Sunday 3 September 2023

దిగులు గుండె మీద కవిత సంపుటి -150

ఒక స్వప్న సాకారం కోసం -గవిడి శ్రీనివాస్ కాలం పొద్దు గూకుతుంది ఇష్టం వున్నా లేకున్నా నిష్క్రమణ అనివార్యమౌతుంది రెప్పల్లో స్వప్నాలన్నీ కళ్ళముందే తెలియడుతుంటే నిలకడగా ఉండలేను ఒక స్వప్న సాకారం కోసం బలమైన గాలుల్ని ఎదురీది వలస పక్షి నౌతున్నా కలల తీరం చేరేవరకు పయనిస్తూనే వుంటాను . కాలం: 19-04-2015 ----------------------------- 3 సముద్రం ఒక ఊరట -గవిడి శ్రీనివాస్ 08886174458. జడలు పాయలు అల్లినట్లు నూనె రాసుకుని నిగనిగలాడినట్లు ఉయ్యాలలూగుతూ కడలి ఉత్సాహాన్ని కెరటం లా విసురుతుంది . నిర్వేదం అల్లుకుని బోర్లాపడినపుడు అనంతమైన ఆశలని రేపి మనసుని తడుపుతుంది . ఒక్కో సారి సంద్రం మీద ఊహించని ప్రపంచాలతో ఈ జాలరి జీవితాలు సతమతమవుతుంటాయి. నావ లో ఒంటరిగా నక్షత్రాలని చూస్తూ వలలో చిక్కుకున్న నక్షత్రాలని చేపలుగా ఏరుకుంటాం. కొద్ది దూరం పోయాక వర్షం పువ్వులై రాలుతుంది . గొడుగు వొళ్ళు విరుచుకుంటుంది కాసేపు గొడుగు చుట్టూ రాలిన నీటి ముత్యాలని ఏరుకుంటాం. సముద్రం లో పొద్దుపోయాక చీకట్ల వాన కురుస్తున్నపుడు సూర్య గోళాన్ని గొడుగు లా ఎక్కి పెట్టాలనుకుంటాం. దైర్యంముంటే చాలు ఎల్లలు లేని విశ్వాన్నే ఛేదిస్తాం గుండె గుబురులలో మంటలు రేగుతున్నపుడే సంద్రం వంకా ఆశ లని నడిపిద్దాం దిగులు దివ్వై వెలిగి ఆశని ఆకాశానికి తారా జువ్వలా తీసుకుపోతుంది . కాలం:22-04-2015 ----------------------------- 4 వొణికిన భూకంపం -గవిడి శ్రీనివాస్ 08886174458. ఊహించని క్షణాలు రెక్టారు స్కేల్ మీద ఊగుతున్నాయ్ . పొరల దొంతరల్లో కదిలికే ఏమో కలలు చిట్లినాయ్. గాలి వీస్తున్నపుడు నేలకొరిగిన చెట్టుల్లా రాలిపడ్డ నేపాల్ , భారతావని బిడ్డలు దేహం మనుసులదైనా ఊహకు ముడిపడని కాలం అంచుల మీద కన్నీటి శిల్పాలు మొలిచాయ్. ఎందుకనో కొన్నింటి రెక్కల చప్పుడు పసిగట్టలేం కొన్నింటిని నిబిడాశ్చర్యమ్ తో చూస్తాం . చెక్కిళ్ళ మీద కన్నీటి చుక్కల్లా జారిపోతున్న ప్రాణాలు ..! కళ్ళెదుట దృశ్యాల్ని చలించే గుండె తో వీక్షించి చేయూత కర్రలా సాగాల్సిన క్షణాల్లో ప్రణమిల్లుతున్నాం . కాలం:26-04-2015 ------------------------------ 5 ఆ దేహం నాదే మల్లెపూలు పెట్టుకుని వెన్నెల చీర చుట్టుకుని నా హృదయ ద్వారం ముందు నిలబడ్డ సిగ్గు తో నేసిన ఓ ముగ్గు బుట్టా ఎన్ని రంగుల ముగ్గులా వుందో ! కాటుక చెక్కిన కళ్ళ అందాల తో జారే జలపాతం లాంటి ఊయలలూగే నడుం తో ముట్టుకుంటే తెనేస్వరాలు వొలికే వేళ్ళతో కురులతో అలా పిలుస్తున్నట్టుగా సమ్మోహనంగా కవ్విస్తున్నట్టుగా లోలోన మనసు పరదాల వెనుక ఆశలు కొద్ది కొద్దిగా చిగిరిస్తున్నట్టుగా ఆమె దేహం గాలి తరంగాల్లో సందేశాల సవ్వడి చేస్తోంది నా ముందు నిలిచి చూపుల పూల దండలతో గుచ్చీ మనసు అంగీకారాన్ని దేహ భాషగా పరిచాక ఒక ఆరాధనా భావంతో నీ హృదయ సామ్రాజ్యాన్ని జయించినందుకు నాదైన భాషలో భావంలో నీ కోసం వెన్నెల సామ్రాజ్యాన్ని నిర్మించా! అనుభూతుల పల్లకిలో ఆత్మానందంతో తేలియాడుతూ స్నేహపరిమళాన్ని పూసుకుని ఏడు అడుగులుగా నడవడానికి సిద్ధపడ్డ నాకే సొంతమైన ఆ అంతరంగాల ప్రేమపందిరి ఆ దేహం నాదే ! నా కోసం పుట్టిందే !! కాలం: 30-05-2015 -------------------------------- 6 నా మట్టి గుర్తొచ్చినపుడల్లా -గవిడి శ్రీనివాస్ ఈ దేహం రూపాన్తరం చెందుతోంది ప్రాంతాలు దాటి మట్టి గుండెను చీల్చుకుని వోరొక చోట పుష్పించటం అనివార్యమైంది . ప్రేమపంచిన నా ఊరు కళ్ళ ముందు నడుస్తుంటే నగరం లో ఒంటరి రాగం ఊపిరి పోసుకుంటుంది కాసేపు అలా రెప్పలు తెరిస్తే చాలు కళ్ళ వాకిలి ముందు పరుగులతో అలసిపోతున్న దేహాలు సుడులు తిరుగుతుంటాయి ఆశల ప్రపంచం లో నిదురపోని మనుషుల ప్రవాహాలుంటాయ్ పలకరింపులు వాట్సప్ ల గానో ఫేస్ బుక్ ల గానో సమయంలేని సందర్భాలవుతాయ్ కొలమానాలు ఆర్ధిక భాషలే గానీ అంతరంగాల్లో గూడుకట్టుకున్న కథలను వినిపించలేమ్ దూరాలు కదిలినా నాలో ప్రవహిస్తున్న నా మట్టి గుర్తొచ్చినపుడల్లా అనుబంధాల దొంతరల్లో ఈ దేహం కన్నీళ్ళై ప్రవహిస్తుంది ఆపుకోలేని భావాలు దుఃఖ తరంగాలై ఘోషిస్తాయ్. కాలం: 30-05-2015 ------------------------------------ 7 . దృశ్యం కాలేని ఆడ శిశువు - గవిడి శ్రీనివాస్ 08722784768 ,08886174458 కొన్ని క్షణాలు ఆకర్షణతోనో అనుబంధం తోనో పెనవేసుకుని చెమట చుక్కలుగా మునిగి తేలిన అమృత ఫలాన్ని నేను. ప్రాణం పోసుకున్న ఆడపిండాన్ని నేను. ఊపిరి ఊదుకుంటున్నందుకే దేవునికి కడుపు లోనే కృతజ్ఞతగా రెక్కలూపుతున్నాను . రేపటి కలల మీద ఇప్పుడే పేగుల వలయాల్లో గంతులేస్తున్నాను కడుపు నిమురుతున్నపుడల్లా చెక్కిలి గింతలతో మురిసిపోయాను . సూర్యోదయం ఎలా వుంటుందో చంద్రోదయం ఎలా బుజ్జగిస్తుందో ఎన్ని ఉయ్యాలలు పడిగాపులు కాస్తున్నాయో ఊహకు అందని ఆనందాల మధ్య నిండిపోయాను. రెమ్మ రెమ్మ తో గాలి వూదుతున్నందుకే నా చిట్టి గుండె మట్టి మీద పడి మల్లె పరిమళాల్ని హత్తుకో బోతున్నందుకే ఆనందంగా వుంది . ఆటల ప్రపంచంలో తోటి పిల్లల్ని ఆప్యాయత బంధాల్లో నా వాళ్ళని తనివితీరా చూసుకోవాలనీ వుంది . నాకల ఫలించక ముందే నా చెవుల్లో కి ధ్వనించిన నిజం ఇప్పుడు కనడానికి కడుపులోంది ఆడబిడ్డా మగబిడ్డా ! నిర్ధారణకు నిర్ధక్ష్యణ్యం గా వచ్చినపుడే వసంతమే లేని శిశిరం లా రాలిపోతున్నందుకే దృశ్యం కాలేని ఆడ శిశువు గా మానవత్వాన్ని పాఠం గా నేర్పమని మౌన ఘోషా తరంగాల్ని వేదజల్లుతున్నాను కన్నీటి వాగై జననాంగం నుండీ జారిపోబోతున్నాను . కాలం: 05-07-2015 ---------------------------- 8 యంత్ర భాష -గవిడి శ్రీనివాస్ 08722784768,9966550601 ఇప్పుడు తెల్లారనవసరం లేదు క్షణాలన్నీ బిగుసుకుపోయి తనువు అనేక కోతల్లో కమిలి పోతోంది ప్రపంచీకరణ పందిరికింద కరెన్సీ కాళ్ళ కింద నలిగిపోతూ తనది కాని ప్రపంచం లో వర్తమానాన్ని ఛిద్రం చేస్తున్నాం . కొండలా తరగని పనిని నెత్తిన ఎత్తుకుని అరకొర ఫలితాలతో బతుకుని బండరాయికి బాదుతున్న జీవితాలు నిత్య దృశ్యాలుగా దొర్లుతున్నాయ్ యాంత్రిక మౌతున్న మనుసుల మధ్య పనితెలియని బడాబాబుల మధ్య బానిసత్వపు సంకెళ్ళు బిగుసుకుంటున్నాయ్ ఇక్కడ ఎవరికి వారే భజంత్రీలు వాగించు కోవాలి నేనిప్పుడు శ్రమను ప్రేమించే మనుషుల్ని మనుషుల్ని ప్రేమించే యజమానుల్ని ప్రగతిని కోరే పౌరుల్ని వెదుకుతున్నాను ఇప్పుడు నే మాట్లాడేదంతా యంత్ర భాషే గుండెను తడిపే మాటలు రావు . మనిషిని చేసే భావాలూ లేవు నా నుంచి రాల్తున్నవల్లా ముందుగా నిర్ణయించబడ్డ సందేశాలకు సమాధానాలు మాత్రమే! కాలం : 18- 07-2015 ------------------------------- ------------------------------- 9 కనురెప్పల భాష -గవిడి శ్రీనివాస్ 08722784768,9966550601 నీ కను రెప్పలపై ఊయలూగి నుదిటిన వెలిగే చంద్రబింబాన్ని అందుకోవాలని వుంది ! నీ కను రెప్పలు మూస్తూ తెరస్తుంటే నెమలి పింఛమ్ తో గాలి విసురు తున్నట్లుంది అలా వాల్చిన నీ కను రెప్పల తలపులు ప్రశాంత ప్రపంచాన్ని మేల్కొలుపు తున్నాయి రెప్పలు వాల్చిన నీ మౌన ప్రపంచం లో తడిసి ముద్దయిన వాడ్ని. నీవు కను రెప్పల్ని తెరచి చూస్తే మేఘాల ఫై వర్షాన్ని కురవమన్నట్లుంది నీ వలా లేస్తూ కదులుతుంటే జలపాతాలు సన్న సన్న గా జారుతున్నట్లు యవ్వనమంతా నాభి సంద్రం లోంచి ఉబుకుతున్నట్లు మనో నేత్రం లో దృశ్య పరిమళాలు పరవళ్ళు తొక్కు తున్నాయి . మౌనం వెనకాల దాగిన ఆంతరంగిక భాషతో నన్ను అలా నడిపిస్తున్నావ్ నీ పెదవుల ఫై తేనే పిట్టలా వాలమని పంపిన సంకేతాలు ఇంకా కళ్ళల్లో దృశ్యాలుగా తడుపుతూనే ఉన్నాయి . కాలం: 18-07-2015 ----------------------------- 10 మట్టి గుండె జారిపోతోంది గవిడి శ్రీనివాస్‌ 08886174458 మమకారం పంచిన తల్లిలా నా మట్టి లాలించి పాలించేది నేను తెల్లారే రేగిన ఆనందంతో పొలా గట్లవెంట తుళ్ళిపడేవాడిని కళ్ళళ్ళో పరిమళా పందిళ్ళు విరిసేవి అంతే వొయ్యారంగా ఊగే ఆకుపచ్చని పొలాన్ని రెక్కు చాచుకు హత్తుకునే వాణ్ణి దొర్లుతున్న సంవత్సరంలో పైరుపచ్చని కలు దృశ్యాలై నిలిచేవి రాజధాని రెక్కల్లో రాక్షస కత్తు దూస్తున్నాయి చీకటి స్వప్నాు ఊహించని దాయి బతుకుని ఛిద్రం చేస్తున్నాయి ఆకుపచ్చని గుండె మీద సిమ్మెంట్‌ దరువు మోగుతున్నాయి ఈ కళ్ళముందే మబ్బుపడుతున్న పొలాన్ని చూస్తే ఆకాశాన్ని పిండి కన్నీటి ధారు చిందిస్తున్నట్లు నాలో ఒక నిర్వేదం అుముకుంది ఇక్కడ మట్టి బంధాల్ని లెక్కించే మనుషుల్ని చూడలేం ఊహ సౌధాల్ని ఆలింగనం చేసుకుని వ్యాపార సామ్రాజ్య వాదాన్ని బాకా ఊదుతున్న రాబంధుల్ని భరిస్తున్నాం నిశ్శబ్దం ముక్కలైన చోట విప్లవాు మొకెత్తుతాయి ఆశ దృశ్యాల్ని చూపిస్తూ రిక్త హస్తాు ఎదురైన వేళ రగుతున్న రక్తం చెరిగిపోని పుటగా లిఖించబడుతుంది 30--08-2015 ప్రస్థానం సెప్టెంబర్‌ 2015 ------------------------------------ 11 ఒక దుఃఖ కెరటం - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601 నిశ్శబ్దం నిలిచినా చోట జ్ఞాపకాల వరదలా దొర్లి పోతుంటావ్. కాలం రెక్కల మీద ప్రవహిస్తూ నీ వొక దుఃఖ కెరటమై గుండెను బాదుతుంటావ్. ఆశలు ఇంకిపోయిన ఇసుక మేట జీవితం లో అలా కెరటంలా వచ్చి పోతావ్ . నేను కూలబడటం తప్పా తోడై నిలిచిన పూలతోట కాలేకపోతున్నాను. ఎన్నయినా చెప్పు నీవు లేని ప్రపంచం ఒక శూన్యం లా ఒక శిధిల శకలం లా నన్ను వెంటాడుతోంది . నువ్వు చేయందిస్తే చాలు ఒక ధైర్యమై జ్వలిస్తాను ఒక ప్రళయమై ధ్వనిస్తాను. నువ్వు నాతో నాలో వున్నపుడు విశ్వాన్నే జయిస్తాను . కాలం: 20-9-2016 ------------------------------------- 12 బాల్యం కొన్ని జ్ఞాపకాలు - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601 ఒక ఖాళీ సమయం బాల్యం తళుక్కుమంటే చాలు మబ్బులు మల్లెలు జల్లినట్లు వొళ్ళంతా సువాసనల గుభాళింపు. పక్షుల గుంపుల్లా చేపల పిల్లల్లా ఎగరటం మునగటం స్వేచ్ఛా లోకంలో ఈదటం ఒక అనిర్వచనీయ అనుభూతి . గాలి వీస్తే చాలు గాలి పటాల వెంట మనసు విను వీధుల్లో లోకాల్ని చుట్టేది . మాకోసం తొంగి చూసే మామిడి చెట్లు బొంగరం లా తిరిగిన వేసవికాలం తడితడి అనుభవాలతో జారిపోయేది. కొబ్బరి చెట్లు ఈత చెట్లు పిలిచి పరిమళాలు పంచేవి . సాయంత్రం అరుగు పైన కథల గుభాళింపుల్లో మనసు తడిసిపోయేది. అలసిన జీవితం లో బాల్యం ఎప్పుడూ వెన్నెల్ని పుస్తూనే వుంది ! కాలం: 20-9-2015 -----------------------------------------13 నాలో నా ఊరు - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601 ఎన్ని కాలాలు అలలు అలలుగా నడచి వచ్చినా నాలో వట వృక్షమ్ లా నిలిచిన నా ఊరు . విజ్ఞానాన్ని బుర్రలోకి వొంపుకుంటూ ఎన్ని దూరాలు జీవిత సందర్భాలు గా మారినా కాస్తంత సమయం దొరికితేచాలు నా పైరు నా పల్లె రెప్పల మీద పిట్టల్లా వాల్తునే వుంటాయి . నా పల్లెలో వలస పక్షుల్ని చూస్తున్నాను . తడారిన గుండెల్లో పగిలిన బీడు భూముల్లో మొల కెత్తని ఆశలు వలస పోతున్నాయి. అయినా చెదిరిన స్వప్నాల్ని మళ్లీ నిర్మిస్తున్నాను . పల్లె గుర్తొస్తే చాలు దేహం ముక్కలు ముక్కలు గా రాలిపోతుంది . పల్లె ఋణం తీర్చు కోడానికి మనసు ప్రణమిల్లుతోంది. పల్లెకు పోతాను రైతుని విజ్ఞాన నిధిగా నిలిపే వరకూ పల్లెకు పోతాను మేట వేసిన జీవితం లో ఒక ఆశగా మొలకెత్తుతాను. కాలం: 27-9-2015 ------------------------------------- 14 నేను పోలవరం రైతుని మాట్లాడుతున్నా! - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601 నేను రైతుని మాట్లాడుతున్నా నీరంటే తడిసిపోవడమే కాదు ఎండిన జీవితాల్లో మొలకెత్తడం వాడిన మాటల్లో సువాసనలు పొదగటం అలలై ఎగసి పడుతున్న నా కలల్ని నా మెత్త భూముల్లో కాలువలుగా తడిసిపోవడం . నేను నిఖార్సయిన రైతుని రాళ్ళలోంచి సెలయేళ్ళని పరిమళం గా ఆశిస్తున్నాను . చినుకుల్ని ప్రోదు చేసుకుందామంటే కొండెక్కి చూస్తున్న పోలవరాలు పొయ్యి మీద ఉడికే కూడుకి దూరమౌతున్నాయి . నేను వడ్డీల చక్రం లో తిరగలేను . సగం కాలిన ఆశల్ని ఎటూ నడపలేక ఎండ వెంటా వాన వెంటా అడుగుల్ని తొడుగు తున్నాను . నీరున్నచోట మనుషులు మహా వృక్షాలవుతారు . నీరులేక అనాధ గోడులు ఆత్మహత్యల కథలవుతాయి . నీటి చుక్కలకోసం గుప్పెడు మెతుకుల కోసం నీటి ప్రాజెక్టుల వెంట ఆశల్ని ఆరేసుకున్నాను . ఇకనైన ఆగిపోతున్న ప్రాణాల్ని ఆనకట్టలు వేసి నీటి చుక్కలతో నిలపండి ! కాలం:27-9-2015 ------------------------------------- 15 జ్ఞాపకాల వాన వసంతంలా ఆశ చిగురిస్తూ శరదృతువు వెన్నెలలా నీ మేను తాకుతూ శిశిరం లా కాలం జారిపోయింది . అనుభవ సుగంధాల్ని పూసుకున్న రోజులు అలానే పలకరిస్తున్నాయ్ . నీ పెదవుల పైకి నడచిన ద్రాక్ష పళ్ళు అలానే కవ్విస్తున్నాయ్ . ఇప్పుడు మనం చెరో దిక్కులో జ్ఞాపకాల వానలో తడుస్తూ ఒంటరి పక్షుల్లా విలపిస్తూ మిగిలిపోయాం. కాలం: 23-10-2015 ----------------------------- 16 నీవులేని క్షణాలు నాపై చినుకుల్లా వాలిన అత్తరు పరిమళాలు చుట్టూ ముట్టిన రంగు రంగు వలయాలు నాపై ప్రవహించిన వెన్నెల ఝరీ చీరలు నీవులేని ప్రపంచం లో పొడిపొడి గా రాలుతున్న అనుభవాలు నీ పెదవులపై తొణికిన పదనిసలు మత్తెక్కిన శుభ ఘడియలు ఒక్కసారిగా గుర్తొచ్చీ నాలో ఒంటరిగా వేరుపడిన నేను . కలత చెందీ కలవరించీ కన్నీళ్ళ తో గుండెను తడుపుకుంటాను . ఎండిన మొక్కలా నిర్జీవమైపోతున్నాను. ఏవీ ఆ రాగ మాళికలు. అల్లుకున్న ముగ్గులు నీ బుగ్గల పై వాలిన తడి తడి మొగ్గలు లేత గా జారిన సిగ్గులు గాజుల మృదు స్వరాలు నాలో విరిసిన కోరికల హరివిల్లులు ఎన్నయినా మాట్లాడు నిన్ను మరచి పోవడమంటే నాలో ప్రపంచాలు మునిగిపోతున్నాయ్ . నిన్ను తలచుకున్నానంటే నాలో అనుభవ పరిమళాలు దుఃఖ కెరటాలై ఉబుకు తున్నాయ్. నీవులేని క్షణాలు దుఃఖ సంద్రాల్ని మోస్తున్నాయ్ . కాలం: 23-10-2015 --------------------------------------- 17 రాలవే నీటి చుక్కా! వొడిసి పట్టుకుందామంటే చిక్కడం లేదు గొంతుని తడిపే భగీరథ ప్రయత్నాలన్నీ సతమత మౌతున్నాయి . చూపులన్నీ కొంగల బారులా నిల్చున్నాయ్. కావేరీ పరవళ్ళు కోసం కళ్ళు ఆకాశాన్ని అంటి దిక్కుల్ని ముక్కలు చేస్తున్నాయ్ బతుకులు సాగిలపడి నేలకు అంటుకుంటున్నాయ్ రాలవే నీటిచుక్కా ! అలసట చెందిన జీవితంలో ఒక తేనీటి విందు గా జారవే నీటి చుక్కా!! (బెంగళూరు లో నీటి ఎద్దడి చూశాక) కాలం: 25-10-2015 ------------------------------- 18 నీ చూపుల దీవెన! నీ చిరునవ్వు పవనమే కష్టాల కడలి నుంచీ చేతులిచ్చీ ఎత్తుకుని మలయమారుతం వైపు నన్ను లాక్కుపోతుంది . నీ చూపుల దీవెనే ఊహలకు రెక్కలిచ్చి భావ సోయగాల మధ్య బందీని చేసింది. దొండ పండులా మెరిసే నీ పెదవుల్ని చిలకలా కోరకడానికి ఉరికి నపుడల్లా మంచు వర్షం నా గుండెల్లో కురుస్తూనే వుంది . నీ పాద పద్మాల్ని చుంబించి నపుడల్లా వెన్నెల సెలయేళ్ళు నాపై జాలువారుతున్నాయి. ఊపిరి సలపని నీ బిగి కౌగిట నలిగిన నాల్గు క్షణాలు స్వర్గపు దారుల్లో పూల పరిమళాలు వీస్తూనే వున్నాయి. నీ చూపుల దీవేనలో నీ మనసు గెలిచిన సమయాన అమృత ఫలాలు ముద్దులాడుతూనే వున్నాయి. 29-11-2015 ---------------------------------------- 19 ----------------------------------------- 20 ఒక సాయంత్రం - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601 ఒక సాయంత్రం నువ్వూ నేను ఆరబోసుకున్న వెన్నెల్ని పంచుకున్నాం. లేలేత ఆశల్ని కళ్ళల్లో వెలుగిస్తూ అనుభందాల వొడిలో వాలిపోయాం. నా అర చేతుల్లో నీ ముఖ లావణ్యా న్ని దాచుకుని స్వర్గపు దారుల్లో వొలికిన నును వెచ్చని సిగ్గులు నీలా పరచుకున్నాయి . చందమామ ఊయలలూగు తున్నట్లు మంచు శిల ఏదో వొడిలో తగులుతున్నట్లు ఏవో తీయని బాధలు తీరుతున్నట్లు నాలో అనుభవ తరంగాలు కదులుతున్నాయి . తీయని స్వప్నాలేవో తడి తడి దృశ్యా లై వెలుగుతున్నాయి. కాలం: 06-12-2015 -------------------------------------- 21 కబ్బన్ పార్క్ క్షణాలు ఒంటరిగా తొలుస్తున్నపుడు మౌనంగా వనంలోకి ప్రవేశించాను . రెప్పలమాటు దృశ్యాలన్నీ హరిత స్వప్నాలై దర్శన మిచ్చాయి. చూపుల మొదళ్ళతో ఆరంభమై ఆకాశానికి ప్రసరించాయి . రాలుతున్న కిరణాలతో ఒద్దికగా స్నానమాడాను . ఎటు చూసినా దృశ్యాల తెరలు . హృదయాల్ని మార్చుకునే జంటలు ఒంటరి రాగం ఆలపించే యువకులు కాలం అంచుల మీద అలసిపోయిన పండుటాకులు గుంపులు గుంపులుగా కొన్ని కొన్ని కుటుంబాలు రంగుల వనం లో ఇంద్రధనుస్సు లా కనిపించాయి . పదునెక్కిన జీవితం లో స్వాంతన సమయాలు స్వేద దీర్చే హృదయాలు కబ్బన్ హరిత వనాలూ జీవితపు పొదలో పూయల్సిన అవసరాలు. [బెంగుళూరు లో కబ్బన్ పార్క్ చూశాక ] కాలం : 06-12-2023 ----------------------------------------- 22 గూడు పారుతోంది - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601 ఒక్కోసారి జీవితం ఎక్కడ పరచుకున్నా దుఃఖ ప్రవాహమై మునుగుతుంది . పల్లెలు వలసపోయి పట్టణాల్లో మురికి పడుతున్నాయి . కూడ గట్టుకున్న ఆశలన్నీ కురిసే వాన ప్రవాహం లో మునిగి పోతూ చెన్నై సంద్రం లోకి జారిపోతున్నాయి. నదులు నగరాల పైకి ఉరికి కూలీల గూడుల్లోకి ఏళ్ళకు తరబడి నమ్ముకున్న మట్టి పైకీ నీటి ప్రవాహం ఫెఠెల్ ఫెఠెల్ మని ధ్వనిస్తూ జీవితాల్ని తుత్తునియలు చేసింది. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ లో తగలబడి పోతున్నాం . నదుల ప్రవాహాలకి అడ్డు గోడలేస్తే సౌదాలైన ఛిద్రమై పోతాయి . ప్రళయ ప్రవాహంలో కొట్టుకు పోతాయ్. చెన్నై నగరం లో గూడు పారుతోంది . గుండె చెదిరి పోతోంది. ఇక ఈ కన్నీటి ప్రవాహాల్ని ఆపలేం! కాలం : 13-12-2023 ---------------------------------- 23 మనిషీ -చెట్టూ-తత్త్వం ఎటు చూసినా శ్వాస ఆడని ఆశల రహదారుల్లో మనిషి గిరికీలు కొడుతూనే వున్నాడు. ఒంటరి భావన ను నిభాయించుకుని కాలం అంచుల మీద నడిచే తోటి ప్రయాణికులల్నీ గుర్తించలేడు. చెట్టు వేనవేల గాలుల్ని గాయాల్ని మోసుకుని ఎన్నో పక్షులకు గూళ్ళు మరెన్నో జీవులకు పళ్ళు నిస్వార్ధంగా పరుస్తూనే ధ్యానిస్తుంది . మనిషి 'నేను' అనే భావన సునామీ లో మనిషితనం కూల్పో తున్నాడు . మనం అనే భావన లో చెట్టు ప్రకాశిస్తూనే వుంది . మనిషీ బతకాలి మనిషితనం బతకాలి నిట్టూర్పుల్లో నిస్సహాయంగా బోర్లా పడ్డ మనిషీ బతకాలి . నిండుగా ఆకులతో అల్లల్లాడే చెట్టు నీడ నిచ్చినట్టు తోడై నడుపుతున్నట్టు మనిషిని మనిషి ప్రేమతో నడపాలి . మనిషై పుట్టినందుకే అనురాగ దీపాల్ని వెలిగించాలి. కాలం: 27-12-2023 --------------------------------------- 24 నీ మాటల జల్లులో ..! ఒకింత ఓదార్పు నీమాటల జల్లులో ఇల్లు కడుతుంది . నీ మాటల సెలయేరులో కిల కిలా రావాలు గులకరాల్లై దొర్లుతున్నాయి . నిశ్శబ్దం దాడి చేసినపుడల్లా నీ మాటే ఆయుధమవుతుంటే నాలో ఉత్సాహం కత్తులు రువ్వుతోంది . నీ మాటల పొదరింట్లో నిదురోతున్న మనసు గాలి తరంగాల్లో గుర్రపు స్వారీ చేస్తోంది . నీ వసంత ఋతువు లో చిగురులు సాక్షిగా చెప్పూ నీ మాటలేని జన్మ పరవశిస్తుందా ! నీ మాటలేని జన్మ పరిమళిస్తుందా ! మంచు కత్తిలా కోస్తున్న అంతుచిక్కని ప్రశ్నలివి . కాలం: 03-01-2016 ---------------------------------------- 25 ఈ దూరం..! ఈ కాసింత దూరం లో నాలో వేదన ప్రవాహాలు నాలో కన్నీటి సుడులు ముడులు కట్టుకు తిరుగుతున్నాయి . ఖాళీ సమయం పలకరిస్తే చాలు నాలో మీ జ్ఞాపకాలు తడి తడిగా తడుముతున్నాయి . నా ప్రియ ప్రాణ బంధమా ఇక్కడ డాలర్ ఇవ్వలేని ప్రేమ ఒకటుందనీ నా కన్నీటి దోసిళ్ళ తో అవి సరితూగ లేవని అర్ధమౌతూనేవుంది. నేను తాగే కాఫీ లో నేను తొడిగే వస్త్రాల్లో మీరు తొంగి చూస్తూనే వున్నారు . ఇక్కడ చెల్లా చెదురైన నేను ఒంటరిగా కూలబడుతున్నాను . అక్కడ బాగున్నావా నాన్నా పిల్లాడి గొంతో ఫొనులో ధ్వనించినపుడు ఒక్కసారీ ఆత్మీయ జ్ఞాపకాలు గా రాలుతుంటాను. నేను వచ్చేస్తా కాసింత కాలం ఓపిగ్గా ఒద్దికగా ఉండు నా చిట్టి తండ్రి ! ఇక్కడ మూట కట్టుకున్న దుఖాన్ని తలగడ దిండు లో అదుము కుంటాను. నాలో రేగే వేదనల్ని ఆవిష్క రించలేకపోతున్నాను . కాలం తొలిచిన కన్నీటి నదుల్నీ ఈదలేకపోతున్నాను. ఇక ఫ్లైట్ కన్ఫార్మ్ అయితే చాలు ఉన్నఫళంగా నాలో ఉత్తేజం రెక్కలు కట్టుకు ఊరేగుతుంది . ఇక ఈ మెట్లు దిగుతూ భారాన్ని దించుకుంటూ నా బంధాల్ని నా బాహువుల్లో బంధించే క్షణాన క్షమా గుణం తో మోకరిల్లుతాను . కాలం: 14-02-2016 --------------------------------------------------------- 26 మరలా తిరిగి రాలేకపోతున్నాను ..! - గవిడి శ్రీనివాస్ 07019278368, 08722784768 ఒక నిశ్శబ్ద సమయం నీలోకి ప్రవేశించాను. మరలా తిరిగి రాలేక పోతున్నాను. ఆ క్షణం నీవూ నేనూ చూపులతో మాట్లాడుకున్నాం . ఆప్యాయతల్ని అలంకరించు కున్నాం బిగిసిన వస్త్రాల్లో విరిసిన సమ్మోహన రూపం గాజుల సవ్వడి లో మోగిన గుండెలు చేతుల కరచాలనం లో నలిగిన మనసులు నీ కురుల నదులలో తేలిన ముఖ సోయగాలు ముద్దుల పరిమళాలు కురిసే వాన లో మౌనంగా వాలిన క్షణాలు అలంకరించిన హృదయాలు నాలో నడుస్తున్న ఈ వెన్నెల సమీరాలు ఇక నాలో ఒక చిరు నవ్వు శిల్పం లా పూల వనం లా మిగిలి పోయాయ్. మరలా రాలేని బందా ల్లో నీవు మరచిపోలేని నీ జ్ఞాపక శిలా శాసనం లా మిగిలిన నేను. కాలం : 26-12-2016 ---------------------------------------- 27 మరలా తిరిగి రాలేకపోతున్నాను ..! - గవిడి శ్రీనివాస్ 07019278368, 08722784768 ఒక నిశ్శబ్ద సమయం నీలోకి ప్రవేశించాను. మరలా తిరిగి రాలేక పోతున్నాను. ఆ క్షణం నీవూ నేనూ చూపులతో మాట్లాడుకున్నాం . ఆప్యాయతల్ని అలంకరించు కున్నాం బిగిసిన వస్త్రాల్లో విరిసిన సమ్మోహన రూపం గాజుల సవ్వడి లో మోగిన గుండెలు చేతుల కరచాలనం లో నలిగిన మనసులు నీ కురుల నదులలో తేలిన ముఖ సోయగాలు ముద్దుల పరిమళాలు కురిసే వాన లో మౌనంగా వాలిన క్షణాలు అలంకరించిన హృదయాలు నాలో నడుస్తున్న ఈ వెన్నెల సమీరాలు ఇక నాలో ఒక చిరు నవ్వు శిల్పం లా పూల వనం లా మిగిలి పోయాయ్. మరలా రాలేని బందా ల్లో నీవు మరచిపోలేని నీ జ్ఞాపక శిలా శాసనం లా మిగిలిన నేను. కాలం: 21-2-2016 ---------------------------------- 28 పక్షులు ఎగరటం - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601 వేకువ సమయం తీయని సూర్య కిరణాలు ఆకులపై అలా పడుతున్నపుడు పక్షులు ఎగురుతున్నాయి . నా హృదయం చెతులూపింది ఎగిరే పక్షుల వెంట . నేను పక్షుల సంఘటిత దృశ్యం లో మునుగుతున్నాను . నాకు దగ్గరగా గుచ్చుతోంది . ఒకరికొకరి సహకారం ప్రేమైక జీవితం ఒకరికొకరు ఆలోచించటం ఒకరికొకరు తినిపించుకోవటం . నేను ఒక్కోసారి ఆలోచిస్తాను మనుషులమైన మనమే ప్రతిస్పందించీ గ్రహించాల్సి వుంది . ఏమి చేయాల్సి వుందో ! జీవితం అస్తమించే లోపే !! కాలం: 28-2-2016 ------------------------------- 29 మౌనంగా ఒక నీ కోసం ! - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601 నీ లోకం లోకి ఒంటరిగా వస్తాను మనసారా నవ్వుతూ చల్లని వెన్నెల పరచి కూచో పెడతావ్ . నా కోసం పరితపిస్తూ పలవరిస్తూ పలకరిస్తూ పరిభ్రమిస్తూ కాలాన్ని కౌగిలిస్తావ్ . కారణాల వివరణేలేని బంధనాల వలలో విలవిల లాడుతూ ఒక ముగ్ధ మనోహర నీ కోసం ఒక ఆత్మీయ సమ్మేళనం కోసం మోడు బారిన చెట్టు లా నిలిచి నిరీక్షిస్తుంటాను . కలల్ని నిర్మించే వాళ్ళే కాదు . కన్నీళ్ళని తుడిచే వాళ్లూ కావాలి . మనసు అల్లిన పందిరి లో మౌనంగా నాలో నే మంచు లా రాలుతూ నీ కోసం ధ్యానిస్తున్నాను . కాలం: 20-3-2016 ------------------------------ 30 నా ఎడ్ల బండి! నా నాగలి కర్రు!! మబ్బుల రెక్కలు ఊగు తుంటే తొలి తొలకరి జల్లు మనసును తడిపేది . పంట పొలాల గుండెల మీద నా ఎడ్ల బండి కొత్త దారుల్ని తొలిచేది . గరిసెడు గత్తం బండి లో పరుగులు తీసేది . ఎద్దుల గంటల్లో ఆశలు మోతలు మొగేవి . వెన్నెల వొంపిన చందమామ సాక్షిగా ప్రతి మడిలో రాత్రిళ్ళు ఎరువుల కుప్పలు విరిసేవి . పనిలోని ఆనందాన్ని ఆ ఆనందం లోని ప్రకృతిని నా కూని రాగాలు పరవశింపజేసేవి . తడి తగిలితే చాలు నాగలి కర్రు నాగేటి చాళ్ళలో మట్టి గుండెల్ని చీల్చుకుంటూ ఉరకలు తీసేది . ఎన్ని మైళ్ళు నాగలి తో నడిచాను . ఎన్ని సార్లు విత్తనం తో మొల కెత్తాను. తెల్లవారు జాము చంద్రుడు పూస్తు న్నప్పటి నుంచీ సూరీడు వేడెక్కే వరకూ నాగలి తో ప్రయాణం జీవన వేద మయ్యేది . బతుకు పాటయ్యేది . పాట పల్లవించిన బతుకు లో నాగలి కర్రు కళ్ళల్లో హరిత వనాల్ని నింపేది . ఇప్పుడు నా నాగలి జాడేది ఇనుప దున్నలకింద కను మెరుగై పోతున్న నా ఎడ్ల బండి ఆనవాళ్లైనా మిగుల్చు కోవాలని తల్లడిల్లు తున్నాను . కాలం: 27-3-2016 ---------------------------------- 31 ఓ నా దేశమా..! నడకలు మారాయి స్వాతంత్రానంతరం సంకెళ్ళ రూపాలు మారాయ్. ఇప్పటి బానిసత్వం కొత్త అర్ధాల్లో జీవిస్తోంది . కాల పరిమితి లేని పనిగంటలు పొద్దస్తమానం రెక్కల పై వేలాదుతూనే ఉంటాయ్. శ్రమజీవులు నిశ్శబ్ద జీవితాన్ని సాగిస్తుంటే ఫలితం హత్తుకునే జీవికలు ఎత్తున మాట్లాడుతుంటాయ్. భరోసా లేని బతుకుల్లో జీవితం తడబడుతోంది . రైతు మట్టి నాదని హత్తుకుంటే గుండె గుభేల్ మనిపించే సందర్బాలు అంటిపెట్టుకు తిరుగు తున్నాయ్ . ప్రాపంచీకరణ ప్రపంచంలో సన్నకారు రైతు జీవించనూ లేడు కిళ్ళీ కొట్టు వాడు బతుకు సాగించనూ లేడు సంతా లేదు సందడీ లేదు సంక్షే మమూ లేదు చిన్న కూరగాయల కొట్టు లేదు మాల్స్ మాయాజాలం లో కొట్టుకు పోతున్నాయ్ . నిన్ను నువ్వు కూల్పోతున్నావ్ నీ నీడ నూ కూల్పోతున్నావ్ నా రైతుకు రాజ్యమేది. నా కార్మికునికి సంక్షే మ చట్టమేది . ఓ నా దేశమా స్వశక్తి ఉపాది మార్గమా నా కలల ప్రపంచమా సమసమాజ స్థాపనలో వెలుగు రేఖలు రువ్వుకుంటూ రావూ ..! కాలం: 09-04-2016 ------------------------------------ 32 చలి చలి గా ..! వాన కురిసిన రాత్రి నీవూ నేనూ చలి చలిగా మాట్లాడుకున్నాం . అంతరంగాల్లోని ఊసుల్ని ఊదుకున్నామ్ . నీలోకి నేను నా లోకి నీవు ప్రవహిస్తూ జీవ నదులమైయ్యాం. రసరమ్య గీతాలుగా కాలాన్ని లిఖించు కున్నాం. కాలం: 18-4-2016 ----------------------------------- 33 రంగుల లోకం - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601 ఇంద్ర ధనుస్సు లో పొదిగి ఉన్నవి ఎన్ని వర్ణాలు ఎన్ని రంగుల జలపాతాలు ఒక వర్ణ శోభిత దృశ్యం లా ఒక రంగుల గొడుగు లా చూపుల్ని తన వైపు లాక్కు పోవడం లేదూ! ఒక అందాల ఆభరణం లా మిరిమిట్లు గొలపడం లేదూ ! ఎన్ని జాతులు ఎన్ని మతాలు ఎన్ని కులాలు ఎన్ని వర్గాలు ఒకే రక్తం లో పూయడం లేదూ ! మరి కన్నీటి ని చెక్కుతున్న శిల్పు లెవరు ? ఆత్మ హత్యలకు కారకులెవరు ? నాలో ఉద్వేగాన్ని నీ లోకి ఉద్భోదిస్తూ నీలో ప్రేమ ను పరిచయం చేయమంటున్నాను . పరాకాష్టకు చేర్చే విపరీత ధోరణుల్ని ముక్కలు ముక్కలు చేస్తున్నాను . వీలైతే కాసింత ఓదర్పు నివ్వు జీవితాన్ని కబళించే శోక గీతికలకి ఆరంభకుడివి ఆరాధ్యుడువి కనే కారాదు . జీవితాధ్యాయం లో కాసింత ప్రేమ ను రుచి చూడు ఒక్క సారీ విద్వేషాల్ని చెరో దిక్కు లో పరుగులెడతాయి. కాలం: 23-4-2023 ------------------------------- 34 కాసేపు నీతో ప్రయాణం ..! - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601 ఆ కాసేపు నీతో పయణించిన క్షణాలు మల్లె వాసనలూ మౌన రాగాలూ అలజడి రేపుతున్నాయి . నీ వేదో చేస్తావనీ కాదు మనసు తలుపు తడితే ఒలికిపోయే వెన్నెల సమీరాల్లో తడిసి పోయిన వాణ్ణి. నీ వేదో చెప్తావనీ కాదు కనుల భాషలో రాలిపోయే పువ్వుల్ని ఏరుకుందా మనీ . మూసుకున్న కళ్ళల్లో కలల్ని నీ పరిచయాలు గా పదిల పరచు కోవాలనీ ఆరాట పడుతుంటాను . మరి కొన్ని క్షణాల్లోనే దూర మౌతుంటాను . కాలం సాగుతున్నకొద్దీ అక్షరాల పక్షి లా నేను వాలుతుంటాను . ఒకటి ఒకటి గా ఏరుకుంటూ నీవు చదువుతుంటావు . నీలో మూగ వేదన భళ్ళున పగిలి తరంగాల ధ్వనితో చేరువౌతావు . అపుడే ఆ కాసేపు నీతో ప్రయాణించిన క్షణాలు జల్లున కురిసి వరదలా దొర్లుతుంటాయి . కాలం: 24-4-2016 ----------------------------------------- 35 పిచ్చుకల్లేని ఇల్లు - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601 ఇంటిలో వరికంకులు దూలానికి రెక్కలు చాచుకు వేలాడినపుడు చెంగు చెంగున ఎగురుతూ తేలివచ్చిన పిచ్చికలు మనసు లోయల్లో ఊయలలూగేవి . వరిచేను కోసిన దగ్గరనుంచీ కుప్పలు నూర్చే వరకూ కదులుతున్న నేస్తాలుగా ఉండేవి . పిచ్చుకలల్లిన గూళ్ళు ఇప్పటికీ మనసు పొరల్లో జ్ఞాపకాల ఊటలు గా సంచరిస్తూనే వున్నాయి . పిచ్చుకల కిచకిచలు ఇంటిలో మర్మోగుతుంటే ఆప్యాయతలు బంధువల్లే నడిచొచ్చినట్టు గుండె లోతుల్లోంచి అభిమానం తీగలై లాగుతున్నట్లు తెలియని పరవశం పరిచయమయ్యేది . ఎండుతున్న వొడియాల చుట్టూ పిచ్చికలు వాటి చుట్టూ పిల్లలు ఓ పసందైన ఆటలా ఉండేది . ఇప్పుడు పిచ్చుకల్లేని ఇంటిలో శబ్ద పరిమళమేదీ . కృత్రిమ ప్రపంచపు అంచుల్లో విషపు ఎరువుల లోకం లో కలుషిత వనాల్లో ఎగరాల్సిన పిచ్చుకలు సందడి చేయాల్సిన కిచకిచలు అలా రాలిపోతున్నాయి . గుండెను తడుముతూ కాల శిల్పం మీద కొన్ని కొన్ని జ్ఞాపకాలుగా వాలిపోతున్నాయి . కాలం: 08-05-2016 ------------------------------------ 36 చినుకు సంబరం - గవిడి శ్రీనివాస్ 08722784768 ఉక్కపోత జీవితం లో ఉన్నట్టుండీ మబ్బులు ఉరమటం మొదలెట్టాయి . ఎండకు తడిసిన తనువులు చినుకు సంబరం తో మట్టి మధ్య మొలకెత్తుతున్నాయి . ఎండిన ఊహలు మళ్ళీ పరుగెడుతున్నాయి . నా గాలిలో మట్టి పరిమళం నా శ్వాసలో ఆశ ను రేపింది . చినుకు తడితో మట్టి పులకించినట్టు మట్టిని తాకిన ఒళ్ళు జలదరించి పోతోంది . పిడికెడు మట్టిని పట్టిన దోసిళ్ళ లోకి రాలిన నా కన్నీళ్ళ లో ఆనందాశ్రువుల్ని పోగు చేస్తున్నాను . గుప్పెడు గుండెల్లో వెలుగు వరదల్ని నింపే నీటిలో పులకరించి పోతున్నాను . నాగలి తో దున్నుకోడానికి ఒక ఆకాశం వచ్చి వాలినందుకు ఒక చినుకుగా మాట్లాడినందుకు పూల వర్షం లా జారిందుకు తనువు బహుముఖంగా పులకరిస్తోంది . గాలి సయ్యటలాడుతోంది మనసు ఊగుతోంది. పల్లె పరవశం లో మనసు మునుగుతోంది . నా మట్టంటే బహుమానమంత అభిమానం . కాలం మీద చెప్పుకున్న కబుర్లన్నీ నా మట్టి తో నిండిన అనుభవాలే . చినుకు కురిస్తే చాలు చిగురించే చేట్టునవుతాను . పరవశించే నెమలి నౌతాను. ఆకాశానికి వేలాడే ఇంద్ర ధనుస్సునవుతాను . మనిషి నవుతాను . మట్టిని నమ్ముకున్న రైతు బిడ్డ నవుతాను . మట్టిని మోసే మనిషి ని మనిషిని నడిపే మట్టినీ అవుతాను . కాలం: 05-06-2023 ------------------------------------------ 37 ఒక తీయని లోకం లోకి ..! - గవిడి శ్రీనివాస్ 08722784768 , 08886174458 ఆమె అరిచింది ఎప్పుడూ ఆ పుస్తకాల గోలేనా ! ఈ కళ్ళల్లో వెలిగే దీపాల్ని చదవరాదూ అంది ! ఒక్క క్షణం కోపం తన మనిషి కోసం పడే తాపం రెండూ ఒకేసారి కన్పిస్తున్నాయి . లేదు నీ కోసమే మబ్బుల మల్లెలు తెవాలనీ మంచును తేనెలా పూయాలనీ కలగంటున్నాను. లోలోపల దిగులు సంద్రాల్ని దిగమింగుతూ తేనీటి సమాధాన మిచ్చాను . తీరం తెలియని ఒక తీయని లోకం లోకి తెర తీస్తూ ..! కాలం: 12-6-2023 ------------------------------------38 నా ఆశల దారిలో ..! - గవిడి శ్రీనివాస్ 08722784768 , 08886174458 నీవలా జలజలా వెన్నెలలా రాలుతున్నపుడు ఊహలు అలలుగా ఎగరేసీ నిన్నే చూస్తున్నాను . అలలకు రూపమ్ అందిచ్చీ నీ ప్రేమనే శ్వాసిస్తున్నాను . ఊహకి ఉరుకులు నెర్పించీ గాలికి వేగం చేకూర్చీ నీ ప్రేమ తీరం చేరే కడలిని నేనై కదిలోస్తున్నాను . కలలను కళ్ళేదుటుగా నిలిపే నీకై వస్తున్నాను . మరి నా ఆశల దారిలో పూల వనం లా వికశిస్తావనీ నిన్నే ధ్యానిస్తున్నాను. కాలం: 12-6-2016 ----------------------------- 39 ఒక జీవితం - గవిడి శ్రీనివాస్ 08722784768 కొన్ని ఉరుములు కొన్ని పిడుగులు జీవితం లో ఉలిక్కి పడుతుంటాయ్. సంతోష సాగరం లో ఈదుతున్నపుడు తన్మయ క్షణాల్లో మునుగుతున్నపుడు కోల్పోయిన బంధాలేవో లోలోపల అలా తడుముతుంటాయ్ . మూలాల వెంట వదిలిపోయినవి కళ్లెం పట్టుకు లాగుతుంటాయ్ . దూరమైన జీవితాల్లో భౌతిక సమ్మెళనాలుండవ్. గాయపడ్డ మమతల దేహాలు తప్పా ! నా కిప్పటికిప్పుడు నా వాళ్ళతో నా మట్టి తో కాసేపు మనసారా కురిసే మాటలా జారిపోవాలనుంది. జీవితమంటే నలుగురి ఆప్యాయతల కలయిక మనసు ఊరటను వ్యక్తపరిచే ఒక వేదిక . హృదయం రెక్కల రెపరెపల్లో సందర్భాల్ని వెతుక్కుంటూ కాలాన్ని మోసుకు పోతున్నాను . మనసారా నవ్వడానికి ఆర్థిక కొలతలు అవసరం లేదు. అంతుచిక్కని లెక్కల్లో కి దిగితే సమీపించే కొద్దీ సాధించే కొద్దీ చేరాల్సినది వేరే ఉంటుంది . గమ్యాల చేరికలో ఒక జీవితం సుగంధాల జల్లులు కురుస్తున్నట్లు వేపచేదులు తినిపిస్తున్నట్లు ఒక అనుభూతి అంతర్భాగమౌతుంది ఆగని కాలం గుర్రపు స్వారీ చేస్తుంది . మనమే కన్నీళ్లను తీపిగా చేదుగా అభివర్ణిస్తుంటాం . జీవితం ఒక జడ పదార్థం కదా! కాలం: 24-6-2016 --------------------------------------- 40 అలా అనుకోలేదు - గవిడి శ్రీనివాస్ 08722784768 పక్షి లా వాలాలనుకున్నా నీవు వృక్షమై ఆశ్రమిస్తావనుకోలేదు మబ్బునై కురావాలనుకున్నా చినుకై కురుస్తావనుకోలేదు అలనై ఉరకాలనుకున్నా తీరమై చేయందిస్తావనుకోలేదు పవనమై వీయాలనుకున్నా ఊపిరై శ్వాసనందిస్తావనుకోలేదు వెన్నెలై కురవాలనుకున్నా వెలుగై నింపేస్తావనుకోలేదు నదినై ప్రవహించాలనుకున్నా సంద్రమై హృదయ ద్వారం తెరుస్తావనుకోలేదు చిగురునై ఊగాలనుకున్నా పువ్వువై సుమగంధాల్ని వెదజల్లుతావనుకోలేదు ఊహలు వాకిళ్ళలో ముగ్గులు వేయకముందే ముచ్చ్చట దృశ్యాల్ని ఒంపుతూ తడి తడి జీవితాల్ని పరుస్తావనుకోలేదు . కాలం: 03-07-2016 ----------------------------------------41 ముక్కలవుతున్న దుఃఖం నాలో ముసురుతున్న దుఃఖం గోడలు బీటలు వారేలా కలల మీంచి కన్నీళ్ల ను తొడుగుతూ అడుగులకు స్వరాలు కూర్చింది . దేహం ఎప్పుడూ అదే, వీచే గాలులు పరిమళాలు పరిస్థితులు వేరు . ఎక్కడ వాలినా అంతరంగపు నివేదనలు నిట్టూర్పులు తొలుస్తూనే ఉంటాయి . నన్ను ఆవిష్కరించుకోవడమంటే గాయాల కొలువుని దర్శించడమే . అదే జోరు నాలో ప్రవాహపు ఏరు వైరాగ్యపు వైనాలు మధ్యనా కొనసాగుతుంది. భళ్ళున పగిలే జ్ఞాపకాలతో ఉన్నట్టుండీ మనసు పావురం ఎగురుతుంది . సమాధాన పర్చుకోవాల్సిన ప్రశ్నలెన్నో తరుముతుంటాయి తడుముతుంటాయి. కొన్ని మోహాలు కొన్ని తాపాలు తడిపిన క్షణాలు రగిలిన మౌనాలు ఆ మైకం లో కమ్ముకున్న మేఘాలు కురవని స్వావలంభన సుమ గంధాలు గుండెల్లో గడ్డకట్టిన భావావేశాలు ఒంటరి మనసు ఊరటనొందని సందర్భాలు ఒకటి ఒకటి గా రాలుస్తూ రగిలిస్తూ చలిస్తూ జ్వలిస్తూ ఇంకా ఒక్క అడుగుని కాస్తంత బలంగా తరలిస్తూ తెల్లవారు మంచులా రాలి పోతాను . బిందువులు బిందువులు గా నాలోంచి రాలుతున్న భావగర్భిత ప్రకంపనలు అసలు నిను తాకాయా ఏళ్ల తడబడి క్షణాల్ని మోసుకుపోతున్నా అసలు మనసు ఘోష మధన పడే రోదన వినపడుతుందా ఆంతరంగిక సుఖాల్లో ఒక దుఃఖం కూడా భాగమా , సంకోచం సతాయిస్తోంది ఖంగుతిన్న ఆశలెన్నో ఆశయాల్ని లిఖించుకున్నాయి ,నాలో ఒక నెల వంక . జీవితపు గుడారం లో కొన్ని గాలుల్ని తట్టుకోగలం కొన్నింటిని భరించలేం అయినా ప్రయత్నాలు పొసగటాలు కొద్దికొద్దిగా జరుగుతుంటాయి ఆవలిగట్టు ను చేరాలంటే ఇక్కడ ప్రయాణం మొదలు పెట్టాల్సిందే తడబడుతూ తర్జుమా చేసుకుంటూ పాఠాలు నేర్చుకుంటూ గమ్యాలకి రహదారులు నిర్మించాల్సిందే ఎన్ని చేసినా విడవనిదేదో ఉంటుంది . సంద్రమై మంద్రమై నను ఊగిస లాడిస్తూ ఊపిరి కోసల మీద ఊగుతుంది పొందలేని అనురాగమేదో వెంటాడుతూ ముక్కలవుతున్న దుఃఖమవుతుంది . కాలం 10-7-2016 -------------------------------------- 