Sunday 27 August 2023

1.దిగులు గుండె మీద - 2. జ్ఞాపకాల వాన కవితా సంపుటాలు

 

ఒక స్వప్న సాకారం కోసం -గవిడి శ్రీనివాస్ 

కాలం పొద్దు గూకుతుంది 
ఇష్టం  వున్నా లేకున్నా
నిష్క్రమణ అనివార్యమౌతుంది 
రెప్పల్లో స్వప్నాలన్నీ 
కళ్ళముందే   తెలియడుతుంటే 
నిలకడగా ఉండలేను
ఒక స్వప్న సాకారం కోసం 
బలమైన  గాలుల్ని ఎదురీది 
వలస పక్షి నౌతున్నా
కలల తీరం చేరేవరకు 
పయనిస్తూనే వుంటాను .  

కాలం: 19-04-2015

----------------------------- 3

సముద్రం ఒక  ఊరట  -గవిడి శ్రీనివాస్    08886174458.

జడలు పాయలు  అల్లినట్లు 
నూనె రాసుకుని      నిగనిగలాడినట్లు   
ఉయ్యాలలూగుతూ  కడలి 
ఉత్సాహాన్ని  కెరటం లా విసురుతుంది .

నిర్వేదం  అల్లుకుని 
బోర్లాపడినపుడు 
అనంతమైన  ఆశలని  రేపి 
మనసుని  తడుపుతుంది .

ఒక్కో సారి 
సంద్రం మీద 
ఊహించని  ప్రపంచాలతో 
ఈ  జాలరి  జీవితాలు 
సతమతమవుతుంటాయి.

నావ లో 
ఒంటరిగా నక్షత్రాలని చూస్తూ  
వలలో  చిక్కుకున్న  నక్షత్రాలని
చేపలుగా  ఏరుకుంటాం.

కొద్ది దూరం  పోయాక 
వర్షం  పువ్వులై  రాలుతుంది .
గొడుగు  వొళ్ళు  విరుచుకుంటుంది 

కాసేపు గొడుగు చుట్టూ  రాలిన 
నీటి ముత్యాలని ఏరుకుంటాం. 
సముద్రం లో  పొద్దుపోయాక 
చీకట్ల  వాన  కురుస్తున్నపుడు 
సూర్య గోళాన్ని  గొడుగు లా 
ఎక్కి  పెట్టాలనుకుంటాం. 

  దైర్యంముంటే  చాలు 
ఎల్లలు  లేని  విశ్వాన్నే ఛేదిస్తాం
గుండె  గుబురులలో 
మంటలు  రేగుతున్నపుడే 
సంద్రం  వంకా 
ఆశ లని    నడిపిద్దాం 
దిగులు  దివ్వై వెలిగి
ఆశని   ఆకాశానికి 
తారా జువ్వలా  తీసుకుపోతుంది .


కాలం:22-04-2015

----------------------------- 4

వొణికిన  భూకంపం    -గవిడి శ్రీనివాస్    08886174458.

ఊహించని  క్షణాలు 
రెక్టారు స్కేల్ మీద
ఊగుతున్నాయ్ .

పొరల  దొంతరల్లో 
కదిలికే  ఏమో 
కలలు చిట్లినాయ్.

గాలి వీస్తున్నపుడు 
నేలకొరిగిన  చెట్టుల్లా  
రాలిపడ్డ  నేపాల్ , భారతావని  బిడ్డలు 
దేహం  మనుసులదైనా 
ఊహకు ముడిపడని 
కాలం అంచుల మీద 
కన్నీటి  శిల్పాలు మొలిచాయ్.

ఎందుకనో  కొన్నింటి రెక్కల చప్పుడు 
పసిగట్టలేం    
కొన్నింటిని   నిబిడాశ్చర్యమ్  తో  చూస్తాం  .

చెక్కిళ్ళ మీద 
కన్నీటి  చుక్కల్లా
జారిపోతున్న  ప్రాణాలు ..!
కళ్ళెదుట  దృశ్యాల్ని 
చలించే గుండె తో  వీక్షించి 
చేయూత  కర్రలా
సాగాల్సిన క్షణాల్లో 
ప్రణమిల్లుతున్నాం .

కాలం:26-04-2015



------------------------------ 5

ఆ దేహం నాదే

మల్లెపూలు  పెట్టుకుని 
వెన్నెల చీర  చుట్టుకుని 
నా హృదయ  ద్వారం ముందు నిలబడ్డ
సిగ్గు తో  నేసిన ఓ  ముగ్గు బుట్టా
ఎన్ని రంగుల ముగ్గులా  వుందో !
కాటుక చెక్కిన కళ్ళ అందాల తో 
జారే జలపాతం లాంటి 
ఊయలలూగే నడుం తో 
ముట్టుకుంటే    తెనేస్వరాలు 
వొలికే  వేళ్ళతో 
కురులతో  అలా పిలుస్తున్నట్టుగా 
సమ్మోహనంగా కవ్విస్తున్నట్టుగా 
లోలోన  మనసు పరదాల వెనుక 
ఆశలు కొద్ది కొద్దిగా  చిగిరిస్తున్నట్టుగా
ఆమె దేహం గాలి తరంగాల్లో
సందేశాల  సవ్వడి చేస్తోంది 
నా ముందు నిలిచి 
చూపుల పూల దండలతో  గుచ్చీ
మనసు అంగీకారాన్ని 
దేహ భాషగా పరిచాక 
ఒక ఆరాధనా  భావంతో 
నీ హృదయ  సామ్రాజ్యాన్ని 
జయించినందుకు 
నాదైన భాషలో భావంలో 
నీ కోసం వెన్నెల సామ్రాజ్యాన్ని  నిర్మించా!
అనుభూతుల  పల్లకిలో 
ఆత్మానందంతో  తేలియాడుతూ 
స్నేహపరిమళాన్ని   పూసుకుని 
ఏడు అడుగులుగా  నడవడానికి సిద్ధపడ్డ
నాకే  సొంతమైన 
ఆ అంతరంగాల  ప్రేమపందిరి
ఆ దేహం నాదే !
నా కోసం పుట్టిందే !!


కాలం: 30-05-2015

-------------------------------- 6


నా మట్టి గుర్తొచ్చినపుడల్లా     -గవిడి శ్రీనివాస్ 

ఈ దేహం రూపాన్తరం చెందుతోంది 
ప్రాంతాలు దాటి 
మట్టి గుండెను  చీల్చుకుని 
వోరొక చోట పుష్పించటం 
అనివార్యమైంది .
ప్రేమపంచిన నా ఊరు
కళ్ళ ముందు నడుస్తుంటే 
నగరం లో 
ఒంటరి  రాగం ఊపిరి పోసుకుంటుంది 
కాసేపు అలా రెప్పలు  తెరిస్తే చాలు 
కళ్ళ వాకిలి ముందు 
పరుగులతో  అలసిపోతున్న 
దేహాలు సుడులు తిరుగుతుంటాయి
ఆశల ప్రపంచం లో 
నిదురపోని 
మనుషుల ప్రవాహాలుంటాయ్
పలకరింపులు 
వాట్సప్ ల గానో ఫేస్ బుక్ ల గానో
సమయంలేని  సందర్భాలవుతాయ్  
కొలమానాలు ఆర్ధిక భాషలే  గానీ 
అంతరంగాల్లో  గూడుకట్టుకున్న 
కథలను  వినిపించలేమ్  
దూరాలు  కదిలినా 
నాలో ప్రవహిస్తున్న 
నా మట్టి గుర్తొచ్చినపుడల్లా 
అనుబంధాల దొంతరల్లో 
ఈ దేహం  కన్నీళ్ళై ప్రవహిస్తుంది 
ఆపుకోలేని  భావాలు దుఃఖ తరంగాలై  ఘోషిస్తాయ్.

కాలం: 30-05-2015

------------------------------------ 7


.
దృశ్యం కాలేని ఆడ శిశువు - గవిడి శ్రీనివాస్ 08722784768 ,08886174458

కొన్ని క్షణాలు
ఆకర్షణతోనో   అనుబంధం తోనో
పెనవేసుకుని  చెమట చుక్కలుగా
మునిగి  తేలిన  అమృత ఫలాన్ని  నేను.
ప్రాణం  పోసుకున్న  ఆడపిండాన్ని  నేను.
ఊపిరి ఊదుకుంటున్నందుకే
దేవునికి  కడుపు లోనే  కృతజ్ఞతగా
రెక్కలూపుతున్నాను .
రేపటి  కలల మీద
ఇప్పుడే  పేగుల  వలయాల్లో గంతులేస్తున్నాను
కడుపు  నిమురుతున్నపుడల్లా
చెక్కిలి  గింతలతో  మురిసిపోయాను .
సూర్యోదయం  ఎలా వుంటుందో
చంద్రోదయం  ఎలా బుజ్జగిస్తుందో
ఎన్ని ఉయ్యాలలు  పడిగాపులు  కాస్తున్నాయో
ఊహకు  అందని  ఆనందాల  మధ్య
నిండిపోయాను.
రెమ్మ రెమ్మ తో  గాలి వూదుతున్నందుకే
నా చిట్టి గుండె
మట్టి మీద పడి
మల్లె  పరిమళాల్ని
హత్తుకో బోతున్నందుకే
ఆనందంగా  వుంది .
ఆటల ప్రపంచంలో  తోటి పిల్లల్ని
ఆప్యాయత  బంధాల్లో  నా వాళ్ళని
తనివితీరా  చూసుకోవాలనీ వుంది .
నాకల  ఫలించక  ముందే
నా చెవుల్లో కి  ధ్వనించిన  నిజం
ఇప్పుడు కనడానికి
కడుపులోంది  ఆడబిడ్డా  మగబిడ్డా !
నిర్ధారణకు  నిర్ధక్ష్యణ్యం గా  వచ్చినపుడే
వసంతమే  లేని
శిశిరం  లా  రాలిపోతున్నందుకే
దృశ్యం  కాలేని  ఆడ శిశువు గా
మానవత్వాన్ని  పాఠం గా  నేర్పమని
మౌన  ఘోషా  తరంగాల్ని వేదజల్లుతున్నాను
కన్నీటి  వాగై  జననాంగం  నుండీ
జారిపోబోతున్నాను .
కాలం: 05-07-2015
---------------------------- 8
యంత్ర భాష -గవిడి శ్రీనివాస్  08722784768,9966550601

