Friday 2 September 2016

శ్రీ కృష్ణశాస్త్రి గారు Vs శ్రీ రామసూరి గారు Vs గవిడి శ్రీనివాస్‌

http://vaakili.com/patrika/?p=11650

===================================
గురువు గారు శ్రీ రామసూరి గారు రాసిన వ్యాసం చాలా విశ్లేషణాత్మకంగా సాగింది . నాకు గురువు గారు శ్రీ రామసూరి గారైతే  ఆయనకి గురువుగారు కృష్ణశాస్త్రి గారు .  నాకు భావకవిత్వం లో  మక్కువ కలగటం  యాదృచ్చికంగా జరిగింది . నాకైతే  కవిత్వాన్ని  మొదట నేర్పిన గురువు గారు  రామసూరి గారు.ఈ జన్మంతా  ఆయనకు రుణపడి వుంటాను . నా  కవిత్వ ఆవేశానికి  ఆలోచన నేర్పింది  ఆయనే . యువస్పంద లో  నేను  ఒకడిని  అని సంతోషంగా చెప్పగలను .
కృష్ణశాస్త్రి గారి  గూర్చి వివరిస్తూ " రొమాంటిక్ కవులు కనిపించని సౌందర్యాన్ని అన్వేషించడానికి కనిపించే సౌందర్యాన్ని సాధనంగా చేసుకున్నారు". 
కృష్ణశాస్త్రి ప్రేమపిపాసి. అంతేకాదు ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించే కవి. స్వేచ్ఛాన్వేషణంలో, ప్రేమాన్వేషణంలో కవి లోకాన్ని నిరాకరించాడు.‘నా యిచ్చ యే గాక నాకేటి వెరపు’ అన్న కవిలో, బాధతో కూడిన మార్పు కలుగుతోంది. కృష్ణశాస్త్రి కావ్య ఖండికల్లో వెల్లివిరిసిన ప్రేమ ఆత్మాశ్రయ ధోరణిలో సాగింది. కవే కథానాయకుడు.ప్రేమికుల పట్ల లోకం పోకడని తెలియజేస్తూ, తన స్వేచ్ఛాయాత్రలో, ప్రేమాన్వేషణంలో తనతో రాని నిర్జీవ ప్రపంచాన్ని ఆయన లెక్క చేయలేదు.భావకవిత్వానికి సంబంధించిన రెండూ ప్రధాన గుణాలు పరిచయం చేస్తున్నారు. అవి సంగీతం, ప్రేమ . రెండూ దగ్గర సంబంధం కలిగి ఉన్నవే. కవి దృష్టిలో రెండింటికీ స్వేచ్ఛ ప్రాణం. ఈ రెండింటి ఔన్నత్యాన్ని కృష్ణశాస్త్రి కవితాత్మకంగా చెప్పారు.కృష్ణపక్షంలో కవికి తన ప్రేయసి నుండి బదులు రాలేదు. పైగా ఆమెకు వేరొకరితో వివాహమైంది. ఈ విషయాన్ని కృష్ణశాస్త్రి ‘ మా ప్రణయలేఖల కథ’ లో ఇలా రాస్తారు. ‘ఓ అద్భుత వ్యక్తి నా హక్కయింది. నా కోసమే జీవితం వహించింది. తన ప్రేమతో నన్ను కప్పేసింది. నాకూపిరాడింది కాదు. నాకెందుకో ఇరుకైంది ఈ ప్రపంచం’ అని అంటూ, ఆమె ప్రేమని స్వీకరించలేక పోయాడు. ఆమెని ప్రేమించ లేకపోయాడు. బాధతో ఆమె నలిగిపోయింది. చివరకి ప్రాణాలు విడిచింది.భార్యని ప్రేమించక అందరాని ఆనందం కోసం అన్వేషించిన కవి – తన పరిస్థితిని ‘చుక్కలు’ కవితలో ఇలా వివరిస్తారు.అందుబాటులో ఉన్న ప్రేమని కాదని అందరాని ప్రేమకి అర్రులు సాచినపుడు ఆకాశంలో చుక్కలు అదృశ్యమవుతాయి. చేతికందే పూలు వాడిపోతాయి. పక్షిలా ఆకాశంలో ఎగిరి పోవాలని కోరుకున్నాడు కవి . రెక్కలు లేవన్న సంగతి గ్రహించలేదు. చివరికి జీవితం కలగా మిగిలిపోయింది. ఇపుడు కవిలో పశ్చాత్తాపం కలుగుతోంది.కవిని భార్య మరణం కుంగదీస్తోంది. ఎడద మోడైపోయి, జీవితం శిథిలమైంది. హృదయాన్ని చిగురింపజేయడంకోసం కవి తపన. భావకవిత్వంలో హృదయానికి అంత ప్రాధాన్యం ఉది. రొమాంటిక్ కవిత్వానికి సంబంధించిన లక్షణం ‘అన్వేషణం’ లో కనబడుతుంది.భావకవులు దుఃఖాన్ని ‘విషాదసుఖం’ గా భావించారు. ఆత్మ ప్రక్షాళనానికి దుఃఖాన్ని వరంగా స్వీకరించారు.
భార్యతో వెళ్లిపోయిన తన హృదయం కోసం ప్రతిరోజూ ఎదురుచూస్తూ ఉంటాడు కవి. దుఃఖం భయంకరంగా ఆవరించింది. అందులో ఆశ మెరుస్తూ ఉంటుంది. కన్నీటి కెరటాల వెన్నెలనీ, హాలహలంలో అమృతాన్నీ, శిథిల శిశిరంలో చివురునీ, రాతిలో పూవునీ చూడగల భావనాశక్తి కవికి ఉంది. అందుకే ఎంత దుఃఖాన్నైనా భరించగల ధైర్యం ఉంది. భావకవికి. ఆశాసంగీతం వినిపించగల సృజన శక్తులున్నాయి.
రొమాంటిసిజం ప్రభావంతో భావకవిత్వంలో ప్రధానమైన ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో ఎంత ఉదాత్తమైనదో, ఎంత గాఢమైనదో కృష్ణశాస్త్రిగారు తమ కావ్య ఖండికల ద్వారా చెప్పారు. ఆ ప్రేమ సౌందర్య ప్రస్థానానికి తొలి సోపానంగా ఎలా మారుతుందో వివరించారు.

బాధను వ్యక్త పర్చడం  లో  గాఢత  భావ కవిత్వం లో నే సాధ్యం .

చాల బాగుంది వ్యాసం . గురువు గారికి ధన్య వాదాలు.

- గవిడి శ్రీనివాస్‌
08722784768

No comments:

Post a Comment