42 అలా చూడు ప్రపంచం ..! గడియారం ముళ్ళు గుండెల్లో గంటలా మోగుతుంటే క్షణాల్ని నెత్తిన ఎత్తుకుని నిర్ణయించబడ్డ సమయానికి అడుగులు సమాయత్తమవుతుంటాయి . ఇక్కడ గమ్యాలు చేరడమంటే హారన్ ఊదుతున్న ఆటోల వెంటో ఘోషించే కెరటాల్లాంటి బస్సుల వెంటో హడావుడిగా ముస్తాబైన మెట్రో రైళ్ల వెంటో మనల్ని మనం ఆరేసుకోవడమే . ఇక్కడ జీవితమంటే ఆకాశాన్ని వంచి మెరుపుల్ని మోయడమే . వొడిసిపట్టిన సమయాల్ని నిలదీస్తే దానిలో మనం మనలా జీవించిన క్షణాల్ని లెక్కించ గలిగామా ! చుట్టూ చూస్తుంటే పల్లె చాపలా చుట్టుకు పోతున్నట్లు పట్టణం ఉక్కపోతలో ఉడికి పోతున్నట్లు చెమర్చిన కళ్ళు చెబుతున్నాయి . వొక సందర్భం వొక పూర్తి కాని స్వప్నం మనల్ని కొత్తదారుల వెంట తరుముతుంటాయి . ఇక్కడ ప్రేమను వొంపే మనసుంది మనసుని నీ ముందు నిలబెట్టే ఆశావుంది నీతో గడపడానికే సమయం గొడవపడుతుంది కాలం కన్నీరు కారుస్తుంది మనిషి పరుగుని చూసీ ఒకింత దిగులుగా కాస్తంత జాలిగా . వృద్ధి చెందడమంటే మనసుకి కారాగార శిక్ష వేయడం కాదు . కొన్ని విలువలు కొన్ని మమతలు కలబోసుకోవడమే. కాలం : 23-7-2023 ---------------------------------- 43 పల్లెకు పోయే పక్షుల్లా ..! రుతువులు రువ్వుతుంటే రంగుల హరివిల్లులు పూసుకుని ఎగిరే పక్షుల్లా ఎల్లలు దాటి వాలటం ఒక కాలం పూసిన పరిమళ పాఠం . చీకటి పడ్డప్పుడు గూటికి చేరే పక్షుల్లా కాస్తంత ఆసరా కనురెప్పల మీద వాలగానే పల్లెకు పోయే ఒక గూటి పక్షినవుతాను . పల్లె దారిలో అడుగిడు తుంటే నాలో పిల్ల కాలువలా ప్రవహిస్తున్న జ్ఞాపకాలు తగులుతుంటాయి. అలా తడుపుతుంటాయి . మొక్కలా ఎదుగుతూ చెట్టు లా పంచుతూ జీవన సాఫల్యం పొందటం లోనే వుంది జీవితం . ఎండకు వాడిన పువ్వులా నీరసించి పోతానా పళ్ళెముఖం చూసి పొద్దు తిరుగుడు పువ్వులా వికసిస్తాను జీవం పోస్తాను . అపుడే నాలో ఉషోదయం తపస్సయి జ్వలిస్తుంది నాలో జ్ఞానోదయం తల్లివేరు మొదళ్ళ లో సాగిల పడుతుంది . ఇపుడే అలసిన మనం పల్లెకు పోయే పక్షుల్లా ఎగిరి పోదాం . కాలం : 11-8-2016 -------------------------------- 44 వెన్నెల స్నానం చల్లని వెన్నెల కిరణాల్ని కత్తుల తో కోస్తూ కలల రాకుమారుడి నవుతాను . అపుడవి వాన పువ్వులై రాలుతుంటాయి . అంతే నేను తడిసి ముద్దవుతుంటాను . కాస్తంత మురిపెం నాలో చలి మంట కాగుతుంది . వెన్నెల్ని చూస్తే రెక్కలు మొలుచుకుని నాలో ఉత్తేజం పావురం లా ఎగురుతుంది . అంతే నేను పారిజాతాన్ని బహూకరిస్తున్నట్లు నాలో కలుస్తున్న గాలి పరవళ్ల లో మునిగి పోతాను . కాలం: 13-8-2016 ------------------------------- 45 ఊపిరి కొనల మీద - గవిడి శ్రీనివాస్ 08722784768 ఊపిరి కొనల మీద అగ్ని జ్వాల రగులుతోంది . ఉడికిన కళింగాంధ్రా జీవితాల మీద అణు విద్యుత్ కొవ్వాడ విధ్వంస దృశ్యమవబోతోంది . మరో దుఃఖానికి సన్నాహమవుతోంది . చినుకుల్ని దున్నుకున్నట్లు ప్రమాదాల్ని మోయలేం అణు విధ్వంసాల్ని ఆపలేం . ఒక కలల ప్రపంచానికి ఒక పవన విద్యుత్ చాలు ఒక సోలార్ విద్యుత్ చాలు ఒక సంద్ర కెరటాల విద్యుత్ చాలు ఒక ప్రవహించే నీటి విద్యుత్ చాలు నన్ను నేను సౌకర్యవంతం చేసుకోడానికి విధ్వంసం అవసరం లేదు . ఎన్నో విన్నూత్న మార్గాల అన్వేషణ జీవులం కదా మనం ...! కాలం: 21-8-2016 -------------------------------------- 46 వొక రహస్య భాష - గవిడి శ్రీనివాస్ 08722784768 కనులు తూనీగ రెక్కల్లా ఊగుతూ మనసును రెపరెప లాడిస్తుంటే రెప్పల పరదాల కింద ఆశలు తొణికిసలాడుతూ ముందుకు నడుపుతున్నాయి . వొక పూలు రాల్చిన చిరునవ్వు గలగలా జారే సెలయేటి పలుకులు అలా గుండెల్లోకి చల్లని గాలిని రువ్వుతున్నాయి . నీవు కనిపిస్తే చాలు తోరణాలతో ముస్తాబైన ఇంటిలా వెలిగి పోతాను . ఈ వాకిట్లో ముగ్గులు నీ తొలి యవ్వనపు సిగ్గులు నాలో వసంత రాగాన్ని ఆలపించాయి . నా ముందే గంతులేసే లేడిపిల్ల లా ఎగిరొస్తుంటే ఈ చందమామ సంబరాన్ని రంగరించుకున్నాను . తడితడి గాలులు మొగలి పూరేకులు నా చుట్టూ శ్వాసను నీ పరిమళం తో ముంచేశాయి. రాగాలు అల్లుకున్న నీ వొడి లో వొక రహస్య భాష తో ఆత్మ సౌందర్యపు శ్వాస తో నిండిపోవాలనుంది. కలల అంచున నాలో మునిగి పోయే నీకై ఇక నేను . కాలం: 13-9-2016 ------------------------------------47 ఒక జల ధార కోసం ..! - గవిడి శ్రీనివాస్ 08722784768 ఆకాశమంతా అల్లరిచేసి చినుకు మొలిస్తే మట్టిలోంచి మనిషి చివురిస్తాడు . చినుకు పూల కోసం ఆకాసమంత దోసిళ్ళు చాచుకుంటాడు . నీటి జల్లులు అవసరాలుగా వేలాడతాయి . ఒక తడి వేకువ కోసం విధ్వంసపు చూపులు రాలుతుంటాయి . ఎండకు నీరసించిన మొక్కలా నీటి ఆశలు వాడి పోతూ ఒక్కో ఆవేదన ఒక్కో గొంతై వినిపిస్తుంది . పెంచే మొక్కల్లో జలధార దాగివున్నట్లు రహస్యం బోధపడుతుంది . కాలం: 18-9-2016 ------------------------------- 48 ఒక ప్రవాహం లా ..! - గవిడి శ్రీనివాస్ 08722784768 నువ్వు నవ్వుతుంటే ఆకాశాన్ని ఎత్తి గుడిసెను బహూకరిస్తాను . నువ్వు కళ్ళు మిరుమిట్లు గొలుపుతుంటే నేను సీతాకోక చిలుకలా ఎగురుతూ ముచ్చ్చట గొలిపే నీ ముక్కు పై వాలతాను. నీవలా సగం చీరలో నడుస్తుంటే నేనలా దొర్లుతూ నీ దేహాన్ని వస్త్రమై కప్పేస్తాను . నీవలా నా హృదయం పై నర్తిస్తుంటే ఆ చుక్కలు వర్షం లా కురుస్తున్నాయి . నన్ను మునిగి పాడనీ ఈ ప్రేమ సంతకాన్ని ..! నన్ను మునిగి తేలనీ ఈ ప్రేమ ప్రవాహాన్నీ...! కాలం: 25-9-2016 ------------------------------------ 49 దళిత స్వరం - గవిడి శ్రీనివాస్ 08722784768 ఏముంటాయి కారణాలేముంటాయి కొన్ని అసహనాలు కొన్ని అహంకారాలు కొన్ని కన్నీళ్లు కొన్ని చిరిగిన క్షణాలు అలా విలవిలలాడుతుంటాయి . రంగులోంచి కులం మొలకెత్తినట్లు ఒకే చెట్టు కే కొన్ని కాసే రెక్కలే నరకబడుతున్నాయి . దళితుడైతేనేం స్వరం మనిషిదేగా మరి కొన్ని కళ్ళు వీక్షిస్తుంటే కొన్ని మానభంగాలు కొన్ని మారణహోమాలు కొన్ని తెగ్గోయటాలు అనాగరికంగా తొంగిచూస్తూనేవున్నాయి . ఒక రంగుని ఇంకో రంగు శిక్షిస్తున్నట్లు ఒక్కో చరిత్ర పుట బరువవుతోంది . శీలం ఎవరిదైనా ఒకటేగా శోకం ఎవరిదైనా బాధే గా క్షోభ పడ్డ క్షణాలు దళిత స్వరాలై దేశ నలుదిక్కులా పొగలుకక్కుతున్నాయి . కాలం: 02-10-2016 -----------------------------------50 ఒక నది వొడ్డున కూచునీ..! ఒక సాయంత్రం ఎగురుతున్న సమయాల్ని నది ఒడ్డున అలల తో ముంచేశాను. కాసేపు తుళ్లింత గులకరాళ్లు పాడుతున్నాయి . కాసేపు కన్నీళ్లు నదిలో పడవలై జారుతున్నాయి . ఒంటరి ఆనందం రెక్కలు చాచి కౌగిలించుకుంది . చల్లని గాలులు ఎగిరే పక్షులు నీట ముక్కలవుతున్న చందమామలు నన్ను ముంచుతున్నాయి . ఆకాశాన్ని గొడుగులా ఎక్కిపెట్టి నాలో కలల కూజితాన్ని వినిపించాను . ఆ సాయంత్రం జ్ఞాపకాలు చేపల్లా ఎగురుతున్నాయి . నాలో నిశ్శబ్ద ప్రవాహాలూ పొంగుతున్నాయి. కాలం:17-10 -2016 -----------------------------51 లోపలా -బయట - గవిడి శ్రీనివాస్ 08722784768 ఒక వైపు నిర్బందపు భావాల మధ్య అడవి రెక్కల మధ్య స్వేచ్ఛను లెక్కిస్తూ సిద్ధాంతాల్ని ఎత్తుకుని చూపులు తడబడినపుడు దేహాలు నెత్తురుని శ్వాసిస్తున్నాయి . లాక్కోవడం మొదలయ్యాక ఎరుపు జెండాలు మొలుస్తూనే వున్నాయి . బతుకు పుక్కిట్లో వెన్నెల పొడుపు కోసం పోరాటాలు ఉబుకుతున్నాయి . చీకటి పై పోరాటాలు పోలేదు అగ్గిరాజు కోవటం చెదిరిపోలేదు . కొన్ని శాసనాలు తలరాతల్ని మార్చడం లేదు . మరో వైపు పొంచివున్న శత్రుసైన్యం తూటాలా ఊగిసలాటలో సరిహద్దులు ఊగిపోవడం ఉలిక్కిపడటం కంటిముందే చెమ్మగిల్లే దృశ్యమవుతోంది . పటాలుగా వేలాడుతున్న వీరజవాన్లు గుండెల్ని తడుపుతున్నారు . లోపల దాడికీ బయట యుద్ధానికీ వీడని ముడి ఏదో గుండెను గుచ్చుతూనేవుంది . కాలం: 31-10-2016 ------------------------- 52 రూపాయి పోరాటం - గవిడి శ్రీనివాస్ 07019278368, 08722784768 రోజల్లా నడిచే ప్రయాణాన్ని ముక్కలు గా విరిచి కన్నీళ్లనే తొడగటం . అర్థరాత్రి నిర్ణయాల ముసుగుల్లో ముంచెత్తటాలు ఒక విధ్వంసపు ఆనవాలు. నల్ల కుబేరులెపుడూ రూపాయిని వివిధ రూపాలుగా తొడుక్కుంటారు . ఇప్పుడు విరిగిన సగం జీవితం సామాన్యుడి పైనో మధ్యతరగతి గానో విలవిలలాడుతూ ప్రాణాలు ఆఖరి శ్వాసగా విడవబడు తున్నాయి . పనులు గాల్లో కలిసి బారులు కట్టిన జనం బ్యాంకుల చుట్టూ యుద్ధం ప్రాణం గుప్పిట తల్లడిల్లుతూ ప్రణాళిక లేని పెద్ద వ్యవహారానికి బలౌతూ ప్రణమిల్లుతూ ఒక పరిష్కరానికి ఎదురు చూపులు పోరాడుతున్నాయి . కాలం: 27-11-2016 -------------------------- 53 వరిచేను కళ్లామ్ -వరికుప్పలు - గవిడి శ్రీనివాస్ 07019278368, 08722784768 నా పల్లె దోసిళ్ళలో కప్పుకున్న దుప్పటి ఈ శీతాకాలం . వరి బండిలా ఊగిన పంటచేను . మడిలో చేపల పై నడిసిన కొంగల చూపు . ఉరకలేసే ఎడ్ల బండి వెంట నేను రంకేలేస్తున్నాను. ఊబి మడిలోంచి కాలు బురదలా లేచింది . చెట్లను తరుముతూ పొలాలను నలుపుతూ కళ్ళాపు ఆరిన లోగిళ్ళలో వరి కళ్లామ్ చేరాను . వరి కుప్పలు కొద్దికొద్ది గా మాటాడుతున్నాయి . గాలి పటాలు కళ్ళు తిప్పుతున్నాయి . గాలిపోతలు మెరిసే కెరటాలవుతున్నాయి . పొల్లులుపోయి ధాన్యం రాశులు ముసిముసిగా నవ్వుతున్నాయి . కళ్ళల్లో కాంతులు పక్షుల్లా వాలుతున్నాయి పిచ్చుకలు నాలో గంతులేస్తున్నాయి . గాదెలో ధాన్యం కష్టం పువ్వులై విరుస్తున్నట్లు కళ్ళల్లో సంక్రాతి అనుభూతులు విచ్చుకున్నాయి . వాలే ఆకాశం కింద వరి చేను కళ్లామ్ వరి కుప్పలు నా వొడిలో అలా రెపరెపలాడుతూ సాయంకాలపు గాల్లో నన్ను మెత్త మెత్తగా ముంచుతున్నాయి . కాలం: 27-11-2016 ------------------------ 54 కాసిన్ని రాత్రులు - గవిడి శ్రీనివాస్ 07019278368, 08722784768 ఈ దేహమెంత అలసివుందో నా దోసిళ్ళలోకి రాలిన నీవు అనుభూతిలా సాక్షాత్కరించావు నీవు గుభాళించే పరిమళాలు నాకోసం ఆలోచించే క్షణాలవి నాకోసం వీచే రసభరిత గాలులువి నీలో నేను అలంకరించుకున్నాను నాలో నీవు నిండి తొణుకుతున్నావు సిగ్గు పై జారే చిరునవ్వులా పెదవుల పై మెరిసే గులాబి పూతలా నువ్వు తెల్లారి సూరీడు లా కాస్తంత వెచ్చగా పుష్పిస్తుంటే ఈ దేహమెంత సేదదీరిందో ఇన్నాళ్లు లేని ఊసులేవో ఉబుకుతున్నాయి . అంతరంగం మీద తూనీగలా వాలిన ఈ కాసిన్ని రాత్రుల్ని కొద్ది కొద్ది గా తాగుతున్నాను . నాలో నిన్ను కొద్ది కొద్దిగా రాల్చుకుంటున్నాను . కాలం: 10-12-2016 ------------------------------ 55 రైతు పర్వం ఎండని మోస్తున్న రైతు చెమట చుక్కల్ని పండిస్తూ చాలు చాలునా విచ్చుకున్న రైతు విత్తునుండి మొలక మెరిసేదాకా మొలకనుండి ఫలం ఊగే దాక వీచే గాలులు నడిచే ప్రవాహాలు లెక్కపెట్టిందే లేదు . దేహం ముక్కలుగా చిట్లుతున్నట్లు దళారీ రాబంధులూ ఎదురౌతున్నట్లు వ్యాపారులు అదును కోసం కొంగ నిద్ర నటిస్తున్నట్లు ఏదీ నిదుర పట్టనివ్వడం లేదు . ఆకాశం చేతిలో ఉరుముతున్నట్లు పిడుగులు బతుకుని అదుముతున్నట్లు పంట ఖర్చులు ఎగురుతున్నట్లు మౌనం గా రైతు కుదేలవుతుంటే సేద్యం చేసే పంటలన్నీ పూర్తి కాని కలలా మిగిలిన నేలపై రైతు . సగం బతుకు వలసపోతూ మోడుగా మిగిలిన రైతు . మట్టిలో కంది చెట్టులా పాతుకుపోయినా మిరప కారాలు తగులుతూనే వున్నాయి . జొన్నసేలు ఊపుతూనే వున్నాయి . పత్తి ఆశలు తేలుతూనే వున్నాయి . ధాన్యం రాశులు గా ఎగరకుండా ఒక నిలకడ కోసం నాల్గు దిక్కుల్ని నల్లని ఆకాశాన్ని భూమిని గుప్పెట్లో బంధిస్తున్నా రైతు పర్వం అడుగు అడుగునా కుదుపుతూనే వుంది . కాలం: 25-12-2016 --------------------------- 56 ఆమె నవ్వింది ..! హా ..! చెప్పు ఉన్నవీ లేనివీ అలలు అలలుగా తొణుకుతున్నవీ చెప్పు కాసేపు సమయాల్ని తాగుతూ ఏం చేస్తావ్ . నాలో ఊగుతూ నీ నవ్వుతో పక్షులు ఎగురుతూ కొంచం కొంచం గా ఏదో మత్తులోకి లాగుతూ చెప్పు ఏదో ఒకటి చెప్పు వెన్నెల స్నానాల్నీ శిశిరం లో రాలే ఆకుల్నీ గుంపులుగా ఎగిరే పక్షుల్నీ నీ లోకి జారే వయసు వసంతాల్నీ ఎన్నైనా చెప్పు . ఇప్పుడు ఆమె నవ్వింది అంతే నాలో ఆశలు పక్షుల్లా ఎగురుతున్నాయి . ఈ గూటిలో ఆమె చలి చలిగా మెరిసింది . కాలం తనివితీరా అలసిపోయింది . కాలం: 25-12-2016 --------------------------- 57 వలస స్వరం నా మట్టి పక్షులన్నీ వలస రెక్కలు కట్టుకున్నాయి నోరు తెరవని కాల్వలు కన్నీళ్ల తో భూముల్ని తడుపుతున్నాయి . గుండె బీళ్లు పగులుతున్నాయి. పరిశ్రమలు కాగితాల్లో కునుకుతున్నాయి . మనుషుల మధ్య దూరాలు విచ్చుకుంటూ ఆప్యాయతలు మునుగుతున్నాయి . ఆత్మీయ ఆలింగనాలు చెదురుతున్నాయి . కొద్ది సమయాలు నా ఊరి జ్ఞాపకాలుగా రాలుతున్నాయి . ఉత్తరాంధ్ర పల్లెలన్నీ వలసలతో ఊగుతున్నాయి . నాలో ఒక నిర్వేదం అగ్నిపర్వతం లా ఉబుకుతుంది . పల్లె స్వరాలు నాలో ఊగుతున్నాయి . వలస గొంతులు నాలో ఒక బాధ గా మోగుతున్నాయి . కాలం: 29-1-2017 ------------------------58 నీవింకిన ఈ దేహం లో ఇంతగా నాలోకి జ్ఞాపకాల జలపాతం లా దుమికి నాలో నీ విద్యుత్ రేఖల్ని మండిస్తావనుకోలేదు. ఎండిన తటాకం లోకి నీటి చెలమలా వచ్చావ్ . కొన్ని కబుర్లు కొన్ని చూపులు విసిరి ముంచేసావ్ . నీ రెక్కల మాటున చప్పుడు నేననీ తెలిసాక సంబర పడిపోయాను . కాలాన్ని భుజాలపై మోసుకుపోతూ ఋతువు ఋతువు కీ నా మీద వాలతావ్. ఏవో కోల్పోయిన అనుభూతులు తిరిగి వచ్చినట్లు మధనపడుతుంటాను . నీవు తామర మీద నీటిబిందువులా దొర్లి పోతుంటావ్ . నాలోకి ఉషస్సులు వచ్చిపోతుంటాయ్ నీవు ఊరటగా మిగిలి పోతుంటావ్ . అంతే కాస్తంత బాధగా నీవింకిన ఈదేహంలో కిటికీ చూపులు ఆశగా వెదుకుతుంటాయ్. కాలం: 5-2-2017 ---------------------------------- 59 ఒక గుప్పెడు రాత్రులు రాత్రులన్నీ సజావుగా నిద్రపోవు గుప్పెడు జ్ఞాపకాలు తట్టి మది కడలి కల్లోలితమవుతుంది . ఈ ప్రపంచీకరణ ప్రపంచం వైకుంఠ పాళీ అవుతుంది . కదిలే అడుగులలో వొణికిన సవ్వడులెన్ని. ముంచుతున్న పనివేళల మంచు తెరల వెనుక నలిగిన జీవికలెన్ని . మబ్బుల్ని ఢీకొట్టి మంటల్ని ఊపినట్లు ఊపిరి ఉక్కపోత తో బిగుసుకుంటుంది . ఆశంతా ఒక గుప్పెడు రాత్రులు ఎగసీ నిద్రపుచ్చేవి రెక్కలు కట్టుకు ఉగుతుంటాయనీ కలగంటూ...నేను ! కాలం: 19-2-2017 --------------------------------------60 నిదురోదామంటే ..! మబ్బుల మెట్ల మీద సందర్భాల్ని మోసుకు తిరిగే రాబంధులు . రాళ్ళ పగుళ్ల లో రక్తాలు పలుకుతుంటే జారిపడిన నిర్వాసితుడు . ఎటు వొత్తిగిలినా చీకటి కలలు ముంచుతుంటే పూయాల్సిన స్వప్నాలు రాలిపోతున్నాయి. కాలం సంచుల్ని వొంపి చూస్తే బలహీనుడు చతికలబడ్డ రూపాలు దొర్లుతుంటాయి . పచ్చని పొలాల్ని ఊదే చూపులు అవకాశవాద సామ్రాజ్య వాదులు చెమ్మగిలిన చూపుల మీద పిడుగుల్ని కురిపిస్తూ ఆయుష్షుని శాసిస్తున్నారు . నిదురోదామంటే పడుకున్న నేల కదులుతోంది . కుదురు జీవితం శూన్యా నికి వేలాడుతోంది . కాలం: 26-2-2017 ------------------------------------------61 సొంత ఊరు సొంత ఊర్లో కొద్దీ కొద్దీ గా తాగిన ఉదయాలు నల్గురు మనుషులు నవ్వుల విసన కర్రలు అమ్మ చాటు కబుర్లు నాన్న నడయాడిన దారులు తాత చాటు వేషాలు అమ్మమ్మ సర్దుబాట్లు జల్లెడ పట్టిన ఊసులు తిరగళ్ల లో ఇసిరిన మాటలు పండిన కనకాంబరాల పూతోటలు సాయంకాలపు చిన్ని గాలులు విరిసిన చోట ఉత్సవం జరిగినట్లుండేది . ఇప్పటికీ నాక్కావాల్సినవి అక్కడే ఉండిపోయాయి . ఈ మౌన ప్రపంచాన్ని వీడి కాస్తంత సేదదీరెదీ అక్కడే.. ! కాలం:12-3-2017 ---------------------------62 సొంత ఊరు సొంత ఊర్లో కొద్దీ కొద్దీ గా తాగిన ఉదయాలు నల్గురు మనుషులు నవ్వుల విసన కర్రలు అమ్మ చాటు కబుర్లు నాన్న నడయాడిన దారులు తాత చాటు వేషాలు అమ్మమ్మ సర్దుబాట్లు జల్లెడ పట్టిన ఊసులు తిరగళ్ల లో ఇసిరిన మాటలు పండిన కనకాంబరాల పూతోటలు సాయంకాలపు చిన్ని గాలులు విరిసిన చోట ఉత్సవం జరిగినట్లుండేది . ఇప్పటికీ నాక్కావాల్సినవి అక్కడే ఉండిపోయాయి . ఈ మౌన ప్రపంచాన్ని వీడి కాస్తంత సేదదీరెదీ అక్కడే.. ! కాలం: 26-3-2017 ------------------------------63 యాత్ర ఒక ప్రవాహం మొదలు పెట్టడానికి సంకల్పం అంకురిస్తే చాలు నిబిడ నిశ్చల ఆశ్చర్య మనో రధాలు ఉరకలేస్తాయి. గుంకే సంధ్య కు వెన్నెల పులిమినట్లు తగిలిన గాయాలికి అనుభవాల కత్తులు పదునెక్కుతాయి. కాలం రూపుకట్టే ప్రయత్నాల వెంట అవిశ్రాంత శ్రమ దృశ్య మాలికలు కదులుతుంటాయి . చుక్కల్ని దోసిట్లోకి దూసి చిరు నవ్వుల్ని వెలిగించుకున్నాక ఆనందపు మేఘాలు కురుస్తుంటాయి . ఉటంకించని భావాలు కుదుపుతూ మరో అధ్యాయానికి తెరలేపుతుంటాయి . దారిపొడుగునా పునాదిరాళ్ళు పాదముద్రలు కదలిక చెప్పిన కొత్త అనుభవాలు అలరారే వెన్నెల రాత్రుల కోసం నిర్ణిద్రావస్థలోని ఆశయాల్ని మేల్కొలిపి సుదూర ప్రయాణాలు అలల పరిచయాలు యాత్రా జీవితం లో ఒక ప్రవాహం లా ఒక పరిమళ భవితమై విజృంభించిన నిస్సంకోచ విజయ దరహాసమవుతుంది. కాలం: 2-4-2016 --------------------------------------64 మిర్చి మంటల్లో రైతు - గవిడి శ్రీనివాస్ 07019278368, 9966550601 మట్టిని నమ్ముకుని కాసింత బతుకుని మిరప నారు గా వుడుసుకొని రైతు మనసు రెపరెపలాడుతుంది . పంటంటే అప్పటిలా కాదు ఎటుచూసినా మదుపులే . నీరు కడుతున్నపుడు గాబు ఎగురుతున్నపుడు మందులు పులుముతున్నపుడు మిరపకాయలు కోస్తున్నపుడు ఇంకా ఆఖరికి గుడాంకి చేర్చే దాకా అన్నీ ఖర్చులే . ఇపుడు మొదలవుతుంది కారం తిన్న గుండెల్లోంచి కన్నీటిసెగ . గిట్టుబాటు ధరలేక ఆవేశం మిర్చి మంటల్లోంచి మండుతుంది . ఆ క్షణం భాద్యులెవరో కళ్ళు విప్పుకుని జాలి చూపులు విసురుతుంటారు . మట్టి బిడ్డలు మంటల్లో దహనమవుతుంటారు . కాలం: 9-4-2017 --------------------------------65 అలా కనురెప్పల పై - గవిడి శ్రీనివాస్ 07019278368, 9966550601 పొద్దస్తమానం నలిగిన పనుల మీద అలసిన దేహం . కళ్ళు మూసుకుని వాలు కుర్చీ లో వాలిపోతానా ! కను