ఇప్పుడు తెల్లారనవసరం లేదు  
క్షణాలన్నీ బిగుసుకుపోయి 
తనువు అనేక కోతల్లో కమిలి పోతోంది 
ప్రపంచీకరణ పందిరికింద 
కరెన్సీ కాళ్ళ కింద నలిగిపోతూ 
తనది కాని ప్రపంచం లో 
వర్తమానాన్ని ఛిద్రం    చేస్తున్నాం .
కొండలా తరగని పనిని 
నెత్తిన ఎత్తుకుని 
అరకొర ఫలితాలతో 
బతుకుని బండరాయికి బాదుతున్న 
జీవితాలు నిత్య దృశ్యాలుగా దొర్లుతున్నాయ్
యాంత్రిక మౌతున్న  మనుసుల మధ్య
పనితెలియని బడాబాబుల  మధ్య 
బానిసత్వపు సంకెళ్ళు బిగుసుకుంటున్నాయ్ 
ఇక్కడ ఎవరికి వారే 
భజంత్రీలు వాగించు కోవాలి 
నేనిప్పుడు శ్రమను ప్రేమించే మనుషుల్ని 
మనుషుల్ని ప్రేమించే  యజమానుల్ని 
ప్రగతిని  కోరే పౌరుల్ని  వెదుకుతున్నాను 
ఇప్పుడు నే మాట్లాడేదంతా 
యంత్ర భాషే 
గుండెను తడిపే మాటలు రావు .
మనిషిని  చేసే  భావాలూ లేవు 
నా నుంచి రాల్తున్నవల్లా 
ముందుగా  నిర్ణయించబడ్డ 
సందేశాలకు  సమాధానాలు మాత్రమే!


కాలం : 18- 07-2015

-------------------------------
------------------------------- 9















 


 













కనురెప్పల  భాష -గవిడి శ్రీనివాస్  08722784768,9966550601

నీ కను రెప్పలపై  ఊయలూగి 
నుదిటిన  వెలిగే 
చంద్రబింబాన్ని  అందుకోవాలని వుంది !
నీ కను రెప్పలు
మూస్తూ  తెరస్తుంటే 
నెమలి పింఛమ్  తో 
గాలి విసురు తున్నట్లుంది 

అలా వాల్చిన 
నీ కను రెప్పల తలపులు 
ప్రశాంత ప్రపంచాన్ని 
మేల్కొలుపు తున్నాయి 
రెప్పలు వాల్చిన 
నీ మౌన ప్రపంచం లో 
తడిసి ముద్దయిన  వాడ్ని.
నీవు కను రెప్పల్ని తెరచి చూస్తే 
మేఘాల ఫై వర్షాన్ని 
కురవమన్నట్లుంది

నీ వలా లేస్తూ కదులుతుంటే 
జలపాతాలు  సన్న సన్న గా  జారుతున్నట్లు
యవ్వనమంతా నాభి  సంద్రం లోంచి 
ఉబుకుతున్నట్లు
మనో నేత్రం లో దృశ్య పరిమళాలు 
పరవళ్ళు తొక్కు తున్నాయి .
మౌనం వెనకాల దాగిన
ఆంతరంగిక  భాషతో 
నన్ను అలా నడిపిస్తున్నావ్
నీ పెదవుల ఫై తేనే పిట్టలా 
వాలమని  పంపిన సంకేతాలు 
ఇంకా కళ్ళల్లో  దృశ్యాలుగా
తడుపుతూనే ఉన్నాయి .

కాలం: 18-07-2015

----------------------------- 10


మట్టి గుండె జారిపోతోంది

గవిడి శ్రీనివాస్‌
08886174458

మమకారం పంచిన తల్లిలా
నా మట్టి లాలించి పాలించేది
నేను తెల్లారే రేగిన ఆనందంతో
పొలా గట్లవెంట తుళ్ళిపడేవాడిని
కళ్ళళ్ళో పరిమళా పందిళ్ళు విరిసేవి
అంతే
వొయ్యారంగా ఊగే ఆకుపచ్చని పొలాన్ని
రెక్కు చాచుకు హత్తుకునే వాణ్ణి
దొర్లుతున్న సంవత్సరంలో
పైరుపచ్చని కలు దృశ్యాలై నిలిచేవి
రాజధాని రెక్కల్లో
రాక్షస కత్తు దూస్తున్నాయి


చీకటి స్వప్నాు
ఊహించని దాయి
బతుకుని ఛిద్రం చేస్తున్నాయి
ఆకుపచ్చని గుండె మీద
సిమ్మెంట్‌ దరువు మోగుతున్నాయి
ఈ కళ్ళముందే
మబ్బుపడుతున్న పొలాన్ని చూస్తే
ఆకాశాన్ని పిండి
కన్నీటి ధారు చిందిస్తున్నట్లు
నాలో ఒక నిర్వేదం అుముకుంది
ఇక్కడ మట్టి బంధాల్ని లెక్కించే
మనుషుల్ని చూడలేం
ఊహ సౌధాల్ని
ఆలింగనం చేసుకుని
వ్యాపార సామ్రాజ్య వాదాన్ని
బాకా ఊదుతున్న
రాబంధుల్ని భరిస్తున్నాం
నిశ్శబ్దం ముక్కలైన చోట
విప్లవాు మొకెత్తుతాయి
ఆశ దృశ్యాల్ని చూపిస్తూ
రిక్త హస్తాు ఎదురైన వేళ
రగుతున్న  రక్తం
చెరిగిపోని పుటగా
లిఖించబడుతుంది

30--08-2015

ప్రస్థానం సెప్టెంబర్‌ 2015



------------------------------------ 11


ఒక దుఃఖ కెరటం  - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601

నిశ్శబ్దం నిలిచినా చోట 
జ్ఞాపకాల వరదలా 
దొర్లి పోతుంటావ్.
కాలం రెక్కల మీద
ప్రవహిస్తూ 
నీ వొక దుఃఖ కెరటమై 
గుండెను బాదుతుంటావ్.
ఆశలు ఇంకిపోయిన 
ఇసుక మేట జీవితం లో
అలా కెరటంలా వచ్చి పోతావ్ .
నేను కూలబడటం తప్పా
తోడై  నిలిచిన
పూలతోట  కాలేకపోతున్నాను.
ఎన్నయినా చెప్పు 
నీవు లేని ప్రపంచం 
ఒక శూన్యం లా 
ఒక శిధిల శకలం లా 
నన్ను వెంటాడుతోంది .
నువ్వు చేయందిస్తే చాలు 
ఒక ధైర్యమై జ్వలిస్తాను 
ఒక ప్రళయమై  ధ్వనిస్తాను.
నువ్వు నాతో నాలో వున్నపుడు 
విశ్వాన్నే జయిస్తాను .

కాలం: 20-9-2016

------------------------------------- 12


బాల్యం కొన్ని జ్ఞాపకాలు   - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601

ఒక ఖాళీ సమయం 
బాల్యం తళుక్కుమంటే  చాలు 
మబ్బులు మల్లెలు జల్లినట్లు 
వొళ్ళంతా సువాసనల గుభాళింపు.
పక్షుల  గుంపుల్లా
చేపల పిల్లల్లా 
ఎగరటం మునగటం 
స్వేచ్ఛా లోకంలో ఈదటం 
ఒక అనిర్వచనీయ  అనుభూతి .
గాలి వీస్తే చాలు 
గాలి పటాల వెంట 
మనసు విను వీధుల్లో  లోకాల్ని చుట్టేది .
మాకోసం  తొంగి చూసే  మామిడి చెట్లు 
బొంగరం లా తిరిగిన వేసవికాలం 
తడితడి అనుభవాలతో  జారిపోయేది.
కొబ్బరి చెట్లు ఈత చెట్లు 
పిలిచి పరిమళాలు  పంచేవి .
సాయంత్రం అరుగు పైన 
కథల గుభాళింపుల్లో
మనసు తడిసిపోయేది.
అలసిన జీవితం లో 
బాల్యం ఎప్పుడూ
వెన్నెల్ని  పుస్తూనే వుంది !

