Friday 2 November 2018

ఈ మౌనం వెనుక

http://www.prajasakti.com/Article/Features/2084057
29-oct-2018

ఈ మౌనం వెనుక - గవిడి శ్రీనివాస్ 

ఈ  కను  రెప్పల ముంగిట 
మౌనం భాషిస్తోన్న వేళ
సంభాషణ  మౌనం వహించింది .

అనురాగపు తీగల పందిరి లో 
గాలి వీయగా నేనో మౌన పరవశాన్ని 
వాన కురియ గా నేనో వికశించే  పుష్పన్ని 
నా ఎద  లోతుల్లో  ఒలికిన  రాగాలెన్నో 
నా హృది పొదల్లో  గుభాలించే సువాసన లెన్నో 

అలా తూనీగలా జాలువారుతూ 
పరిమళ  ప్రపంచాన్ని ఆస్వాదిస్తూ 
నాలో ఒక నేను ఆనంద ప్రపంచం లో 
మునిగి పోతాను .

చుట్టూ సౌంద్యమూ ఆహార్యమూ 
అనురాగమూ పెనవేసుకుని 
కొన్ని రసానుభూతులు   మిగులుతాయ్.

ప్రేమను పొందేక్షణాలెపుడూ
మనసు పొరల్లోంచి జారిపోవు .

కాల ప్రవాహం పారుతుంది 
ఋతువులూ దొర్లుతుంటాయి 
నాలో కొన్ని జ్ఞాపకాలు అలా నిలుస్తాయ్.

ఈ మౌనం వెనకాల 
ప్రోది చేసుకున్న  సంతోష సమయాల్ని 
ఈ కన్నుల్లో దివ్వెల్లా  వెలిగే గడియల్ని 
చెరిగిపోకుండా  ఆలా ఒడిసి పట్టుకోవడమే 
నా ఆంతరంగిక  ఆనంద రహస్యం !


No comments:

Post a Comment