ్రీ,
దీపశిఖ ,
నవనీత్
           
భార్య
తండ్రి
అనురాధ
సూర్యనారాయణ

      తల్లి
అరుణ కుమారి
   సంతకం

గవిడి శ్రీనివాస్ తెలుగు కవి, గీత రచయిత. మార్క్సిస్టు. శ్రీనివాస్  గాతాడనివాసి. 
రామసూరి ,అద్దేపల్లి, కె. శివారెడ్డి,భావశ్రీ  వంటి  కవుల ప్రభావంతో  సాహిత్య రంగానికి వచ్చాడు. తెలుగులో భావుకత ,శిల్ప నైపుణ్యం కల్గిన కవిత్వం  చేపట్టిన కవుల్లో గవిడి ఒకరు.

జీవిత విశేషాలు

గవిడి శ్రీనివాస్1977, 1977, జూన్13న  గాతాడలో పుట్టారు. తిమిటేరు బూర్జవలస
లో ప్రాథమిక విద్యను అభ్యసించి, తర్వాత ఉన్నత పాఠశాల చదువు 10 కిలోమీటర్లు దూరం ఉన్న దత్తి హైస్కూల్‌లో కొనసాగింది. ఈయన తాత గవిడి కన్నప్పల నాయుడు . తండ్రి సూర్యనారాయణ  వీరోఓగా పనిచేసేవారు. 1999 నుండి 2010  వరకు  సెయింట్ ఆన్స్  స్కూల్  లో  గణిత ఉపాధ్యాయుని గా చేశారు.2010  నుండి నోర్డ్ సిన్యూ , సిఎంబియోసిస్ టెక్నాలజీస్ , సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేశారు .ఈయన ఆంధ్ర  విశ్వవిద్యాలయం విశాఖ పట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు.సెయింట్ మేరీస్ సెంటినరీ కాలేజీ నుండి  బి .ఎడ్ . పూర్తీ చేశారు . ఈయన తాతయ్య వలిరెడ్డి అప్పలనాయుడు దగ్గర పెరిగారు . తాతయ్య ఉపాద్యాయుడు , సర్పంచ్  గా చేశారు .

రచనలు


1.కన్నీళ్లు సాక్ష్యం (కవితల సంపుటి 2005 ) యువస్పందన ప్రచురణ

2.వలస పాట (కవితల సంపుటి 2015) సాహితీ స్రవంతి ప్రచురణ

పాటలు 

1 . తొలితొలి ఆశల్లో (ఆల్బమ్)


పురస్కారాలు

2016లో సాహితీ సమాఖ్య  నుండి సాహితీవిమర్శకు గాను కవితాసృజన  పురస్కారాన్ని అందుకున్నారు .