కాలం: 20-9-2015


-----------------------------------------13



నాలో నా ఊరు - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601

ఎన్ని కాలాలు 
అలలు అలలుగా  నడచి  వచ్చినా 
నాలో  వట వృక్షమ్  లా నిలిచిన నా ఊరు .
విజ్ఞానాన్ని బుర్రలోకి  వొంపుకుంటూ 
ఎన్ని దూరాలు 
జీవిత  సందర్భాలు గా  మారినా 
కాస్తంత సమయం దొరికితేచాలు
నా పైరు  నా పల్లె 
రెప్పల మీద  పిట్టల్లా వాల్తునే  వుంటాయి .
నా పల్లెలో 
వలస పక్షుల్ని చూస్తున్నాను .
తడారిన  గుండెల్లో 
పగిలిన బీడు భూముల్లో 
మొల కెత్తని ఆశలు
వలస పోతున్నాయి.
అయినా చెదిరిన స్వప్నాల్ని 
మళ్లీ నిర్మిస్తున్నాను .
పల్లె గుర్తొస్తే  చాలు 
దేహం ముక్కలు ముక్కలు గా 
రాలిపోతుంది .
పల్లె ఋణం తీర్చు కోడానికి 
మనసు ప్రణమిల్లుతోంది.
పల్లెకు పోతాను 
రైతుని  విజ్ఞాన నిధిగా నిలిపే వరకూ 
పల్లెకు పోతాను 
మేట వేసిన  జీవితం లో 
ఒక ఆశగా  మొలకెత్తుతాను. 

కాలం: 27-9-2015

------------------------------------- 14


నేను పోలవరం రైతుని మాట్లాడుతున్నా!   - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601

నేను రైతుని మాట్లాడుతున్నా
నీరంటే  తడిసిపోవడమే కాదు 
ఎండిన జీవితాల్లో  మొలకెత్తడం 
వాడిన మాటల్లో సువాసనలు పొదగటం 
అలలై  ఎగసి పడుతున్న నా కలల్ని 
నా మెత్త భూముల్లో 
కాలువలుగా  తడిసిపోవడం .
నేను నిఖార్సయిన  రైతుని 
రాళ్ళలోంచి సెలయేళ్ళని 
పరిమళం గా ఆశిస్తున్నాను .
చినుకుల్ని ప్రోదు చేసుకుందామంటే 
కొండెక్కి చూస్తున్న  పోలవరాలు 
పొయ్యి మీద ఉడికే కూడుకి 
దూరమౌతున్నాయి .
నేను వడ్డీల  చక్రం లో తిరగలేను .
సగం కాలిన ఆశల్ని 
ఎటూ నడపలేక 
ఎండ వెంటా వాన వెంటా 
అడుగుల్ని  తొడుగు తున్నాను .
నీరున్నచోట  మనుషులు
మహా వృక్షాలవుతారు .
నీరులేక  అనాధ గోడులు 
ఆత్మహత్యల  కథలవుతాయి .
నీటి చుక్కలకోసం గుప్పెడు మెతుకుల కోసం 
నీటి ప్రాజెక్టుల వెంట ఆశల్ని ఆరేసుకున్నాను .
ఇకనైన  ఆగిపోతున్న  ప్రాణాల్ని 
ఆనకట్టలు వేసి నీటి చుక్కలతో నిలపండి !


కాలం:27-9-2015

------------------------------------- 15 



జ్ఞాపకాల వాన

వసంతంలా  ఆశ
చిగురిస్తూ
శరదృతువు  వెన్నెలలా 
నీ మేను తాకుతూ 
శిశిరం లా 
కాలం జారిపోయింది .
అనుభవ సుగంధాల్ని 
పూసుకున్న రోజులు 
అలానే పలకరిస్తున్నాయ్ .

నీ పెదవుల పైకి 
నడచిన ద్రాక్ష పళ్ళు 
అలానే కవ్విస్తున్నాయ్ .

ఇప్పుడు  మనం 
చెరో దిక్కులో 
జ్ఞాపకాల  వానలో తడుస్తూ 
ఒంటరి పక్షుల్లా 
విలపిస్తూ మిగిలిపోయాం.

కాలం: 23-10-2015

----------------------------- 16



నీవులేని క్షణాలు 
నాపై  చినుకుల్లా వాలిన అత్తరు పరిమళాలు 
చుట్టూ ముట్టిన  రంగు రంగు  వలయాలు 
నాపై  ప్రవహించిన  వెన్నెల ఝరీ చీరలు 
నీవులేని  ప్రపంచం లో 
పొడిపొడి గా రాలుతున్న అనుభవాలు 
నీ పెదవులపై  తొణికిన పదనిసలు 
మత్తెక్కిన శుభ ఘడియలు 
ఒక్కసారిగా గుర్తొచ్చీ 
నాలో 
ఒంటరిగా వేరుపడిన నేను .
కలత చెందీ కలవరించీ 
కన్నీళ్ళ తో  గుండెను 
తడుపుకుంటాను .

ఎండిన మొక్కలా 
నిర్జీవమైపోతున్నాను.
ఏవీ  ఆ రాగ మాళికలు.
అల్లుకున్న ముగ్గులు 
నీ బుగ్గల పై వాలిన 
తడి తడి  మొగ్గలు 
లేత గా జారిన సిగ్గులు 
గాజుల మృదు స్వరాలు
నాలో  విరిసిన 
కోరికల హరివిల్లులు 
ఎన్నయినా మాట్లాడు 
నిన్ను మరచి పోవడమంటే 
నాలో ప్రపంచాలు  మునిగిపోతున్నాయ్ .
నిన్ను  తలచుకున్నానంటే 
నాలో అనుభవ పరిమళాలు 
దుఃఖ కెరటాలై  ఉబుకు తున్నాయ్.
నీవులేని క్షణాలు 
దుఃఖ సంద్రాల్ని మోస్తున్నాయ్ .

కాలం: 23-10-2015

--------------------------------------- 17

రాలవే నీటి చుక్కా!

వొడిసి పట్టుకుందామంటే 
చిక్కడం లేదు
గొంతుని తడిపే 
భగీరథ  ప్రయత్నాలన్నీ 
సతమత  మౌతున్నాయి .
చూపులన్నీ కొంగల బారులా 
నిల్చున్నాయ్.
కావేరీ  పరవళ్ళు కోసం 
కళ్ళు ఆకాశాన్ని  అంటి 
దిక్కుల్ని  ముక్కలు చేస్తున్నాయ్ 
బతుకులు సాగిలపడి 
నేలకు అంటుకుంటున్నాయ్
రాలవే నీటిచుక్కా !
అలసట చెందిన జీవితంలో 
ఒక తేనీటి విందు గా 
జారవే నీటి చుక్కా!!

(బెంగళూరు లో నీటి ఎద్దడి చూశాక)

కాలం: 25-10-2015

-------------------------------  18


నీ చూపుల దీవెన!

నీ చిరునవ్వు  పవనమే 
కష్టాల కడలి నుంచీ
చేతులిచ్చీ ఎత్తుకుని 
మలయమారుతం  వైపు 
నన్ను లాక్కుపోతుంది .
నీ చూపుల దీవెనే
ఊహలకు రెక్కలిచ్చి 
భావ సోయగాల మధ్య
బందీని చేసింది.
దొండ పండులా 
మెరిసే నీ పెదవుల్ని 
చిలకలా కోరకడానికి
ఉరికి నపుడల్లా 
మంచు వర్షం 
నా గుండెల్లో 
కురుస్తూనే  వుంది .
నీ పాద పద్మాల్ని 
చుంబించి నపుడల్లా 
వెన్నెల సెలయేళ్ళు 
నాపై జాలువారుతున్నాయి.
ఊపిరి సలపని
నీ బిగి కౌగిట 
నలిగిన నాల్గు క్షణాలు 
స్వర్గపు దారుల్లో 
పూల పరిమళాలు 
వీస్తూనే వున్నాయి.
నీ చూపుల దీవేనలో 
నీ మనసు గెలిచిన సమయాన 
అమృత ఫలాలు 
ముద్దులాడుతూనే  వున్నాయి.

29-11-2015

 ---------------------------------------- 19

-----------------------------------------  20


ఒక సాయంత్రం  - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601

ఒక సాయంత్రం
నువ్వూ నేను 
ఆరబోసుకున్న 
వెన్నెల్ని  పంచుకున్నాం.

లేలేత  ఆశల్ని 
కళ్ళల్లో వెలుగిస్తూ 
అనుభందాల వొడిలో వాలిపోయాం.

నా అర చేతుల్లో 
నీ ముఖ లావణ్యా న్ని  దాచుకుని 
స్వర్గపు దారుల్లో వొలికిన 
నును వెచ్చని సిగ్గులు 
నీలా పరచుకున్నాయి .

చందమామ ఊయలలూగు తున్నట్లు 
మంచు శిల ఏదో వొడిలో 
తగులుతున్నట్లు 
ఏవో తీయని బాధలు తీరుతున్నట్లు 
నాలో అనుభవ తరంగాలు 
కదులుతున్నాయి .

తీయని స్వప్నాలేవో 
తడి తడి దృశ్యా లై 
వెలుగుతున్నాయి. 