రెప్పల పై అలా ఎగురుతావ్. కాస్తంత మురిపెం నీ చేతుల్లో దొరుకుతుంది . పూలతో తేనె అద్దినట్లు తెలియని చల్లదనం పరిచయమవుతుంది . కళ్ళు మూసి ఎవరో చెప్పమంటే ఏమని చెప్పనూ నా అంతరాల్లో పెనవేసుకున్న పరిమళ పూల తోట నువ్వు ! కాలం: 9-4-2017 -------------------------------------------66 నువ్ ప్రేమిస్తున్నావా ! - గవిడి శ్రీనివాస్ 07019278368, 9966550601 అలా ఉరిమే జలపాతం లా అక్షరాల మల్లెల్ని ఒంపి పోతుంటే తడిసి తడితడి గా చలి చలి గా మంట కాగినోడ్ని . విశాలమైన చూపుల్ని వెలిగించి శూన్యం మీద ఆశలు మొలిపించావ్ . కన్నీళ్లను తుడిచే మనసుల పెనవేతలు లోలోపల తడుముతున్నాయ్. నిప్పులు కురిసే నీ మాటల మాటున ఒకింత ప్రేమ దాగుందనీ ఎర్రెర్రని పెదాల్లో పదాల్ని నిరంతరంగా జుర్రుతూ ఈ క్షణం గడిచిపోనీ ! వదిలి వెళ్లిన ప్రతి సారీ నా లోంచి తీయని జ్ఞాపకాల్ని మోసుకు పోతుంటావ్ . నీ అమూల్య పద అమృత వర్షమ్ లో నిత్యం తడిసే నాకు పద కౌగిల్లో అమాంతంగా దూసుకొచ్చిన కత్తులకు నెత్తురోడిన కవితలు గా రాలుతుంటాను . నువ్ ప్రేమిస్తున్నావో ద్వేషిస్తున్నావో అర్థం కాని అక్షరాల మైకం లో నీ చుట్టూ ఒకింత రాలిన నేను ------------------------------- కాలం: 16-4-2017 ---------------------------------67 రాలుతున్న పసుపు - గవిడి శ్రీనివాస్ 07019278368, 9966550601 ఊహల లోగిల్లో ఎదుగుతున్న యవ్వనాన్ని పసుపు వర్ణం గా ఆరబోయటం చూశాం. జీవిత సందర్భాల్ని పసుపు తో ముడిపడటాన్ని పలకరించాం. పసుపు మొక్కలు అందం గా ఎదుగుతుంటే ఆకాశం లోని హరివిల్లుల్ని రాల్చుకున్నాం . నీరు పోసినప్పుడు మదుపులు తెచ్చినప్పుడు ఆఖరుకి గిడ్డంగులకి పసుపు చేరేదాకా స్వప్నాల్ని ఎగరేసుకున్నాం . ఇక్కడ ధర లేదు ఉడికి పోతున్న పసుపు రైతుల బతుకులు గుంపుకట్టే దళారీ రాజకీయాలు చెమట చుక్కల్ని తాగుతున్నాయి . పండాల్సిన పసుపు ముఖాలు బతుకెండిన బాధల్లో పసుపుని రాల్చుకుంటున్నాయి . కాలం; 23-4-2017 ---------------------------------67 రాలుతున్న పసుపు - గవిడి శ్రీనివాస్ 07019278368, 9966550601 ఊహల లోగిల్లో ఎదుగుతున్న యవ్వనాన్ని పసుపు వర్ణం గా ఆరబోయటం చూశాం. జీవిత సందర్భాల్ని పసుపు తో ముడిపడటాన్ని పలకరించాం. పసుపు మొక్కలు అందం గా ఎదుగుతుంటే ఆకాశం లోని హరివిల్లుల్ని రాల్చుకున్నాం . నీరు పోసినప్పుడు మదుపులు తెచ్చినప్పుడు ఆఖరుకి గిడ్డంగులకి పసుపు చేరేదాకా స్వప్నాల్ని ఎగరేసుకున్నాం . ఇక్కడ ధర లేదు ఉడికి పోతున్న పసుపు రైతుల బతుకులు గుంపుకట్టే దళారీ రాజకీయాలు చెమట చుక్కల్ని తాగుతున్నాయి . పండాల్సిన పసుపు ముఖాలు బతుకెండిన బాధల్లో పసుపుని రాల్చుకుంటున్నాయి . ------------------------------------68 ఇక అమ్మ ను చూడాలనుంది - గవిడి శ్రీనివాస్ 07019278368, 9966550601 గొంతు పెగలని మాటల తో నిద్రపట్టని రాత్రుల్ని దగ్గుతో కలవరిస్తూ నాయనా కాస్తంత ఎక్సరే తీయాలన్నపుడు అందుబాటు లేనితనం కన్నీళ్లను ఒంపింది. ఎన్ని మాట్లాడినా పేగుబంధం గొంతు సన్నబడేసరికి ఉన్నపళంగా ఉరికేయాలనుంటుంది . కొన్ని సర్దుబాట్లు కొన్ని ఏర్పాట్లు కాలం రెక్కలకి తగిలించి ఎగిరి పోవాలనుంటుంది . క్షణాల్ని లెక్కిస్తూ ఏదో కోల్పోయినట్లు ఇంకాస్త కాలం జరిగినపుడు దగ్గరవుతున్నట్లు ఉంటుంది . అమ్మకు నీరసంటే కాసేపు పనుల్ని పక్కకునెట్టి ఇక అమ్మను చూడాలనుంటుంది . పేగు తడి బంధానికి కాస్తంత దీనంగా కాస్తంత ఆశగా చూపులు పరుగెడుతూనేవున్నాయి . కాలం:23-4-2017 ------------------------------------69 నివేదన - గవిడి శ్రీనివాస్ 07019278368, 9966550601 సంక్షిప్త సమాచారం లోంచి అక్షరం లా వెలిగిపోతావ్ . తొలి కిరణం పూస్తున్నపుడు కొబ్బరి ఆకుల జడలల్లుకుంటావ్ . సంధ్య లోని స్వప్నాల్ని వేకువ గడియారం లోంచి కూర్చుకుంటావ్ . చలి కొరుకుతుంటే దుప్పటిలా చుట్టుకుంటావ్ . అలా నీ కురుల అరలలోంచి జారే సన్నని నీటి ప్రవాహాల వెంట నే జారుతుంటాను. దేవుడి గుడి లో సూర్యుడ్ని వెలిగిస్తూ హారతి రూపం లో ఆప్యాతను అనుగ్రహిస్తావ్. నీ చూపుల వర్షం లో రాలిన హరివిల్లులు ఈదిన చేప పిల్లలు నాలో సందడి చేస్తున్నాయి . నీ చేతి స్పర్శలో వసంతం చిగురిస్తుంది . కొద్దికొద్ది గా వొలికిన నీ చిరు నవ్వు తో నాలో శరదృతువు వెన్నెల కాస్తుంది . గ్రీష్మపు మంటల్లేవ్ తడారిన పెదవుల పై నువ్ చుంబిస్తుంటే . కాస్తంత మురిపాన్ని కొంగు లో దాచి నక్షత్రాల్ని బంతులు చేసి నాతో ఆడుతుంటే అలసిన దేహానికి వేకువ రెక్కలు తొడిగినట్లుంటుంది . నేను ఎండను మోస్తున్నా చలిని కాగుతున్నా వర్షాన్ని ఎక్కుపెడుతున్నా క్షణాలన్నీ నీ అనుభూతుల నివేదనగా మిగిలిపోతున్నాయ్. కాలం: 13-5-2017 --------------------------------------70 నివేదన - గవిడి శ్రీనివాస్ 07019278368, 9966550601 సంక్షిప్త సమాచారం లోంచి అక్షరం లా వెలిగిపోతావ్ . తొలి కిరణం పూస్తున్నపుడు కొబ్బరి ఆకుల జడలల్లుకుంటావ్ . సంధ్య లోని స్వప్నాల్ని వేకువ గడియారం లోంచి కూర్చుకుంటావ్ . చలి కొరుకుతుంటే దుప్పటిలా చుట్టుకుంటావ్ . అలా నీ కురుల అరలలోంచి జారే సన్నని నీటి ప్రవాహాల వెంట నే జారుతుంటాను. దేవుడి గుడి లో సూర్యుడ్ని వెలిగిస్తూ హారతి రూపం లో ఆప్యాతను అనుగ్రహిస్తావ్. నీ చూపుల వర్షం లో రాలిన హరివిల్లులు ఈదిన చేప పిల్లలు నాలో సందడి చేస్తున్నాయి . నీ చేతి స్పర్శలో వసంతం చిగురిస్తుంది . కొద్దికొద్ది గా వొలికిన నీ చిరు నవ్వు తో నాలో శరదృతువు వెన్నెల కాస్తుంది . గ్రీష్మపు మంటల్లేవ్ తడారిన పెదవుల పై నువ్ చుంబిస్తుంటే . కాస్తంత మురిపాన్ని కొంగు లో దాచి నక్షత్రాల్ని బంతులు చేసి నాతో ఆడుతుంటే అలసిన దేహానికి వేకువ రెక్కలు తొడిగినట్లుంటుంది . నేను ఎండను మోస్తున్నా చలిని కాగుతున్నా వర్షాన్ని ఎక్కుపెడుతున్నా క్షణాలన్నీ నీ అనుభూతుల నివేదనగా మిగిలిపోతున్నాయ్. కాలం:11-6-2017 ------------------------------------------------71 ఆకర్షణ - గవిడి శ్రీనివాస్ 07019278368, 9966550601 మౌనం పందిరిలో తీగల్లా అల్లుకున్నాం . నీవు పరిమళిస్తావ్ నేను ఆస్వాదిస్తాను . నీవు చందమామలా ఊగుతుంటావు . నేను కలువ రేకుల్లా విచ్చుకుంటాను . చూసే బంధం లోని ఆకర్షణ ఒకింత సిగ్గుబడుతుంది . కాలం: 11-6-2017 -----------------------72 విడువని హృదయాలు - గవిడి శ్రీనివాస్ 07019278368, 9966550601 ఆ మలుపు దగ్గర కాస్తంత వొలికి నీ కోసం తొంగి చూస్తానా ! సన్నని సీతాకోక చిలుక చూపులు సరస్సుల్ని ఒంపుతుంటాయి . గలగలా ముస్తాబై అందెల సవ్వడి విందు లో చినుకు పువ్వుల్ని పెట్టుకుని నాలో తడిసి ముద్దవుతుంటావు . రాగాల గాలుల్లో నడకలు సర్దుకుని హొయలు ఎత్తుకుని చూపుల్ని ఏరులా పారిస్తావు . ఈ చిట్టి గుండె తట్టుకోగలదా చూపుల్ని లేడిపిల్ల లా ఎగరేసి భూమ్మీద ఆకాశం లో మబ్బుల అడుగులు తేలుతుంటాయి . ఒక్క సారీ రెండు మేఘాలు ఢీకొన్నట్లు మెరుపులు కుదుపుతున్నట్లు నదులు సంద్రాలు బిగుసుకున్నట్లు తీరం అలలతో తడిసి ముద్దవుతున్నట్లు కోర్కెల నావ ఊగుతున్నట్లు అలజడుల గాలుల్లో విడువని హృదయాలు ముడిపడుతూ అలా చినుకుల్ని కొద్ది కొద్ది గా రాల్చుకుంటున్నాయి ! కాలం: 25-6-2017 ------------------------------73 నడక - గవిడి శ్రీనివాస్ 07019278368, 9966550601 నడక దూరాల్ని చెంక లో పెట్టుకుని మోస్తది రాతిరుందా ! పగలుందా !! నడవాలని నిర్ణయమే చొరబడాలి గానీ నదులు దాటి సంద్రాలు దాటి ఆకాశ తీరాల వెంబడి కాలం మునకలేస్తుంది . చూసే లోకాన్ని చూడని లోపలి సంద్రాల్ని విస్తరించి చూపే సాధనమే నడక. దున్నుకునే రైతుని చూపిస్తది యంత్రాల్ని ఎత్తుకునే కార్మికుని చూపిస్తది . పని పిల్ల శ్రమలోని వెలుగుని చూపిస్తది నడక వికసించే కొద్దీ పరిధి హద్దులు చెరిపి రుతువులు పూసుకున్న రంగుల హరివిల్లుల్ని చూపిస్తది . ప్రాంతాలు దాటే కొద్దీ విశ్రాంత సమయాల్ని వొదిలి కొన్ని దుఃఖాల్ని కొన్ని అతీత సుందర దృశ్యాల్ని నడక ఒంపుతూ చూపిస్తది . కాలం:25-6-2017 ----------------------------74 కాసేపు ఇలా ఉండనీ ! - గవిడి శ్రీనివాస్ 07019278368, 9966550601 కాసేపు నన్నిలా ఉండనీ లోలోపల చలానాలు నాలో విరిగిపోతున్న అలలు ముక్కలవుతున్న క్షణాలు ఏవీ ఒంపుకోలేను ఏవీ ఇమిడ్చుకోలేను దుఃఖం చెక్కిన శిల్పంలా నేను! నాలో ఇంకిపోతూ నేను కారణాలు లేని బాధలుంటాయా బాధలవెంట మనిషిని తరుముతుంటాయా కొన్ని మనసుని అలలా లేచి ఊపుతాయంతే కన్నీటి వెంట పయనం పయనం వెంట ఓదార్పు మనిషిని నిలబెడతాయంతే నా కోసం నాలో మనిషి కోసం రెండు చూపులు గా నీవుంటే నీ దోసిళ్ళ లో వెలిగిన నేను కాసేపు ఇలా ఉండనీ ! కరిగే కాలాన్ని వెలగనీ !! కాలం: 22-7-2017 --------------------------------75 కొన్ని మత్తు జీవితాలు - గవిడి శ్రీనివాస్ 07338053650, 9966550601 కొందరిని ప్రశ్నించాను ఆనందం ఎలా జాలువారుతుందనీ కొన్ని సమాధానాలు సృజనాత్మకంగా ఉన్నాయి . కొన్ని మత్తులో తూలిపోతున్నాయి. ఒంటరి మనిషి సమాధానపర్చుకోలేక ఓదార్చే హృదయలికి చేరువకాక ఆలా మత్తులో నిద్రిస్తాయంతే ! విచ్చిన్నజీవితాలు అన్ని వైపులా గోలపెడతాయంతే ! నిషా కళ్ళలో రంగుల విన్యాసాలు గంతులు వేస్తుంటాయి . బాధ్యతల్ని చిదిమేవి రోడ్లపై తూగేవి ఇళ్లలో మత్తులా పారేవి రకరకాలుగా దర్శనమిస్తుంటాయి . అనుభవించలేని క్షణాలు హృదయాల్ని కలవరపెట్టినపుడు చేరువ కావాల్సినవి దుఃఖ సెలయేళ్ళు గా పారుతున్నపుడు మత్తు జీవితాలు గా జీవికలు తగలబడుతుంటాయి . కాలం: 30-7-207 ------------------------------------76 వర్షం లా నీవు ! - గవిడి శ్రీనివాస్ 07338053650, 9966550601 తొలకరి మెరుపుల మధ్య వొక స్వప్నపు తీగలా వచ్చావ్ . చల్లని గాలేదో నీలా చలిచలిగా వీస్తుంటే నాపై మొగ్గల్లా వాలే చినుకులు నీలా లోలోపలికి అల్లుకున్నాయి . వొక తెలియని మలుపులా వొక తామర నీటి బిందువులా నా పై జారిపోయావ్ . గరికిపూసను చందమామ సందర్శించినట్లుంది . తూనీగలు నాపై వాలి రంగులు అద్దుతున్నట్లుంది . చల్లగా నేలను తాకే నీపాదాలు ఈ గుండెలో మోగే నీ అందెలు చూపుల్లో కురిసే లేలేత ఆశలు నాలో అలజడి రేపుతున్నాయి . ఈ రోజంతా నీ వసంత పరిమళం నాలో విరజిమ్ముతుంది . నీవలా రెపరెపలాడుతూ దేహాన్ని ఇంద్రధనస్సులా మార్చేస్తావ్ . వర్షం లా నీవు పులకరించిన చెట్టులా నేను కురవటం నీ వంతు తడవటం నా వంతు కాస్త ఈ జన్మంతా ఇలా తడవనీ..! కాలం: 30-7-2017 --------------------------------77 ఇల్లు కొన్ని దృశ్యాలు - గవిడి శ్రీనివాస్ 07338053650, 9966550601 నా చేతి వేళ్ళు పట్టుకున్న ఉదయం లా నవ్వుతూ కాస్తంత ముందుకి ఇల్లు పిల్లాడి అల్లరితో ఊగుతుంది . తెరచిన కిటికీ అరల్లోంచి చేతులు చాచుకు ఎగిరే గాలికి గోడకి వేళ్ళాడే క్యాలెండర్లు ఎగిరి ఎగిరి నవ్వుకుంటున్నాయి. మూసిన హృదయాల్ని తెరిచే తలుపులు కొద్ది కొద్ది గా వీధి దృశ్యాల్ని కూరగాయల బండి గానో నడిచి పోయే బాధ్యత గానో ఒంపుతున్నాయి. సందర్శించిన ప్రదేశాలు మాట పంచుకున్న అనుభవాలు నాల్గు గోడల మధ్య జ్ఞాపకాల ఆకుల్లా రాలుతున్నాయి. ఒక మునిలా ధ్యానిస్తుంటే ఆత్మ దర్శనం లో జ్ఞాన సంద్రాలు ముంచుతున్నాయి . ఆరబోసిన ఆకాశం కింద పిల్లాడు బొంగరం లా తిరుగుతుంటే చుక్కల ఆకాశం చొక్కాలో మెరుస్తోంది . ఆరుబయట చినుకులు బుగ్గల్ని గిల్లుతూ ముత్యాల్ని అద్దుతూ తూనీగల్ని పైపై ఊపుతూ మనోరథాన్ని మహిమాన్వితం చేస్తున్నాయి . మౌన ప్రపంచాన్ని ముక్కలు చేసి మాటల లోగిళ్ళు ముసిముసి నవ్వులై కుదుపుతున్నాయి . ఉదయానికి సంధ్య కి మధ్య చెరగని మధురానుభూతి లా . కాలం:15-8-2015 -------------------------78 ఏంది మామ ! - గవిడి శ్రీనివాస్ 07338053650, 9966550601 ఏంది మామ ఏడున్నవేంది పొద్దుగుంకేదాకా పెళ్ళాం పిల్లల యేదలేదా ఏంది ! కళ్ళారేసుకుని సూపులు వాసిపోతున్నాయి. సుక్కలు దూరే యేలదాకా ఏంది మామ ఆ పని ఒక ముద్దూ నేదు ఒక ముచ్చటా నేదు పొద్దత్తమానం పనియాదేనా సినుకు సిటుక్కుమంతే సెంత సేరిపోనా కూస్తంత యెచ్చగా రాతిరిని జుర్రుకోమా ఏందీ మామ ! ఏమోనో మామ ఈ మజ్జ బొత్తిగా పేమ తగ్గిపోనాది సూసే కళ్ళ కి ఏడుపే వాటమైనాది అడవి కాసిన ఎన్నెలైనాది బతుకు పోల్నే మామ పోయింది ఎలాగూ తేనేము నువ్వొ త్తావనీ కాటుక కళ్ళు మెరుత్తున్నాయి బుగ్గచుక్క ఎతుకుతాంది సన్నజాజి గుప్పుమంది సేతి గాజులు అల్లరవుతున్నాయి. కాలి బొటన వేలు ముగ్గు లేత్తాంది ఏందీ మామ నువ్వు నువ్వు ఏం సేత్తావో తెల్దు కాసేపటికి నా పక్క ఎలుగుతుండాలా సందె పొద్దు దివిటీ మల్లె ! కాలం :27-8-2017 ----------------------------------------79 రెప్పల వాకిట్లో ..! - గవిడి శ్రీనివాస్ 07338053650, 9966550601 అంతలా గుప్పుమంటావనుకోలేదు . మౌనాన్ని తోరణాలుగా అలంకరించి మల్లెలు మాట్లాడుతున్నట్లు ఒక నీవు . గాజు అద్దం మీద మంచు సంతకం లా ఒక నీవు . దృశ్యా అదృశ్య తెరలుగా ఒక నీవు . ఆ కాసేపు నీ వొడి లో శ్వాసించిన క్షణాల్ని బంధించిన జ్ఞాపకాల్ని నీవు లేనపుడు ఒంటరిగా చేసుకుంటాను . తగలబడుతున్న అంతరంగాల్ని ఒక జలపాతపు జల్లులా తడిపి పోతావు . గాయాలు పూసుకున్న హృదయానికి కాస్తంత చందనం చల్లిపోతావు . నీవెప్పుడూ అంతే చిగురుటాకు లా వీస్తావు వెన్నెల చినుకుల్ని కురిసిపోతావు . నేనెప్పుడూ రెప్పల వాకిట్లో నీ కోసం ఎదురు చూస్తుంటాను . నీ వొచ్చి వెళ్లిన ప్రతిసారీ కూలబడుతుంటాను . నీవు గుర్తొచ్చిన ప్రతిసారి చిగురిస్తుంటాను . కాలం రంగుల్ని కత్తిరించలేక దిగులుగా నీకై ఒక నేను ! కాలం :3-9-2017 ----------------------------------80 నేనూ నా వరిపొలం - గవిడి శ్రీనివాస్ 07338053650, 9966550601 చినుకు రువ్వితే మడి సెక్కలా తడిసి ముద్దయిపోతుంటాను . ఒంటినిండా బురద పూసుకుని వరి నారు మడిలో కట్టలుగా తేలుతుంటాను . పీల్చే గాలిలో మట్టివాసన రేపటి స్వప్నాలకి ఊపిరిలూదుతుంది. బురదలో అడుగు మునిగి తేలిన ప్రతిసారీ దుఃఖాన్ని ముక్కలు చేసుకుని సుఖం తేలినట్లు సుఖాన్ని అణచిపెట్టి దుఃఖం రాలుతున్నట్లు అలా జీవిత చక్రం తిరుగుతుంది . పైపైన చినుకులు కురుస్తుంటాయి నన్ను అంటకాగిన బురదని జార్చుకుని తేలికై పోతాను. ఒక్కో అడుగులో ఒక్కో వరికట్ట గూడులా కూచుంటుంది . ఊగే పైరు సెలయేరులా సాగుతుంటే ఉన్నఫళంగా ప్రాణం కొత్త ఊపిరి ఊదుకుంటుంది. నేనూ గట్టు పైన బండరాయి పై అలా చూస్తూ మెరిసిపోతాను . పైరు పిలుస్తున్నట్లు ఊరు మురిసిపోతున్నట్లు ఆ ఆనందం లో నా లోని ప్రపంచం చుట్టూ పరిభ్రమిస్తాను . నా వరి పొలం నాలో నిండిపోతుంది . కాలం :17-9-2017 --------------------------------81 ఒత్తిడి ఉక్కపోత - గవిడి శ్రీనివాస్ 07338053650, 9966550601 నా దేహం లో దహించబడుతున్న ఆంక్షల జ్వాలల్ని నీకు ఒంపి చూపలేను . ఖండితమౌతున్న ఉద్విగ్న దుఃఖ సమయాల్ని వెలుగెత్తి చాటలేను . స్వప్నాల మాటున సంకెళ్లు బిగుస్తున్నాయ్. నాలో నన్ను చూద్దామని బయలుదేరా ముక్కలవుతున్న నమ్మకాన్ని సర్దుకుపోతున్న దేహాన్ని కాస్తంత హెచ్చరించా ! ఇప్పుడు పునర్మించు కోవాల్సిన కాలం లో సాగిల పడుతున్నందుకే ! అలసట దేహానికే యుద్ధభేరి మోగించే భావాలకి కాదు . విచ్చుకుంటున్న పూల మధ్య ముల్లులా గుచ్చుకునే ఒక దిగులు . వాయువేగాలు తగలబడుతున్న జనారణ్యాలు సమయంలేని పొడి క్షణాలు బాధను రంగరిస్తూనే వున్నాయి . మనసు బతకాల్సిన చోట ఒత్తిడి ఉక్కపోత రాజుకుంటోంది . దిగులు దిండులో ఒత్తిగిల్లటం తప్పా వెన్నెల సరోవరాల్ని పరచే ఇల్లు వాకిలి పిల్ల కాలువలు ఇప్పుడు ఏవీ గుర్తుకు రావటం లేదు . కాలం :13 -10-2017 ----------------------------82 ఒకింత మేఘం - గవిడి శ్రీనివాస్ 07019278368, 9966550601 చూపుల్ని దీపాల్లా వెలిగిస్తూ చంటి పిల్ల మాదిరి మారం చేస్తుంది . ఒకింత మేఘం అలసిన దేహం తో చినుకు చినుకు గా వాలుతుంది భూమి తనువు మరిచి తడి తడి గా ముద్దయి పోతుంది . కల్మషాలు తడి దేహాల వెంట అలా విడవబడతాయి . మేఘం రూపం మారింది మనసు ఊహ కొత్త లోకాన్ని చూపింది . ఈ ఒకింత మేఘం కాలాన్ని ఎన్ని ముఖాలు గా లిఖించుకుందో ! మరెన్ని గొంతుల్ని సవరించుకుందో ! ఋతువుల్ని గంధం లా రంగరించుకుని ఎంత పులకరించిందో ఒకింత మేఘం నీటి చలనాల్ని మనిషి గమనాల్ని ఉపరితల దారుల్నీ మార్చేస్తూనేవుంది . ఒకింత మనిషి ప్రపంచ గమనాల్ని కాసింత కాలం నిర్దేశించలేడా ! కాలం: 25-11-2017 -------------------------------------------83 కాస్సేపు దుఃఖాన్ని అలా విసిరి - గవిడి శ్రీనివాస్ 07019278368, 9966550601 నాదనుకున్న నీతనం లోంచి ఎపుడు బయటపడ్డానో సరిగ్గా తెలియరాలేదు కానీ .. ఒకింత నీ కోసం నెమ్మదిగా నెమ్మదిగా తెరచిన కిటికీలు మల్లె తీగల్లా నీ చుట్టూ అల్లుకునే బంధాలు నీ కోసం అలసి ఆరాటపడే క్షణాలు నాలో నీవు సగమవ్వాలన్న ప్రార్థనలు మంచు తెరలవెంట ముత్యాల్లా హత్తుకుంటూ దొర్లేవి . చుట్టూ పక్షుల్లా మనం వేలాడినా ఎక్కడో ఒక పొసగనితనం ఒక అమాయకత్వం ఒక తెలియని ఆరాధన చిగురుటాకుల్లా వొణికిపోయాయి . నీ వెన్నెల ఎడారి వెంట నీ కోసం ఒక నీడలా ఒక నేను నీవు కురియ లేదు నేను మరువ లేదు అలా చీకట్లే రాలిపోయాయి దుఖ్ఖపడ్డ కాలాలే పేలిపోయాయి ఒక సుఖానికి ఒక దుఃఖానికి నిలువుటద్దంలా నిలిచిన ఒక నేను . ఆరాధకుడిగా కాస్సేపు దుఃఖాన్ని అలా విసిరి నిన్ను నాలో స్నానించుకుంటాను . ఈ కాసేపు సుఖాన్ని వెన్నెల సమీరం లో తైల వర్ణ చిత్రంగా చిత్రించుకుంటాను . కాలం: 3-12-2017 -----------------------------------84 రెక్కలూపే ధరలు - గవిడి శ్రీనివాస్ 07019278368, 9966550601 ఇక్కడ మౌనాన్ని రాపాడుతున్న బతుకుల్లో కుండ పోతగా రాలుతున్న ఎండలు పొగలు కక్కుతున్న ఆవేశపు ధరలు సామాన్యుడి బతుకుల్లోకి శూలాల్ని విసురుతున్నాయి . ఇక్కడ జీవితం మునగదూ తేలదు మూలాల్ని ముడిపెట్టుకుని ఆశ ని కాలం కనుబొమల పై నెట్టుకుంటాం . రోజులు బోర్లా పడుతుంటాయి అలవికాని సందర్భాలు మునుగుతుంటాయి . అందలం ఎక్కేవాడికి గుడిసెల గోల కానరాదు . మబ్బులు మడిసే వాడికి హద్దులు చెరిపే వాడికి అర్దాకలి గోసలు అర్థం కావు . శున్యానికి రెక్కలు చాపి తపోదీక్షతో ధరల్ని దిగమని శరణు వేడడమే శరణ్య మౌతోంది . ఇక్కడ పై చూపులు నేల మీద వాలాలి కాగిన బతుకుల్లో కూసింత భరోసా నిలపాలి! . కాలం: 16-12-2023 -----------------------------------------85 తోడు - గవిడి శ్రీనివాస్ 07019278368, 9966550601 ప్రయాణాలు కొన్ని సార్లు ఒంటరిగానే తలుపులు తెరుచుకుంటాయి . కాలం కొన్ని చీకటి రాత్రుల్ని మోస్తుంది . విసిగిన చోట నక్షత్రాల్ని బంతిలా కుట్టి కాసింత వెలుగుని రాజుకుంటే బాగుణ్ణు దారిపొడుగునా రుతువులు పరిచయాలుగా పూస్తే బాగుణ్ణు ఊపిరి ఊగిసలాట ముంగిట నిలిచే ఆరాటమైతే బాగుణ్ణు కురిసే నక్షత్రాలు అలసిన సంద్రాలు జీవితానికి ముడిపడుతుంటాయి . పసిడి వెన్నెల ముద్దలు ముద్దలుగా మబ్బుల నుంచీ జారినపుడు కాళ్ళ ముందు ముచ్చట తోరణాల్ని తొడిగినపుడు నిలువునా దేహం కొత్త అనుభూతుల్ని తోడుగా నిలుపుకుంటుంది . అలసిన దేహానికి తోడు భరోసాగా నిలుస్తుంది . కాలం: 7-1-2018 ----------------------------86 సంధి కాలం - గవిడి శ్రీనివాస్ 07019278368, 9966550601 ఇన్నేళ్లు ఇన్ని రోజులు గడిసి పోయాక కాసేపు నాలోకి అవలోకించుకుంటాను . కొన్ని జ్ఞాపకాలు అలా తడుముతుంటాయి . నా ఊరు నా వాకిలి నా చుట్టూ నడిసిన పరిసరాలు కళ్ళ ముందు పక్షుల్లా వాలతాయి. నేను మొక్కను చూస్తూ మొలిచాను పూవును చూస్తూ పరిమళించాను మట్టిని తాకుతూ దేహమే అనుకున్నాను . ఊరూ మారింది జీవన సరళీ కొత్తగుంది గుడిసెలు ముడుచుకున్నాయి మార్పు సహజమే మారనిదల్లా కాసింత ప్రేమ కోరుకునే మనసు మాత్రమే ఆప్యాయంగా పలకరించే నా పొరుగు వాళ్ళు వారి మాటలు తడిపి పోతుంటాయి . ఇన్ని జ్ఞాపకాల తర్వాత ఇవి గుర్తొచ్చిన సంధి కాలం నాలో నేను ఒక తీపి అనుభూతిగా మిగిలిపోతాను . కాలం: 28-1-2018 -------------------------------------------------87 స్వీకరించవూ - గవిడి శ్రీనివాస్ నాలో కదిలే అలలా నాలో మెదిలే కోలాటం లా నాలో విరిసే తొలి కిరణమయ్యావు నాలో పూసిన తొలి మందారమయ్యావు తూనీగలాగ నీతలపులే వాలుతూ పూతోట లాగ నీముందునే వాలుతూ నిను కలిసిన ఆ సమయం నేను మురిసిన ఆ సమయం నేను ఆనంద ప్రపంచం లోతుల్లో మునిగి పోతాను నేను నీ ఆలోచన ప్రపంచంలో లోతుల్లో మునిగిపోతాను నిను పూజిస్తూ ధ్యానించనీ మరి నను నీ ప్రియుని గా స్వీకరించవూ..! కాలం: 11-2-2018 -----------------------------------88 ఒక సిరియా కొన్ని దుఃఖ ప్రవాహాలు - గవిడి శ్రీనివాస్ 07019278368, 9966550601 రేపటి తరం ఎర్రని అలలు అలలుగా రాలిపోతోంది . కొన్ని దుఃఖపు కెరటాల మధ్య సూర్యులు అస్తమిస్తున్నారు . ఆక్రమిత ప్రాంతవాదులు స్థానిక రోధనవుతుంటే రాజ్య పాలకులు యుద్ధ మేఘాలవుతుంటే జీవితం ముక్కలవుతోంది . దేశమేదయినా గాయం బాధ అదే సమయమంతా చీకట్లను చీల్చడం లో మునిగిపోతోంది . తగలబడుతున్న సిరియా సాక్షి గా వొరిగి పోతున్న నలిగి పోతున్న కాలం సాక్షి గా చిన్నారుల్ని అడిగిచూడు తెగని సమస్యలు చావుని ఎత్తుకునే తలపులు నెత్తురోడుతున్న ఒక సిరియా కొన్ని దుఃఖాలు అణువణువునా తల్లడిల్లుతున్నాయి. కాలం: 4-3-2018 --------------------------------89 నా ప్రజలు నా రాష్ట్రం - గవిడి శ్రీనివాస్ 07019278368, 9966550601 సన్నద్ధం కావాల్సిన సమయం మౌనం నిషిద్ధం . నడిసే కాలాలు ఊసులాడే ఆశలూ రోజును దొర్లించడం పరిపాటే . అబద్ధాన్ని ఎల్లప్పుడు నిజంలా నడపలేం నమ్మేప్రజలను ఎంతోకాలం భ్రమింపచేయలేం . కన్నీళ్లను తుడవాల్సినపుడు వొట్టి మాటలు జీవితాలను నిలబెట్టలేవు . అందలం మీద కింది మాటలు గుర్తుకు రావు . కాలం ఆసన్నమైనపుడు ఎన్ని అబద్దాలైన గుండెల్ని గెలవలేవు . అంతర్గత అగ్ని కీలల్ని అబద్దాలు జయించలేవు . మాకిప్పుడు ప్రత్యేక హోదా కావాలి వికసించే కొత్త నవ్వులు కావాలి . కాలం: 4-3-2018 ------------------------------------------------------90 నా ప్రజలు నా రాష్ట్రం - గవిడి శ్రీనివాస్ 07019278368, 9966550601 సన్నద్ధం కావాల్సిన సమయం మౌనం నిషిద్ధం . నడిసే కాలాలు ఊసులాడే ఆశలూ రోజును దొర్లించడం పరిపాటే . అబద్ధాన్ని ఎల్లప్పుడు నిజంలా నడపలేం నమ్మేప్రజలను ఎంతోకాలం భ్రమింపచేయలేం . కన్నీళ్లను తుడవాల్సినపుడు వొట్టి మాటలు జీవితాలను నిలబెట్టలేవు . అందలం మీద కింది మాటలు గుర్తుకు రావు . కాలం ఆసన్నమైనపుడు ఎన్ని అబద్దాలైన గుండెల్ని గెలవలేవు . అంతర్గత అగ్ని కీలల్ని అబద్దాలు జయించలేవు . మాకిప్పుడు ప్రత్యేక హోదా కావాలి వికసించే కొత్త నవ్వులు కావాలి . కాలం: 1-4-2018 --------------------------91 మరి! వస్తానూ ..!! -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601 ఈ కళ్ళలోంచి విస్తారంగా నడచిన చూపుల మేఘాలు కాస్తంత దట్టంగా కాస్తంత బరువు గా కోరుకుతున్న బాధ లా నన్ను చుట్టుముడతాయి . నీ వెళుతున్నావనీ ఎత్తిన చేయి దించకుండా అలా ఊపడమే మొదలు మనసుని సమాధాన పరచుకోలేక కన్నీళ్లను రెప్పల సంద్రం లో దాచలేక ఉబుకుతూ ఊగుతూ వీస్తున్న తుపాను లోంచి జారే నదిలా అలా నన్ను తడిపి పోతాయి . జీవితాన్ని అనుభవాల తో కాగి పెనవేసుకున్న బంధాలు గుండెను అలా లాగి కాలం రెక్కల పై కర్పూరం లా వెలిగి కరిగి పోవడం తప్పా దేన్నీ ఆపలేని చిట్టి గుండె చివుక్కుమంటుంది . ఎప్పుడు ప్రవేశించావ్ ఇప్పుడు కాస్తంత దూరంగా ఎందుకు ఎందుకు నిష్క్రమిస్తున్నావ్ . దూరం కొలతలు తెలీవు గానీ దూరం గాయాల్ని తడుతుంది . నీతో భౌతిక ప్రపంచం వేరు నీతో మాటాడిన క్షణాల రూపం వేరు రెప్పల ముందు రెపరెపలాడుతూ నా చేతి వేళ్ళ సందుల్లోంచి నీవు దుఃఖం గా జారిపోతుంటే ఉక్కబోత లో ఊపిరాడక ఇంతితై జీవితం చీకటి తెరలు కప్పిపోతున్నట్లు నేను ఒక నీ జ్ఞాపక దృశ్యం గా రాలిపోతాను . 'మరి వస్తానూ ' అన్న నీ మాట తో మూగ బోయిన క్షణాల్ని ఆ దృశ్యాల్ని కను గుడ్ల లో చెరిగి పోనీ చిత్రాలు గా బంధిస్తూ భరోసా లేని బతుకు వైపు నిర్లిప్తంగా కదులు తూ కాలం కలుక్కుమంటుంది . కాలం: 15-4-2018 ---------------------------------92 ఒంటరితనం ఒక వేదన. -గవిడి శ్రీనివాస్ వొళ్ళు విరుచుకుంటున్న నాల్గు గోడల మధ్య వేలాడుతున్న శూన్యాన్ని ఒంటరిగా తెరిచిన కళ్ళతో చూశాను. అలికిడిలేని ప్రపంచంలో శూన్యపు పొరలు దిగులు మేఘాలు గా కురవడం సందేశమూ సమాధానం లేక ఒంటరి జ్ఞాపకాల్లో తడవడం చిరాకు దిండు మీద దొర్లడం ఎంత దుర్లభం! ఇప్పుడు ఎవరితో మాటాడాలి కాసింత వీచే గాలితో మాటాడాలి తల ఊపే మొక్క తో మాటాడాలి కాలాన్ని తిప్పే గాలి మర తో మాటాడాలి మనిషి కి మనిషి తోడులేకుంటే ఇంకెవరి తో మాటాడాలి. కొన్ని సందర్భాలు వెంటాడే ఒంటరితనాలు కోల్పోతున్న బతుకు రుతువుల్ని జీవితపు బంధాల విలువల్ని ఒంటరి కి పాఠాలు వల్లివేస్తాయి బిక్కు బిక్కుమంటున్న నాల్గు దిక్కుల్లో వొలికిపోతున్న దుఃఖాన్ని ఒక్కో జ్ఞాపకంగా కళ్ళలో తడుముకుంటూ కాలం నిశ్శబ్ద ప్రవాహంలోకి రాలిపోతుంది! కాలం: 20-5-2018 ---------------------------------------------93 నెత్తురోడిన క్షణికం - -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601 మొగ్గ వీడని సూర్యోదయానికి గ్రహణం కమ్మినట్లు చీకటి పులిమి నెత్తురోడినట్లు వంచించే వాంఛలు పులులవుతుంటే విచక్షణ క్షణకాలం కళ్ళు తెరవకుంటే ఉదయాలన్నీ కాళరాత్రులవుతున్నాయి . సింధూరం పూసిన నుదిటిమీద నెత్తుటి చారలు రగిలిపోతుంటే ఎరుపెక్కిన దహన దాహ జ్వాలల్లో జీవన గానమే ఎరుపవుతుంది. నడిచేదారుల్లో చిక్కుముడుల వలలు చూపుల్ని అలికే సాలెగూడు తీగలు మూసిన కళ్ళు తెరిచేలోపే నరాలని నలిపి ఊపిరిని తెంపి తడబడుతుంటే మూగబోయిన జీవన శల్యాలు . చుక్కలు మొలిసిన ఆకాశం కింద దోషం చూసే చూపులదా వేషం మార్చే క్రూర మనసులదా ప్రాణశక్తి ని తెంచే మనుషులదా చీకట్లనే కలగనే ఆ ప్రపంచ ఋతువులదా ... కాలం ముక్కలవుతూనేవుంది పసిజీవాలు నెత్తుటి మరకవవుతున్నాయి నెత్తురోడిన క్షణికం విచక్షణ తెరవని ద్వారం దగ్గర రోధన విడువలేని తడినెత్తుటి జీవితాలు అస్తమిస్తూనే వున్నాయి నిన్నా నేడూ... భరోసాలేని రేపటి వైపు ఒక ప్రశ్న వాలింది ఎప్పటిలానే ...! కాలం: 24-6-2018 ------------------------------------------------94 నేను పాఠం నేర్పాను ..! -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601 నేను మాట నేర్పాను మౌనం బద్దలయింది . నేను భరోసా ఇచ్చాను . ఆశ విత్తుగా మొలకెత్తింది నేను పాఠం నేర్పాను చైతన్యం ఉరకలేసింది నేను ఉదయించే సూర్యుని చూపాను పోరాటానికి పునాది పడింది నేను ప్రశ్నను చూపాను సమాధానమే ఎదురై నిలిచింది నేను అగ్నిని చూపాను క్షమించరానిదేదో బూడిదయింది. నేను కళ్ళు తెరవమన్నాను ఆత్మ స్థైర్యం నిలుచుని పోరాడింది నేను మౌనంగా నవ్వుకున్నాను స్థబ్దంగా పడిన క్షణాల నైరాశ్యాన్ని చూసీ ..! కాలం: 24-6-2018 -------------------------------95 ఈ నల్లని మేఘాలు -కీకారణ్యాలు -గవిడి శ్రీనివాస్ ఆకూ ఆకూ కరచాలనం చేస్తున్నవేళ ఒక సూర్యోదయం వెలిగింది మబ్బూ మబ్బూ ఢీ కొంటున్నవేళ ఒక మెరుపు అలా మెరిసి చినుకు అలా కురిసింది. చిక్కుముడులు నక్షత్రాలుగా చిక్కుకున్నాయి వేళ్ళు నాటుకున్నచోట గాలి గుహలు కట్టుకున్న చోట వృక్షాలు వొంగి సలాం వేసే చోట ఆకలి ఉరుముతుంటే అరణ్యం వణుకుతోంది ఒకప్పటి రాతి ఆయుధం ఇప్పుడు ఆకలి తుపాకై వూగుతోంది ఆకాసాన్ని తలకిందులుగా వేలాడదీసే ఇన్ని చెట్ల మధ్య ఇన్ని క్రూరమృగాల మధ్య తలదాచుకున్న సూర్యుల్ని నమస్కరించాలి సమస్య సాధన కోసం మార్పు సూర్యల్లై ఉదయిస్తూ సంకురాతిరినే ఉరితీస్తూ మట్టి పరిమళాల్ని పీలుస్తూ పాద ముద్రలు రేపటి స్వేచ్ఛకై విడుస్తూ ఈ నల్లని మేఘాలు కీకారణ్యాలు ఉరుముతున్నాయి ఉడుకుతున్నాయి ఇప్పుడు సమ సమాజం ఒక నిర్మాణాత్మక అవసరం. . కాలం:22-7-2018 ----------------------------------------96 మా ఊరి చెరువు -గవిడి శ్రీనివాస్ అలా ఆకాశం రెక్కలు కట్టుకుని ఎర్ర ఎర్ర గా వాలుతూ సాయంత్రం సూర్యుడ్ని ముంచుతున్న వేళ పొలం గట్ల మీద చూపులవెంట నడిసెల్లి చూస్తే పెద్ద హృదయాన్ని ఆరేసుకున్న మా ఊరి చెరువు. మనసు పడాలేకానీ మౌనమూ సంగీతమే ప్రతి సాయంత్రమూ దివ్య సమ్మోహన సహవాసమే ఆ కొండగాలి ఆకుల అలల్లా ఊగుతుంటే గుప్పెడంత ఊహలు పక్షులై ఎగురుతూంటాయి. ఏ కొంగల గుంపో ఏ పిచ్చుకల సమూహమో ఎగురుతున్న ముగ్గులా మనోహరంగా నా కళ్ల కొలనుల్లో తేలియాడుతుంది. నా పక్కనే తిరుగు ముఖంలో ఆవులు ఎద్దులు మేకలు నా పక్కనే సంతోషాన్ని ఎత్తుకునే పసుకాపరులు మిశ్రమ సమూహాలికి కొదువేలేదు అలా కాసేపు ఆకాసం వంక ఎగిరే మబ్బుల గుర్రాల్ని సంధ్య లో గుంకే సూర్య బింబాన్ని నాలో పూర్తిగా నింపేసుకున్నాను. ఎప్పుడైనా ఆస్వాదించగలిగే క్షణం లోని అనుభూతిని బంధించటం ఒక వరం. వరం లా చిక్కుకున్న అనుభూతుల్లో మునిగితేలటం ఒక బతకటం. నన్ను తడిపిన ఊపిరి జ్ఞాపకంలా మా ఊరి చెరువు. వానా కాలం నిండుగా బెక బెకలతో వాగుతుంది ఎండాకాలం ఆటల పరుపుగా పడి ఉంటుంది. నేను చెరువు గట్టంట నడిస్తే చాలు సంతోషాన్ని నిర్వచించలేని అనుభూతుల దొంతరల్లో గాలిని పీలుస్తూ ఆకాసాన్ని ధరిస్తూ వాయు మేఘాల్ని వస్త్రాల్లో బంధించటం కంటే ఆనందం ఏముంటుంది.! కాలం: 5-8-2018 -----------------------------------------------------97 మా ఊరి చెరువు -గవిడి శ్రీనివాస్ అలా ఆకాశం రెక్కలు కట్టుకుని ఎర్ర ఎర్ర గా వాలుతూ సాయంత్రం సూర్యుడ్ని ముంచుతున్న వేళ పొలం గట్ల మీద చూపులవెంట నడిసెల్లి చూస్తే పెద్ద హృదయాన్ని ఆరేసుకున్న మా ఊరి చెరువు. మనసు పడాలేకానీ మౌనమూ సంగీతమే ప్రతి సాయంత్రమూ దివ్య సమ్మోహన సహవాసమే ఆ కొండగాలి ఆకుల అలల్లా ఊగుతుంటే గుప్పెడంత ఊహలు పక్షులై ఎగురుతూంటాయి. ఏ కొంగల గుంపో ఏ పిచ్చుకల సమూహమో ఎగురుతున్న ముగ్గులా మనోహరంగా నా కళ్ల కొలనుల్లో తేలియాడుతుంది. నా పక్కనే తిరుగు ముఖంలో ఆవులు ఎద్దులు మేకలు నా పక్కనే సంతోషాన్ని ఎత్తుకునే పసుకాపరులు మిశ్రమ సమూహాలికి కొదువేలేదు అలా కాసేపు ఆకాసం వంక ఎగిరే మబ్బుల గుర్రాల్ని సంధ్య లో గుంకే సూర్య బింబాన్ని నాలో పూర్తిగా నింపేసుకున్నాను. ఎప్పుడైనా ఆస్వాదించగలిగే క్షణం లోని అనుభూతిని బంధించటం ఒక వరం. వరం లా చిక్కుకున్న అనుభూతుల్లో మునిగితేలటం ఒక బతకటం. నన్ను తడిపిన ఊపిరి జ్ఞాపకంలా మా ఊరి చెరువు. వానా కాలం నిండుగా బెక బెకలతో వాగుతుంది ఎండాకాలం ఆటల పరుపుగా పడి ఉంటుంది. నేను చెరువు గట్టంట నడిస్తే చాలు సంతోషాన్ని నిర్వచించలేని అనుభూతుల దొంతరల్లో గాలిని పీలుస్తూ ఆకాసాన్ని ధరిస్తూ వాయు మేఘాల్ని వస్త్రాల్లో బంధించటం కంటే ఆనందం ఏముంటుంది.! కాలం:16-9-2018 -------------------------------98 మా ఊరి చెరువు -గవిడి శ్రీనివాస్ అలా ఆకాశం రెక్కలు కట్టుకుని ఎర్ర ఎర్ర గా వాలుతూ సాయంత్రం సూర్యుడ్ని ముంచుతున్న వేళ పొలం గట్ల మీద చూపులవెంట నడిసెల్లి చూస్తే పెద్ద హృదయాన్ని ఆరేసుకున్న మా ఊరి చెరువు. మనసు పడాలేకానీ మౌనమూ సంగీతమే ప్రతి సాయంత్రమూ దివ్య సమ్మోహన సహవాసమే ఆ కొండగాలి ఆకుల అలల్లా ఊగుతుంటే గుప్పెడంత ఊహలు పక్షులై ఎగురుతూంటాయి. ఏ కొంగల గుంపో ఏ పిచ్చుకల సమూహమో ఎగురుతున్న ముగ్గులా మనోహరంగా నా కళ్ల కొలనుల్లో తేలియాడుతుంది. నా పక్కనే తిరుగు ముఖంలో ఆవులు ఎద్దులు మేకలు నా పక్కనే సంతోషాన్ని ఎత్తుకునే పసుకాపరులు మిశ్రమ సమూహాలికి కొదువేలేదు అలా కాసేపు ఆకాసం వంక ఎగిరే మబ్బుల గుర్రాల్ని సంధ్య లో గుంకే సూర్య బింబాన్ని నాలో పూర్తిగా నింపేసుకున్నాను. ఎప్పుడైనా ఆస్వాదించగలిగే క్షణం లోని అనుభూతిని బంధించటం ఒక వరం. వరం లా చిక్కుకున్న అనుభూతుల్లో మునిగితేలటం ఒక బతకటం. నన్ను తడిపిన ఊపిరి జ్ఞాపకంలా మా ఊరి చెరువు. వానా కాలం నిండుగా బెక బెకలతో వాగుతుంది ఎండాకాలం ఆటల పరుపుగా పడి ఉంటుంది. నేను చెరువు గట్టంట నడిస్తే చాలు సంతోషాన్ని నిర్వచించలేని అనుభూతుల దొంతరల్లో గాలిని పీలుస్తూ ఆకాసాన్ని ధరిస్తూ వాయు మేఘాల్ని వస్త్రాల్లో బంధించటం కంటే ఆనందం ఏముంటుంది.! కాలం: 28-10-2018 ---------------------------------------------99 తుపాను కెదురు గా -గవిడి శ్రీనివాస్ 9966550601, 7019278368 కొద్దిపాటి సమయాల్ని ఒడ్డున ఆరేసి పెను తుపాను జీవితాల్ని ఆహ్వానించలేక ఆస్వాదించలేక లోలోపల ఇష్టాన్ని వొoపలేక నాలో ఇక ఇమడలేక పొడి పొడి గా రాలుతూ గాయాల్ని కొద్ది కొద్ది గా దాస్తూ ఈ దేహం దిగులు సంద్రం లో మునిగిపోతుంది. తూరుపు కెదురు గా నడుస్తాను ఒక ఉదయం సమీరం లా తాకుతుందనీ. వాకిట తలుపులు తెరుస్తాను చిరు నవ్వే గాలి తెరలు గా కవ్విస్తుందనీ. రోజులు గడిసే కొద్దీ రూపాలు రూపాంతరం చెందుతున్నాయి . ఏకాగ్రత కోల్పోతున్న క్షణాల్లో నక్షత్రం లా ప్రత్యక్షమౌతావ్ . నా వొంటి నిండా నువ్వు అనేకానేక నక్షత్రాలై మెరుస్తుంటే నీ తలపులకే బానిసనౌతున్నా . ఎక్కడికని పారిపోను నాలో బంధించి బడ్డ ఆణువణువూ నీ రూపం తో అలంకరించ బడ్డాక! కాసేపు నీ మాటల్లో వొలికి మరుక్షణం నీ చేతుల్లో వొదిగి తుపాను కెదురు గా వెళ్లే సాహసాన్ని రంగరించే నువ్వున్నంత సేపూ నాలో రాత్రి పగలు స్వర్గపు అంచున తడి చుంబన మృదు భావన తాకుతూనే ఉంటుంది ! కాలం:4-11-2018 ------------------------------------------100 నేనో ధిక్కార స్వరాన్ని -గవిడి శ్రీనివాస్ 7019278368 నేనొక బాధాతప్త హృదయ స్వరపేటిక పై నినదిస్తున్న అకుంటిత దీక్షా శిబిరాన్ని ఆప్త వాక్యాన్ని ఆర్తనాదాల చేయూత ధీరుడ్ని శిరసు ఎత్తి శంఖారావం పూరించే యుద్ధ యోధుడ్ని మాటల కోటలు కూలిపోతే రెపరెప ఎగిరే ఎర్రని పతాకాన్ని నమ్మకం ముక్కలు చేసే గుండెల్లో సింహస్వప్నాన్ని . ఒక అల్లూరి ఒక చేగువేరాల్ని నింపుకున్న పోరాట తూటని. నీరులేక పంటే ఎండి పొతే కాగుతున్న రైతు క్రోధాగ్నిని . ఒక బాధా సంద్రాన్ని . ఉపాధిలేక వలసే పొతే బతుకును మోసుకు పోయే వలసవాద వ్యతిరేక సమరాన్ని . ఆకలి పేగులు తీగలై మోగుతుంటే ఒక సామ్రాజ్యం వాగ్దానాల కింద నలిగిపోయిన సామాన్యగొంతుని . మెలకువలేని రాజ్యాధిపతులకి ఒక జ్ఞాన బోధ వృక్షాన్ని . పీడిత హృదయాలకి ఎదుర్కోవటం నేర్పే గెలుపు పాఠాన్ని . ఇంకా దుఃఖాన్ని ఎన్నాళ్ళు మోయాలి మోసాన్ని న్యాయమని ఎన్నేళ్లు నమ్మాలి . విషణ్ణ వదనాల్ని మూటకట్టుకునే సాగు జీవితాల్ని ఎన్నేళ్లు చూడాలి ప్రపంచం మారినా రైతు జీవితం అదే . హామీలు కురిసినా అమలు అందుబాటుకు కుదరదే. పల్లెకూ కొత్త శోభ రావాలి అభివృద్ధికి మూలం పల్లెకావాలి . భళ్ళున కూలిపోతున్న స్వప్నాల్ని నిర్మించేదెపుడు ! కార్మిక సంరక్షణ హరించే కాంట్రాక్టు వ్యవస్థ కూలేదెపుడు. నాకిప్పుడు సమాధానం కావాలి సమాధానం లోంచి చైతన్యం వెలగాలి . నేనొక శ్రమ దోపిడీ వ్యవస్థను కూలదోసే ఒక పదునైన ఆయుధాన్ని . నేనో ధిక్కార స్వరాన్ని అన్యాయపు అడుగులపై ఎగసి పడే కీలాగ్నిని సమరం నా అభిమతం కాదు న్యాయ శంఖారావమే నా లక్ష్యం . న్యాయమే నాలో మోగే మృదంగం ! ఇదే నా తత్త్వం ! నా జవసత్వం !! కాలం: 25-11-2018 -------------------------------------101 జీవ శక్తి - గవిడి శ్రీనివాస్ కాస్తంత బిగుస్తూ ఒక చలి కాలం నిలవటం . వెచ్చని దుప్పటి కింద కాలాన్ని వేలాడ దీయటం . ఒక వేసవి కాలం చల్లని బావి నీటి లో శరీరం మునకలేయటం ఒక వర్షా కాలం గొడుగు లో దేహం ముడుచుకు పోవటం ప్రాణశక్తి కి జీవ శక్తి ని అద్దినట్లవుతుంది . నీటి బిందువులు రాలుతున్నపుడు తడిసిన విత్తనం వదులుగా లేస్తున్నపుడు రెక్కలు చాచి ఆకులు వూగుతున్నపుడు