Friday 9 November 2018

తుపాను కెదురు గా


05-Nov-2018
https://m.dailyhunt.in/news/india/telugu/prajasakti-epaper-prajasak/tupaanukeduruga-newsid-100837746

తుపాను కెదురు గా   -గవిడి శ్రీనివాస్ 9966550601, 7019278368

కొద్దిపాటి సమయాల్ని ఒడ్డున ఆరేసి 
పెను తుపాను జీవితాల్ని 
ఆహ్వానించలేక  ఆస్వాదించలేక 
లోలోపల  ఇష్టాన్ని వొoపలేక  
నాలో ఇక ఇమడలేక 
పొడి పొడి గా రాలుతూ 
గాయాల్ని కొద్ది కొద్ది గా  దాస్తూ 
ఈ దేహం దిగులు సంద్రం లో మునిగిపోతుంది.

తూరుపు కెదురు గా నడుస్తాను 
ఒక ఉదయం సమీరం లా  తాకుతుందనీ. 

వాకిట తలుపులు  తెరుస్తాను
చిరు నవ్వే  గాలి తెరలు గా కవ్విస్తుందనీ.

రోజులు గడిసే కొద్దీ 
రూపాలు రూపాంతరం చెందుతున్నాయి .

ఏకాగ్రత కోల్పోతున్న క్షణాల్లో 
నక్షత్రం లా  ప్రత్యక్షమౌతావ్ .

నా వొంటి నిండా 
నువ్వు  అనేకానేక  నక్షత్రాలై  మెరుస్తుంటే 
నీ తలపులకే  బానిసనౌతున్నా .

ఎక్కడికని పారిపోను 
నాలో  బంధించి బడ్డ  ఆణువణువూ 
నీ రూపం తో  అలంకరించ బడ్డాక!

కాసేపు  నీ మాటల్లో వొలికి 
మరుక్షణం  నీ చేతుల్లో  వొదిగి 
తుపాను  కెదురు గా  వెళ్లే 
సాహసాన్ని  రంగరించే  నువ్వున్నంత సేపూ
నాలో రాత్రి పగలు 
స్వర్గపు అంచున తడి చుంబన 
మృదు భావన తాకుతూనే ఉంటుంది !

No comments:

Post a Comment