కాలం: 06-12-2015

-------------------------------------- 21


కబ్బన్ పార్క్ 

క్షణాలు ఒంటరిగా తొలుస్తున్నపుడు
మౌనంగా  వనంలోకి ప్రవేశించాను .
రెప్పలమాటు దృశ్యాలన్నీ 
హరిత స్వప్నాలై దర్శన  మిచ్చాయి.
చూపుల మొదళ్ళతో ఆరంభమై 
ఆకాశానికి ప్రసరించాయి .
రాలుతున్న కిరణాలతో 
ఒద్దికగా స్నానమాడాను .
ఎటు చూసినా 
దృశ్యాల తెరలు .
హృదయాల్ని  మార్చుకునే జంటలు 
ఒంటరి రాగం ఆలపించే యువకులు 
కాలం అంచుల మీద 
అలసిపోయిన పండుటాకులు 
గుంపులు గుంపులుగా 
కొన్ని కొన్ని కుటుంబాలు 
రంగుల వనం లో  ఇంద్రధనుస్సు లా 
కనిపించాయి .
పదునెక్కిన జీవితం లో 
స్వాంతన సమయాలు 
స్వేద దీర్చే హృదయాలు 
కబ్బన్ హరిత వనాలూ 
జీవితపు పొదలో 
పూయల్సిన అవసరాలు.

[బెంగుళూరు లో  కబ్బన్ పార్క్ చూశాక ]

కాలం : 06-12-2023

----------------------------------------- 22

గూడు పారుతోంది   - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601

ఒక్కోసారి జీవితం 
ఎక్కడ పరచుకున్నా 
దుఃఖ ప్రవాహమై మునుగుతుంది .
పల్లెలు  వలసపోయి
పట్టణాల్లో మురికి పడుతున్నాయి .

కూడ గట్టుకున్న ఆశలన్నీ
కురిసే వాన ప్రవాహం లో 
మునిగి పోతూ 
చెన్నై సంద్రం లోకి  జారిపోతున్నాయి.
 
నదులు నగరాల పైకి ఉరికి 
కూలీల గూడుల్లోకి 

ఏళ్ళకు తరబడి 
నమ్ముకున్న మట్టి పైకీ
నీటి ప్రవాహం 
 ఫెఠెల్  ఫెఠెల్ మని ధ్వనిస్తూ 
జీవితాల్ని తుత్తునియలు చేసింది.
ఇప్పుడు
గ్లోబల్ వార్మింగ్ లో తగలబడి పోతున్నాం .
నదుల ప్రవాహాలకి 
అడ్డు గోడలేస్తే
సౌదాలైన ఛిద్రమై పోతాయి . 

ప్రళయ ప్రవాహంలో కొట్టుకు పోతాయ్.
చెన్నై నగరం లో 
గూడు పారుతోంది .
గుండె చెదిరి పోతోంది.
ఇక ఈ కన్నీటి ప్రవాహాల్ని ఆపలేం!


కాలం : 13-12-2023

---------------------------------- 23


మనిషీ -చెట్టూ-తత్త్వం 

ఎటు చూసినా 
శ్వాస ఆడని 
ఆశల రహదారుల్లో 
మనిషి గిరికీలు కొడుతూనే వున్నాడు.
ఒంటరి  భావన ను  నిభాయించుకుని 
కాలం అంచుల మీద నడిచే 
తోటి ప్రయాణికులల్నీ  గుర్తించలేడు.
చెట్టు వేనవేల 
గాలుల్ని గాయాల్ని మోసుకుని 
ఎన్నో పక్షులకు  గూళ్ళు
మరెన్నో జీవులకు పళ్ళు 
నిస్వార్ధంగా పరుస్తూనే   ధ్యానిస్తుంది . 
మనిషి 'నేను' అనే భావన సునామీ లో 
మనిషితనం కూల్పో తున్నాడు .
మనం అనే భావన లో 
చెట్టు ప్రకాశిస్తూనే  వుంది .
మనిషీ బతకాలి మనిషితనం బతకాలి 
నిట్టూర్పుల్లో  నిస్సహాయంగా 
బోర్లా పడ్డ  మనిషీ బతకాలి .
నిండుగా 
ఆకులతో  అల్లల్లాడే  చెట్టు
నీడ నిచ్చినట్టు
తోడై నడుపుతున్నట్టు
మనిషిని  మనిషి  ప్రేమతో నడపాలి .
మనిషై పుట్టినందుకే 
అనురాగ దీపాల్ని వెలిగించాలి. 

కాలం: 27-12-2023

--------------------------------------- 24


నీ మాటల జల్లులో ..!

ఒకింత  ఓదార్పు 
నీమాటల జల్లులో 
ఇల్లు కడుతుంది .
నీ మాటల సెలయేరులో 
కిల కిలా రావాలు 
గులకరాల్లై   దొర్లుతున్నాయి .
నిశ్శబ్దం దాడి చేసినపుడల్లా
నీ  మాటే ఆయుధమవుతుంటే 
నాలో ఉత్సాహం కత్తులు రువ్వుతోంది .
నీ మాటల  పొదరింట్లో 
నిదురోతున్న మనసు 
గాలి తరంగాల్లో
గుర్రపు స్వారీ చేస్తోంది .
నీ వసంత ఋతువు లో 
చిగురులు సాక్షిగా చెప్పూ
నీ మాటలేని జన్మ పరవశిస్తుందా !
నీ మాటలేని జన్మ పరిమళిస్తుందా !
మంచు కత్తిలా కోస్తున్న 
అంతుచిక్కని  ప్రశ్నలివి .

కాలం: 03-01-2016

---------------------------------------- 25


ఈ దూరం..! 

ఈ కాసింత దూరం లో 
నాలో వేదన ప్రవాహాలు 
నాలో  కన్నీటి సుడులు 
ముడులు కట్టుకు తిరుగుతున్నాయి .

ఖాళీ సమయం పలకరిస్తే చాలు 
నాలో  మీ జ్ఞాపకాలు తడి తడిగా  తడుముతున్నాయి .

నా ప్రియ ప్రాణ బంధమా 
ఇక్కడ డాలర్ ఇవ్వలేని ప్రేమ ఒకటుందనీ 
నా కన్నీటి దోసిళ్ళ తో 
అవి సరితూగ లేవని అర్ధమౌతూనేవుంది.

నేను తాగే కాఫీ లో నేను తొడిగే  వస్త్రాల్లో 
మీరు తొంగి చూస్తూనే  వున్నారు .
ఇక్కడ చెల్లా చెదురైన  నేను 
ఒంటరిగా  కూలబడుతున్నాను .

అక్కడ బాగున్నావా  నాన్నా 
పిల్లాడి గొంతో ఫొనులో ధ్వనించినపుడు 
ఒక్కసారీ  ఆత్మీయ జ్ఞాపకాలు గా రాలుతుంటాను.
నేను వచ్చేస్తా 
కాసింత కాలం ఓపిగ్గా ఒద్దికగా ఉండు నా చిట్టి తండ్రి !
ఇక్కడ  మూట కట్టుకున్న దుఖాన్ని 
తలగడ దిండు లో  అదుము కుంటాను.

నాలో రేగే వేదనల్ని ఆవిష్క రించలేకపోతున్నాను .
కాలం తొలిచిన  కన్నీటి నదుల్నీ ఈదలేకపోతున్నాను.
ఇక ఫ్లైట్  కన్ఫార్మ్  అయితే చాలు 
ఉన్నఫళంగా నాలో ఉత్తేజం రెక్కలు కట్టుకు ఊరేగుతుంది .
ఇక ఈ మెట్లు దిగుతూ భారాన్ని  దించుకుంటూ
నా బంధాల్ని  నా బాహువుల్లో 
బంధించే క్షణాన క్షమా గుణం తో మోకరిల్లుతాను .

కాలం: 14-02-2016

  
 --------------------------------------------------------- 26


మరలా తిరిగి రాలేకపోతున్నాను ..!  - గవిడి శ్రీనివాస్  07019278368, 08722784768

ఒక నిశ్శబ్ద  సమయం 
నీలోకి ప్రవేశించాను.
మరలా తిరిగి రాలేక పోతున్నాను.

ఆ క్షణం నీవూ నేనూ 
చూపులతో  మాట్లాడుకున్నాం .
ఆప్యాయతల్ని అలంకరించు కున్నాం

బిగిసిన వస్త్రాల్లో 
విరిసిన సమ్మోహన రూపం 
గాజుల సవ్వడి లో 
మోగిన  గుండెలు 
చేతుల కరచాలనం లో 
నలిగిన మనసులు 
నీ కురుల నదులలో 
తేలిన ముఖ సోయగాలు 
ముద్దుల పరిమళాలు   
కురిసే వాన లో 
మౌనంగా వాలిన క్షణాలు 
అలంకరించిన హృదయాలు 
నాలో నడుస్తున్న 
ఈ వెన్నెల  సమీరాలు 
ఇక నాలో 
ఒక చిరు నవ్వు శిల్పం లా 
పూల వనం లా
మిగిలి పోయాయ్.

మరలా రాలేని బందా ల్లో నీవు
మరచిపోలేని 
నీ జ్ఞాపక శిలా శాసనం లా 
మిగిలిన నేను.
  

కాలం : 26-12-2016

---------------------------------------- 27


మరలా తిరిగి రాలేకపోతున్నాను ..!  - గవిడి శ్రీనివాస్  07019278368, 08722784768

ఒక నిశ్శబ్ద  సమయం 
నీలోకి ప్రవేశించాను.
మరలా తిరిగి రాలేక పోతున్నాను.

ఆ క్షణం నీవూ నేనూ 
చూపులతో  మాట్లాడుకున్నాం .
ఆప్యాయతల్ని అలంకరించు కున్నాం

బిగిసిన వస్త్రాల్లో 
విరిసిన సమ్మోహన రూపం 
గాజుల సవ్వడి లో 
మోగిన  గుండెలు 
చేతుల కరచాలనం లో 
నలిగిన మనసులు 
నీ కురుల నదులలో 
తేలిన ముఖ సోయగాలు 
ముద్దుల పరిమళాలు   
కురిసే వాన లో 
మౌనంగా వాలిన క్షణాలు 
అలంకరించిన హృదయాలు 
నాలో నడుస్తున్న 
ఈ వెన్నెల  సమీరాలు 
ఇక నాలో 
ఒక చిరు నవ్వు శిల్పం లా 
పూల వనం లా
మిగిలి పోయాయ్.

మరలా రాలేని బందా ల్లో నీవు
మరచిపోలేని 
నీ జ్ఞాపక శిలా శాసనం లా 
మిగిలిన నేను.
  

కాలం:  21-2-2016



---------------------------------- 28


పక్షులు  ఎగరటం - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601

వేకువ  సమయం 
తీయని సూర్య కిరణాలు 
ఆకులపై  అలా పడుతున్నపుడు 
పక్షులు ఎగురుతున్నాయి .

నా హృదయం చెతులూపింది
ఎగిరే  పక్షుల వెంట .

నేను  పక్షుల సంఘటిత దృశ్యం లో 
మునుగుతున్నాను .

నాకు దగ్గరగా గుచ్చుతోంది .

ఒకరికొకరి  సహకారం 
ప్రేమైక జీవితం 
ఒకరికొకరు ఆలోచించటం 
ఒకరికొకరు తినిపించుకోవటం .

నేను ఒక్కోసారి ఆలోచిస్తాను 
మనుషులమైన  మనమే 
ప్రతిస్పందించీ గ్రహించాల్సి వుంది .

ఏమి చేయాల్సి వుందో !
జీవితం అస్తమించే లోపే !!

కాలం: 28-2-2016

------------------------------- 29


మౌనంగా ఒక నీ కోసం !    - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601

నీ లోకం లోకి 
ఒంటరిగా వస్తాను 
మనసారా  నవ్వుతూ 
చల్లని వెన్నెల పరచి 
కూచో పెడతావ్ .

నా కోసం 
పరితపిస్తూ పలవరిస్తూ 
పలకరిస్తూ  పరిభ్రమిస్తూ 
కాలాన్ని కౌగిలిస్తావ్ .

కారణాల వివరణేలేని
బంధనాల  వలలో 
విలవిల లాడుతూ 

ఒక ముగ్ధ మనోహర నీ కోసం 
ఒక ఆత్మీయ  సమ్మేళనం కోసం 
మోడు బారిన  చెట్టు లా 
నిలిచి నిరీక్షిస్తుంటాను .

కలల్ని  నిర్మించే వాళ్ళే కాదు .
కన్నీళ్ళని  తుడిచే వాళ్లూ కావాలి .

మనసు అల్లిన పందిరి లో 
మౌనంగా 
నాలో నే  మంచు లా రాలుతూ 
నీ కోసం  
ధ్యానిస్తున్నాను .


కాలం: 20-3-2016



------------------------------ 30


నా ఎడ్ల బండి! నా నాగలి కర్రు!!

మబ్బుల  రెక్కలు ఊగు తుంటే 
తొలి తొలకరి జల్లు  మనసును తడిపేది .

పంట పొలాల గుండెల మీద 
నా ఎడ్ల బండి కొత్త దారుల్ని తొలిచేది .
గరిసెడు గత్తం బండి లో పరుగులు తీసేది .
ఎద్దుల గంటల్లో ఆశలు మోతలు మొగేవి .

వెన్నెల వొంపిన  చందమామ సాక్షిగా 
ప్రతి మడిలో రాత్రిళ్ళు ఎరువుల కుప్పలు విరిసేవి .
పనిలోని  ఆనందాన్ని 
ఆ ఆనందం లోని ప్రకృతిని 
నా కూని రాగాలు పరవశింపజేసేవి .

తడి తగిలితే చాలు 
నాగలి కర్రు నాగేటి చాళ్ళలో 
మట్టి గుండెల్ని చీల్చుకుంటూ ఉరకలు తీసేది .

ఎన్ని మైళ్ళు నాగలి తో నడిచాను .
ఎన్ని సార్లు విత్తనం తో మొల కెత్తాను.

తెల్లవారు జాము చంద్రుడు పూస్తు న్నప్పటి నుంచీ
సూరీడు వేడెక్కే వరకూ 
నాగలి తో ప్రయాణం 
జీవన వేద మయ్యేది .
బతుకు పాటయ్యేది .

పాట పల్లవించిన బతుకు లో 
నాగలి కర్రు  కళ్ళల్లో హరిత వనాల్ని నింపేది .

ఇప్పుడు
నా నాగలి జాడేది 
ఇనుప దున్నలకింద
కను మెరుగై పోతున్న నా ఎడ్ల బండి 
ఆనవాళ్లైనా మిగుల్చు కోవాలని 
తల్లడిల్లు తున్నాను .

కాలం: 27-3-2016



---------------------------------- 31


ఓ నా దేశమా..!

నడకలు మారాయి 
స్వాతంత్రానంతరం
సంకెళ్ళ రూపాలు మారాయ్.

ఇప్పటి బానిసత్వం 
కొత్త అర్ధాల్లో  జీవిస్తోంది .

కాల పరిమితి లేని 
పనిగంటలు పొద్దస్తమానం 
రెక్కల పై  వేలాదుతూనే  ఉంటాయ్.

శ్రమజీవులు 
నిశ్శబ్ద జీవితాన్ని సాగిస్తుంటే 
ఫలితం హత్తుకునే  జీవికలు 
ఎత్తున మాట్లాడుతుంటాయ్.

భరోసా లేని  బతుకుల్లో 
జీవితం తడబడుతోంది .

రైతు మట్టి నాదని హత్తుకుంటే 
గుండె గుభేల్ మనిపించే 
సందర్బాలు అంటిపెట్టుకు తిరుగు తున్నాయ్ .

ప్రాపంచీకరణ ప్రపంచంలో 
సన్నకారు  రైతు జీవించనూ లేడు
కిళ్ళీ కొట్టు వాడు బతుకు సాగించనూ లేడు
సంతా లేదు సందడీ లేదు 
సంక్షే మమూ  లేదు 
చిన్న కూరగాయల కొట్టు లేదు 
మాల్స్  మాయాజాలం లో 
కొట్టుకు పోతున్నాయ్ .

నిన్ను నువ్వు కూల్పోతున్నావ్ 
నీ నీడ నూ  కూల్పోతున్నావ్ 

నా రైతుకు రాజ్యమేది.
నా కార్మికునికి సంక్షే మ చట్టమేది .

ఓ నా దేశమా 
స్వశక్తి ఉపాది మార్గమా 
నా కలల ప్రపంచమా 
సమసమాజ  స్థాపనలో 
వెలుగు రేఖలు రువ్వుకుంటూ రావూ ..!

కాలం: 09-04-2016


------------------------------------ 32

చలి చలి గా ..!

వాన కురిసిన  రాత్రి 
నీవూ నేనూ 
చలి చలిగా  మాట్లాడుకున్నాం .

అంతరంగాల్లోని 
ఊసుల్ని ఊదుకున్నామ్ .

నీలోకి నేను 
నా లోకి  నీవు
ప్రవహిస్తూ 
జీవ నదులమైయ్యాం. 

రసరమ్య గీతాలుగా 
కాలాన్ని లిఖించు కున్నాం.


కాలం: 18-4-2016


----------------------------------- 33


రంగుల లోకం - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601

ఇంద్ర ధనుస్సు లో  పొదిగి ఉన్నవి 
ఎన్ని వర్ణాలు 
ఎన్ని రంగుల జలపాతాలు 
ఒక వర్ణ  శోభిత దృశ్యం లా 
ఒక రంగుల గొడుగు లా 
చూపుల్ని తన వైపు 
లాక్కు పోవడం లేదూ!
ఒక అందాల ఆభరణం లా 
మిరిమిట్లు  గొలపడం లేదూ !
ఎన్ని జాతులు ఎన్ని మతాలు
ఎన్ని కులాలు ఎన్ని వర్గాలు 
ఒకే రక్తం లో పూయడం లేదూ !
మరి కన్నీటి ని చెక్కుతున్న శిల్పు లెవరు ?
ఆత్మ హత్యలకు  కారకులెవరు ?
నాలో ఉద్వేగాన్ని 
నీ లోకి  ఉద్భోదిస్తూ 
నీలో ప్రేమ ను 
పరిచయం చేయమంటున్నాను .