గాలి వీచి ప్రాణం లేస్తున్నపుడు జీవశక్తి ఊతమిస్తుంది . ప్రయత్నానికి ప్రయత్నానికీ విరాజితమైన విజయానికీ . గాయానికీ లేపనం పూసుకున్న దేహానికీ కాలానికీ కాలం పెదవులపై పూసిన చిరునవ్వులకీ జీవశక్తి ఉపిరిలూదుతుంది . కలల వాకిటిలో వెన్నెల విరిస్తే పెదవుల అంచులపై ఉషోదయాలు జనిస్తే కాస్త కాస్తగా జాలువారే నదులు అలా అందని ఆకాశం పై ఎగిరే పక్షులు హృదయం నిండా పరచుకుని జీవశక్తి తనువునిండా తొణికిసలాడి తేజోవంతమై నిలుస్తుంది . కాలం: 25-12-2018 ---------------------------------------102 నా చుట్టూ నా లోపల -గవిడి శ్రీనివాస్ 9966550601,7019278368 రాత్రులు చూపుల్ని మోసుకుని దీప కాంతులతో పరుగెడుతుంటాయి . ఏ తీరాలా వైపో క్షణాల్ని కోసుకుంటూ ... ఏ ఆరాటాలు వైపో పొద్దు తెలియని ప్రపంచం వైపు అలా సమయాలు హడావిడి గా సాగిపోతుంటాయి . పట్టణమొక సాగరమే ఈదటమే అలవాటుగా రుతువులు మారుతుంటాయి . బస్సుల్లో కిక్కిరుసుకుపోతూ జన ప్రవాహం మెట్రో వైపు పరుగెడుతూ మరో ప్రవాహం ఊగే ప్రపంచాన్ని రంగులు అద్దే కార్మికుడు ఎత్తునుంచీ ఆదుర్ధా గా చూస్తాడు . ధూళిని దులిపే కార్మికుని కళ్ళలో ఆర్ద్రత తడి తడి గా తడుముతుంది . ఉరుముల పిడుగుల అరుపులు ద్వారాల వెంట తెరచి ఉంటాయి . ఇక్కడ బానిసత్వమే తప్ప పని వేళలకీ చివరాఖరు అంటూ ఉండదు . అవసరాల తోటలో బతుకులు ముడిపడి తెగుతుంటాయి . కారణాల విశ్లేషణ అనవసరం ఇక వెనక్కి ఆలోచించని పరుగే నిజమైన నిర్దారణ గా సాగే అవసరం . నా చుట్టూ పరుగుల వలయాలుంటాయి . నా లోపల చందమామలు చెట్లు పూల మొక్కలు అలానే ఉంటాయి . ఆస్వాదించడానికి క్షణాలకే తీరికలేదు ఏదో సమయం ఎప్పటి సౌందర్యాన్నే కొత్తగా ఆహ్వానిస్తూ ఆనందిస్తుంది . నా చుట్టూ గజి బిజీ నా లోపల అంతే ! కాలం: 27-1-2019 -------------------------------------103 రసమయ కావ్యం - గవిడి శ్రీనివాస్ 7019278368, 9966550601 కనురెప్పల గొడుగుల్ని నెమ్మదిగా ఎత్తి చూశాను కనుగుడ్ల చందమామలు నీలా విరిశాయి . కొద్ది కొద్ది గా ముసుగేసుకున్న తెరలు తొలగే వేళ నాలో నీ దేహం ఆకాశమంత ముత్యం లా మెరుస్తోంది . పదాలు పలికీ పలకని ఒక రాత్రి చూపుల వెన్నెల ఎడతెరుపుగా కురుస్తోంది . మంచు రాలుతుంటే తలూపే చెట్టులా తెల్ల బోయాను . చేతులు సడి చేయ లేదు . చుట్టుకున్న మమకారం లా పెన వేసుకున్నాయి . రాత్రులూ నిద్రపోలేదు కళ్ళల్లో ఉరికిన కోరికలేవో పూల పాన్పులపై సందడి చేస్తున్నాయి . అంతా మైకంలా మెడ చుట్టూ చుంభిత వర్షం లా ఒక తుళ్లింత . నేను కలగన్నది దేహాన్ని కాదు అలా కళ్ళల్లో దీపాల్ని ఆ దీపాల వెలుగుల్లో దారిని ఆ దారుల్లో నన్ను నడిపించే నీ ప్రేమని చూశాను . మల్లెలు మత్తు గా నలుగుతున్నాయి వాసనలు అగర వత్తుల ధూపాలై చెదురుతున్నాయి . ఈ దేహమంతా నీ పరిమళ మై అత్తరు వాసనల తో ముంచుతోంది . పెదవుల తడి గీతం వెచ్చని ఊపిరితో ఆవిరవుతోంది . బుగ్గల తడి సంద్రం పాల వెల్లువై కురుస్తోంది . వక్ష శోభిత శిలల పై మెరిసిన సూరీడులా నువెచ్చగా తాకుతూ సాకుతుంటే జీవితం రసమయ కావ్యం లా జాలువారుతూనేవుంది . కాలం : 10-2-2019 --------------------------------------------------104 ఒక నిరంతర యుద్ధం - గవిడి శ్రీనివాస్ 7019278368, 9966550601 ఒక రాజ్యం నచ్చచెబుతోంది . ఒక రాజ్యం ఆక్రమణే అభిమతమంటోంది . అర్దాంతరంగా ముగిసే వర్ణమెపుడూ సైనికులదే కాలాలు మారినా రాజ్యాలు మారినా రాజమాతల దుఃఖాలే పుస్తకాల్లో లిఖించబడతాయి . ఒక జవాను సరిహద్దుల్లో పహారా కాస్తుంటే ఒంటరిగా భార్య జ్ఞాపకాల్ని మోస్తుంది . అమరుడైతే జ్ఞాపకాలనే జీవితంగా మోస్తుంది . కాశ్మిరు దుఃఖాశ్రువులు ఇంటిముందు శవపేటికలై ప్రత్యక్షమవుతాయి . అధికార లాంఛనాల ముందు పోరాట యోధుడైనందుకు గర్వపడాలో గుండె లోతుల్లో ఎగసిపడే సంద్రాల్లో మునిగిపోవాలో ముగిసిపోవాలో అర్ధం కాదు . ఈ ఆఖరి వీడ్కోలులో తొంగి చూసిన సందర్భాల్ని చూస్తే జీవితమే పోరాటమనీ గెలిచినా ఓడినా రక్షణ భూమిలో యుద్ధపటిమే ప్రధమమనీ బోధపడుతుంది . లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక పోరాటమే నిజమైన వీరుడి విజయం విజయమైన వీరస్వర్గమైన పాదముద్రలు తాడితడి గానే మిగిలిపోతాయి . తడిపిపోతాయి . మరో నలుగురికి వెలుగుని చూపి పోతాయి . కాలం: 17-2-2019 -------------------------------------------------105 నీ జ్ఞాపకంగా రాలుతూ ..! - గవిడి శ్రీనివాస్ 7019278368, 9966550601 నీ జ్ఞాపకాల్ని మోస్తూ నీతో కలిసి తిరిగిన ఈ ఇసుక తీరాల వెంట పొడి పొడి గా రాలిపోతున్నాను . ఈ ఇసుకలో ఈతచెట్లు నన్నే ప్రశ్నిస్తున్నాయి నీ వెంట వెన్నెలలా నడిచే తోడేదనీ .. నీవు ఇక రాలేవు నేను నీ జ్ఞాపకాల నుండీ పోలేను . ఆకాశం ఒడ్డున రాలిన నక్షత్రాలన్నీ నీవే . ఏరుకోడానికే యుగాలు చాలవు . మైదనాల వెంట మబ్బులవెంట అడవి దారుల వెంట తిరిగినా రాలిపోయినవి తిరిగి బతికిరావు . సమకూర్చుకోడానికే సమయాలు కలిసి లేవు . గాలి ఎప్పటిలానే రెక్కలు కట్టుకు ఊగుతోంది . ఎండిన ఆకుల్లో నిండిన అనుభవాలు వాలుతున్నాయి. దిగులు గా ఆకాశం గుంకుతోంది మబ్బులేమో చీకటి తెరల్ని కప్పుతున్నాయి . కన్నీటి నదుల వెంట కాలం జారిపోతుంటే ఆ ఒడ్డున నీ అనేక జ్ఞాపకాలు గా రాలుతూ మిగిలిన ఒంటరి చెట్టుగా నేను . కాలం: 24-2-1019 ------------------------------106 సమస్యల కొలిమి - గవిడి శ్రీనివాస్ 7019278368, 9966550601 ఎప్పటిలానే వేసవి ఎండలు ఉడుకుతున్నాయ్ . ఇక్కడే కాదు అక్కడ అడుగులు నడుపుతూ కాశ్మిరు సరిహద్దుల్లో పొదల వెంట గోడల వెంట తూటాలై పేలుతున్నాయ్ నీడలై వెంటాడుతున్నాయ్. రోజువారీ జీవితం ఎప్పటిలానే నడుస్తుందంటే నడిపిస్తుందంటే అర్ధాంతరంగా తెలీకుండానే దాడి జరుగుతుంది . బస్సు స్టాండు లో బాంబు పేలుతుంది . కల్లోలిత దృశ్యాలనే కలగనే వాళ్ల్లు మానవీయ కోణాల్ని మూసి చీకటి ప్రపంచం నుంచీ దుముకుతారు . విధ్వంస కారుల లక్ష్యమేమిటని ప్రశ్నించు బలప్రదర్శన లక్ష్యమే ప్రత్యక్షమవుతుంది . ఇక్కడే ఉనికి కోసం ఊపిరులు ఆగిపోతాయ్. తెలియని గాలేదో అమాయకుల్ని హరిస్తుంది . ఆక్రమణ ఎపుడు మొదలైందో చెప్పలేం రాజ్యాల హద్దులు కదులుతున్నాయ్. పెదవుల పై స్నేహం ధ్వనింప చేస్తూ పొడి నవ్వులు నవ్వి ఇరుగు పొరుగు దేశాలు యుద్ధం చేస్తున్నాయ్ . యుద్దమంటే మాటల గారడీ కాదు విచ్చుకునే మట్టే కాదు మట్టి లో ముద్దలు గా ఎగసి పడే దేహాలు కూడా . మనిషిని కాస్తా స్వార్ధం వదలిపోయే వరకూ ధర్మం కిరీటమై ప్రపంచాన్ని పాలించేవరకూ సమస్యల కొలిమి మరుగుతూనే ఉంటుంది . కాలం: 10-3-2019 ------------------------------------------------------------- సమస్యల కొలిమి - గవిడి శ్రీనివాస్ 7019278368, 9966550601 ఎప్పటిలానే వేసవి ఎండలు ఉడుకుతున్నాయ్ . ఇక్కడే కాదు అక్కడ అడుగులు నడుపుతూ కాశ్మిరు సరిహద్దుల్లో పొదల వెంట గోడల వెంట తూటాలై పేలుతున్నాయ్ నీడలై వెంటాడుతున్నాయ్. రోజువారీ జీవితం ఎప్పటిలానే నడుస్తుందంటే నడిపిస్తుందంటే అర్ధాంతరంగా తెలీకుండానే దాడి జరుగుతుంది . బస్సు స్టాండు లో బాంబు పేలుతుంది . కల్లోలిత దృశ్యాలనే కలగనే వాళ్ల్లు మానవీయ కోణాల్ని మూసి చీకటి ప్రపంచం నుంచీ దుముకుతారు . విధ్వంస కారుల లక్ష్యమేమిటని ప్రశ్నించు బలప్రదర్శన లక్ష్యమే ప్రత్యక్షమవుతుంది . ఇక్కడే ఉనికి కోసం ఊపిరులు ఆగిపోతాయ్. తెలియని గాలేదో అమాయకుల్ని హరిస్తుంది . ఆక్రమణ ఎపుడు మొదలైందో చెప్పలేం రాజ్యాల హద్దులు కదులుతున్నాయ్. పెదవుల పై స్నేహం ధ్వనింప చేస్తూ పొడి నవ్వులు నవ్వి ఇరుగు పొరుగు దేశాలు యుద్ధం చేస్తున్నాయ్ . యుద్దమంటే మాటల గారడీ కాదు విచ్చుకునే మట్టే కాదు మట్టి లో ముద్దలు గా ఎగసి పడే దేహాలు కూడా . మనిషిని కాస్తా స్వార్ధం వదలిపోయే వరకూ ధర్మం కిరీటమై ప్రపంచాన్ని పాలించేవరకూ సమస్యల కొలిమి మరుగుతూనే ఉంటుంది . -------------------------------------------------------107 ఒక చెట్టూ - మరో శిశిర ఋతువు - గవిడి శ్రీనివాస్ 7019278368, 9966550601 నా ఇంటి గుమ్మం ముందు చూపులు వేలాడేసుకుని ఒక రావి చెట్టూ పలకరిస్తూ ఋతువుల్ని తనలో మెరిపిస్తుంది . నల్గురు మాట్లాడే రచ్చ బండ నుంచీ కాస్త దూరం జరిగాక ఒంటరి నగర జీవనం ఒక శిశిరం లానే కనిపిస్తుంది . అంత పెద్ద చెట్టూ ఆకు రాలి మోడువారినా వసంతాన్ని మరచిపోనట్లు రేపటి చిగుర్ల కోసం శ్వాస తీస్తుంది. కాలాన్ని అంకెలతో ముడివేస్తూ పల్లె వాసన కోసం మనసు పరితపిస్తుంది . కరెన్సీ తో మాట్లాడేవాళ్ళని అనుబంధాలకి ముడివేయలేం. రాలే కన్నీళ్ల లో రూపాయలు రాలవు అనుబంధాలు తెగుతున్న ధ్వనులు తప్ప. నిన్ను నిన్ను గా ప్రేమించే మనిషి కోసం శ్వాసనందించే ఒక చెట్టూ కోసం నీ చుట్టూ కలిసి తిరిగే పక్షుల కోసం ఆప్యాయత కోసం పరితపిస్తూ ఒక చెట్టూ లో జీవితాన్ని చూస్తూ ఒక శిశిరం రాలినా కొన్ని వసంతాల కోసం చూపుల్ని ఆరేయక తప్పదు..! కాలం: 23-3-2019 --------------------------------------------------108 నీ వెలుగు లో - గవిడి శ్రీనివాస్ 7019278368, 9966550601 నిన్ను తలచుకుంటే చాలు కళ్ళ లో దుఃఖ సంద్రాలు రెప్పల తీరాలు దాటి ఉబుకుతుంటాయి నాకు బాగా గుర్తు నా చేయి పట్టుకుని ఒకటో తరగతి వనం బడి లో చేర్పించటం. నా అవసరాల చుట్టూ నీ ప్రయోజనాల్ని త్యాగం చేయటం ఇంకా బాగా గుర్తు . నా కోసం ఉత్తరమై నా కోసం మనీ ఆర్డర్ టపాలవై నా గెలుపు కోసం అంకితమైన నీ నిస్వార్ధం జీవితం ఇంకా నా కళ్ళ లో ఉరకలేస్తోంది . నా మాటల చుట్టూ ప్రహరీ గోడ లా కాపు కాసి కాసిన్ని కన్నీళ్ల లోనూ కాసిన్ని సుఖాల లోనూ నిలిచిన నీ అభయ హస్తం ఎప్పటి కి వీడిపోదు. మనసు గెలిచిన నీకు ఇప్పుడు నేనెమివ్వగలను నీ పటం పాదాల వద్ద కన్నీళ్ల తో కడగటం తప్ప . (కీ .శే . వలిరెడ్డి గోపినాథ్ మావయ్య కోసం ...) కాలం: 31-3-2019 ----------------------------------------109 మంచె మీద ఈ రైతు అనగా ఒక నేను - గవిడి శ్రీనివాస్ 9966550601 ,7019278368 చలి పొద్దు మీద సూర్యోదయాన్ని ఎత్తుకుని వడి వడి గా నడకను పక్షుల కూతల పై ఆరేస్తాను ఇన్నాళ్ల కష్టం పంటై కళ్ళల్లో మెరుస్తుంటే నాలో ఆశల గోరువంకలు ఎగురుతున్నాయి . వేరుశెనగ పంట గదా ఏ పిట్ట ఎక్కడ కొరుకుతుందో అల్లరి పక్షుల మూకలకి నేను నలుమూలలా పరుగెత్తాల్సిందే కాసేపు మంచె మీద వాయిద్యమై డబ్బా డప్పుతో దుముకుతుంటాను . శబ్ద మెంత కఠోరమైన గాని పక్షులకి పంట చిక్కుకుంటే చాలు అడవి పందులకి దక్కకుంటే చాలు కొన్ని నెలల చెమట ధార ఆనంద ప్రవాహమై తిరిగొస్తుంది . ఎండ ముంచుతున్నపుడూ మబ్బులు చీకట్లను దులుపుతున్నపుడూ నా కళ్ళు ఆకాశం లో సంచరిస్తున్నపుడూ ఆకాశం నా పంట పై వాలుతున్నపుడూ ఈ ఒంటరి సమయం లో కూడా మంచె మీద ఈ రైతు అనగా అనగా ఒక నేను ఆకాశాన్ని మోస్తూ సూర్యోదయాల్ని సూర్యాస్తమయాల్ని నాలో నింపుకుంటూ నిలుపుకుంటూ అరిచే కీచురాళ్ళ మధ్య రేపటి బతుకు భరోసా గా ప్రకాశిస్తాను కాలం: 7-4-2019 -----------------------------------------------------------------------------------------------110 మంచె మీద ఈ రైతు అనగా ఒక నేను - గవిడి శ్రీనివాస్ 9966550601 ,7019278368 చలి పొద్దు మీద సూర్యోదయాన్ని ఎత్తుకుని వడి వడి గా నడకను పక్షుల కూతల పై ఆరేస్తాను ఇన్నాళ్ల కష్టం పంటై కళ్ళల్లో మెరుస్తుంటే నాలో ఆశల గోరువంకలు ఎగురుతున్నాయి . వేరుశెనగ పంట గదా ఏ పిట్ట ఎక్కడ కొరుకుతుందో అల్లరి పక్షుల మూకలకి నేను నలుమూలలా పరుగెత్తాల్సిందే కాసేపు మంచె మీద వాయిద్యమై డబ్బా డప్పుతో దుముకుతుంటాను . శబ్ద మెంత కఠోరమైన గాని పక్షులకి పంట చిక్కుకుంటే చాలు అడవి పందులకి దక్కకుంటే చాలు కొన్ని నెలల చెమట ధార ఆనంద ప్రవాహమై తిరిగొస్తుంది . ఎండ ముంచుతున్నపుడూ మబ్బులు చీకట్లను దులుపుతున్నపుడూ నా కళ్ళు ఆకాశం లో సంచరిస్తున్నపుడూ ఆకాశం నా పంట పై వాలుతున్నపుడూ ఈ ఒంటరి సమయం లో కూడా మంచె మీద ఈ రైతు అనగా అనగా ఒక నేను ఆకాశాన్ని మోస్తూ సూర్యోదయాల్ని సూర్యాస్తమయాల్ని నాలో నింపుకుంటూ నిలుపుకుంటూ అరిచే కీచురాళ్ళ మధ్య రేపటి బతుకు భరోసా గా ప్రకాశిస్తాను . కాలం: 14-4-2019 -------------------------------------------------------------------------111 శ్రామిక తరంగాలు - గవిడి శ్రీనివాస్ 9966550601 ,7019278368 మనిషొక జీవన యంత్రం మలుపొక జీవన తంత్రం పుడమి పుటల్లో శ్రామిక భాషలో కార్మిక క్షోభ పర్వం లో నెత్తుటి అక్షరాలు కార్మిక గోడు గా గోడల పై నిలుస్తాయి . చీకట్లను చింపి యంత్రాలతో మగ్గిన లోకం ఇది. మాటలు పెగలాలంటే బతుకుని నడపాలంటే యంత్ర భాష మాటాడాల్సిందే ఇంద్రజాలం లా . సమతూకం లేని జీవితాల పైన వేళ్ళాడుతూ ఇంటిదీపం మసకగా వెలుగుతుంది . ఇనుప యంత్రాల వేడికి మరుగుతూ కొందరు కంప్యూటర్ ప్రపంచాన్ని నెత్తిన మోస్తూ కొందరు రాక్షస బల్లుల్లా చేతుల్ని నమిలే యంత్రాల మధ్య నల్ల కలువల్లా మండిపోతూ కొందరు పురికొసల యంత్రాల మధ్య పీలికవవుతూ కొందరు పాదరసం లా మారుతున్న జీవితాలు సంక్షేమ ఫలాలు నోచుకోని బతుకుల్లో కాలాన్ని సంకెళ్లతో ముందుకు నడుపుతున్నారు . శ్రామిక జీవితాలు ఉషోదయం లేని మౌన ఘోషా కెరటాలుగా మిగిలి పోతున్నాయి . నిట్టూర్పుల మధ్య మింగుపడని ప్రశ్నల మధ్య సమాధానం దొరకని వ్యవస్థ మధ్య కార్మిక ఘోషలు వినిపించడం లేదు అయినా శ్రామిక అంతరంగాలు భరోసా జీవిక కై ఆశ గా వేలాడుతున్నాయి . కాలం:28-4-2019 --------------------------------------------------------112 గూటికి చేరే ముందు - గవిడి శ్రీనివాస్ 9966550601 , 7019278368 ఇన్ని రోజులు గడిచాక నెమ్మది నెమ్మది గా చూపుల్ని నెడుతూ ఒంటరి ఇల్లును వదిలి స్వస్థలం చేరుకోడానికి ఆరుబయట ఊగే గాలిలా మనసు నిలకగా లేదు చుట్టూ చూస్తున్నాను ఆదరించే ప్రపంచం నెలకొని ఉంది ఒక చోట ఉండాలనే ఉంటుంది వీచే గాలులు ఉరిమే ఉరుములు ఏవీ నాలో నన్ను అట్టే ఉండనీయవు ఏదో ముందుకు లాగినట్లు గెలుపేదో ఒక మార్గం నిర్దేశిస్తున్నట్లు కాలాల్ని ఆనుకొని స్థలాలు మారతాం. నా వాకిలి రోడ్డును చూస్తూ నా పెరటి చెట్టును ఆస్వాదిస్తూ కాసిన్ని అడుగుల్ని ముందుకు నడిపాను . నాలాగే దూరం వచ్చి సొంతూరు పోవాల్సినవారు కలిశారు జీవితమూ మనసూ మారలేదు కాస్త ఆర్థిక ప్రమాణాలు తప్పా. ఇపుడొకటనిపిస్తుంది ఉదయం ఎగిరిన పిట్టలు చెట్టునొదిలి ఉండలేవు మళ్ళీ గూటికి అలసి సాయంకాలం వాలింది. కాలం: 7-5-2019 -----------------------------------------------------------------------------------113 తడిసిన బతుకులు - గవిడి శ్రీనివాస్ 9966550601 , 7019278368 ఇప్పటి కాలం ఇంకా తడుస్తూనే ఉంది తెల్లారే పక్షులు మబ్బుల నదిలో జల జలా జారుతున్నాయి . పొలం గట్ల మీద పారలు నడిచి పరవసిస్తున్నాయి నారు పోసి మట్టిని తడిమి చేతులు మురిసిపోతున్నాయి నీరు పెట్టి పచ్చదనం తొడిగి కళ్ళు మెరిసిపోతున్నాయి గాబు తీసి ఎరువు వేసి ఆశలు మొలకెత్తుతున్నాయి పైరు ఊగినపుడల్లా మనసు మబ్బుల్లో ఊరేగుతుంది చుట్టూ పిలిచే చెట్లు వెనక్కి లాగే తుప్పలు ఎన్నని చెప్పను ఏమని చెప్పనూ పనిలో ఆనందాన్ని చెమట చుక్కల్లో విడుస్తాం ఇన్ని సమయాల నడుమ ఒక పోరాడే సూరీడు ఒక వేలాడే చంద్రుడు మధ్య అనేకానేక మలుపుల్లో ప్రయాణిస్తూ పంట చేతి లో వాలుతుంది ఇప్పటి కాలం మరో దశకు తూగుతుంది కష్టం చేతుల్లోంచి గుడాముల ముందు నిలుస్తుంది దిక్కులు తెలియని దారుల్లో దళారుల చేతుల్లో విలపిస్తుంది వరి బస్తాలు గా జొన్న సంచులు గా మిరప బస్తాలు గా చిరు ధాన్యాలు గా ఆరని ఆశ నిరంతరంగా తడుస్తుంది ఆట మైదానాల్లో నేల తడవదు గొంతు ఎండదు రైతు పంటకు భద్రతా లేదు మద్దతు ధర లేదు వెలుగు చూపమని రైతు గొంతు ఎండి ఏడుస్తున్నాడు చెదిరిన మనసు దిక్కుల్ని రేపి కలం ఎత్తి కన్నీటి సిరాచుక్కల్ని ఒంపుతుంది . కాలం : 08-06-2019 --------------------------114 దర్పణం - గవిడి శ్రీనివాస్ 9966550601 , 7019278368 సరోవరం లో గుంపులుగా వేలాడే పక్షులు ఆకాశాన్ని వేరు చేసి మబ్బుల మధ్య ఈదుతున్నాయి . కళ్ళనిండా ఆశల సంద్రాలు పొంగుతున్నాయి . వెనుకటి పాదముద్రలు హృదయాంతరాలలో చిక్కుకుని రేపటి స్వప్నాలికి అడుగులు తడబడుతున్నాయి . చిగురించే జీవితం రెక్కలు కట్టుకు ఊగుతోంది ఏమి తోచనప్పుడు నిశ్శబ్దం పిండుతున్నపుడు ఒంటరి లోకం తో సహజీవనం గావిస్తున్నపుడు లోపలికి అవలోకిస్తున్నపుడు గుప్పెడు మాటలు ఒలికితే ఆనంద ప్రవాహాలు రెప్పలు తెరుచుకుంటాయి మెలికలు తిరిగే ఆలోచనల నడుమ దాచుకోలేని వసంతాల నడుమ నలుగురి మనుష్యుల మధ్య చిరునవ్వుగా వికసిస్తాను నాలో అంతరంగం ఇప్పటి క్షణాల్ని కాస్త ముందుకి జరిపి లోలోపలి దర్పణం లోంచి బయటికి ప్రతిబింబిస్తూ ముందుకి ఉరుకుతుంది. కాలం: 30-6-2019 -----------------------------------------------------115------ చూపుల్ని వేలాడ దీసి - గవిడి శ్రీనివాస్ 9966550601 , 7019278368 నీరెండిన పొలం లా ఒక రైతు నేను ఖరీఫ్ కాలం కనుబొమల నెత్తి ఆకాశం చూరు వంక ఆశ గా చూశాను. ఎండిన బీడు భూముల్లో చినుకు మొలుస్తుందనీ ఊగే మేఘాల వంక ఉరిమే కాలాల వంక చినుకు దుమకాలనీ పిలిచే చెట్లను వేడుకున్నాను . పోసిన వరి ఆకు ఎండిపోతుంటే ఏ దిక్కుకి చూపుల్ని విసిరేదీ.. మట్టిని నమ్ముకున్న మమకారపు పేగుల్లో మంటే పుడుతుంటే వలస జీవితమే శరణ్యమౌతోంది . గుప్పెడు నీళ్ల కోసం తడి తడి అదును కోసం కళ్ళాపులా జల్లే ఒక జల సంబరం కోసం ఎదురు చూపులు అనేక దిక్కులు గా తిరుగుతున్నాయి . మట్టిని దున్నుతూ మడిలో నారు ఊడుస్తూ పంట మురిపెంలా ఎదగాలనీ పైరు గాలిలా పరవశించాలనీ చూపుల్ని కాలం చూరుపై ఆశగా వేలాడ దీస్తున్నాను .1 కాలం: 21-7-2021 ------------------------------------------------116 వొ ... దుఃఖ ప్రవాహం - గవిడి శ్రీనివాస్ 