Saturday 10 February 2018

ఒకింత మేఘం

http://www.sirimalle.com/issues/2018/02/kavitha2.html

ఒకింత మేఘం
- గవిడి శ్రీనివాస్


చూపుల్ని దీపాల్లా వెలిగిస్తూ
చంటి పిల్ల  మాదిరి మారం చేస్తుంది.
ఒకింత  మేఘం
అలసిన దేహం తో
చినుకు చినుకు గా వాలుతుంది
భూమి తనువు మరిచి
తడి తడి గా ముద్దయి పోతుంది.
కల్మషాలు  తడి  దేహాల వెంట
అలా విడవబడతాయి
మేఘం రూపం మారింది
మనసు ఊహ కొత్త లోకాన్ని చూపింది
ఈ ఒకింత మేఘం
కాలాన్ని ఎన్ని ముఖాలు గా
లిఖించుకుందో !
మరెన్ని గొంతుల్ని
సవరించుకుందో !
ఋతువుల్ని గంధంలా  రంగరించుకుని
ఎంత పులకరించిందో
ఒకింత మేఘం
నీటి చలనాల్ని
మనిషి గమనాల్ని
ఉపరితల దారుల్నీ మార్చేస్తూనే వుంది
ఒకింత మనిషి
ప్రపంచ గమనాల్ని
కాసింత కాలం నిర్దేశించలేడా !

divider


No comments:

Post a Comment