పరాకాష్టకు చేర్చే 
విపరీత ధోరణుల్ని 
ముక్కలు ముక్కలు చేస్తున్నాను .

వీలైతే కాసింత ఓదర్పు నివ్వు 
జీవితాన్ని కబళించే
శోక గీతికలకి 
ఆరంభకుడివి 
ఆరాధ్యుడువి కనే కారాదు .

జీవితాధ్యాయం లో 
కాసింత ప్రేమ ను రుచి చూడు 
ఒక్క సారీ విద్వేషాల్ని
చెరో దిక్కు లో పరుగులెడతాయి.

  కాలం: 23-4-2023


------------------------------- 34


కాసేపు నీతో ప్రయాణం ..! - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601

ఆ కాసేపు 
నీతో  పయణించిన   క్షణాలు 
మల్లె వాసనలూ
మౌన రాగాలూ 
అలజడి రేపుతున్నాయి .

నీ వేదో చేస్తావనీ కాదు 
మనసు తలుపు తడితే 
ఒలికిపోయే 
వెన్నెల సమీరాల్లో 
తడిసి పోయిన వాణ్ణి.

నీ వేదో చెప్తావనీ కాదు 
కనుల భాషలో 
రాలిపోయే 
పువ్వుల్ని  ఏరుకుందా మనీ .

మూసుకున్న కళ్ళల్లో కలల్ని 
నీ పరిచయాలు  గా 
పదిల పరచు కోవాలనీ 
ఆరాట పడుతుంటాను .

మరి కొన్ని క్షణాల్లోనే 
దూర మౌతుంటాను .

కాలం సాగుతున్నకొద్దీ 

అక్షరాల పక్షి లా 
నేను  వాలుతుంటాను .
ఒకటి ఒకటి గా ఏరుకుంటూ  
నీవు చదువుతుంటావు .

నీలో మూగ వేదన 
భళ్ళున పగిలి 
తరంగాల ధ్వనితో 
చేరువౌతావు .

అపుడే 
ఆ కాసేపు 
నీతో ప్రయాణించిన  క్షణాలు 
జల్లున కురిసి
వరదలా దొర్లుతుంటాయి .


కాలం:  24-4-2016

----------------------------------------- 35



పిచ్చుకల్లేని  ఇల్లు - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601

ఇంటిలో వరికంకులు 
దూలానికి రెక్కలు చాచుకు  వేలాడినపుడు
చెంగు చెంగున 
ఎగురుతూ తేలివచ్చిన పిచ్చికలు 
మనసు లోయల్లో ఊయలలూగేవి .

వరిచేను  కోసిన దగ్గరనుంచీ
కుప్పలు నూర్చే  వరకూ
కదులుతున్న నేస్తాలుగా ఉండేవి .

పిచ్చుకలల్లిన  గూళ్ళు 
ఇప్పటికీ మనసు పొరల్లో 
జ్ఞాపకాల ఊటలు గా  
సంచరిస్తూనే వున్నాయి .

పిచ్చుకల  కిచకిచలు 
ఇంటిలో మర్మోగుతుంటే 
ఆప్యాయతలు బంధువల్లే నడిచొచ్చినట్టు
గుండె లోతుల్లోంచి  అభిమానం 
తీగలై లాగుతున్నట్లు 
తెలియని   పరవశం 
పరిచయమయ్యేది .

ఎండుతున్న వొడియాల చుట్టూ 
పిచ్చికలు 
వాటి చుట్టూ పిల్లలు 
ఓ పసందైన ఆటలా ఉండేది .

ఇప్పుడు పిచ్చుకల్లేని ఇంటిలో 
శబ్ద పరిమళమేదీ .

కృత్రిమ ప్రపంచపు అంచుల్లో
విషపు ఎరువుల లోకం లో 
కలుషిత వనాల్లో
ఎగరాల్సిన పిచ్చుకలు 
సందడి చేయాల్సిన కిచకిచలు 
అలా రాలిపోతున్నాయి .

గుండెను తడుముతూ 
కాల శిల్పం మీద 
కొన్ని కొన్ని జ్ఞాపకాలుగా 
వాలిపోతున్నాయి .

కాలం: 08-05-2016

------------------------------------  36


చినుకు సంబరం   - గవిడి శ్రీనివాస్ 08722784768 

ఉక్కపోత జీవితం లో 
ఉన్నట్టుండీ  మబ్బులు 
ఉరమటం మొదలెట్టాయి .

ఎండకు తడిసిన తనువులు 
చినుకు సంబరం తో 
మట్టి మధ్య  మొలకెత్తుతున్నాయి .

ఎండిన ఊహలు  మళ్ళీ పరుగెడుతున్నాయి .

నా గాలిలో  మట్టి పరిమళం 
నా శ్వాసలో  ఆశ ను  రేపింది .

చినుకు తడితో  మట్టి పులకించినట్టు 
మట్టిని తాకిన ఒళ్ళు జలదరించి పోతోంది .

పిడికెడు  మట్టిని పట్టిన 
దోసిళ్ళ లోకి  రాలిన నా కన్నీళ్ళ లో 
ఆనందాశ్రువుల్ని పోగు చేస్తున్నాను .

గుప్పెడు గుండెల్లో 
వెలుగు  వరదల్ని నింపే 
నీటిలో  పులకరించి పోతున్నాను .

నాగలి తో దున్నుకోడానికి 
ఒక ఆకాశం వచ్చి వాలినందుకు 
ఒక చినుకుగా మాట్లాడినందుకు 
పూల వర్షం లా  జారిందుకు 
తనువు బహుముఖంగా పులకరిస్తోంది .

గాలి సయ్యటలాడుతోంది
మనసు ఊగుతోంది.
పల్లె పరవశం లో 
మనసు  మునుగుతోంది .

నా మట్టంటే 
బహుమానమంత అభిమానం .
కాలం మీద చెప్పుకున్న కబుర్లన్నీ 
నా మట్టి తో  నిండిన  అనుభవాలే .

చినుకు కురిస్తే చాలు 
చిగురించే చేట్టునవుతాను .
పరవశించే  నెమలి నౌతాను.
ఆకాశానికి  వేలాడే 
ఇంద్ర ధనుస్సునవుతాను .
మనిషి నవుతాను .
మట్టిని నమ్ముకున్న 
రైతు బిడ్డ నవుతాను .
మట్టిని మోసే మనిషి ని 
మనిషిని  నడిపే మట్టినీ  అవుతాను .


కాలం: 05-06-2023

------------------------------------------ 37


ఒక తీయని లోకం లోకి ..!  - గవిడి శ్రీనివాస్ 08722784768 , 08886174458

ఆమె అరిచింది 
ఎప్పుడూ ఆ పుస్తకాల  గోలేనా !
ఈ కళ్ళల్లో  వెలిగే దీపాల్ని 
చదవరాదూ అంది !

ఒక్క క్షణం కోపం 
తన మనిషి కోసం  పడే తాపం 
రెండూ ఒకేసారి  కన్పిస్తున్నాయి .

లేదు నీ కోసమే 
మబ్బుల మల్లెలు తెవాలనీ 
మంచును  తేనెలా  పూయాలనీ 
కలగంటున్నాను.

లోలోపల దిగులు సంద్రాల్ని 
దిగమింగుతూ 
తేనీటి  సమాధాన మిచ్చాను .

తీరం తెలియని 
ఒక తీయని లోకం లోకి 
తెర తీస్తూ ..!


కాలం: 12-6-2023


------------------------------------38


నా ఆశల దారిలో ..! - గవిడి శ్రీనివాస్ 08722784768 , 08886174458

నీవలా 
జలజలా  వెన్నెలలా  రాలుతున్నపుడు 
ఊహలు  అలలుగా  ఎగరేసీ
నిన్నే చూస్తున్నాను .
అలలకు  రూపమ్ అందిచ్చీ  
నీ ప్రేమనే శ్వాసిస్తున్నాను .
ఊహకి ఉరుకులు  నెర్పించీ 
గాలికి  వేగం చేకూర్చీ 
నీ ప్రేమ తీరం చేరే 
కడలిని  నేనై కదిలోస్తున్నాను .
కలలను కళ్ళేదుటుగా నిలిపే 
నీకై  వస్తున్నాను .
మరి 
నా ఆశల దారిలో 
పూల వనం లా  వికశిస్తావనీ 
నిన్నే ధ్యానిస్తున్నాను.


కాలం: 12-6-2016

----------------------------- 39



ఒక జీవితం  - గవిడి శ్రీనివాస్ 08722784768 

కొన్ని ఉరుములు 
కొన్ని పిడుగులు 
జీవితం లో ఉలిక్కి పడుతుంటాయ్.

సంతోష సాగరం లో ఈదుతున్నపుడు 
తన్మయ క్షణాల్లో  మునుగుతున్నపుడు 
కోల్పోయిన బంధాలేవో 
లోలోపల అలా తడుముతుంటాయ్ .

మూలాల వెంట వదిలిపోయినవి 
కళ్లెం పట్టుకు లాగుతుంటాయ్ .

దూరమైన జీవితాల్లో 
భౌతిక సమ్మెళనాలుండవ్.
గాయపడ్డ  మమతల దేహాలు తప్పా !