9966550601 , 7019278368 ఈ దుఃఖ ప్రవాహాన్ని ముక్కలు చేయ లేక పోతున్నాను నీ రెండిన బతుకులాంటి జీవన ప్రవాహం లో వేలాడే దృశ్యాల్ని ఎటూ నెట్టలేక పోతున్నాను బదులివ్వలేని ప్రశ్నల తో సతమత మౌతూ ఏళ్ళ నాటి దుఃఖాన్ని రెండు నదులు గా ముఖ గోళం పై జార్చుకుంటూ .... ఒక సమయానికి వచ్చే నీ రాకే నాలో ఎత్తు పల్లాలు తెలీని ఆనందం లో ముంచేది . కొండలు ఎక్కి వాగులు దాటి తోటలు తిరిగి నీలో పొంగిన నా ఆనందాన్ని నీతో నడిచే వికాశాన్ని నాలో చూసుకునే వాడిని .... కాలమెంత కఠిన మైనదో కదా మనసు నొదిలి ఆ క్షణం నిర్ణయాలు వెలుగుల వెంట పరుగు లెత్తాయి. సూర్యోదం నీతో అయినట్లే సూర్యాస్తమయం నీతోనే ముగిసింది దిక్కులు మారాయి మనసులు బరువెక్కాయి రెక్కలే ఉంటే ఏ దిక్కున నీవున్నా నీ ముంగిట వాలేవాడిని ఆ రోజులు లేవు రాతిరి పూట నిదురించే ఆకాశం పై చందమామ ను ఒకే దగ్గర నుంచి చూసే రోజుల నుంచీ వేరయి... ఇప్పుడు చెరో దిక్కు నుంచీ చూస్తున్నాం రాని వెన్నెల కోసం ఆరాటపడుతూ ...! కాలం: 28-7-2019 ---------------------------------------------117 నిప్పు కణిక యుద్ధం ముగిసిన చోట మరో ఆంతరంగిక యుద్ధం జరుగుతుంది . స్వప్నాలు ఎగిరిపోతుంటే మంచు చరియలు విరిగిపడి కప్పబడిన దేహల్లోంచి ధైర్యంగా నడిచిన విజయకేతనమే కలల సాకారం . తూటాలను గుండెల్లో నాటిన సైనిక సాహసమే సరిహద్దుల వెంట పహారా కాస్తుంది . మెరుపు దాడులవెంట రాజనీతి బోధపడుతుంది . ఆక్రమితమెప్పుడూ ముంపుకు దారి తెరచే ఉంటుంది . చెమట చుక్కల వెంట రక్తపు మడుగుల వెంట దేశ దేహాల భద్రతలూ ముడిపడివుంటాయి . కవ్వింపు చర్యల వెంట తూటాలు దూకుతుంటాయి . సిద్ధాంతాలు వేరు వాస్తవాలు వేరు ఖననమైన ఆశల్ని ఎలుగెత్తటానికి నరమేధమే సిధ్ధం కావాల్సిన అవసరం లేదు . నిరసన నిప్పుకణికలు నిజాన్ని వెదజల్లుతాయి . అయినా ఆక్రమణ ఆజ్యం పోసిన చోట చల్లబడ్డ యుద్ధమేఘాలు మళ్ళీ గర్జిస్తుంటాయి . కాలం: 31-8-2019 -----------------------------------------------------------------------------118 --------------------------119 ఈ వానొకటీ ..! - గవిడి శ్రీనివాస్ 9966550601 ,8722784768 ఈ వానొకటీ కురిసే కాలాలు మారుస్తుంటుంది. లేలేత గాలికి హాయిగా ఉగాల్సిన వరి ఆకు ఆవిరౌతుంటే అలకబూనీ అలా మబ్బుల పై దాగుంటుంది . గాలివీయటం లేదు ఉక్కపోత లో వర్షాన్ని కలగంటాం. చూస్తుండగానే మబ్బుల ఆశలు తేలిపోతాయి . మట్టి మనిషికి బతుకంటే నీరే కదా నీటికి ఎదురు చూపులు పరచడమే కదా ! బురద మడి లో ఉడుపు ఉడిసాక వర్షం తడుపుతుందనీ తడి తడి గా నిలుపుతుందనీ ఆకు పచ్చ ఆశల్ని వేలాడదీసుకుంటాం . కాళ్ళ ముందు పంటే ఎండి పోతుంటే గుండె తడి ఆరిపోతుందనీ ఎన్నిసార్లు ఆకాశాన్ని ఎక్కుపెట్టి చూసినా చినుకూ మొలవదు ఆశా చావదు . వడ్డీ రూపాయలు కళ్ళల్లో తేలుతూ భయపెడుతుంటాయి . యెంత గంభీర్యాన్ని ఒంపినా చినుకు రాలేనంతవరకూ మొలకలు పంటగా హత్తుకోనంత వరకూ అలజడులు రేగుతూనే ఉంటాయి . ఈ వానొకటీ గడ్డిలా ఎండీ కాలిపోయేక ప్రళయమై ఊగుతూ ముంచుతుంటుంది . కాలం: 15-9-20౧9 --------------------------------------------120 ఒంటరి లోకం లో - గవిడి శ్రీనివాస్ 8886174458 , 7019278368 దూరం గా అలా చూపుల్ని వేలాది దీస్తున్నావ్ కాస్తంత దగ్గరవుతూ నా ఉహల లోగిలో ఉండి పోయావ్ జ్ఞాపకాల పొరల వెంట వాలుతూ ఈ వెన్నెలనూ ఈ వెలుగులనూ నాలోకి రార్చుకోవడమే మిగిలింది ఏవీ ఒలికిన ఆ వెన్నెల దరహాసాలు ఒకింత చూసుకోవాలనుంది. ఇక్కడ చిగురు టాకులు నన్నే చూస్తున్నాయి గాలి తెమ్మెరలు నాలో వీస్తున్నాయి కాసిన్ని పిచ్చుకలు నా పై వాలి నాలో ప్రకృతిని తట్టి లేపుతున్నాయి . ఈ సాయంత్రం నీ జ్ఞాపకాల తో వెన్నెల వాన లో తడిసి పోతున్నాను . ఊగే చెట్ల కొమ్మల నడుమ ఆకాశం నా పై వాలి అనంత విశ్వాన్ని ఒంపుతున్నట్ట్లుంది . ఒంటరి లోకం లో కూడా వేలాడే నీవు నా చుట్టూ ఉంటావు . నీ జ్ఞాపకాల నొదిలి మరింత ఒంటరిని కాలేక పోతున్నాను . నా రెప్పల సంద్రం లో ఒంటరి నావలా నీవు తీరం ఒడ్డున ఎగిరిపడ్డ ఇసుక రేణువు లా నేను అలా చూస్తూ మిగిలి పోతాం...! కాలం : 19-1౦-2019 -----------+--------------------++-----------------121 అదేంటో ..! - గవిడి శ్రీనివాస్ 7019278368 ,8886174458 ఈ రాత్రంతా నా పొలం నా కళ్ళల్లో ఊగుతూనే ఉంది . సాలు సాలు కి చూపులు అంటుకుని పెళ్లలు పెళ్లలు గా రాలిపోతున్నాయి . మట్టిలో విత్తు మౌనం గా మేఘాన్ని చూస్తూ మొలుస్తుంది . అదేంటో ఆకాశం అందుతుందా తప్పిపోయిన స్వప్న సాకారానికి చినుకు వెంట చిగురులు తొడుగుతుంది . చిగురు తాకితే తేలిపోతాం గాలి వీస్తే మునిగిపోతాం మొగ్గలు పువ్వులు గా మారే కాలం చిరునవ్వులు తొడుక్కుంటాం ఊగిన ఆకుల్లో పువ్వుల్లో నన్ను కొత్తగా తొడుక్కుంటాను . కాలం కాయలు గా పళ్ళు గా కళ్ళల్లో వసంతాన్ని వెలిగిస్తుంది స్వచ్ఛమైన స్వేచ్ఛ గాలుల్ని తొడుక్కుని మొక్కల మొదళ్ళ వెంట మొదలై ఆకుల వెంట నడుస్తూ పూవుల వెంట నవ్వులు గా పూస్తూనే ఉంటుంది . అదేంటో మామిడి తోట లో అడుగు పెట్టడమే తరువాయి మట్టిలో మమకారం చెట్లలో జీవిత ఫలం గాలిలో ప్రాణ గుణం సుతిమెత్తగా నన్ను తాకుతుంటాయి . మనసు మేఘాల్లోంచి వాన జల్లులు కురుస్తుంటాయి . కాలం: 17-11-2019 -----+----+---------------+----122 కొద్దిగా ఈ చలి రాత్రి - గవిడి శ్రీనివాస్ 7019278368 ,8886174458 ఉక్కపోత సమయాల నుంచి ఆరుబయటకు వచ్చి ప్రాణాన్ని ఆరబోసుకుంటున్నాను . ప్రాణ వాయువు వీచి మనసుని లేపినట్లయింది . చలి గాలి కాస్త సుఖం గాను వుంది . దుప్పటిని కాస్త తెరుస్తూ మూస్తూ దోబూచులాడుతుంటాను . రోజులు చిగురులు తొడిగి చెట్ల గాలులు ఉయ్యాలలూపి ఎల్లప్పుడూ తడి తడి గా ఉంచుతుంటాయి . జీవితాన్ని ప్రేమించడం మొదలెట్టాక చలైన ఎండైన వానైనా కొన్ని సమయాలు ఉపిరిలూదుతూ ఊతమిస్తాయి . చల్ల గాలి కొరుకుతుంటే చెట్లలో చూపులు చిక్కుకుంటున్నాయి . ఆకాశాన్ని కళ్ళల్లో నింపుకుని చుక్కల్ని వెలిగించుకుంటున్నాను . కొద్దిగా ఈ చలి రాత్రి ఒద్దికగా చలిని వెలిగించుకుని కలల అంచున తేలుతూ ఒక దిండు పై రెండుగా వాలుతూ ఒక స్వప్న లోకం లో మునిగిపోతాను . కాలం: 15-12-2019 ------------------------------+---------------------------------------123- గుబాళింపు -గవిడి శ్రీనివాస్ 7019278368,8886174458 తీరని కలలేవో వాలుతున్నాయి పరిమళాలు అద్దుకుని అత్తరు వాసన రుద్దుకుని చిరు నవ్వు గుభాళింపుతో నన్ను నింపుతున్నాయి . నదిలా జారుతూ వెన్నెల లా ఈదుతూ చెట్టులా తలూపుతూ కలలేవో దృశ్యాలుగా అల్లుకుంటున్నాయి . ఎడతెగని దేహం లా నాలోకి వర్షిస్తున్నావు . మూసే కళ్ళలోకి గిలిగింతలా వాలుతుంటావు . చుట్టేసిన చేతుల్ని నెట్టలేను . కళ్ళ భాష లో మాట్లాడే నీలోకి ఒరిగిపోవడం తప్పా ఏమీ తెలీదు . కాలం : 25-12-2019 -------------------------------------+-----------124 మూసిన రెప్పల వెనుక -గవిడి శ్రీనివాస్ 7019278368,8886174458 ఏకాంత మందిరాన్ని పూల పరిమళాల తో అలంకరించి ఏటవాలు చూపులు మౌన ప్రపంచాన్ని వెతుకుతున్నాయి . మూసేకళ్ళలో రాలిపడిన అనుభవ దృశ్యాలు తేలుతుంటాయి . ఎక్కడ మొదలయిందో ఎక్కడ ముడిపడిందో ఎక్కడ ముక్కలయిందో ఎక్కడ చక్కబడుతుందో తెలీని ప్రవాహాలు ముంచుతుంటాయి . వీచే గాలి కీ తెలీదు ఏ ప్రపంచం లో ఈదుతున్నానో చిన్ని చిరునవ్వు వెనుక దుఃఖ ప్రపంచాన్ని అదిమి పెట్టి జీవితం రాగాలు వొలికించడమంటే గాయలకి వెన్నెల పూసి ఓటమి ఒప్పుకోని ఎదురీతకి సిద్ధం కావటం ఒక సిద్ధాంతం కావటం రోజు లో ఒక ప్రయాణానికి సన్నద్ధం కావటమే . చూస్తుండగానే ఒక చందమామ ముద్దయినట్లు చలికి వణికి పోయినట్లు అంత తెల్లదనం లోనూ కొన్ని నల్లని చారికలు అల్లుకుపోయినట్లు వెన్నెల చూడలేని కళ్ళకి------------------------------------------------------------125 వసంతాలు ప్రేమ వర్షాలు కనిపించవు . కాల ధర్మం లో రాలే శిశిరాలు తప్పా. బహుశా దుప్పట్లు కప్పివుంచిన నీ శీతల దృశ్యాలకి సూర్యరశ్మి చుట్టూనే ఉండవచ్చు . మూసిన రెప్పల వెనుక భావసంద్రాలు వేరు గా ఉండవచ్చు . అనుభూతుల పర్వం లో ప్రకంపనలు ఉండవచ్చు . కానీ చూసే చూపేదో మనసు మందిరాన్ని మౌనంగా అలకరించే ఆరాధనా దృశ్యాల్ని హారంగా ధరించవూ ..! వెలుగు పిట్టలు కువ కువ లాడుతూనేవుంటాయి . కాలం:29-12-2019 -----------------------------------------------+---------126 ఇన్నినాళ్ళు -గవిడి శ్రీనివాస్ ఇన్నినాళ్ళు ఏమయ్యావో మామ దూరాలు పొడుచుకుని కాలాలు మారిపోయాయి . నీవులేని క్షణాల్ని దోసిట్లో ఒంపుకుని గొంతు తడబడుతోంది . ఉన్నఫళంగా ఊరు వలస పోతుంటే నిశ్శబ్దాలు రాలుతున్నాయి . మనసులు మూగబోతున్నాయి . నువ్వుకావాలని పిల్లలు మారం చేస్తున్నారు . బతుకుమాటు బాధల్ని వివరించలేక కన్నీరుగా వేలాడుతున్నాను . అర్ధం కానీ భాషలా పొడిపొడి గా రాలుతున్నాను . ఇంటి నిండా ఖాళీ ప్రపంచం నెలకొనివుంది . ఆలా నీ వొచ్చి పోయినపుడు ఇచ్చిన జ్ఞాపకాల్ని మరలా మరలా ఒంపుకుంటూ ఈ కాలాన్ని ఈదుతున్నాను. గాయం చేసిన కాలాన్ని నిందించలేను ఉపాధి లేని ఊరుని దోషిగా నిలబెట్టలేను . కారణాల వెతుకులాటలో వేలాడే కాలాన్ని ప్రశ్నిస్తున్నాను . ఇన్నినాళ్ళు -గవిడి శ్రీనివాస్ ఇన్నినాళ్ళు ఏమయ్యావో మామ దూరాలు పొడుచుకుని కాలాలు మారిపోయాయి . నీవులేని క్షణాల్ని దోసిట్లో ఒంపుకుని గొంతు తడబడుతోంది . ఉన్నఫళంగా ఊరు వలస పోతుంటే నిశ్శబ్దాలు రాలుతున్నాయి . మనసులు మూగబోతున్నాయి . నువ్వుకావాలని పిల్లలు మారం చేస్తున్నారు . బతుకుమాటు బాధల్ని వివరించలేక కన్నీరుగా వేలాడుతున్నాను . అర్ధం కానీ భాషలా పొడిపొడి గా రాలుతున్నాను . ఇంటి నిండా ఖాళీ ప్రపంచం నెలకొనివుంది . ఆలా నీ వొచ్చి పోయినపుడు ఇచ్చిన జ్ఞాపకాల్ని మరలా మరలా ఒంపుకుంటూ ఈ కాలాన్ని ఈదుతున్నాను. గాయం చేసిన కాలాన్ని నిందించలేను ఉపాధి లేని ఊరుని దోషిగా నిలబెట్టలేను . కారణాల వెతుకులాటలో వేలాడే కాలాన్ని ప్రశ్నిస్తున్నాను . కాలం: 16-12-2020 ----------------------++------------------------------------------------------------------126 దుఃఖ శిఖరం -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601 వెలిగిన తలపుల్లోంచి ఊపిరి నలిగి పోతుంది . శిఖరపు అంచుల్లో వేలాడే ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి . నిద్రపోని భావాలు నిప్పు కణికల ఉప్పెనవుతాయి. కొన్నినాళ్ళు ప్రపంచమే కొద్దీ కొద్దిగా కుదుపుతుంది . కొన్ని సార్లు ఉహలకే సంకెళ్లు బిగిస్తుంటాయి. కరిగిపోతున్న కాలాన్ని తడుపుతున్న వర్తమానం గాయమై తడుతుంది . ఊహల చిల్లుల నావ ఇంత దుఃఖాన్ని మోసుకుపోతుంది . కొన్ని సందర్భాల్లో తలపడిన దుఃఖాన్ని దున్నుకుంటూ శిఖరాల కొసలకి అడుగులు జరుపుతుంటాయి. కాలం: 8-3-2020 ------------------------------------127 అలసిన నడక -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601 విపత్తు లోంచి విత్తుకోవడం ఎలాగో తెలీక అడుగులు తడబడుతున్నాయి . ఉన్న చోట నుంచి వలస పోయాక అనుకోని కరోనా మేఘమేదో బతుకుల పై ఉరికినాక నడక అలసినా ప్రయాణం తప్పదు . ఎన్ని వందల మైళ్ళ దూరాలను బరువుతో నడుపుకోవాలి . ఎందరి ప్రశ్నలకి సమాధాన పరచుకోవాలి . కళ్ళ లో వేలాడే ఇల్లు తెలిసిన మనుషుల మధ్య బతకాలని ఆరాటం దూరాలని ముక్కలు చేస్తుంది . కన్నీళ్లను దిగమింగుతూ అరికాళ్ళ నొప్పుల్ని ఎండ ప్రకోపాల్ని ఆకలి బాధల్ని దాచుకుని అలిసిన నడక రాత్రి పగలు కొనసాగుతూనే ఉంటుంది ...! 😭 కాలం:16-5-2020 -------+------- ----+--------------+--128 వలస సంకెళ్లు -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601 ఉన్న చోటే పనులు పల్లె లో ముడుచుకున్నాక కాసిన్ని పైసల కోసం నగరం ముంగిట వలస బతుకులు సాగిలా పడ్డాయి. పని ఉంటేనే పొట్ట పోసుకునేదీ ... కరుణించని కాలం పనిని ఆపినట్టు ఆకలిని ఆపదు... ఇక ఈ వలస యుద్ధం లో తిరుగు పయనం మొదలయ్యాక అరికాళ్ళు నిప్పులు రాల్చినా తల ఫై బరువు పేదరికాన్ని గుర్తు చేసినా బతుకు పోరు ఆగదు. ఎండ రాలిన వాన తడిపినా శ్వాస ఆడే వరకూ కాలి నడక పోరూ ఆగదు. ఊహించినంత ఉత్సవం కాదు నేడు నగరం లో బతుకంటే అనుక్షణం ఊపిరి వేడెక్కుతుంటాది . ఇప్పుడు బతుకంతా కరోనా కనుసన్నల్లో ఊపిరి లూదుకుంటే వలసకు సంకెళ్లు కదిలే బతుకుకి సంకెళ్లు ఊరు చేరుకోవాలంటే ఊపిరి పణంగా పెట్టాల్సిందే .... దేశం నలుమూలలా చెదురుతున్న వలస పక్షులకి చేయూత నందించే మార్గాలు మార్గ దర్శకాలు కానరావు. ఇక ఈ పోరు లో చూస్తున్నవి చూడబోతున్నవి కాలం నుదుటిపై చేసిన గాయం లా ఆకలి చావులే ....! కాలం:17-5-2020 -----------------------------------------------------129 నిద్రపోతున్న సూర్యోదయం -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601 కళ్ళలో కాలినడక నదులిలా దుఃఖ ప్రవాహాలవుతున్నాయి . కలలు జారి దుఃఖ మేఘాలు ఉరుముతున్నాయి . ఈ చేతి సందుల్లోంచి భవనాలు మొలిచాయి . ఈ గుండె మంటల్లోంచి ఉత్పత్తులు వెలిసాయి . ఈ రహదారి కన్నుల్లో ఇంకా మేం ప్రతిబింబిస్తున్నాం .. కను చూపుమేర చూసే కరెంటు స్తంభాల వెంట మోసే రవాణా సరుకుల వెంట మా చెమటి చుక్కలు తడిసే ఉన్నాయి . కూలీలు లేని దేశం నిర్మితమౌతోందా వలస కార్మికులు లేని రాజ్యం పరిమళాలు అద్దుకుంటుందా కరోనా కళ్లెం కి చిక్కి కమిలిన బతుకులతో ఆకలి మింగిన ప్రపంచం లోకి నిద్రపోతున్న సూర్యోదయంలా గుంకిపోతున్నాం. కాలం 25-5-2020 -----+------------------130 పోగొట్టుకున్న జ్ఞాపకాలు -గవిడి శ్రీనివాస్ 701928368,9966550601 ఏమనీ చెప్పలేను నిత్యం కళ్ల వాకిళ్ళలో తూనీగలా ఎగురుతూ ముందుండే జ్ఞాపకాలకు మబ్బులు కమ్ముకున్నాయి . ఎన్ని చూపుల నెగరేసినా చుక్కల మధ్య నిన్ను అందుకోలేను . ఉన్నట్టుండి ముసిరే గాలులు ఉహల చిత్రాల్ని సైతం చెరుపుతున్నాయి . కాలం రెక్కల పై నిజం సాక్షి గా దూరాలు భారాలైన జ్ఞాపకాల్లో ఊయలూగేవాళ్ళం దొరికిన సంతోషాన్ని గుప్పెట్లో దాచుకుని ఎగిరే కలలకి ఇప్పుడు కన్నీటి వాగులమయ్యాం . ఇప్పటి ప్రపంచం మారింది ఒత్తిడి సాగరం లో ఈదుకుంటూ పోగొట్టుకున్న జ్ఞాపకాల్ని నెమరేసుకోటానికి కాసింత సమయం కాసింత ఉపశమనం కావాలి మనం మళ్ళీ వేకువ రెప్పల పై తడి తడి గా ఉదయించాలి . కాలం : 5-7-2020 -------------------------------+--------------------------------+---------131 ఇంత వర్ష కాలం -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601 చినుకు వొళ్ళు విరుచుకుని మట్టి మాగాణిని తట్టిలేపింది . ఆకు పచ్చని కళ్ళు ఆశ గా మెరిసాయి . నీటి సుక్కకు ఒళ్ళు జలదరించింది . తొలినాళ్ళ వానస్పర్శ ప్రకృతిని ముస్తాబు చేసింది . ఈ మౌన ప్రపంచం కనిపించని క్రిమి గుప్పిట్లో దాగుంది . మాటలు జారలేవు . కళ్ళు తదేకంగా చూడలేవు ముక్కు ఏ పరిమళానికి దగ్గర కాలేదు . ఆధిపత్యం పోరు తలకెత్తుకుని జీవాయుధాల్ని చుట్టుకుని సమయం విస్తరణ వాదాన్ని కాంక్షిస్తూ ఒక యుద్దానికి తెరలేపుతోంది . దాడి సామాన్యుడి బతుకు మీద జరుగుతోంది . ఇంత వర్షా కాలం ఇన్ని ముడులు విప్పుకుని బతుకుని ఆస్వాదించడం కాలమనే నదికి ఎదురీదినట్లే వుంది . కాలం: 12-07-2020 -------------------------------------------------------132 ఏమీ తోచని కాలం -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601 ఒక ఇల్లు అల్లుకున్న ఇంటర్నెట్ తప్ప ఏమి తోచని ఇరుకు ప్రపంచం ఇప్పటిది. రోజులకి తేడా తెలీదు ఏవీ చిగురించవు చివరాఖరికి కదలలేని బంధాలతో వేరు వేరు గా కాలం ఒడ్డున కరిగిపోతూ ... ఆకాశం నేల రాతిరి పగలు అన్నీ ఇంటికే అంటుకున్నాయి . చూపులు స్వేచ్ఛ మీద వాలాలని చూస్తున్నాయి . ఎగరలేని పక్షుల్లా పిల్లలు ఆటలులేని వింత ప్రపంచం లో చిక్కుకుని మొబైల్ ఫోన్ మీద వేలాడుతున్నారు . కిటికీలు తెరవని ప్రపంచం లో కిటకిటలాడుతూ ఒక సూర్యోదయాన్ని ఒక చంద్రోదయాన్ని ఈ చిన్ని గూటిలో పూయిస్తున్నాం . కాలం: 18-7-2020 -------------------------133 వెన్నెల కురిసే కాలం -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601 వెన్నెలని జోబులో వేసుకుని తీస్తే పువ్వులయినాయి . కలలని వాకిట్లో ఆరబోస్తే చుక్కలై మొలిచాయి . నది వెంట చూపులను పరిస్తే జీవ నాడులయినాయి. ఇసుక తీరం లో నడుస్తూ వెళ్తే పాదముద్రలు ప్రేమ కావ్యాలుగా మిగిలాయి . వేకువ ఆలోచనలని ఆచరణ లో చూస్తే గమ్యాలు చేరువైనాయి . రెప్పల మీద వాలే కన్నీటిబొట్లను ప్రేమగా తడిమాక అమృత బిందువులయినాయి . కొన్ని రాగాల వెనుక వెన్నెల కురిసే కాలం చెలిమి అవుతుంది . కాలం : 19-7-2020 -----------++------------------------134 దాహపు తీరాల్లో -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601 నా నుదిటి మధ్య వెలిగే సూర్యోదయం లా నెమ్మదిగా ఉదయిస్తూ నువ్వెప్పుడూ నా కళ్ళల్లో కాంతిని ఒంపుతావ్. నా చుట్టూ తుమ్మెదలా తిరుగుతున్నప్పుడు నా ముని వేళ్ళ మీద ముద్దుగా వాలుతున్నపుడు నాపై నువ్వు చినుకులుగా కురుస్తున్నపుడు కాలం కవ్వింత గుసగుసలాడుతుంది . ఈ దేహం మీద తడితడిగా నువ్వు జారుతున్నాక ఊపిరి ఆడని ఉత్సవం లో ఆత్మానందంగా మునుగుతున్నాను . నీ చుట్టూ మల్లెల మాలలు నా చుట్టూ అల్లిన చేతులు ఎడతెగక పెనవేసుకున్నాక కాలం ఉక్కపోతతో తడుముకుంటుంది . నువ్వు వెన్నెల్ని ఒంపుతుంటే నేను ఒకింత స్నానమాడుతుంటాను . మనం తీరని దాహపు తీరాల్లో ఈదులాడుతూ ఇరుక్కుపోతున్నాం ..! కాలం: 26-7-2020 ------------------------------------------------135 మారిన జీవన దృశ్యాలు -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601 ఒకప్పుడు ఒక చట్రం లో తిరుగుతున్నాక అలవాటుగా ఒకే పనిని తొడుక్కున్నాం . కథ మలుపుతిరిగింది