Saturday 4 August 2018

ఈ నల్లని మేఘాలు -కీకారణ్యాలు

http://epaper.suryaa.com/c/30728401

ఈ నల్లని మేఘాలు -కీకారణ్యాలు -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601

ఆకూ ఆకూ కరచాలనం చేస్తున్నవేళ
ఒక సూర్యోదయం వెలిగింది
మబ్బూ మబ్బూ ఢీ కొంటున్నవేళ
ఒక మెరుపు అలా మెరిసి చినుకు అలా కురిసింది.
చిక్కుముడులు నక్షత్రాలుగా చిక్కుకున్నాయి
వేళ్ళు నాటుకున్నచోట
గాలి గుహలు కట్టుకున్న చోట
వృక్షాలు వొంగి సలాం వేసే చోట
ఆకలి ఉరుముతుంటే
అరణ్యం వణుకుతోంది
ఒకప్పటి రాతి ఆయుధం 
ఇప్పుడు ఆకలి తుపాకై వూగుతోంది
ఆకాసాన్ని తలకిందులుగా వేలాడదీసే
ఇన్ని చెట్ల మధ్య ఇన్ని క్రూరమృగాల మధ్య
తలదాచుకున్న సూర్యుల్ని నమస్కరించాలి
సమస్య సాధన కోసం
మార్పు సూర్యల్లై ఉదయిస్తూ
సంకురాతిరినే ఉరితీస్తూ 
మట్టి పరిమళాల్ని పీలుస్తూ
పాద ముద్రలు రేపటి స్వేచ్ఛకై విడుస్తూ
ఈ నల్లని మేఘాలు కీకారణ్యాలు
ఉరుముతున్నాయి ఉడుకుతున్నాయి
ఇప్పుడు సమ సమాజం
ఒక నిర్మాణాత్మక అవసరం.

No comments:

Post a Comment