నా కిప్పటికిప్పుడు 
నా వాళ్ళతో నా మట్టి తో 
కాసేపు మనసారా కురిసే 
మాటలా జారిపోవాలనుంది.

జీవితమంటే 
నలుగురి ఆప్యాయతల కలయిక 
మనసు ఊరటను 
వ్యక్తపరిచే ఒక వేదిక .

హృదయం రెక్కల రెపరెపల్లో 
సందర్భాల్ని వెతుక్కుంటూ 
కాలాన్ని మోసుకు పోతున్నాను .

మనసారా నవ్వడానికి 
ఆర్థిక కొలతలు అవసరం లేదు.

అంతుచిక్కని లెక్కల్లో కి  దిగితే 
సమీపించే కొద్దీ సాధించే కొద్దీ 
చేరాల్సినది వేరే ఉంటుంది .

గమ్యాల చేరికలో
ఒక జీవితం 
సుగంధాల జల్లులు కురుస్తున్నట్లు 
వేపచేదులు   తినిపిస్తున్నట్లు   
ఒక అనుభూతి అంతర్భాగమౌతుంది 

ఆగని కాలం గుర్రపు స్వారీ చేస్తుంది .
 
మనమే కన్నీళ్లను తీపిగా చేదుగా 
అభివర్ణిస్తుంటాం .

జీవితం ఒక జడ పదార్థం కదా!

కాలం: 24-6-2016

--------------------------------------- 40


అలా అనుకోలేదు  - గవిడి శ్రీనివాస్ 08722784768 

పక్షి లా  వాలాలనుకున్నా 
నీవు వృక్షమై  ఆశ్రమిస్తావనుకోలేదు 
మబ్బునై  కురావాలనుకున్నా
చినుకై కురుస్తావనుకోలేదు 
అలనై  ఉరకాలనుకున్నా 
తీరమై  చేయందిస్తావనుకోలేదు 
పవనమై  వీయాలనుకున్నా
ఊపిరై  శ్వాసనందిస్తావనుకోలేదు 
వెన్నెలై కురవాలనుకున్నా
వెలుగై  నింపేస్తావనుకోలేదు 
నదినై  ప్రవహించాలనుకున్నా 
సంద్రమై హృదయ ద్వారం తెరుస్తావనుకోలేదు 
చిగురునై ఊగాలనుకున్నా
పువ్వువై  సుమగంధాల్ని  వెదజల్లుతావనుకోలేదు 
ఊహలు వాకిళ్ళలో ముగ్గులు వేయకముందే 
ముచ్చ్చట దృశ్యాల్ని ఒంపుతూ  
తడి తడి  జీవితాల్ని పరుస్తావనుకోలేదు .


కాలం: 03-07-2016


----------------------------------------41

ముక్కలవుతున్న  దుఃఖం 

నాలో ముసురుతున్న దుఃఖం గోడలు బీటలు వారేలా
కలల మీంచి  కన్నీళ్ల ను తొడుగుతూ  అడుగులకు స్వరాలు కూర్చింది .
దేహం ఎప్పుడూ అదే, వీచే గాలులు పరిమళాలు పరిస్థితులు వేరు .
ఎక్కడ వాలినా అంతరంగపు నివేదనలు నిట్టూర్పులు తొలుస్తూనే ఉంటాయి .
నన్ను ఆవిష్కరించుకోవడమంటే గాయాల కొలువుని దర్శించడమే .
అదే జోరు నాలో ప్రవాహపు ఏరు  వైరాగ్యపు వైనాలు మధ్యనా కొనసాగుతుంది.
భళ్ళున పగిలే జ్ఞాపకాలతో ఉన్నట్టుండీ మనసు పావురం ఎగురుతుంది .
సమాధాన పర్చుకోవాల్సిన  ప్రశ్నలెన్నో తరుముతుంటాయి తడుముతుంటాయి.
కొన్ని మోహాలు కొన్ని తాపాలు తడిపిన క్షణాలు రగిలిన  మౌనాలు 
ఆ మైకం లో కమ్ముకున్న మేఘాలు కురవని స్వావలంభన సుమ గంధాలు 
గుండెల్లో గడ్డకట్టిన  భావావేశాలు ఒంటరి మనసు ఊరటనొందని సందర్భాలు 
ఒకటి ఒకటి గా రాలుస్తూ రగిలిస్తూ  చలిస్తూ జ్వలిస్తూ ఇంకా 
ఒక్క అడుగుని కాస్తంత బలంగా తరలిస్తూ తెల్లవారు మంచులా రాలి పోతాను .
బిందువులు  బిందువులు  గా నాలోంచి రాలుతున్న భావగర్భిత ప్రకంపనలు 
అసలు నిను  తాకాయా ఏళ్ల తడబడి క్షణాల్ని మోసుకుపోతున్నా 
అసలు మనసు ఘోష మధన పడే రోదన వినపడుతుందా
ఆంతరంగిక సుఖాల్లో ఒక దుఃఖం కూడా భాగమా , సంకోచం సతాయిస్తోంది 
ఖంగుతిన్న ఆశలెన్నో ఆశయాల్ని లిఖించుకున్నాయి ,నాలో ఒక నెల వంక .
జీవితపు గుడారం లో కొన్ని గాలుల్ని తట్టుకోగలం కొన్నింటిని భరించలేం 
అయినా ప్రయత్నాలు పొసగటాలు కొద్దికొద్దిగా జరుగుతుంటాయి 
ఆవలిగట్టు ను  చేరాలంటే ఇక్కడ ప్రయాణం మొదలు పెట్టాల్సిందే 
తడబడుతూ తర్జుమా చేసుకుంటూ  పాఠాలు నేర్చుకుంటూ 
గమ్యాలకి రహదారులు నిర్మించాల్సిందే ఎన్ని చేసినా విడవనిదేదో ఉంటుంది .
సంద్రమై మంద్రమై నను ఊగిస లాడిస్తూ ఊపిరి కోసల మీద ఊగుతుంది 
పొందలేని అనురాగమేదో  వెంటాడుతూ ముక్కలవుతున్న దుఃఖమవుతుంది .


కాలం 10-7-2016

-------------------------------------- 42

అలా చూడు ప్రపంచం ..!

గడియారం ముళ్ళు
గుండెల్లో గంటలా మోగుతుంటే 
క్షణాల్ని  నెత్తిన ఎత్తుకుని 
నిర్ణయించబడ్డ సమయానికి 
అడుగులు  సమాయత్తమవుతుంటాయి .

ఇక్కడ గమ్యాలు చేరడమంటే 
హారన్ ఊదుతున్న ఆటోల వెంటో
ఘోషించే కెరటాల్లాంటి బస్సుల వెంటో 
హడావుడిగా  ముస్తాబైన మెట్రో రైళ్ల వెంటో 
మనల్ని  మనం ఆరేసుకోవడమే .

ఇక్కడ జీవితమంటే 
ఆకాశాన్ని వంచి  మెరుపుల్ని మోయడమే .
వొడిసిపట్టిన  సమయాల్ని  నిలదీస్తే 
దానిలో  మనం మనలా జీవించిన 
క్షణాల్ని లెక్కించ గలిగామా !

చుట్టూ చూస్తుంటే 
పల్లె చాపలా చుట్టుకు పోతున్నట్లు 
పట్టణం ఉక్కపోతలో ఉడికి పోతున్నట్లు 
చెమర్చిన కళ్ళు చెబుతున్నాయి .

వొక సందర్భం 
వొక పూర్తి కాని  స్వప్నం 
మనల్ని  కొత్తదారుల వెంట  తరుముతుంటాయి .

ఇక్కడ  ప్రేమను  వొంపే మనసుంది 
మనసుని  నీ ముందు నిలబెట్టే ఆశావుంది
నీతో  గడపడానికే సమయం గొడవపడుతుంది

కాలం కన్నీరు కారుస్తుంది
మనిషి  పరుగుని చూసీ
ఒకింత దిగులుగా కాస్తంత జాలిగా .

వృద్ధి చెందడమంటే 
మనసుకి  కారాగార శిక్ష వేయడం కాదు .
కొన్ని విలువలు  కొన్ని మమతలు 
కలబోసుకోవడమే.

కాలం : 23-7-2023

---------------------------------- 43


పల్లెకు  పోయే పక్షుల్లా ..!

రుతువులు  రువ్వుతుంటే 
రంగుల హరివిల్లులు  పూసుకుని 
ఎగిరే పక్షుల్లా 
ఎల్లలు దాటి  వాలటం 
ఒక కాలం పూసిన 
పరిమళ  పాఠం .

చీకటి పడ్డప్పుడు 
గూటికి చేరే పక్షుల్లా 
కాస్తంత ఆసరా 
కనురెప్పల మీద వాలగానే 
పల్లెకు  పోయే 
ఒక గూటి పక్షినవుతాను .

పల్లె దారిలో  అడుగిడు తుంటే 
నాలో పిల్ల కాలువలా ప్రవహిస్తున్న 
జ్ఞాపకాలు  తగులుతుంటాయి.
అలా తడుపుతుంటాయి .