ఒక విధ్వంసకర పరిస్థితి అనుభవించాక బతకడం ఒక యుద్ధమైంది బతకనేర్చటం ఒక కళ అయింది కష్టాన్ని నెత్తిన ఎత్తుకుని కూరగాయల బండి గా మారినా రోజుకూలీ గా మారినా రోజులు తిప్పే చక్రం వెంట నడవడమే. క్రిములు చరిత్రను శాసిస్తాయని వాగులు వంకలు ఊళ్లనే ఊడుస్తాయనీ అనుభవ దృశ్యాలు గా చూస్తూ తలమునకలౌతున్నాం . మండే ఎండను ఎత్తుకుని రైతు క్రిమి ముంగిట పారిశుధ్య కార్మికులు వైద్యులు నర్సులు పర్యవేక్షణలో రక్షకభటులు కర్తవ్యాన్ని ఎలా పాలించాలో సందిగ్ధం లో సామాన్యుడు మారిన జీవన దృశ్యాలు కుదుపుతున్నాయి . కంటి రెప్పలను తడుపుతున్నాయి . కాలం:16-8-2020 -----------------------------------------------------------------136 మారిన జీవన దృశ్యాలు -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601 ఒకప్పుడు ఒక చట్రం లో తిరుగుతున్నాక అలవాటుగా ఒకే పనిని తొడుక్కున్నాం . కథ మలుపుతిరిగింది ఒక విధ్వంసకర పరిస్థితి అనుభవించాక బతకడం ఒక యుద్ధమైంది బతకనేర్చటం ఒక కళ అయింది కష్టాన్ని నెత్తిన ఎత్తుకుని కూరగాయల బండి గా మారినా రోజుకూలీ గా మారినా రోజులు తిప్పే చక్రం వెంట నడవడమే. క్రిములు చరిత్రను శాసిస్తాయని వాగులు వంకలు ఊళ్లనే ఊడుస్తాయనీ అనుభవ దృశ్యాలు గా చూస్తూ తలమునకలౌతున్నాం . మండే ఎండను ఎత్తుకుని రైతు క్రిమి ముంగిట పారిశుధ్య కార్మికులు వైద్యులు నర్సులు పర్యవేక్షణలో రక్షకభటులు కర్తవ్యాన్ని ఎలా పాలించాలో సందిగ్ధం లో సామాన్యుడు మారిన జీవన దృశ్యాలు కుదుపుతున్నాయి . కంటి రెప్పలను తడుపుతున్నాయి . కాలం: 20-9-2020 --------+--------------------------------------------------137 ఉండలేనితనం లోంచి -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601 పొద్దు రాలిన సంజెవేళ చీకటి చిగురున గుండెలో రాగాలను అలా మోసుకుపోతుంటాను . ఆ ఇసుక తిన్నెలు బొమ్మలు పూసి అలలు చేతులిచ్చి ఎగసే వేళ ఊహలకి రెక్కలొచ్చి ఎగురుతుంటాయి . ఎర్రెర్రని సూర్యాస్తమయాలు కొండల మధ్య మునుగుతుంటాయి . విచ్చుకున్న హృదయాన్ని ఆకాశానికి అతికి చూస్తే ధగ ధగా మెరిసే కలలు మోగుతుంటాయి . రాక్షస మీమాంసా తొడుగుల్లో ఛిద్ర ప్రపంచంలో విచ్ఛిన్న వైఖరులు ప్రకృతిని మింగుతుంటాయి . పీల్చే గాలికి స్వేచ్ఛ లేదు నడిచే నడకకి ధైర్యం కుదరదు . వర్ష మొచ్చి వాగులొచ్చి బతుకులు చెరువులయినాయి ఎండలు పేలి తనువులు చెమట బావిలో బావురుమన్నాయి . ఒక వైపు క్రిములు యుద్ధం చేస్తున్నాయి . తీరం వీచే గాలికి సేదతీరాలో పొద్దు పోయే జీవితాలకి కన్నీటి గీతిక పాడాలో సంద్రం ఒడ్డున ఆలోచనలు ఉండలేనితనంలోంచి ఉలిక్కి పడుతున్నాయి . కాలం: 3-10-2020 ----------------------------------------------------------138 ఉండలేనితనం లోంచి -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601 పొద్దు రాలిన సంజెవేళ చీకటి చిగురున గుండెలో రాగాలను అలా మోసుకుపోతుంటాను . ఆ ఇసుక తిన్నెలు బొమ్మలు పూసి అలలు చేతులిచ్చి ఎగసే వేళ ఊహలకి రెక్కలొచ్చి ఎగురుతుంటాయి . ఎర్రెర్రని సూర్యాస్తమయాలు కొండల మధ్య మునుగుతుంటాయి . విచ్చుకున్న హృదయాన్ని ఆకాశానికి అతికి చూస్తే ధగ ధగా మెరిసే కలలు మోగుతుంటాయి . రాక్షస మీమాంసా తొడుగుల్లో ఛిద్ర ప్రపంచంలో విచ్ఛిన్న వైఖరులు ప్రకృతిని మింగుతుంటాయి . పీల్చే గాలికి స్వేచ్ఛ లేదు నడిచే నడకకి ధైర్యం కుదరదు . వర్ష మొచ్చి వాగులొచ్చి బతుకులు చెరువులయినాయి ఎండలు పేలి తనువులు చెమట బావిలో బావురుమన్నాయి . ఒక వైపు క్రిములు యుద్ధం చేస్తున్నాయి . తీరం వీచే గాలికి సేదతీరాలో పొద్దు పోయే జీవితాలకి కన్నీటి గీతిక పాడాలో సంద్రం ఒడ్డున ఆలోచనలు ఉండలేనితనంలోంచి ఉలిక్కి పడుతున్నాయి . కాలం: 18-10-2020 ------------------------------------------139 ఎర్ర గొంతు ఘోషోస్తోంది... -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601 వెన్నెల్లో ఊగేవాళ్లను రక్తం లో మరిగేవాళ్లను చూసి కొడవలి ఎత్తి సమానవత్వ శంఖారావం పూరించాం . నిరసన జెండాలెత్తి దోపిడీని ఖండించాం . సంపద అన్నిచేతుల్లో ఉండాలన్నాం. లేదు ! శ్రమ శ్రామికులదీ ఫలితం పెట్టుబడు దారులదన్నారు . పెట్టుబడిదారీతనం పెత్తనం గొప్పదన్నారు బరువు మోసేవాడు చెమటోడ్చేవాడు వాటాదారుడన్నాం. పోరాటాలు ధ్వనింపమ చేస్తున్నాం . అయినా సామ్రాజ్యవాదం మింగుతూనేవుంది పొలాల్ని కొండల్ని పెండుల్ని. ప్రపంచీకరణ వైకుంఠ పాళీలో బతుకులు జారుతున్నాయ్. సంకెళ్ళ రూపాలే మారినయ్ సంక్లిష్ట పరిస్థితులు అలానే వేలాడుతున్నాయి . నిలుచున్న నేల ఊగుతోంది . అస్తిత్వ వేదనతో విప్లవ గొంతు ఘోషిస్తోంది . చేగువేరా స్ఫూర్తిని రెపరెప లాడిస్తూ.. అగ్నిగోళాలై జ్వలిస్తూ ప్రవహిస్తోంది ... కాలం: 20-10-2020 ------------------------------139 వర్షాన్ని మోస్తున్నా -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601 నా కనుల సంద్రంలో ఇండ్లు పారుతున్నాయి. మనుషులు తెప్పల్లా తేలుతున్నారు . వాహనాలు ఈదుతున్నాయి గాలి క్రిమి పాట పాడుతోంది. జీవితం అంత సజావుగా లేదు వేలాడే శూన్యాన్ని కాళ్ళకి సంకేళ్లుగా వేసి నాల్గు గోడల ప్రపంచాన్ని రుచి చూపింది . ఫేను రెక్కల్లో జీవితాన్ని తిప్పుకుంటూ తెరల వెనుక చూపులు పరచుకుంటూ మసక మసక గా దృశ్యం లేస్తోంది . కళ్ళనిండా వర్షాన్ని మోస్తున్నా రెప్పల పై తెప్పలు అలా వెళుతుంటే నిర్లిప్తంగా ఆకాశానికి చూపులు అతికి చేతులు ఆపన్న హస్తాలుగా ముడిపెట్టుకున్నాం . మునిగిపోతున్నా ఎదురీదుతున్నాం . కాలం:25-10-2020 ----------------------------------------140 రాలిన పరిమళాలు -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601 రాలే కన్నీటి చుక్కలకి సమాధాన పర్చలేక పోతున్నాం . కొన్ని చేతులు పరిమళాలు పూస్తూ సువాసనలు వెదజల్లుతూ కొంత కాలం తరువాత కాలం చేసే గాయానికి కనుమరుగవుతుంటాయి . ఇంటిలో పిల్లలు ఎగిరినట్లు కన్నీటి నదులు కుదిపినట్లు నవ్వుల తూనీగలు చెదిరినట్లు ఆలోచనల పిచ్చుకలు మూగబోయినట్లు ఏం ఉందో ఏంలేదో తెలీక సతమత మౌతున్నప్పుడు ఏమీ తోచినప్పుడు ఎవరు లేనప్పుడు కష్టం గుండె మీద మరుగుతున్నప్పుడు ఆ ఆప్యాయత కాసింత ఉపశమనంగా ఉండేది . జీవితం ఇలానే జాలువారుతుంది . కొన్ని పరిచయాలు కొన్ని పలకరింపులు కొన్ని సంతోషాలు కొన్ని కన్నీటి బొట్లు అనుభూతి సంతకాలు మిగులుతాయ్. కాలం నుదిటి మీద పరిచయాలు అనుభవాలుగా అనుభవాలుగా జ్ఞాపకాలుగా మారినపుడు రాలిన పరిమళాలతో కూలబడుతుంటాం . మిగిలిన బతుకు చిత్రాలతో తడబడుతూ అడుగులేస్తుంటాం. కాలం : 15-11-2020 ----------------------------------------------------------141 రైతు పోరాటం -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601 ఇన్ని గొంతులు ప్రశ్నిస్తున్నాయంటే హక్కుల్ని నులిమే కాళరాత్రులు రాబోతున్నాయని అర్ధం . మట్టిని నమ్మే మనిషికి పన్ను ఆ మనిషిని కూల్చే దళారి కి దన్ను పంటను ఎగరేసుకుపోయే చట్టాలు ఉపిరిలూదుతున్నాయి . ఆసరాగా నిలవాల్సిన మద్దతు ధరలు అడుగు వేయక ఇంకా మంటలు రేపుతూనేఉన్నాయి . రైతు చితికి పోతున్నాడు తన పొలంలోనే కూలీ అవుతున్నాడు . పొలం పై స్వతంత్రం కోల్పోతున్నాడు ఏమి పండించాలో ఎవరికి అమ్మాలో అన్నీ ముందే నిర్ణయించబడతాయి . కష్టాన్ని ఎత్తుకోవటం తప్పా ఏదీ నీది గాదు గొంతు తడారి పోవటం తప్పా నీ పంటకు స్వేచ్ఛలేదు పీల్చే గాలికి స్వేచ్ఛలేదు రహదారుల వెంట పోరాటాల నడుమ బతుకు ఉడికిపోతోంది. దేశ రైతాంగమంతా కష్టానికి భరోసా మనిషికి ఆసరా జీవితానికి తగిన స్వేచ్ఛ దోపిడీ లేని రాజ్యం కోసం పోరాటబాట పడుతున్నాయి . మరో సూర్యోదయం కోసం నిరసన జెండాలూపుతూ .. కాలం: 20-12-2020 -------------------------------------------------------------------------------------------------------------------------------142 చలి వాకిట్లో ... -గవిడి శ్రీనివాస్ 7019278368,9966550601 ఉదయాల్ని ఆరేసుకోటానికి చలి దుప్పట్లు తీసి ముసిరే గాలుల వెంట ఊహలు పరిగెడుతుంటాయి . మట్టి మమకారం కప్పుకుని వొణుకుతూ కాసింత పోరాడుతూ దేహం చిట్లినా దృక్పథం మహావృక్షమ్ లా చెదరకుంది. రాజులు పోయారు పరాయి పాలన పోయింది . ఇప్పుడు స్వంత పాలనలో పరాయికరణ ఉనికినే ప్రశ్నిస్తోంది. ఆజ్ఞలకు తిరిగే బొమ్మల ప్రపంచంలోకి అడుగిడుతున్నాం . సన్నకారు రైతులకి నిదుర రాదు ఆహారం సామాన్యుడికి అంత సులువు కాదు . ధరల రాకెట్లతో ప్రయాణించాల్సిన సమయాలు చూడబోతున్నందుకు ప్రశ్నించాల్సిన సందర్భం నిలదీస్తోంది సంధి చేసుకోవటాలు కాదు సంక్షేమాలు ఆలోచించాలి చలి వాకిట్లో కుంపటి వెచ్చని వెలుగు నింపాలి . కాలం: 27-12-2020 -------------------------------------------------------------------------------143 ఓ వెన్నెల రాత్రి కోసం -గవిడి శ్రీనివాస్ 7019278368, 9966550601 చాలా కాలమే అయింది కాసిన్ని నవ్వులు పూసి వెన్నెల దోబూచులాడి సిగ్గుపడే చుక్కలతో మాట్లాడి కొద్దీ గా కొరికే చలిగాలుల్లో ఈదులాడి ముచ్చట పడే మేఘాల్లో తేలి చాలా కాలమే అయింది . ఇన్ని దినాలు ఎన్ని వర్షాలు నాలో ఒంపుకో లేదూ ...! ఊసులు కొసరుతుంటే ఎన్ని చలి మంటలు గుండెల్లో దాచుకోలేదూ....! మౌనం పెగలక ఎన్ని ఎండలకి తడిసినా... కాసింత కాలం నడిచాక ఏదో చల్లని సమీరం ఆకుల వెంబడి తాకింది . వెన్నెల వేలాడ దీసే పక్షుల్ని మబ్బులు అల్లిన రంగవల్లుల్ని చీకటిని తొలిచే మిణుగురుల్ని అదే పనిగా చూస్తున్నాను . కొంత ప్రయాణం సాగాక ఈ నిర్లిప్త క్షణాల్లో ఓ వెన్నెల రాత్రికోసం ఆశను పరచుకొని నీలి ఆకాశం వంక ఇంకా ముచ్చటగా వీక్షిస్తున్నాను . కాలం: 26-1-2021 -------------------------------------------144 ఈ దుఃఖపు రుధిర రణ క్షేత్రం లో .. -గవిడి శ్రీనివాస్ 7019278368, 9966550601 ఒక అనివార్యపు దుఃఖ స్థితి ఏవో ఆక్రమిత దృశ్యాల్లో ముక్కలవుతూ కార్యకారణ సంచలిత కల్లోలం ఇది. కళ్ళలో ఆకాశం చీల్చబడి నా నిజ ఆనందపు శృతులు లయ తప్పుతున్నాయి . దూరాలు దూకినా నా మట్టి నన్ను వెంటాడుతుంది . నాలో మునిగిన పర్వత శ్రేణులు నాలో కుంగిన సూర్యోదయాలు నాలో నోళ్లు తెరచిన లోయలు నా ప్రపంచం లో దర్శనమౌతాయి . ఈ దుఃఖపు రుధిర రణ క్షేత్రం లో అవ్యక్తాశ్రువులు ఘోషిస్తున్నాయి . ఛేదించ సాధ్యం కాని నైరాశ్యపు లోకం లో నిట్టూర్పుల నడకల్లో క్షణాల్ని ఒంపుకుంటూ విలపిస్తున్నాను . భళ్ళున వొలికే దుఃఖాన్ని నా ఊరి చిత్రంగానో నా ప్రాంత అభిమతం గానో నా నేల జ్ఞాపకాల పుటగానో నాలో ఒక వర్ణ క్షోభిత దుఃఖ జలాలు ఉబుకుతుంటాయి . నేను విశ్వ మానవుణ్ణే అయినా వేళ్లవెంట జారుతూ ఈ దుఃఖపు రుధిర సంక్షోభం లో రాలుతున్న బొట్టు బొట్టు లో రగిలే మమకారపు వేదాగ్నిని నేను . కాలం: 20-2-2021 -------------------------+++++++145 ఏ తీరం వైపో -గవిడి శ్రీనివాస్ 7019278368, 9966550601 ఒక అసంపూర్ణ అసమతుల్య ప్రపంచం నెలకొంది . నల్లని మేఘాలు అల్లుకున్నాయి. ఇనుప చువ్వలు అన్యాక్రాంతమవుతున్నాయి . ఆక్షేపణ కాదు గానీ స్వార్ధపు చేతుల్లోకి బతుకులు తరలి పోతున్నాయి . స్వేచ్చకు సంకెళ్లు పడుతున్నాయి హక్కులకి ఉరితాళ్లు బిగుసుకుంటున్నాయి . పోరాట ఫలాలు చిదిగిపోతున్నాయి . మన కలల విశాఖ ఉక్కు రాజకీయ రంగులు అద్దుకుని కార్పొరేట్ రెక్కలతో ఎగురుతోంది . మట్టిని దానం చేసినవారు మట్టికొట్టుకు పోతున్నారు . ఇప్పుడు దేశమంతా ప్రయివేటీకరణ పాట చిందులేస్తోంది . అస్తిత్వపు ప్రశ్నలు ఎరుపెక్కుతున్నాయి . కార్మిక రాజ్యాన్ని కాలరాసి పెట్టుబడుల పెత్తనం పాతరాగం ఎత్తుకుంది . ఇప్పుడు గొంతులు మరింత మోగాలి. సంస్కరణలు ఏ తీరం వైపో వాలుతున్నాయి. నిరసనలు లేనిచోట ఉనికి ప్రస్నార్ధకమవుతుంది కార్మిక సంక్షేమానికి ఉద్యమాలు ఊపిరిగా విజయకేతనం ఎగరేయాలి . కాలం: 13-3-2021 -----------------------------+++---------------------146 శిశిరం వాలిన చెట్టు -గవిడి శ్రీనివాస్ 7019278368, 9966550601 ఆకులు వాల్చిన చెట్టు ఆకులు రాలిన చెట్టు అలసిన దేహం ఒకటే . కొద్ది కొద్దిగా వికసించిన ఆకులు ముద్ద ముద్దగా తడుస్తూ గాలులు విసురుతూ ప్రాణాల్ని నిలుపుతూ అందమైన జీవితం గడిపాక ఒక రోజు విశ్రమించక తప్పదు . కొన్ని ఆలోచనలు దొర్లుతూ సంఘర్షణల మధ్య గడుపుతూ కర్తవ్యం నడిచాక శరీరం వాలిపోతుంది . నిస్సత్తువు ఆవహించినపుడు చూపులు సంధ్య వైపు ప్రవహిస్తుంటాయి . ఊపిరి వెలుగుతున్న కాలమంతా రుతువులు రువ్వుతునేవుంటాయి . ఈ కొంత కాలంలో కొన్ని అనుభూతుల్ని ముద్రించుకోవటం లో శిశిరకాలం వసంతకాలం తలమునకలౌతుంటాయి . కాలం : 28-3-2021 -----------------------------147 కాసింత ఉపశమనం -గవిడి శ్రీనివాస్ 7019278368, 9966550601 అలసిన దేహంతో మేలుకుని ఉన్న రాత్రి తెల్లారే రెప్పలు వాల్చి నవ్వులు పూసిన తోటలో ఉపశమనం పొందుతుంది . మబ్బులు ఊగుతూ చెట్లు వేలాడుతూ పూవులు ముద్దాడుతుంటాయి . కొన్ని క్షణాలు ప్రాణాలు అలా లేచి పరిమళం లోకి జారుకుంటాయి . గాలి రువ్విన బతుకుల్లో చీకటి దీపాలు వొణుకుతుంటాయి . ఏదీ అర్ధం కాదు బతుకు రెక్కల మీద భ్రమణాలు జరుగుతుంటాయి . నేటి దృశ్యం రేపటి ఓ జ్ఞాపకం అవుతుంది . వర్తమానాన్ని మోస్తూ కాసిన్ని సంతోషాల్ని ఆస్వాదిస్తూ విసిగిన క్షణాలు కాసింత ఉపశమనం పొందుతాయి . కాలం: 18-4-2021 -------------+----------------------------+148 సెకండ్ వేవ్ -గవిడి శ్రీనివాస్ 7019278368, 9966550601 ఏమిటో ఈ కన్నీటి తరంగమ్ హృదయాల్ని కూల్చే మరణ మృదంగమ్ ఆకులు రాలినట్లు పిడుగులు కురిసినట్లు జీవితాలు చెల్లా చెదురవుతున్నాయి . జన్ను క్రమం మార్చే సూక్ష్మ జీవి పై తిరగబడే వ్యాధి నిరోధక శక్తులుగా మానసిక ధైర్యం నూరే ప్రచారకులుగా సనాతన సంప్రదాయాల్లో ఆహారాన్ని నూతనంగా వెలిగించలేమా ... మనుగడకు చిరు నవ్వుల్నీ భయాల్ని చెరిపే వాక్యాల్ని గుండెల్లో నింపలేమా .... గోరు వెచ్చని నీటి తోనో పసుపు పూసిన గాలి తోనో పులిసిన మజ్జిక తోనో నిమ్మకాయ తోనో ఉసిరి కాయతోనో క్రిమి పై యుద్ధం ప్రకటించాలి . పోరాటం లోంచి దుఃఖం ఒడ్డుకు చేరాలి కాలం ఎన్ని శోకాలను చూడలేదూ... అనుభవం కాని ఆపదాల్లోంచి విజయం తట్టే వరకు యోగిలా యోగా మార్గాన వివేకం తెలిసిన అన్వేషణ చూపులతో ఇక ఈ రెండో తరంగాన్ని తుడిచేయాల్సిన సమయం ఇది గెలిచే వరకూ ప్రతి ఒక్కరు సైనికులే . కాలం:25-4-2021 -------------------------------------149 నా పల్లె లోకం లో ... -గవిడి శ్రీనివాస్ 7019278368, 9966550601 వేలాడే ఇరుకు గదుల నుంచీ రెపరెపలాడే చల్లని గాలిలోకి ఈ ప్రయాణం ఉరికింది . ఔరా | ఈ వేసవి తోటల చూపులు ఊపిరి వాకిలిని శుభ్ర పరుస్తున్నాయి . కాలం రెప్పల కిలకిలల్లో ఎంచక్కా పల్లె మారింది. నిశ్శబ్ద మౌన ప్రపంచం లో రూపు రేఖలు కొత్త చిగురులు తొడిగాయి . పండిన పంటలు దారెంట పలకరిస్తున్నాయి . జొన్న కంకులు ఎత్తుతూ కొందరు ఆవులకు గడ్డిపెడుతూ కొందరు మామిడి తోట కాస్తూ కొందరు ఇక్కడ చిరు నవ్వుల తోటను చూసాను . కాసింత పల్లె గాలికి వికశించాను ప్రయాణాలు ఎన్ని చేసినా దూరాలు ఎన్ని మారినా చెదరని స్వప్నంలా నా పల్లె నిలిచింది. ఇంటిలో కూచుంటే చాలు చుట్టూ కాకుల కూతలు పిచ్చుకల కిచకిచలు ఆప్యాంగా వాలుతుంటాయి. తడితడిగా మనసుని కుదుపుతుంటాయి . పల్లె తాకిన ప్రపంచం లో మరో కొత్త అనుభవం పరచుకుంటుంది . ఈ చల్లని పల్లె గాలుల్లో తడిస్తే చాలు కోల్పోయినవి అనుభూతి చెందుతున్నట్లు ఉంటుంది . కాలం: 14-5-2021 ---------------------------150 నీ ఆలంబన లో -గవిడి శ్రీనివాస్ 7019278368, 9966550601 నువ్వు అలా రెప్పల పై వాలాక కలల నక్షత్రాలు మొలుస్తున్నాయి . చిన్ని సరదాలు చిలిపి దరహాసాలు కేరింతలు కొడుతుంటాయి . కాలాలు మారే కొద్దీ దూరాలు వీస్తుంటాయ్. అయినా నీ ఆలంబన నాకొక వెలుగు దీపంగానే వుంది . నా అఖండ విజయపు పునాదుల్ని నీ చిరు నవ్వుతో నిర్మిస్తావ్ . నన్ను వెలిగిస్తావ్ . మనసుని మీటే ఊసేదో నన్ను చిగురించేలా చేస్తుంది . కాలం కనులలో ఈ హృదయం దేదీప్యంగా నిలుస్తుంది. ఈ రాత్రి ఆకాశ నేత్రాలతో విశాలంగా చూస్తానా అంతే నిశీధి నక్షత్రం లా మెరుస్తావ్ నీ నవ్వుల జలపాతం లో తడిసి మురిసిన క్షణాలు చాలు . నీ ఆలంబన లో నా ప్రపంచాన్ని అలంకరించటానికీ.. నీలో తలమునకలైన నా లోకం అనుభూతుల్ని పేర్చుకుంటూ నిశ్శబ్ద తీరాల వెంట నీ సైకత శిల్పాల్ని చెక్కుకుంటుంది . కాలం: 22-5-2021 -----------------------------151 ఓ నా పెనిమిటీ -గవిడి శ్రీనివాస్ 7019278368, 9966550601 నా మనసుకి నచ్చేటోడివనీ మనువాడినందుకు ముచ్చటపడ్డాను. మూడు ముడుల బంధానికి కానుకగా పిల్లలు వరమనుకున్నాను. రోజులు అనురాగాల తీగలు అల్లుకున్నపుడు సంబర పడ్డాను . ఆరబోసిన వెన్నెలనంతా వొడిలో ఒంపుకున్నాము . ఇంకేం కావాలీ దీపాల్లా వెలిగే పిల్లలు కాగడాలని వెలిగించే పెనిమిటి అంతా సంతోషాల కడలిలో తేలియడాం . రుతువులు మారినట్లు కాసింత కాలం నడిచాక ఆయన కాలం చేసాడు . ఊపిరి సలపని క్రిమి దాడికి రాలిపోయాడు . ఆయన్ని తలచినపుడల్లా కళ్ళల్లో కన్నీటి వాగులు ఆగనంటాయి. పిల్లలు బిక్కుబిక్కు మంటూ తిరిగిరాని నాన్న కోసం ఎదురు చూస్తుంటారు . మా ఇంటి దీపం ఆరిపోయింది ఉన్న ధైర్యం పిల్లలకి నేననీ తెలిసాక రాలే కన్నీటి చినుకుల్లో తడిసినా దుఃఖపు తెరల్ని తెంపుకుంటుంటూ చిన్నపాటి పనులవెంట జీవితాన్ని లాగటం దినచర్యవుతుంది విధిని ప్రశ్నించలేక అడుగుల్ని జరపటం పరిపాటయింది. ప్రతి పనిలోనూ పెనిమిటి తోడున్నట్లే అనుకోవటం బాధయినా కసాయి కాలానికి ఎదురెళ్లటం అలవాటైంది . ఓ నా పెనిమిటి ఇప్పుడు బతుకు యుద్ధం అనివార్యమైంది . కాలం: 29-5-2021 -------------------------152

No comments:

Post a Comment