మొక్కలా  ఎదుగుతూ 
చెట్టు లా  పంచుతూ 
జీవన సాఫల్యం 
పొందటం లోనే  వుంది జీవితం .

ఎండకు  వాడిన పువ్వులా 
నీరసించి పోతానా 
పళ్ళెముఖం చూసి 
పొద్దు తిరుగుడు పువ్వులా 
వికసిస్తాను జీవం పోస్తాను .

అపుడే నాలో ఉషోదయం 
తపస్సయి  జ్వలిస్తుంది 
నాలో జ్ఞానోదయం 
తల్లివేరు  మొదళ్ళ లో 
సాగిల పడుతుంది .

ఇపుడే అలసిన మనం 
పల్లెకు పోయే పక్షుల్లా 
ఎగిరి పోదాం .

కాలం : 11-8-2016

-------------------------------- 44


వెన్నెల స్నానం 

చల్లని వెన్నెల కిరణాల్ని 
కత్తుల తో  కోస్తూ 
కలల రాకుమారుడి నవుతాను .

అపుడవి 
వాన పువ్వులై  రాలుతుంటాయి .

అంతే
నేను  తడిసి  ముద్దవుతుంటాను .

కాస్తంత మురిపెం 
నాలో చలి మంట కాగుతుంది .

వెన్నెల్ని చూస్తే
రెక్కలు మొలుచుకుని 
నాలో ఉత్తేజం 
పావురం లా ఎగురుతుంది .

అంతే 
నేను పారిజాతాన్ని 
బహూకరిస్తున్నట్లు
నాలో కలుస్తున్న 
గాలి పరవళ్ల లో   మునిగి పోతాను .


కాలం: 13-8-2016

------------------------------- 45


ఊపిరి కొనల  మీద  - గవిడి శ్రీనివాస్ 08722784768

ఊపిరి కొనల  మీద 
అగ్ని జ్వాల రగులుతోంది .

ఉడికిన కళింగాంధ్రా జీవితాల మీద 
అణు విద్యుత్ కొవ్వాడ 
విధ్వంస  దృశ్యమవబోతోంది .

మరో దుఃఖానికి 
సన్నాహమవుతోంది .

చినుకుల్ని దున్నుకున్నట్లు 
ప్రమాదాల్ని  మోయలేం 
అణు విధ్వంసాల్ని ఆపలేం .

ఒక కలల ప్రపంచానికి 
ఒక పవన విద్యుత్  చాలు 
ఒక సోలార్ విద్యుత్ చాలు 
ఒక సంద్ర కెరటాల  విద్యుత్  చాలు 
ఒక ప్రవహించే నీటి విద్యుత్ చాలు 

నన్ను నేను సౌకర్యవంతం 
చేసుకోడానికి 
విధ్వంసం  అవసరం లేదు .

ఎన్నో విన్నూత్న మార్గాల 
అన్వేషణ  జీవులం కదా మనం ...!

కాలం: 21-8-2016

-------------------------------------- 46


వొక రహస్య భాష  - గవిడి శ్రీనివాస్ 08722784768

కనులు తూనీగ రెక్కల్లా 
ఊగుతూ 
మనసును  రెపరెప లాడిస్తుంటే 
రెప్పల పరదాల కింద 
ఆశలు తొణికిసలాడుతూ 
ముందుకు  నడుపుతున్నాయి .

వొక 
పూలు  రాల్చిన  చిరునవ్వు 
గలగలా  జారే  సెలయేటి 
పలుకులు 
అలా గుండెల్లోకి 
చల్లని గాలిని రువ్వుతున్నాయి .

నీవు కనిపిస్తే చాలు 
తోరణాలతో  ముస్తాబైన 
ఇంటిలా వెలిగి పోతాను .

ఈ వాకిట్లో ముగ్గులు 
నీ తొలి యవ్వనపు  సిగ్గులు 
నాలో వసంత రాగాన్ని 
ఆలపించాయి .

నా ముందే 
గంతులేసే  లేడిపిల్ల లా 
ఎగిరొస్తుంటే 
ఈ చందమామ  సంబరాన్ని 
రంగరించుకున్నాను .

తడితడి గాలులు 
మొగలి పూరేకులు 
నా చుట్టూ  శ్వాసను 
నీ పరిమళం తో ముంచేశాయి.

రాగాలు అల్లుకున్న 
నీ వొడి లో 
వొక  రహస్య భాష తో
ఆత్మ సౌందర్యపు  శ్వాస తో 
నిండిపోవాలనుంది.

కలల అంచున 
నాలో  మునిగి పోయే 
నీకై  ఇక నేను .


కాలం: 13-9-2016

------------------------------------47


ఒక జల ధార కోసం ..!   - గవిడి శ్రీనివాస్ 08722784768

ఆకాశమంతా అల్లరిచేసి 
చినుకు మొలిస్తే 
మట్టిలోంచి  మనిషి చివురిస్తాడు .

చినుకు పూల కోసం 
ఆకాసమంత దోసిళ్ళు చాచుకుంటాడు .

నీటి జల్లులు 
అవసరాలుగా  వేలాడతాయి .

ఒక తడి వేకువ కోసం 
విధ్వంసపు  చూపులు  రాలుతుంటాయి .

ఎండకు  నీరసించిన  మొక్కలా 
నీటి ఆశలు  వాడి పోతూ 
ఒక్కో  ఆవేదన  ఒక్కో గొంతై  వినిపిస్తుంది .

పెంచే మొక్కల్లో 
జలధార  దాగివున్నట్లు 
రహస్యం  బోధపడుతుంది .

కాలం: 18-9-2016

------------------------------- 48



ఒక ప్రవాహం లా ..!    - గవిడి శ్రీనివాస్ 08722784768

నువ్వు నవ్వుతుంటే 
ఆకాశాన్ని  ఎత్తి
గుడిసెను  బహూకరిస్తాను .

నువ్వు కళ్ళు మిరుమిట్లు  గొలుపుతుంటే 
నేను సీతాకోక  చిలుకలా  ఎగురుతూ 
ముచ్చ్చట గొలిపే  నీ ముక్కు పై  వాలతాను.

నీవలా సగం చీరలో  నడుస్తుంటే 
నేనలా  దొర్లుతూ 
నీ దేహాన్ని వస్త్రమై  కప్పేస్తాను .

నీవలా  నా హృదయం పై 
నర్తిస్తుంటే 
ఆ చుక్కలు వర్షం లా  కురుస్తున్నాయి .

నన్ను  మునిగి పాడనీ 
ఈ ప్రేమ సంతకాన్ని ..!

నన్ను మునిగి తేలనీ 
ఈ ప్రేమ ప్రవాహాన్నీ...!

కాలం: 25-9-2016

------------------------------------ 49



దళిత స్వరం - గవిడి శ్రీనివాస్ 08722784768
ఏముంటాయి కారణాలేముంటాయి 
కొన్ని అసహనాలు కొన్ని అహంకారాలు 
కొన్ని కన్నీళ్లు  కొన్ని చిరిగిన క్షణాలు 
అలా విలవిలలాడుతుంటాయి .

రంగులోంచి  కులం మొలకెత్తినట్లు 
ఒకే చెట్టు కే
కొన్ని కాసే రెక్కలే 
నరకబడుతున్నాయి .

దళితుడైతేనేం 
స్వరం మనిషిదేగా 
మరి కొన్ని కళ్ళు వీక్షిస్తుంటే 
కొన్ని మానభంగాలు 
కొన్ని మారణహోమాలు 
కొన్ని తెగ్గోయటాలు 
అనాగరికంగా  తొంగిచూస్తూనేవున్నాయి .

ఒక రంగుని  ఇంకో రంగు 
శిక్షిస్తున్నట్లు  ఒక్కో 
చరిత్ర పుట బరువవుతోంది .

శీలం ఎవరిదైనా ఒకటేగా
శోకం ఎవరిదైనా  బాధే గా 
క్షోభ పడ్డ  క్షణాలు 
దళిత  స్వరాలై 
దేశ నలుదిక్కులా  పొగలుకక్కుతున్నాయి .

కాలం: 02-10-2016

-----------------------------------50



ఒక నది వొడ్డున కూచునీ..!

ఒక సాయంత్రం 
ఎగురుతున్న సమయాల్ని 
నది ఒడ్డున  అలల తో 
ముంచేశాను.

కాసేపు తుళ్లింత 
గులకరాళ్లు పాడుతున్నాయి .

కాసేపు కన్నీళ్లు 
నదిలో  పడవలై జారుతున్నాయి .

ఒంటరి ఆనందం 
రెక్కలు చాచి  కౌగిలించుకుంది .

చల్లని గాలులు 
ఎగిరే పక్షులు 
నీట ముక్కలవుతున్న 
చందమామలు 
నన్ను ముంచుతున్నాయి .

ఆకాశాన్ని గొడుగులా ఎక్కిపెట్టి 
నాలో కలల కూజితాన్ని  వినిపించాను .

ఆ సాయంత్రం 
జ్ఞాపకాలు 
చేపల్లా ఎగురుతున్నాయి .

నాలో 
నిశ్శబ్ద  ప్రవాహాలూ
పొంగుతున్నాయి.


కాలం:17-10 -2016


-----------------------------51



 
 













 































 








-------

No comments:

Post a Comment